Tuesday, August 1, 2017

వెళ్లాలని లేకున్నా... వెళ్లక తప్పని పయనమిది..వెళ్లిరానా మరి..బై..రా.!!

బ్రతుకుతెరువు కోసం వలసవెళ్లే పల్లె ప్రజల కన్నీటి కథలను,వెతలను చూపించాటానికి కావాల్సినంత సమాచారముంది, గల్ఫ్ కు వెళ్లి కంపెనీ వారి ఘాతుకానికి బలి యై కుటుంబానికి దూరమై కూనారిల్లుతున్న ప్రజలదీన గాధలెన్నో ఉన్నాయి.ప్రతిభావంతులు పూనుకొని ప్రజలను వెళ్ళనీయకుండా ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ కూడా చిత్రాలు రూపొందించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.
ఒబులాపురం గ్రామం పోస్ట్ పేరిట ఓ అజ్ఞాత కవి వ్రాసిన కన్నీటి కథను మీ ముందున్చుతున్నాను.

వెళ్లాలని లేకున్నా...
వెళ్లక తప్పని పయనమిది..వెళ్లిరానా మరి..బై..రా.!!
******************************************
అమ్మను చూస్కో..
బాబు జాగ్రత్తే..నువ్వు ఏడ్వకు..
గుండె అంత పిండినట్టైతుందే నువ్వేడిస్తే..
ఈసారి తొందర్గనే వస్తా..నాకూ గల్ఫ్ లో.. 
ఉండబుద్ది కావట్లేదే..నావల్ల కాదిక .నా బుజ్జి కదూ..వెళ్లక తప్పదురా..!

ఏడ్నెల్ల జీతం రావాలి..
పన్నెండ్ల సర్వీసు పైసల్ రావాలి..
రూంలున్న దోస్తులకు సేపాయిచ్చినవి వసూల్ చేస్కోవాలి.

అన్నట్టు మరిచానే..
పక్క దేశపోల్లు తక్కువ జీతంకు వస్తున్నరు..
నా ఒక్కడి జీతంల ..ఆ దేశం వాళ్లు ముగ్గురు పనిజేయడానికి రెడీ అవడంతో మా కంపిని కఫిల్ గాడు మా సీనియర్లను పొమ్మనలేక పొగవెట్టి టార్చర్ పెడుతుండు.

తక్వ జీతానికి..
గల్ఫ్ లో పని చేయలేక..
గతి లేక ఇండియాకు రాలేక..
ఎంత నలిగి పోతున్నమో ..ఎవరికి చెప్పుకోలేక పోతున్నం.!!

బై..రా..బంగారం..
నేను ఇప్పుడు కష్టపడితేనే కదే మనందరి కష్టాలన్ని పోయి 
సంతోషంగా బతికేది..మేం రొండు నెలల కోసం వచ్చేది మేమేదో సాధించామని కాదే..నా వాళ్లందరి మొహంలో చిరునవ్వు చూసేందుకు..!

మిమ్మల్ని చూసుకుని మేమెంత ఛార్జవుతామంటే..ఎండిపోయిన అన్నాన్ని బిర్యాని అనుకునేంత..మాడగొడుతున్న ఎండను సైతం మర్చిపోయెంత..మీకోసం మేం ఏం చేయడానికైనా సిద్ధం రా..
నువ్వేం బాధ పడకూ..ఆ..నే..వస్తాన్రా..ఏడకూ..జాగర్తా..బైరా..!!

No comments:

Post a Comment

Total Pageviews