Thursday, August 3, 2017

అంత: శుభ్రత

అంత: శుభ్రత
"నువ్వెప్పుడైనా వంట చేశావా?"
"చేశాను గురూజీ"
"వంట తరువాత అంట్లు తోమావా?"
"తోమాను గురూజీ"
"అంట్లు తోమడం నీకు ఎలాంటి జీవిత పాఠాన్ని నేర్పించింది?"
"..........."
"గిన్నెల బయట భాగం కన్నా లోపలే ఎక్కువగా తోమ వలసి ఉంటుంది. లోపల వైపు శుభ్రం చేయడమే చాలా ముఖ్యం"
"అవును గురూజీ"
"మనిషి కూడా అంతే... బయట తోమి శుభ్రం చేయడం కంటే లోపల తోమిశుభ్రం చేసుకోవడం ముఖ్యం. లోపల శుభ్రంగా లేకపోతే బయట ఎంత శుభ్రంగా ఉన్నా లాభం లేదు."
గురువు పాఠం శిష్యుడికి బోధపడింది.
అంతఃకరణ శుద్ధి కోసం శిష్యుడు సిద్ధం అయ్యాడు.

No comments:

Post a Comment

Total Pageviews