పాతికేళ్ళ క్రితం మాట.
“మా ‘ఆమ్మ' వొస్తోందిరా! నిన్ననే అమ్మడక్కయ్యనించి ఉత్తరఁవొచ్చింది."
అమ్మ మాట వినగానే పళ్ళన్నీ ఊడిపోయి, కొంచెం వంగి నడిచే డెబ్భయ్యేళ్ళ ముసలావిడ కళ్ళముందు ప్రత్యక్షమైంది.
ఆవిడ మాఅమ్మమ్మకి తోడికోడలు. పశ్చిమగోదావరి జిల్లాలో శుద్ధపల్లెటూర్లో వుంటుంది. ఆమధ్య ఓసారి గూడెంవెళితే అమ్మతో అందిట..
“నీకొడుకు డాక్టరటగా! నేను మీయింటికొస్తాను. ఓనాల్రోలుండి అన్నీ చూబించుకెళతాను!"
“వాడింకా మూడోయేడే! నీకేఁవిటి కష్టం?" అంది అమ్మ ఆవిణ్ణి ఎలాగైనా ఆపాలని.
“తల్లో ఓరే తల్లీ! రైళ్ళెడుతున్నట్టే అనుకో!... అయినా వాడు చదివేది కేజీహెచ్చేకదా, అక్కడ చూబిస్తాళ్ళే!"
మరిక అప్పీలు చేసుకునే వీల్లేదు. ఆవిడ వచ్చేసినట్టే! అన్నట్టుగానే బొకారోలో దిగింది.
“వెధవరైలు. ప్రెతీచోటా ఆపేడఁవే! టేషనున్నా లేపోయినా!" ఒక్క సెంటెన్సులో తేల్చేసింది ఆరైలు గుణగణాల్ని!
మాకందరికీ ఆవిడ కంప్లైంట్లు వినడం ఒక వినోదకార్యక్రమమైపోయింది. తలలో హోరుకొచ్చిన తిప్పలు...తల్లో ఓరనేది.
“ఈమోకాలు నొప్పి. మళ్ళా ఇదిలేదు!" అనేది రెండోది చూపించి.
ఇంటెడు పనీ చేసేది. వద్దన్నా వినేదికాదు.
కరీంబీడీలవారి గుడ్డసంచీలో బట్టలు సర్దుకొచ్చేసింది.
సంచిలో ఎక్కడో అడుగునుంచి ఓ ఎక్స్-రే తీసి నాకిచ్చి చూడమని తను పక్కగదిలోకెళ్ళింది.
అది తలకి తీసింది. పుర్రెచుట్టూ తెల్లగా కిరణాల్లా వున్నాయి. అన్నయ్యేమో “అదే తల్లో ఓరు!" అని ఒకటే నవ్వు.
నా మూడోయేడు చదువుకి అంతుపట్టని రహస్యంలా వుందా ఫిల్ము. ఈలోగా ఆవిడ చక్కావచ్చింది.
“ఏఁవన్నా తెలిసిందిరా నీకూ?" అంది ఆశగా.
“ఇదేదో వుందమ్మమ్మా! తెలీట్లా!" అన్నాను పేద్ద ప్రొఫెసర్లా పైపెదవి పళ్ళతో నొక్కిపట్టి!
“అదా! అదొకమారు తేనిసీసా పగిలిపోయి దానిమీద ఒలికిపోయిందిరా! అదేఅది!" సట్టన్ కి కూడా అంతుచిక్కని రేడియలాజికల్ సీక్రెట్ అలా బయటపెట్టింది.
ఇక చూస్కోండి! దొర్లిదొర్లి నవ్వులు అందరం. నాకయితే ఆనవ్వుకి ఊపిరందలా! ఆవిడెంత సరదామనిషంటే మాతోపాటూ తనూ నవ్వేసింది. ఉడుక్కోడాల్లేవ్.
మొత్తానికి ఆవిణ్ణేసుకుని కేజీహెచ్ కెళ్ళాను. న్యూరోసర్జరీ విభాగం మూడోఅంతస్తులో వుంటుంది.
“మెట్లెక్కడం కష్టం. ఆయన కిందకొస్తే చూపించుకుందువుగాని!" అన్నాను.
“వీళ్ళని మనం పట్టుకోవాలి. వాళ్ళొస్తారని కూచోకూడదు!" అంటూ జీవితసత్యాన్ని బోధించింది. మెట్లన్నీ ఎక్కేసింది.
ఆడాక్టరు “ఎలావచ్చారమ్మా?" అనడిగాడు.
“మిమ్మల్ని చూడాలన్న ఆశే లాక్కొచ్చేసింది!" అనగానే కుర్రాడు ఫ్లాటు!
చక్కగా పరీక్షలు చేసి మందులవీ రాసిచ్చాడు. అవితీసుకుని మాయింట్లో ఓపదిహేన్రోజులుంటానని డిక్లేర్ చేసింది.
మధ్యానంపూట పడుకునేదికాదు. ఉతికినబట్టలు మడతెయ్యడమో, ఎండబెట్టిన పప్పులు, మిరపకాయలూ డబ్బాలకెత్తడమో...ఇలా ఏదోవొక పని కల్పించుకుని చేస్తుండేది.
ఒకాదివారంనాడు మిట్టమధ్యానం ఇంటిల్లిపాదీ నిద్దర్లోతున్నారు. మనం చాలా సీరియస్‌గా చదివేసుకుంటున్నాం. ఇంతలో వంటింట్లోంచి ‘సుఁయ్..'మంటూ సౌండొచ్చింది. ఏఁవిటాశబ్దమని వచ్చిచూస్తే ఆవిడ పొయ్యిదగ్గర నిలబడుంది.
“ఏంచేస్తున్నావిక్కడా?" అన్నాను సందేహంగా.
“నీకే! కొయ్యరొట్టి కాలుస్తున్నాను. పాపం పొద్దుణ్ణించీ చదూతూనేవున్నావు. ఆకలేస్తూవుంటుంది! ఆరారా ఏదోఒకటి తింటోవుండాలి!" అంది పళ్ళెంలో రొట్టెపెట్టి.
నాక్కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. నా అహం, అహంకారం ఆరొట్టెకన్నా పూర్తిగా కాలిపోయాయి.
అదెంత కమ్మగా వుందంటే ...శెనగపప్పువల్ల అనుకుంటున్నారా? ఆవిడ ఆత్మీయతే ఆ రుచిని తెచ్చిపెట్టింది.
ఎంత నవ్వుకున్నాం? ఎంత అపహాస్యం చేసాం?
అభిమానమనేది చెప్పిచేయించుకోవడంలో వుండదు. ఇష్టపడిచేసే పనిలో కష్టముండదు.
ఇక ఆపేస్తాను. మరీ ఎక్కువ తలుచుకుంటే ‘అమృతం' తాగేటపుడు పొలమారుతుంది ఆవిడకి!
..........జగదీష్ కొచ్చెర్లకోట

No comments:
Post a Comment