Monday, April 4, 2016

మహాభారతంలో, ఒక సంఘటనలో హనుమంతుడు రామేశ్వరం వద్ద ఒక సాధారణ వానర రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకకు వెళ్ళటానికి రాముడు నిర్మించిన వంతెన చూసి అర్జునుడు ఈ వంతెనను నిర్మించడానికి వానరుల సహాయం తీసుకున్నాడు. ఎందుకు! అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు అదే తను అయితే ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించి ఉండేవాడినని అనుకున్నాడు.
హనుమంతుడు నీ బాణంతో నిర్మించిన వంతెన అయితే సంతృప్తికరంగా ఉండేది కాదని, ఆ వంతెన ఒక వ్యక్తి బరువును మోసి ఉండేది కాదని విమర్శించాడు. అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకున్నాడు. అర్జునుడు, తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే, అప్పుడు తాను అగ్నిలో దూకుతానన్నాడు.
దీంతో అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మించారు. హనుమంతుడు దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది. అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు. తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునిని ముందు ప్రత్యక్షమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు. ఈసారి వంతెన కూలిపోలేదు. హనుమంతుడు ఆశ్చర్యపోయి తన ప్రభువు శ్రీరామచంద్రుడే ...శ్రీకృష్ణ పరమాత్మునిగా అవతరించాడని గ్రహించి నమస్కరించాడు.

Saturday, April 2, 2016

దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........

1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.

2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........

3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి.........
.

4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........

5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...

6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......

7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......

8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........

9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............

10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి.........అన్ని మతాలు ప్రేమించమనే
చెప్పాయని,ద్వేషించమని ఏ మతమూ చెప్పలేదని వారికి తెలియచేయండి........

వీటిలో మీరు కొన్ని అయినా చేస్తే..........
మీ పిల్లలకు మంచిని చేసినవారు అవుతారు.......
ప్లీజ్..చేస్తారని ఆశిస్తూ.........

Thursday, March 31, 2016


            ఈ సత్యాన్ని  ప్రతీ తల్లి, తండ్రి  గ్రహించాలి...

