Monday, August 7, 2017

హైద్రాబాద్ లో ఆటో ప్రయాణం

హైద్రాబాద్ లో ఆటో ప్రయాణం:
పూర్వం హైదరాబాద్ లో ఆటోలో వెళ్లాలంటే సరదాగా ఉండేది. చుట్టుపక్కల అన్ని చూసుకుంటూ వెళ్లచ్చూ. రోడ్డు పక్కన నిలబడే సరికి ఆటో మనముందు ఆగి ఎక్కడికెళ్లాలి అని అడిగితే అబిడ్స్, చార్మినార్, పంజాగుట్ట ఇలా మనం వెళ్లాల్సిన గమ్యం చెప్తే కూర్చోండి అని గిర్రున మీటర్ తిప్పేవారు. ఆ తర్వాత చుట్టుప్రక్కల చూడ్డం దేముడెరుగు మనం ఆ మీటర్ కేసి చూస్తూ ఎంతవుతుందో ఏవిటో అని మీటర్ తిరిగే కొద్దీ మన కళ్ళు తిరిగేవి. గమ్యం వస్తే హమ్మయ్య అనుకుంటూ డబ్బులు ఇచ్చి దిగేవాళ్ళం గొడవ లేకుండా.
మరి ఇప్పుడో దూరప్రయణాలకి ఆటో ఎక్కడం మానేసామ్. ఎందుకంటే ఆటో కావాలంటే పిలవాలి. ఫలానా చోటుకు వస్తావా అంటే వస్తా అని రేట్ చెప్తాడు. ఆయన అడిగిన దానికి అటూ ఇటూ లో బేరం కుదుర్చుకుని ఆటో ఎక్కడమే. మీటర్ కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. దగ్గర వాటికి కూడా బేరం కుదుర్చుకోవడమే. కాస్త రేట్లు హైదరాబాద్ వాస్తవ్యులకు తెలుసుకాని అదే కొత్తవాళ్లయితే అడిగినంత ఇచ్చుకోవలసిందే. పూర్వవైభవం బదులు కొన్నాళ్ళకు ఈ ఆటోలు కూడా కనుమరుగవుతాయేమో. ఎదుకంటే క్యాబ్ లు వచ్చేసాయి. కాల్ చేసి బుక్ చేసుకుంటే ఇంటిముందర నిముషాల్లో ప్రత్యక్షం. హాయిగా ఏసీ లో కూర్చుని వైఫై పెట్టుకుని నెట్ ఎంజాయ్ చేస్తూ గమ్య స్థానాన్ని చేరుకుంటున్నాము. ఇంతలో ఎంత మార్పు.

No comments:

Post a Comment

Total Pageviews