మహాభారతంలో, ఒక సంఘటనలో హనుమంతుడు రామేశ్వరం వద్ద ఒక సాధారణ వానర రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకకు వెళ్ళటానికి రాముడు నిర్మించిన వంతెన చూసి అర్జునుడు ఈ వంతెనను నిర్మించడానికి వానరుల సహాయం తీసుకున్నాడు. ఎందుకు! అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు అదే తను అయితే ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించి ఉండేవాడినని అనుకున్నాడు.
హనుమంతుడు నీ బాణంతో నిర్మించిన వంతెన అయితే సంతృప్తికరంగా ఉండేది కాదని, ఆ వంతెన ఒక వ్యక్తి బరువును మోసి ఉండేది కాదని విమర్శించాడు. అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకున్నాడు. అర్జునుడు, తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే, అప్పుడు తాను అగ్నిలో దూకుతానన్నాడు.
దీంతో అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మించారు. హనుమంతుడు దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది. అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు. తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునిని ముందు ప్రత్యక్షమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు. ఈసారి వంతెన కూలిపోలేదు. హనుమంతుడు ఆశ్చర్యపోయి తన ప్రభువు శ్రీరామచంద్రుడే ...శ్రీకృష్ణ పరమాత్మునిగా అవతరించాడని గ్రహించి నమస్కరించాడు.
No comments:
Post a Comment