భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Thursday, June 20, 2019
తెలుగు గజల్: ఉందో లేదో స్వర్గం
తెలుగు గజల్: ఉందో లేదో స్వర్గం: రచన : తటపర్తి రాజగోపాలన్ గానం : గజల్ శ్రీనివాస్ ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్ సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్ అమ్మ గ...
Monday, June 17, 2019
🙏 *పద్య భాషాభిమానులకు జోహార్లు*. *తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు* 🙏 *అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *
*చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*
భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా
*చదివే సమయంలో పెదవులు తగలనిది*
శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా
*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*
*అంటే పెదవి తగలనిది, తగిలేది*
*అంటే పెదవి తగలనిది, తగిలేది*
దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా
*కేవలం నాలుక కదిలేది*
సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా
*నాలుక కదలని (తగలని) పద్యాలు*
కాయముగేహము వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా
భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా
భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా
*నాలుక కదిలీ కదలని పద్యం*
ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా
🙏 *పద్య భాషాభిమానులకు జోహార్లు*.
*తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు*
🙏
*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *
🙏
*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *
Wednesday, June 12, 2019
ఘజల్ గురుంచి పరిచయం నీ చూపే పరిమళించు పద్యం లా ఉంది
మీ అందరికి ఘజల్ గురుంచి పరిచయం చేసి నా వివరాలు కొంత మీకు తెలియా చేస్తా.
తెలుగులో ఘజల్ ప్రవేశం చేసి సుమారు ఓ 30 ఏళ్లు అయింది. డా: దాశరధి తొలి ప్రయత్నం చేశారు
కొన్ని ప్రణయ సంభంధ మైన ఘజాళ్లు వ్రాశారు. డా: సినారె కూడా అదేయ్ కాలం లో వ్రాశారు. కానీఘజాళ్లు గా వాటిని ఆయన ఎక్కడా చెప్పలేదు.
అన్నట్టు ఘజల్ అంటే ఏమిటి పాటకు , ఘజల్ కు ఉన్న తేడా ఏమిటి అన్న సందేహలు వస్తున్నాయి కదా!
ఘజల్ ఆంటెయ్ " ఇష్టమయిన వాలతో సంభాషన అని అర్ధం. ఘజల్ అంటే సంగీతం కాదు, ఘజల్ ఆంటెయ్ సాహిత్యం.
ఘజల్ పల్లవి ని మత్హలా అంటారు. ఘజల్ పల్లవి లోని చివరి పదాలు ప్రతి చరణం లో అంత్య ప్రాశలు గా వస్తాయి.
ఈ అంత్య ప్రాశాలను ఖాఫియా _రాధీఫ్ లాంటారు.
ఇలా ఘజల్ లో 4 నుండి 27 వరకు చరణాలు ఉండవచ్చు
ఆఖరి చరణాన్ని మఖ్త అంటారు
ఆఖరి చరణం లో కవి నామ ముద్ర ఉంటుంది దానిని తక్ఖల్‌లూస్ అంటారు.
ఇక ఘజల్ ఇలా ఉంటుంది ఉధ్ాహరణకి.
రచన- డా: పెన్నా శివ రామ కృష్ణ
నీ చూపే పరిమళించు పద్యం లా ఉంది
నీ మాటే మధుర మైన వాధ్యం లా ఉంది
( పైడి పల్లవి)
తొలకరి జల్లులాగా ఒక్కసారి తొంగి చూడ రాదా!
నీవు లేని బ్రతుకు ఎడారిలో సేధ్యం లా ఉంది
ప్రణయ మూర్తి వనుకున్న పాషానమయిపోతివే!
నా మది నువు తాకని నయివేద్యం లా ఉంది
ఎపుడు నీ తోడుగా నాకుండాలని ఉంటుంది
నీడలాగ మారితేనే సాధ్యం లా ఉంది
నీ పేరు తలవ గానే మాట తడబడుతోంది
నీ తలపే యుగ యుగాల మద్యం లా ఉంది
ఇది తెలుగు ఘజల్.
దీనిని నా గొంతులో వినాలనుకుంటే
https://gaana.com/song/nee-choope-parimalinchu
ని చూడండి

Monday, June 10, 2019
RANGULA KALALU: Bapu bommala koluvu:Bapu(Satthiraju Lakshmi Naray...
