Thursday, August 10, 2017

రామశబ్దం.!ఒక చమత్కారం.

రామశబ్దం.!ఒక చమత్కారం. 
"రామ" అనే శబ్దాని తెలిసి పలికినా తెలియక పలికినా ఎటువంటి పలుకుల్లో భాగంగా పలికినా అవి జీడిపప్పు పలుకులైముక్తి సుగంధాన్నిమనస్సుకి అందిస్తాయట.ఒకానొక అరణ్యంలో వేటాడుతూ తిరుగుతున కిరాతుల్ని ఎవరు ప్రశ్నించినావారు వారి దినచర్యను ఈ విధంగా వివరిస్తునారట.."వనే చరామః వసుచాహరామఃనదీ స్తరామః న భయం స్మరామఃఇతీరయంతో విపినే కిరాతాఃముక్తింగతా రామపదానుషంగాః".మేం అడవుల్లో తిరుగుతూ ఉంటాఅ(చరామః) జంతువుల్ని (ఆహరామః), నదీ నదాలు సులువుగా దాటేస్తూ ఉంటాం(తరామః). భయం మా మనస్సులోకే రాదు (న స్మరామః)," అంటూ ఉంటే అనుకోకుండా ఆ మాటల్లో రామః రామః అని పలుమార్లు రావడం వల్ల రామసంకీర్తన చేసిన ఫలం లభించి వారి మోక్షం పొందగలిగారట. ఎంత చమత్కారం లీలా మానుష వేషధారియైన భగవంతుని దృష్టిలో ఈ సృష్టియే ఒక పెద్ద చమత్కారం.అంత శక్తి గల్గిన భగవన్నామ సంకీర్తనతో జీవుడు ఆనందలహరిగా మారిఆత్మానంద మహా సాగరంలో లీనం కావడమే జీవన పరమార్దం.

No comments:

Post a Comment

Total Pageviews