Thursday, August 31, 2017

పాలు-కర్మ-సంబంధం-ఆకలి

పాలు-కర్మ-సంబంధం-ఆకలి

పాలను ఆశించి గోవును పోషిస్తాము ,
గోవు నుంచి మనకు పాలు వస్తాయి
అంతే కాదుః పేడ కూడా వస్తుంది ,
పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం ,
పేడని .ఇంటికి దూరంగా విసిరేస్తాం ,

ఆవు నుండి పాలు మాత్రమే రావాలి –
పేడ రాకూడదు అంటే వీలు కాదు ,
కర్మలు కూడా ఇలాగే ఉంటాయి …
ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్థవంతంగా
ఉంటుందని చెప్పలేము ,
కొంత అభ్యంతరంగా కూడా ఉంటుంది .
సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి .
ఏ. సంబంధం లేకుండా ఎవరితోను సంబంధం
లేకుండా జీవించడం సాధ్యపడదు .
కాని సంబంధాలలో కేవలం సంతోషమే
ఉంటుందని చెప్పలేము ,
విషాదం కూడా కలిసే ఉంటుంది ,
మనం ఎవరితో కలిసి జీవింజీవించినా . వారు –
తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు
కావచ్చు , భార్యాభర్తలు కావచ్చు
స్నేహితులు కావచ్చు , బంధువులు కావచ్చు ,
వారిలో అన్నీ మనకు నచ్చిన గుణాలే
ఉంటాయని చెప్పలేము .
మనకు నచ్చనివి , వారు మెచ్చేవి కూడా
ఉంటాయి …. అలాంటివి ప్రేమకి సౌఖ్యానికి
ప్రతిబంధకాలే కావచ్చు , కాని అవి లేకుండా
సంబంధాలు లేవు గులాబీలమధ్యా ముళ్ళు
తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన
సంఘర్షణలు తప్పవు ..

భోజనం చేయాలి ఆకును పడేయాలి .
కాని. ఆకు లేకుంటే వడ్డించటమే జరగదు —
ఆకలి తీరదు , ఆకలి అన్నంతోనే తీరుతుంది
అన్నం ఆరగించినంత. వరకు ఆకును
ఆదరిస్తూనే పోవాలి ,పడేసేదే కదా అనుకోవచ్చు , కడుపులో
అన్నం పడే ఆకు మన ముందే ఉండాలి ,…
ఈ. ప్రపంచంలో ఏది అవసరం లేని క్షణం
ఒకటి రావచ్చు కాని అవసరాలలో
ఆవశ్యంగా తొంగిచూసే అనవసరాలనుకూడా
పెద్ద మమనసుతో అంగీకరించేతత్వం
పెంచుకుంటేనే అభివృద్ధిని సాధించటం
మనిషికి సాధ్యపడుతుంది......


No comments:

Post a Comment

Total Pageviews