Monday, August 7, 2017

*వర్ణమాల - దాని అంతర్నిర్మాణం

*వర్ణమాల - దాని అంతర్నిర్మాణం :-
"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అంటారు. ఈ చంద్ర ఖండం లోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని". వశ పరచుకొనే శక్తి కలదే వశినీ శక్తి.

"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం" అంటారు.

"మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు.

ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమోజోములను ...ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండం లోని "క" మొదలు... మొదటి ఐదు అక్షరాలకు అధిదేవత కామేశ్వరి. కోర్కెలను మేలుకొలిపేదే కామేశ్వరి.

"ట" నుండి "ణ" వరకు గల అధిదేవతా శక్తి "విమల". మలినాలను తొలగించేదే విమల."త" నుండి "న" వరకు గల 5 అక్షరాలకు అధిదేవతా శక్తి "అరుణ". కరుణను మేలుకొలిపేదే అరుణ.

సౌర ఖండంలోని "ప, ఫ, బ, భ", మరియూ అగ్ని ఖండంలోని "మ" అనే అక్షరాలకు అధిదేవతా శక్తి "జయిని".

అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి". శాశించే శక్తి కలదే సర్వేశ్వరి.

అగ్ని ఖండంలోని 5 అక్షరాలైన శ, ష, స,హ, క్ష లకు అధి దేవత కాళి. ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు.*

No comments:

Post a Comment

Total Pageviews