RANGULA KALALU:
Bapu bommala koluvu:Bapu(Satthiraju Lakshmi Naray...: Bapu bommala koluvu: Bapu( Satthiraju Lakshmi Narayana) Bapu (born on December 15,1933) . He is an Indian film director, ...
Bapu bommala koluvu:Bapu(Satthiraju Lakshmi Naray...: Bapu bommala koluvu: Bapu( Satthiraju Lakshmi Narayana) Bapu (born on December 15,1933) . He is an Indian film director, ...
Thursday, June 6, 2019
సాహితీ నందనం: కొత్త పాతలలో ఏది మంచిది?
సాహితీ నందనం: కొత్త పాతలలో ఏది మంచిది?: కొత్త పాతలలో ఏది మంచిది? సాహితీమిత్రులారా! మనవాళ్ళు అంటూవుంటారు "గతకాలము మేలు వచ్చు కాలముకంటేన్" - అని, మరికొందరేమో...
Review by ms. Anjani యండమూరి తరహా విశ్లేషణే ఈ ‘ప్రేమ’
-----------------------------------
ఆమె పేరు వేద సంహిత!
అపురూప సౌందర్యవతి
ఆమెను సృష్టించిన బ్రహ్మ కూడా ఆమె సౌందర్యానికి ముగ్దుడవుతాడు.
‘ఈమె కురులు హటకాంబురుహ చంచరీ కోత్కరంబులు...
ఈమె ఊరువులు సహజ గంధ పరిమళ పరివేష్టితమ్ములు’ అని
అశువుగా కవిత్వం చెప్పి భార్యతో మొట్టికాయ తింటాడు.
అంతేనా... వారిద్దరి తగవు తీర్చడం నారదుడి వంతు అయ్యింది.
వారి తగవుల ఫలితం...
వేదసంహిత వైవాహిక జీవితం
ఆమె మెడ మీద భర్త పెట్టిన కత్తి గాటునే మిగిల్చింది.
* * *
మెరుపులేని ఉరుములా... మేఘంలేని వర్షంలా
ఏమిటీ ఉపోద్గతం అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నా..
ఈమధ్యనే యండమూరి వీరేంద్రనాథ్ ‘ప్రేమ’ నవల చదివాను.
తొలుత ఆంధ్రభూమి వారపత్రిక నలుగురు ప్రముఖ రచయితలతో 'ప్రేమ' అనే నవలకు
శ్రీకారం చుట్టింది.
నలుగురూ భిన్న కథాంశాలు ఎన్నుకొని, ప్రేమని ఎలివేట్ చేస్తూ...
ఎవరి కోణంలో వారు రాసిన కథలను ఒక పుస్తకంగా ప్రచురించారు.
ప్రస్తుతం యండమూరి ‘ప్రేమ’ నవలను ప్రత్యేకంగా చిన్న పుస్తకంగా ప్రచురించారు.
ఆ పుస్తకం చూసిన తర్వాత మళ్లీ చదవాలనిపించింది....
చదివిన తర్వాత నా అనుభూతిని మిత్రులందరితో పంచుకోవాలి కదా....
అందుకే నా అభిప్రాయాలను అక్షరాలుగా ఇక్కడ పేర్చుతున్నా...
* * *
ఇక ఈ ‘ప్రేమ’ కథలోకి వెళితే....
బ్రహ్మచే అద్భుతంగా సృష్టించబడిన అందమైన అమ్మాయి వేదసంహిత.
అద్దె ఇల్లు కోసం ఆదిత్యపురం అనే గ్రామానికి రావటంతో కథ ప్రారంభం అవుతుంది.
అంత అందమైన ఒంటరిగా రావడంతో ఆశ్రయం ఇవ్వటానికి అంతా సందేహిస్తారు.
ఆమె అందానికి ముగ్దుడైన చలం అనే యువకుడు ఈ పల్లెటూళ్ళో రీసెర్చ్ చెయ్యటానికి
వచ్చిందని అబద్ధం చెప్పి, సోమయాజులు గారి ఇంట్లో ఆమెకు ఆశ్రయం దొరికేలా చేస్తాడు.
తొలిచూపుతోనే వేదసంహితను ప్రేమించడం ప్రారంభిస్తాడు చలం.
ఒకరోజు అందరూ పొలాల్లో సంతోషంగా గడుపుతున్న సమయంలో,
హఠాత్తుగా సోమయాజులు గారి కూతురు భారతికి జలగ పడుతుంది.
ఆ సందర్భంలో అరుణ్ అనే యువకుడు వచ్చి ఆమెను రక్షిస్తాడు.
