శ్రావణపూర్ణిమ చాలా దైవీశక్తులతో కూడిన తిథి. ఈరోజున దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణ శీఘ్రసత్ఫలితాలను ఇస్తాయి. ఈరోజున ఉపవీతులందరూ ఉపాకర్మ చేసుకొని, నూత్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
ఈరోజున, జప, ధ్యాన, హోమాదులు ఉత్తమఫలాలనిస్తాయి. తోబుట్టువులచే రక్షాబంధనాన్ని పొందడం సంప్రదాయంగా వస్తున్నది. భారతీయ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి ఇది చిహ్నం. అందులోనూ అక్కాచెల్లెళ్ళకు అన్నదమ్ముల అనురాగం జీవితాంతం ఉండవలసిన బంధం – అని గుర్తు చేసే పర్వదినం. ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి అని మన భావన. ఆ శక్తినుంచి లభించే రక్షణ దేవతలందరి కాపుదలను అనుగ్రహిస్తుందనే దృష్టితో ఈ పర్వాన్ని ఏర్పరచారు. సోదరిచేత కట్టబడిన రక్షాబంధనం అరిష్టాలను పోగొడుతుంది.
No comments:
Post a Comment