Monday, August 7, 2017

పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది.

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం
చెప్పింది..కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు.

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

--> కార్యేషు యోగీ :

పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. 



--> కరణేషు దక్షః 

కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

--> రూపేచ కృష్ణః

రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,  సంతోషంగా ఉండాలి.

--> క్షమయా తు రామః

ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.


--> భోజ్యేషు తృప్తః

భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. 


--> సుఖదుఃఖ మిత్రం

సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

No comments:

Post a Comment

Total Pageviews