Saturday, September 9, 2017

పెళ్ళిచూపుల్లో

పెళ్ళిచూపుల్లో
అబ్బాయి తండ్రి అమ్మాయితో......
"అమ్మాయి, నీకు టైపింగ్ వచ్చా"
"ఆయ్, నిమిషానికి కనీసం పది మందికి వాట్స్ అప్ లో రిప్లై ఇవ్వగలనండి"
"మంచిది. వంటా వార్పు ఏమైనా వచ్చా"
"ఆయ్, సిటీలో ఉన్న కర్రీ పాయింట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, టేక్ అవే సెంటర్స్ యాప్స్ అన్ని అలవాటు చేసుకున్నానండి. ఆర్డర్ పెట్టడం చిటికెలో పని"
"శభాష్. టెక్నాలజీ ఏమైనా నేర్చుకున్నావా"
"ఆయ్, ఆండ్రాయిడ్ నౌగట్ దాకా మొబైల్ అప్ డేట్ లో ఉంచుకున్నానండి"
"భలే భలే. స్పోర్ట్స్ లో ప్రవేశం ఉందామ్మ"
"ఆయ్, టెంపుల్ రన్ లో ఈ కాలనీలోనే నన్ను బీట్ చేసిన వాళ్ళు లేరండి"
"కేక, మరి డ్రైవింగ్ అయినా వచ్చా"
"ఆయ్, ఊబర్, ఓలా నాకు బెస్ట్ కస్టమర్ అవార్డ్ కూడా ఇచ్చాయండి"
"అబ్బో, మరి ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతుక్కోవడం లాంటి పనులు"
"ఆయ్, ఎవరు కావాలన్నా జస్ట్ డయల్ ఉంది కదండీ"
"వెళ్లోస్తానమ్మా"
"నేను నచ్చానాండి?"
" ఇంటికి వెళ్ళాక మెసెంజర్ లో చెప్తానమ్మా. కాస్త ఆన్ లైన్ లోనే ఉండు"

Thursday, August 31, 2017

పాలు-కర్మ-సంబంధం-ఆకలి

పాలు-కర్మ-సంబంధం-ఆకలి

పాలను ఆశించి గోవును పోషిస్తాము ,
గోవు నుంచి మనకు పాలు వస్తాయి
అంతే కాదుః పేడ కూడా వస్తుంది ,
పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం ,
పేడని .ఇంటికి దూరంగా విసిరేస్తాం ,

ఆవు నుండి పాలు మాత్రమే రావాలి –
పేడ రాకూడదు అంటే వీలు కాదు ,
కర్మలు కూడా ఇలాగే ఉంటాయి …
ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్థవంతంగా
ఉంటుందని చెప్పలేము ,
కొంత అభ్యంతరంగా కూడా ఉంటుంది .
సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి .
ఏ. సంబంధం లేకుండా ఎవరితోను సంబంధం
లేకుండా జీవించడం సాధ్యపడదు .
కాని సంబంధాలలో కేవలం సంతోషమే
ఉంటుందని చెప్పలేము ,
విషాదం కూడా కలిసే ఉంటుంది ,
మనం ఎవరితో కలిసి జీవింజీవించినా . వారు –
తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు
కావచ్చు , భార్యాభర్తలు కావచ్చు
స్నేహితులు కావచ్చు , బంధువులు కావచ్చు ,
వారిలో అన్నీ మనకు నచ్చిన గుణాలే
ఉంటాయని చెప్పలేము .
మనకు నచ్చనివి , వారు మెచ్చేవి కూడా
ఉంటాయి …. అలాంటివి ప్రేమకి సౌఖ్యానికి
ప్రతిబంధకాలే కావచ్చు , కాని అవి లేకుండా
సంబంధాలు లేవు గులాబీలమధ్యా ముళ్ళు
తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన
సంఘర్షణలు తప్పవు ..