వేదసంహితతో అతనికి పరిచయం కలుగుతుంది.
అతను కూడా అంత్రోపాలజీ చదివినవాడు కావడంతో వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది.
ఇద్దరూ కలిసి పని మీద ఒకరోజు పట్నం వెళ్తారు.
సంహిత అరుణ్ కి తెలియకుండా తన నగలు కుదువపెట్టబోతుంటే, అతను వారించి ఆమె
నగలు ఆమెకు ఇప్పిస్తాడు.
వారిద్దరూ కలిసి తిరగడం చూసి ఊక్రోషంతో మదనపడిన చలం... తన ప్రేమను వెల్లడి
చేస్తాడు.
వేదసంహిత మొదట షాక్ అవుతుంది. ఆ తర్వాత తాను వివాహితురాలినని చెబుతుంది.
ఒక వ్యక్తి మీద, ఒక వ్యవస్థ మీద తను వ్రాసిన థీసిస్ అతని చేతిలో పెట్టి అది
చదువమంటుంది. చలం కొయ్యబారిపోతాడు.
ఓ సాయంత్రం వేదసంహితను కలవడానికొచ్చిన అరుణ్ ఆమెకు వచ్చిన ఉత్తరం
చదువుతాడు అరుణ్.
ఇతరుల ఉత్తరాలు చదవడం సంస్కారం కాదని అరుణ్ తో గొడవపడుతుంది.
అయితే ఆమె మీద తనకున్న వ్యామోహాన్ని వ్యక్తం చేస్తాడు అరుణ్. ఈ సందర్భంగా వారి
మధ్య గొడవ జరుగుతుంది. అరుణ్ ఆ తర్వాత వేదసంహితపై అనేక పుకార్లు పుట్టిస్తాడు.
అభిషేక్ ఆదిత్యపురం వస్తాడు. వేదసంహిత భర్తగా అతన్ని అందరికీ పరిచయం చేస్తాడు
చలం. అభిషేక్ మెక్సికో దీవుల్లో స్థిరపడ్డ భారతీయ సంతతి డాక్టర్. అపాచి తెగకు
నాయకుడు. అపాచి తెగ హక్కుల కోసం అతను చేస్తున్న పోరాటం, అక్కడి జైలర్ హెర్మన్
కార్డిస్ కి అభిషేక్ మధ్య సంవాదం, అనంతరం అభిషేక్ ఇండియాకు ముఖ్యంగా ఒక
అందమైన పల్లెటూరికి రావాలనుకోవడం... ఈ కథనం అంతా చదువరులకు ఉత్కంఠతను
కలిగిస్తుంది. అదే సందర్భంలో వేదసంహిత అభిషేక్ మీద రీసెర్చ్ చేయడం, ఆ సందర్భంగా
జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా అతనికి స్నేహపాత్రమవుతుంది. అతని సూచనల మేరకు
వేదసంహిత ఆదిత్యపురం గ్రామానికి వస్తుంది. ఈ విషయాలు ఒక్క చలంకి తప్ప ఇతరులకి
తెలియవు. రీసెర్చ్ పనిమీదే ఆమె ఆ గ్రామంలో వుంటోందని, అభిషేక్, వేదసంహిత
భార్యభర్తలనే అంతా భావిస్తారు. అభిషేక్ తన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకొంటాడు.
భారతి అరుణ్ ని ప్రేమిస్తున్న విషయం తెలియని సోమయాజులు ఆమెకు పెళ్ళి చేసే
ప్రయత్నంలో వుంటారు. దీంతో భారతి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అభిషేక్ తన
వైద్యంతో ఆమె ప్రాణం నిలబెట్టి, జరిగిన విషయం తెలుసుకొని అరుణ్ నిజస్వరూపం ఆమెకు
తెలిసేలా చేస్తారు. దీంతో సోమయాజులు గారి కుటుంబం పరువు నిలబడుతుంది. దీంతో ఆ
కుటుంబానికి అభిషేక్- వేదసంహిత మరింత దగ్గరవుతారు.
