కంటిచూపు తగ్గుతోందన్న విషయం మన ఇంట్లోని బామ్మలు, అమ్మమ్మల చెవినబడితే వెంటనే వాళ్లు రోజూ పొన్నగంటి కూర తినమని సలహా ఇస్తారు. నిజానికి చూపు పోయినవాళ్లకీ చూపు తెప్పించగలదనే అర్థంలో దీన్ని ‘పోయిన కంటి కూర’ అని పిలిచేవారు. అదే వాడుకలో పొన్నగంటి అయింది. ఈ ఆకునే సంస్కృతంలో మత్స్యక్షి అనీ, ఇంగ్లిషులో డ్వార్ఫ్ కాపర్‌లీఫ్, సెసైల్ జాయ్‌వీడ్ అనీ పిలుస్తారు. సామాన్యుడి బంగారు భస్మంగానూ దీన్ని పిలుస్తారు. పూర్వం తిరిగి శక్తిని పుంజుకునేందుకు కాయకల్పచికిత్స చేయించుకునేవారు. అందులో వాడే బంగారు భస్మానికి బదులు దీన్ని వాడేవారట. మనకన్నా ఉత్తరాదిన దీని వాడకం మరింత ఎక్కువ. ఇందులో పోషకాలూ ఎక్కువే. వంద గ్రాముల ఆకులో 60 క్యాలరీల, 12గ్రా. పిండిపదార్థాలూ, 4.7గ్రా. ప్రొటీన్లూ, 2.1గ్రా. పీచూ, 146మి.గ్రా. కాల్షియం, 45 మి.గ్రా. పొటాషియంలతోబాటు ఎ, సి- విటమిన్లూ పుష్కలంగా లభ్యమవుతాయి.
No comments:
Post a Comment