భోజనం చేయాలి ఆకును పడేయాలి .
కాని. ఆకు లేకుంటే వడ్డించటమే జరగదు —
ఆకలి తీరదు , ఆకలి అన్నంతోనే తీరుతుంది
అన్నం ఆరగించినంత. వరకు ఆకును
ఆదరిస్తూనే పోవాలి ,పడేసేదే కదా అనుకోవచ్చు , కడుపులో
అన్నం పడే ఆకు మన ముందే ఉండాలి ,…
ఈ. ప్రపంచంలో ఏది అవసరం లేని క్షణం
ఒకటి రావచ్చు కాని అవసరాలలో
ఆవశ్యంగా తొంగిచూసే అనవసరాలనుకూడా
పెద్ద మమనసుతో అంగీకరించేతత్వం
పెంచుకుంటేనే అభివృద్ధిని సాధించటం
మనిషికి సాధ్యపడుతుంది......


Wednesday, August 30, 2017

కధ

పూర్వం ఇద్దరు రాజులు రధాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు..
ఒక రాజు రధం వెనక్కి వెళ్తేనే గానీ రెండో రధం ముందుకు వెళ్ళే వీలు లేదు..
రధసారధులిద్దరూ నీ రధం వెనక్కి తీసుకెళ్ళంటే నీదే తీసుకెళ్ళమని వాదించుకోడం‌మొదలెట్టారు. ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు..
చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు..
వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు.. ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు..
సరే మొదటి రధసారధి ఇలా అన్నాడు..
మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు.. గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారువందలమందికి వస్త్రదానం చేస్తారు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాలూ స్థాపించారు..

రెండవ సారధి తలదించుకుని కంట నీరుపెట్టుకుని తన రధం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు..
దానికి ఆరాజు గారిలా అడిగారు.. ఏమయ్యా మీ రాజుకి దాన గుణం‌లేదా అలా ఏమీ చెప్పకుండా రధం వెనక్కి తిప్పుకుంటున్నావు..
దానికా రెండో రధ సారధి వినయంగా ఇలా అన్నాడు..
హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు.. మా రాజ్యం లో దానం చేద్దామ‌ంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడూ కనబడలేదు..‌ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు..‌ఇంక మారాజుగారికా అవకాశం ఎలఎలా ఉంటుంది.. దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ అని.
వెంటనే మొదటి రధంలో రాజు రధం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తనరధం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు..

వేల వృద్ధాశ్రమాలూ..రాయితీలు.సంక్షేమపధకాలూ ఉచితాలూ.. అభాగ్యులకు సేవలూ దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న.. ఆశించే పౌరులున్న  ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు..

Tuesday, August 29, 2017

అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.
*తెలుగు తొలిప్రొద్దు వెలుగులు లేక తెలుగు ప్రపంచంలో ప్రథమాలు.
*శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు
*తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది
*తొలి తెలుగు కవి - నన్నయ
*తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం
*తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము
*తొలి తెలుగు ప్రబంధము - మనుచరిత్రము
*తొలి తెలుగు నవల - రాజశేఖర చరిత్రము
*తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క
*తొలి తెలుగు వ్యాకరణము -
ఆంధ్రభాషాభూషణము
*తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము
*తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవిజనాశ్రయము
*తొలి తెలుగు శతకము - వృషాధిశతకము
*తొలి తెలుగు నాటకము - మంజరీమధుకీయము
*తొలి తెలుగు శృంగారకవయిత్రి -
ముద్దుపళని
*తొలి తెలుగు కథానిక - దిద్దుబాటు
*తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము
*తొలి తెలుగు రామాయణము - రంగనాథ రామాయణము
*తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము
*తొలి తెలుగు జంటకవులు - నందిమల్లయ, ఘంట సింగన
*తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
*తొలి తెలుగు ఉదాహరణకావ్యము -
బసవోదాహరణము
*తొలి తెలుగు పత్రిక - సత్యదూత
*తొలి తెలుగు నీతి శతకము - సుమతీశతకము
*తొలి తెలుగు సాంఘిక నాటకము -
నందకరాజ్యం
*తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
*తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన
*తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ
*తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము
*తొలి తెలుగు ధర్మశాస్త్రము -
విజ్ఙానేశ్వరీయము
*తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయగ్రంథము -
సకల నీతి సమ్మతము
*తొలి తెలుగు వ్యావహారిక నాటకము -
కన్యాశుల్కం
*తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి -
ఆంధ్రుల సాంఘిక చరిత్ర
*తొలి తెలుగు ఖురాన్- చిలుకూరినారాయణరావు
*తొలి తెలుగు వ్యావహారికభాషా వచనగ్రంధం-
హితసూచని (1853) - స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856).
*తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు -
ఐ.కొండలరావు 1938
*తెలుగు ప్రముఖులు:-
*ఢిల్లీ దర్బారు (ఫిరొజ్ షా తుగ్లక్) లో తొలి వజీరు (ప్రధానమంత్రి)-- మాలిక్ మక్బూల్ / యుగంధర్ లేక దాది (సాగి) గన్నమ నాయకుడు.
*ప్రధాన మంత్రి అయిన తొలి తెలుగువ్యక్తి-
పి.వి.నరసింహారావు
*రాష్ట్రపతి అయిన తొలి తెలుగువ్యక్తి-
వి.వి.గిరి
*అంటార్కిటికా కు వెళ్ళిన తొలి తెలుగువ్యక్తి-
దాట్ల రామదాసు
*ఒలంపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి తెలుగు వ్యక్తి- కరణం మల్లేశ్వరి.