ఈ నేపథ్యంలో అభిషేక్, సంహిత ఆదిత్యపురం విడిచి వెళ్ళాల్సిన రోజు రానే వస్తుంది. సంహిత
దుఃఖితురాలవుతుంది. బ్రతుకుబాటలో ముందుకు సాగిపోయే తరుణంలో- ఆలంబనగా
ఒక అనుభవాన్ని అనుభూతిని మిగుల్చుకోవాలనుకుంది. ఆమె జీవితంలోకి అపురూపంగా
ప్రవేశించిన అభిషేక్ తో ఓ వెన్నెల రాత్రి.... గోదారి ఒడ్డున ఒక అనుభవం అనుభూతిగా
మార్చుకుంటారు. భారమైన హృదయాలతో ఐ.ఏ.ఎస్ ఇంటర్వ్యూ కోసం సంహిత ఒకవైపు,
వ్యక్తిగతమైన ప్రేమని విశ్వజనీయమైన ప్రేమగా మార్చుకోవడానికి మరో ట్రైన్ లో అభిషేక్
ప్రయాణమవుతారు. అప్పుడు చూస్తాడు చలం ఆమె మెడ మీద మచ్చని. అయితే అది
త్రాగుబోతైన ఆమె అసలు భర్త చేసిన గాయం అన్న నిజం, అతనికి ఎప్పటికీ తెలియకుండానే
ఉండిపోతుంది. ఇక్కడితో కథ ముగుస్తుంది.
* * *
కథారంభంలో వేదసంహితని సృష్టించినప్పుడు ఆమె అందానికి వివశుడై బ్రహ్మదేవుడు
ఆశువుగా శృంగార పద్యం చెబితే, సరస్వతీదేవి ఆగ్రహించి ఆ అమ్మాయి అందచందాలని ఏ
మాత్రం గుర్తించలేని వ్యసనపరుడైన భర్త దొరకాలని శపిస్తుంది.
దీన్నిబట్టి నవలలో మొత్తం కథానాయిక అష్టకష్టాలు పడుతుందని హింట్ ఇస్తాడు రచయిత.
ఆ దృష్టితో చదివే పాఠకులకు మొదట ఊహించినట్టుగా ఎక్కడా కష్టాలుండవు. నవల చివర
ఒకే వాక్యంతో ఆమె ఎన్ని కష్టాలు పడిందోననేది పాఠకుల ఊహకే వదిలేస్తాడు రచయిత.
అభిషేక్ రంగప్రవేశంతో కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది. తెలుగు సినిమాలో
హీరోకి వుండే క్వాలిటీస్ ఇతనికీ వుంటాయి. దీంతో వేదసంహిత పాత్ర ప్రాధాన్యత కాస్త
తగ్గినట్లుగా అనిపిస్తుంది.
అలాగే... భారతి -అరుణ్, వేదసంహిత -చలం , వేదసంహిత - అరుణ్ మధ్య జరిగే
సన్నివేశాలు...
హీరో కథలో ఎక్కువ భాగం మెక్సికో బ్యాక్ డ్రాప్ లో నడవడం ఆసక్తికరంగా వుంటాయి.
ఈ నవలలోని ప్రతి సన్నివేశాన్ని యండమూరి అద్భుతంగా వర్ణించాడు.
పల్లెసీమల్లోని అందాలను, అలవాట్ల గురించి చెబుతూ....
అక్కడ గాలులు గానం చేస్తాయట. గోదావరి గంధర్వ స్త్రీలా వుంటుందట....
అంటూ వర్ణించిన విధానం సహజాతి సహజంగా వుంటుంది.
ఇక అంత్రోపాలజి పరిణామక్రమాన్ని వివరించిన తీరు చూస్తే రచయిత దీనిపై చేసిన కృషి
అవగతమౌతుంది.
అదే సందర్భంలో పురుషుడు స్త్రీని తనకు అనుకూలంగా ఎలా మలచుకుంటున్నాడో చర్చించే
ప్రయత్నం చేస్తాడు రచయిత. ‘స్త్రీని తన కనుగుణంగా తిప్పుకున్నాడు ఆధునిక పురుషుడు.
భర్త ఎలాంటి వాడైనా, అతడికి అణిగి వుండకపోతే తనకి భద్రత లేదనుకునే మానసిక స్థితికి
తీసుకొచ్చాడు. ఆధారపడటాన్ని ఆమెలో ప్రవేశపెట్టాడు. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి
పితృస్వామ్య వ్యవస్థకు మార్చగలిగాడు. వరూధిని చుట్టూ నీతి సూత్రాలు అమర్చాడు. తాను
మాత్రం కృష్ణుడిలానే వుండిపోయాడు’ అంటూ నేటి ఆధునిక పురుషాధిక్యతను కొంత చర్చించే
ప్రయత్నం చేస్తాడు రచయిత.