మీ పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానములు విలువైనవి, అమూల్యమైనవి, వెలకట్టలేనివి ...
కాకపోతే ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లి, తండ్రులు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకునే పెద్ద పొరపాటు
“నేను పడ్డ కష్టం,
శ్రమ నా బిడ్డ పడకూడదు”
ఇది తల్లి, తండ్రుల నిస్పక్షపాతమైన, కల్మషమైన, పవిత్ర ప్రేమకు చిహ్నo .
కాని ఇక్కడ మీరో విషయం మర్చిపోతున్నారు...
మీరు ఆ కష్టాలు, శ్రమలు పడ్డారు కాబట్టే ఇంత పైకి వచ్చి భాద్యతగా ఉంటూ వున్నారు..
అదే మీ పిల్లల విషయంలో మీరు కఠినంగా ఉండకుండా సున్నితంగా వారికి లోకం తెలియకుండా పెంచితే మాత్రం మీరు, వారు, వారితో వున్న ప్రతీ ఒక్కరు మూల్యం చెల్లించాల్సి వుంటుంది...
కష్టమేమిటో ఎరగని వాడికి సుఖం విలువ తెలియదు.
నష్టమేమిటో ఎరుగని వాడికి లాభం విలువ తెలియదు.
కాలమేమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలియదు.
ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి...
"అతి ప్రేమ,అతి గారాబం,అతి అలుసు అనేది అస్సలు మంచిది కాదు"..
మీ పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాలనే భావనతో వారిని మరీ సున్నితంగా పెంచుతున్నారు.
ఇదే నేడు సమస్యగా మారింది.
స్వీటీ అనే అమ్మాయి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు.
అడిగింది కాదనకుండా ఇంకా ఎక్కువగా ఆమెకు తెచ్చి అందిస్తారు.
చిన్నతనం నుండి ఓ మహారాణి అన్న భావనను స్వీటీలో పెంచారు.
ఉన్నత చదువులు చదివి.. పెళ్లాయ్యాక...
భర్త ఆమెను ప్రత్యేకంగా చూడకపోవడంతో గొడవ పడేది.
ఇలా పెరిగడం వల్లే చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది.
ఇలా స్వీటీ ఒక్కటే కాదు..
ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
దీనికి పెంపకంలోని లోపాలే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు అన్నం విలువ,డబ్బు విలువ తెలియచేయాలి...
కొన్ని సందర్భాలలో చేతినిండా డబ్బు ఉన్నా తినడానికి తిండి దొరకదు..
అలాగే కొన్నిసార్లు తినిడానికి అన్నీ దొరికినా చేతిలో డబ్బులు ఉండవు..
ఇటువంటి పరిస్ధితులు జీవితంలో ఎదుర్కొన్న వారికి తప్పకుండా అన్నం,డబ్బు విలువ తెలుస్తుంది...
అతి గారాబం చేయడం వలన పిల్లలకు కష్టాలు తట్టుకొనే శక్తి సడలుతుంది..
అలాగే అతి భయం, బెదిరింపు, కొట్టడం,తిట్టడం చేయడం వలన
మొండిగా/మూర్ఖంగా తయారయ్యే అవకాశం ఉంది...
కనుక తల్లిదండ్రులు ఈ రెండింటిని బేలన్స్ చేస్తూ పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాలి...
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొనే శక్తి కలిగే వారిగా చేసి వారికి మార్గదర్శకంగా నిలవాలి....
వారికి కష్టం...
నష్టం...
సుఖం
అన్నీ తెలియాలి.
లగ్జరీగా పిల్లల్ని పెంచ డం నేటి ఫ్యాషన్‌.
అదే ఇప్పుడు కొంప ముంచుతోంది.
ఇలా పెరిగిన వారు చిన్న కష్టాలకే హడలుతున్నారు.
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ అంశాలపై అవగాహన పెంచాలి.
కొంతమంది తల్లి, తండ్రులు తమకు ఎన్ని కస్టాలు వున్నాయో,
తము సరుకులు తెచ్చేందుకు కూడా ఎలా ఇబ్బంది పడుతున్నారో వగైరా విషయాలు పిల్లల దాకా రానివ్వరు ఇవన్ని వాళ్ళకు తెలియాలని అనుకోరు..
కాని అది కరెక్ట్ కాదు.
పిల్లలకు విచ్చలవిడి తనాన్ని మనమే అలవాటు చేస్తున్నాం..
మీరు సంపాదించే ప్రతీ రూపాయి యెంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారో వాళ్ళకు తెలియాలి తద్వారా వాళ్ళకు దుబారా ఖర్చులు అలవడకుండా వుంటాయి..
ముఖ్యముగా తల్లి తండ్రులు వాల్లకు చదువు కంటె జీవితంలో జనరల్ విషయాలు ఎక్కువ అవగాహనకు తీసుకురావాలి..
చదువు ఒక్కటే ఉంటె ఈ కాలంలో సరిపోదు.
కొందరు పిల్లలు సెలవు దినాల్లో ఏదైనా పనికి పంపుతుంటారు కారణం వాళ్ళు సంపాదించి పెడతారని కాదు..
వాళ్ళకు డబ్బు విలువ తెలుస్తుందని ..
ఇలా ప్రతీ తల్లి, తండ్రులు వాళ్ళ పిల్లలకు సరైన అవగాహనా,
సరైన శిక్షణ అందిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు తప్పకుండా అవుతారు.
గొప్ప వాళ్ళు కాకపోయినా మంచి మనుషులుగా మిగులుతారు...
ప్రతీ గొప్ప వారు డబ్బునుంచి వచ్చిన వారు కాదు కష్ట, నస్టాల్లోనుంచి వచ్చిన వారు కారణం వారు అన్నీ అనుభవించి వచ్చినవారు కనుక వారికి అన్ని తెలుసు..
నాయకులు ఏ.సి రూముల్లో కూర్చొని పనిచేస్తే సరిపోదు..
ఆ పని చేస్తే ఎవరికి మేలు కలుగుతుంది,
ముందు ఎవరికి ఉపయోగపడాలి,
ఏ పని ఏ ఏ సమయాల్లో సమయానుకూలంగా చెయ్యాలనే విషయం వారు స్వయంగా కష్ట, నష్టాలు అనుభవిస్తేనే తెలుస్తుంది...
పిల్లల్ని ముద్దుగా చూడటంలో తప్పులేదు కానీ...
వారికి లోకం తెలీకుండా పెంచడంలోనే అసలు సమస్య.
అందుకే దయచేసి తల్లి, తండ్రులారా మేల్కోండి..
రేపటి భావితరానికి మీరు బాటలు వెయ్యండి.