Friday, August 25, 2017

కార్తెలపై సామెతలు*

కార్తెలపై సామెతలు*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


1.అశ్వని (ఏప్రిల్ – 14) '


అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం

అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.

అశ్వని కురిస్తే అడుగు తడవదు.

2'.'భరణి' (ఏప్రిల్ – 27)


భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.

భరణి ఎండకు బండలు పగులుతాయి.

భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు

భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.

3.కృత్తిక (మే – 11)


కృత్తిక పునర్వసులు సత్తువ పంట.

కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.

4.రోహిణి (మే – 25)


రోహిణి ఎండకు రోళ్ళు పగులును

రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.

రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.

5.మృగశిర (జూన్ – 8)


మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును

మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.

మృగశిరకు ముల్లోకాలు చల్లబడును.

మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.

మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.

మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.

మృగశిర కురిస్తే ముంగాలి పండును.

మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.

6.ఆరుద్ర (జూన్ – 22)


ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు

ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.

ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.

ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.

ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.

ఆరుద్రతో అదనుసరి.

ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.

ఆరుద్ర వాన ఆదాయాల బాన.

ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.

ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.

ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.

ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.

ఆరుద్ర వాన అరుదు వాన

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి

7.పునర్వసు (జులై – 6) :-


పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.

8.పుష్యమి (జులై – 20) :-


పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.

పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు

9.ఆశ్లేష (ఆగస్టు – 3) :-


ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది

ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.

ఆశ్లేష వాన అరికాలు తేమ

ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.

ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.

ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.

ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం

ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.

ఆశ్లేష వర్షం – అందరికి లాభం.

ఆశ్లేష వాన అరికాలు తేమ

10.మఖ (ఆగస్టు – 17) :-


మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ

మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.

మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.

మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.

మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు.

మఖా పంచకం సదా వంచకం.

మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం.

మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.

11.పుబ్బ (ఆగస్టు – 31) :-


పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.

పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.

పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు

పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు

పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు

పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు

12.ఉత్తర (సెప్టెంబరు – 13) :-


ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.

ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.

ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.

ఉత్తర పదును ఉలవకు అదును.

ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.

ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం

ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు

13.హస్త (సెప్టెంబరు – 27) :-


హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.

హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.

హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.

హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.

హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.

హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.

హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.

హస్తలో చల్లితే హస్తం లోకి రావు.

హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.

హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.


14. చిత్త (అక్టోబరు – 11) :-


చిత్త కురిస్తే చింతలు కాయును

చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.

చిత్తి ఎండకు బట్టతల పగులును.

చిత్తలో చల్లితే చిత్తుగా పండును.

ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.

చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.

చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.

చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.

చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.

చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.

చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.

15.స్వాతి (అక్టోబరు – 27) :-


స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.

స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.

స్వాతి కురిస్తే భీతి కలుగును.

స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.

స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.

స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.

స్వాతి వానకు సముద్రాలు నిండును.

