సెల్ ఫోన్ మన దైతే ....ఇక మనని మనం" సెల్ " లో వేసుకున్నట్లే
మాయాజాలపు మరో ప్రపంచం లో బందీ ఐపోయినట్లే ........
మాయాజాలపు మరో ప్రపంచం లో బందీ ఐపోయినట్లే ........
24 గంటల నిత్య నేస్తమై శాసించేస్తోంది మన జీవితం
అంకితమైపోయి జనం ... అతుక్కుపోతోందీ నిజం
అంకితమైపోయి జనం ... అతుక్కుపోతోందీ నిజం
గుప్పెట్లో దొరుకుతోంది సకల ప్రపంచం/విషయం
నియంతై ఆడిస్తూ చూపిస్తోంది స్వర్గం/నరకం /భోగం
నియంతై ఆడిస్తూ చూపిస్తోంది స్వర్గం/నరకం /భోగం
ఈ ఇంద్రజాల మహేంద్రజాలం మత్తును మించిన సమ్మోహనం
దినారాత్రాలు కొట్టుకుంటూ ఆ మత్తుకు అవుతున్నాము బానిసలం
దినారాత్రాలు కొట్టుకుంటూ ఆ మత్తుకు అవుతున్నాము బానిసలం
ఇపుడు ఫోన్ సకల రంగ కళా నిలయ సంగమ సమస్తం
అందించేస్తోంది నిరంతరం విశ్వరూప దర్శన వైభోగం
అందించేస్తోంది నిరంతరం విశ్వరూప దర్శన వైభోగం
ఆ నెట్ వలలో ...బెల్లం పానకంలో ఈగల్లా వాలిపోతున్నాం
పరిణతి చెందని వయసులకు శాపగ్రస్తం
వయో భేదం లేకుండా ఇపోయారు అంతా దానికి పాదాక్రాంతం
పరిణతి చెందని వయసులకు శాపగ్రస్తం
వయో భేదం లేకుండా ఇపోయారు అంతా దానికి పాదాక్రాంతం
నలుగురు ఒకచోట చేరినా .... వారి ఫోనే వారికీ ప్రియ ప్రపంచం
లేవు మాటలు /ముచ్చట్లు ....లేవు మమతల భాషితాలు
లేవు మాటలు /ముచ్చట్లు ....లేవు మమతల భాషితాలు
అడ్డమైన వన్నీ చూస్తూ , నేరుస్తూ ... జరుగుతున్నాయి దురాగతాలు
అక్కరలేనివి తెలుసుకుంటూ ....దిగజారుతున్నాయి సంస్కారాలు
అక్కరలేనివి తెలుసుకుంటూ ....దిగజారుతున్నాయి సంస్కారాలు
మనసు విప్పి మాట్లాడటం మర్చిపోయి ...ఒకే మాటలో సమాధానం
కలుసుకోవటం ఆగిపోయి ..... ఫోటోలు చూస్తూ ...సరి పెట్టుకుంటున్న జనం
కలుసుకోవటం ఆగిపోయి ..... ఫోటోలు చూస్తూ ...సరి పెట్టుకుంటున్న జనం
సెల్ ఫోన్ .... నేడు షడ్రసోపేత భోజనం ...... కానీ అతి ..... అజీర్తి తో ఆరోగ్య భంగం
చేతులు ఇంకా కాలక ముందే మేలుకోవటం ఉత్తమం ..... సమాజ శ్రేయస్కరం
చేతులు ఇంకా కాలక ముందే మేలుకోవటం ఉత్తమం ..... సమాజ శ్రేయస్కరం
బీటలు వారుతున్న గృహ సీమలు ....... మాయమైపోతున్న ఆప్యాయతలు
సెల్ ఫోన్ విశ్వరూపానికి బలై పోతున్న మానవాళీ ...... తస్మాత్ జాగ్రత్త .......
సెల్ ఫోన్ విశ్వరూపానికి బలై పోతున్న మానవాళీ ...... తస్మాత్ జాగ్రత్త .......
టెక్నాలజీ ఆవిష్కారం ....... కావాలి విశ్వ క్షేమం
కారాదు ..... విశ్వ సంక్షోభం ...... సమాజ సౌఖ్య విద్రోహం .... కుటుంబ భంగం .
కారాదు ..... విశ్వ సంక్షోభం ...... సమాజ సౌఖ్య విద్రోహం .... కుటుంబ భంగం .
రచన:
పద్మజ
No comments:
Post a Comment