Sunday, August 20, 2017

పరాయి భాషలో మనం చేసేది నటనే . మనల్ని మనంగా చెప్పుకోగలియేది మాతృభాషలోనే

మీకు గాయం అయ్యింది . బాధ వేసింది . ఏమంటారు ? ఓహ్ మై గాడ్ ! ఇట్స్ పైనింగ్ ఏ లాట్ యార్ !" అంటారా ? చచ్చినా అనరు. అమ్మా... హయ్యో అంటారు . చిన్నప్పుడు మీరు నేర్చుకొన్న మాతృభాషే మీకు భావోద్వేగాన్ని వ్యక్త పరచడానికి పనికి వస్తుంది . అనారోగ్యం తో వున్నా , జరగరానిది జరిగినా బాధ ను కేవలం మాతృబాష లోనే వ్యక్తపరచగలం .
ఇంగ్లీష్ లో ఏడవలేము .. ఎందుకంటే మనం ఇంగ్లీష్ వాళ్ళు కాదు కదా?
రాత్రి ఒక కుటుంబాన్ని చూసాను . న్యూయార్క్ నుంచి వచ్చారు . పిల్లలు చక్కగా american యాస లో హే మామ్ .. హే డాడ్ అంటూ మాట్లాడుతున్నారు . వారితో తల్లితండ్రులు అదే english యాస లో ప్రయత్న పూర్వకం గా మాట్లాడుతున్నారు. కానీ తమలో తాము తెలుగు లో మాట్లాడుతున్నారు.
ఈ మధ్య కాలం నేను చుసిన ప్రతి nri తెలుగు కుటుంబం లో ఇదే పరిస్థితి . నాకు ఒకటే అనుమానం . మాములు సంభాషణ సరే . రేపు వృద్ధులయ్యాక లేదా ఎప్పుడైనా తీవ్ర సంఘటన జరిగి పిల్లల్ని గుండెలకు హత్తుకొని కడుపారా ఏడ్చి మనసులోని భావాన్ని వీళ్ళు చెప్పగలరా ? గుండె బరువు దించుకోగలరా ? సంతోషాన్నో దుక్ఖాన్నో కమ్యూనికేట్ చెయ్యగలరా ?
బాష ను మనం ఉద్దరుంచాల్సిన పనిలేదు . మనల్ని మనం ఉద్దరించుకొంటే చాలు . నాకైతే అనిపిస్తుంది పరాయి భాషలో మనం చేసేది నటనే . మనల్ని మనంగా చెప్పుకోగలియేది మాతృభాషలోనే . nri పిల్లలకు ఇంగ్లీష్ మాతృబాష అయ్యింది. ఎందుకంటే ఇంట్లో వాళ్లకు ఇంగ్లీష్ నేర్పుతున్నారు . So they may not have any problem.
సమస్య అంతా తల్లితండ్రుల తోనే! పాపం వారు తమ పిల్లలతో మనసు విప్పి మాట్లాడగలరా ? ఎస్ అంటే సంతోషపడుతాను .

No comments:

Post a Comment

Total Pageviews