స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.

స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.

స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.

16.విశాఖ (నవంబరు – 16) :-


విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.

విశాఖ కురిస్తే పంటకూ విషమే.

విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం

విశాఖ విసురుతుంది.

17.అనూరాధ (నవంబరు – 20) :-


అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.

18.జేష్ట్య (డిసెంబరు – 3) :-


జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును

19.మూల (డిసెంబరు – 16) :-


మూల కార్తెకు వరి మూలన జేరుతుంది

మూల ముంచుతుంది

మూల కురిస్తే ముంగారు పాడు

మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు

మూల మంటే నిర్మూల మంటాడు

మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.

మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.

20.పూర్వాషాడ (డిసెంబరు – 29) 21.ఉత్తరాషాడ (జనవరి – 11) 22.శ్రావణం (జనవరి – 24) 23.ధనిష్ట ( ఫిబ్రవరి – 6 ) 24.శతభిషం ( ఫిబ్రవరి – 19) 25.పుర్వాబాధ్ర ( మార్చి - 4 ) 26. ఉత్తరాబాధ్ర ( మార్చి - 4 )


27.రేవతి ( మార్చి - 31 )


రేవతి వర్షం రసమయం – రమణీయం

రేవతి వర్షం అన్ని పంటలకు రేణింపే.

రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయం

Thursday, August 24, 2017

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం ..

సీతారామాభ్యామ్ నమః -
.
పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం .. అనే లోకోక్తి
పై లోకోక్తి ఎలా వచ్చింది?
.
మాచిన్న తనంలో కొందరు బ్రాహ్మణులు నిత్యజీవితానికి ఆరోజుకు అవసరమైన అవసరమైన ఆహారాన్ని ధాన్యం, లేదా బియ్యమును యాచనతో సంపాదించుకునేవారు.
ఇత్తడి చెంబు శుభ్రంగా తోముకొని, సీతారామాభ్యామ్ నమః అని చెప్పుకుంటూ ఆరోజు పంచాంగ శ్రవణం చేస్తూ పిడికెడు బియ్యం తో సంతుష్టిచెంది వెళ్ళేవారు.
బిక్షం వేయగానే ఆశీర్వచన మంత్రం చదివే వారు. దీనిని యాయవార వృత్తి అనేవారు. ఇది సంస్కృత పదం.
సంస్కృత నిఘంటువు - ప్రత్యహం ధాన్య యాచనా - అని అర్థం ఇస్తుంది.
ముష్టి అంటే పిడికిలి, యాచన కాదు సవ్య ముష్టి ప్రహారంతో లంకాపురిని జయిస్తాడు .
ఒక విద్యావిహీనుడు, దరిద్రుడు అయిన బ్రాహ్మణునికి చిన్నప్పుడు తండ్రి ఉరుములతో కూడీన వర్షం వచ్చినప్పుడు ఇంద్రుని వజ్రం (పిడుగు) పాలి పడకుండా అందరికీ తెలిసిన ఈ శ్లోకం చెప్పాడు
.
“అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః
భీభత్స విజయోర్జిష్ణుః సవ్యసాచీ ధనంజయః” .||
.
తరువాత కొన్ని దినాలకే తండ్రిపోవడం, దరిద్రస్థితిలో చదువులేక పోవడం జరిగింది. యాయవారంతో పొట్ట పోసుకుంటూ యాచనకు వెళ్ళీ తనకు తెలిసిన పిడుగు మంత్రం చెప్పడం మొదలు పెట్టాడు. పంచాంగం చదవడం, ఆశీర్వచనం చేయడం తెలియదు తెలిసినది ఒకే మంత్రం - పిడుక్కీ బియ్యానికి అదే!

శుభ సాయంత్రం../\..

శుభ సాయంత్రం../\..
అలవచ్చినప్పుడు తలవంచితే...
ప్రాణం నిలబడుతుంది!
గొడవైనప్పుడు ఒకఅడుగు వెనక్కి తగ్గితే...
బంధం నిలబడుతుంది!!
ఒక్కక్షణం ఓడినా.. జీవితాంతం మనిషిగా గెలుస్తాం!!!!

Total Pageviews