పెళ్ళినాటి ప్రమాణాలు.
సప్తపదిలో ఏడు అడుగులు వేస్తూ " ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు " అనే మంత్రం చదువుతారు. దాని అర్ధం:-
మొదటి అడుగు : శక్తి కోసం
రెండవ అడుగు : బలం కోసం
మూడవ అడుగు : వ్రతం కోసం
నాల్గవ అడుగు : ఆనందం కోసం
ఐదవ అడుగు : ఇంద్రియబలం కోసం
ఆరవ అడుగు : రుతువులకోసం
ఏడవ అడుగు : గృహ ధర్మాలకోసం
వధూవరులు ఇద్దరూ కలసి జీవితాంతం ఇలాగే కలసి నడుస్తామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపది కార్యక్రమం తోనే * వధువు ఇంటి పేరు మారిపోతుంది *. వివాహానికి ఈ సప్తపది కార్యక్రమమే చాలా ముఖ్యం.
ఈ పెళ్ళినాటి ప్రమాణాలను స్త్రీ , పురుషులు ఇద్దరూ అనుసరించి పాటించిననాడే పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకొంటుంది. భార్య భర్తకు , భర్త భార్యకు తోడునీడగా, అన్యోన్యం గా అరమరికలు లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో జీవిస్తేనే ఈ ప్రమాణాలకు ఒక విలువ వుంటుంది.

Friday, March 25, 2016

శనివారం తులసికోట వద్ద దీపమెలిగించండి..!

శనివారం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజుగా పురోహితులు అంటున్నారు. అలనాడు 
వైష్ణవులు శనివారం పూట శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించేవారని పురాణాలు 
చెబుతున్నాయి.అందుచేత శనివారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా 
స్వానమాచరించి తులసికోట ముందు నేతితో గాని, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగించేవారికి 
అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తులసికోట ముందు దీపమెలిగిస్తే.. ఆ గృహంలో లక్ష్మీదేవి 
ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.అలాగే శనివారం సాయంత్రం పూట 
శ్రీమన్నారాయణుని ఆలయాన్ని సందర్శించుకుని నేతితో దీపమెలిగించుకునే వారికి 
ఈతిబాధలు తొలగిపోయి, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
శనివారం పూట ఒక పూట మాత్రమే భుజించి, శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుడిని 
ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావంచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.ఇంకా తొమ్మిది 
వారాల పాటు నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని, విష్ణుమూర్తి ఆలయాన్ని 
తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని 
పురోహితులు సూచిస్తున్నారు
కుంకమ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ??




మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో ఆదిదేవత వున్నాడు. అలాగే లాలట అధి దేవత

బ్రహ్మా. లలాటం బ్రహ్మా స్థానం . బ్రహ్మా దేవుని రంగు ఎరుపు. కావున బ్రహ్మాస్థానమైన లలాటాన 

ఎరుపు రంగు(కుంకుమ) ధరించాలి. ఎప్పుడైతే కుంకుమ లలాటాన(నుదుటన) అద్దుతారో 

అప్పుడు జ్ణానచక్రాన్ని పూజించినట్లు అవుతుంది. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే 

శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలితో ధరిస్తే ఆయువు సమృద్ది చేందుతుంది. 

బోటనవేలితో ధరిస్తే శక్తి, చూపుడు వేలితో ధరిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి  అని పెద్దలు 

చెపుతారు.

Total Pageviews