నవల ప్రారంభంలో వేదసంహిత అందానికి బ్రహ్మ వివశుడైన సందర్భంగా జరిగితే చర్చలో
కూడా ‘ఒక స్త్రీ జీవితం సారమా-నిస్సారమా అని నిర్ణయించేది కేవలం భర్తేనా? భర్త తోడులేని
స్త్రీకి ఇంకే సుఖమూ లేదా? అంటూ నారదుడు ఒక సమస్యను లేవనెత్తుతాడు.
‘స్త్రీగానీ, పురుషుడుగానీ ఆనందంగా వుండడానికి కావలసింది... ప్రేమించిన మనిషి
లేకపోవడం కాదు. తనకి ప్రేమించే హృదయం లేకపోవడం...’
‘ప్రేమంటే ఆహలాదం. అది స్త్రీ, పురుషు సంపర్కమే కానవసరంలేదు...’ అంటూ ప్రేమపైనా
చర్చ నడుస్తుంది.
అయితే... ఈ చర్చ ఒక పరిపక్వత దిశగా లేకపోయినా... కథావస్తువుగా ఎంచుకున్న బ్యాక్
డ్రాప్, రచనా శిల్పం నవలను ఆసాంతం ఆసక్తికరంగా చదవడానికి దోహదం చేస్తుంది.
గోదారి ఒడ్డున ఓ వెన్నెల రాత్రి నాయికా నాయకుల శృంగారాన్ని... ఎక్కడా శృతి
మించకుండా, అశ్లీలతకు తావులేకుండా, రసజ్ఞత ఉట్టిపడేలా వర్ణించడం అద్భుతం.
మొత్తంగా ఈ నవలలో పల్లెటూరి అందాలు, ఒక దేశప్రజల స్వేచ్ఛాపోరాటం, గాయపడిన ఓ
హృదయం వ్యక్తిత్వ పోరాటం ఈ నవలను ఆసక్తికరంగా చదివింపజేస్తుంది.

Wednesday, May 29, 2019
మా గ్యాంగ్ టక్, డార్జిలింగ్ యాత్ర అనుభవాలు!
మా గ్యాంగ్ టక్, డార్జిలింగ్ యాత్ర అనుభవాలు
విహార యాత్రల వల్ల ‘అందమైన ప్రాంతాలను, ప్రకృతి అందాలను ఆయా ప్రాంత ప్రజల భాష, కట్టూబొట్టు, ఆహారపుటలవాట్లు... ఇలా ఎన్నో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అటువంటిదే డార్జిలింగ్
హైదరాబాద్ నుంచి రైల్లో కోల్‌కతా చేరుకుని ఆ రాత్రి హోటల్ లో బస చేసి, మరునాడు విమానంలో బాగ్డోగ్రా వెళ్ళాము. అక్కడ మా టూర్ ఏజెంట్ ఏర్పాటు చేసిన వాహన ప్రయాణంలో దారి పొడుగునా కొండలు, కోనలు, వాగులు, వంకలు చిత్రమైన ఆ దారిలో అన్నీ తేయాకూ, యాలకులూ, కమలా తోటల కనువిందు. గ్యాంగ్ టాక్ చేరుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకుని తక్కువ దూరాలైనా ఆ వంపుసొంపుల ఘాట్ రోడ్లమీద గంటల ప్రయాణిస్తూ దారివెంటే వచ్చే ఆ తోటల్నీ నీటి ప్రవాహాల... అల్లంత దూరంలోని హిమాలయాల సోయగాలు మనల్ని మరో ప్రపంచానికి తీసుకువెళతాయి. కవులకు చిత్రకారులకు ఆ సుందర సుకుమార దృశ్యాలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి.
కొండ ప్రదేశమైన డార్జిలింగ్‌లో నేపాలీలూ, లెప్చాలూ, గోర్ఖాలూ, భూటియాలూ, టిబెటన్లూ, తమంగ్‌లూ... ఇలా భిన్న తెగలకు చెందిన ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకుంటూ నివసిస్తున్నారు. అసలైన స్థానికులు లెప్చాలే. మిగిలినవాళ్లంతా వలస వచ్చినవాళ్లే. కూరగాయలు, చికెన్, పోర్క్ నింపిన మోమోలూ; వాయ్‌వాయ్‌లు ఎక్కువగా తింటారు. సూప్ నూడుల్స్, దమ్ ఆలూ, సాల్ రోటీ కూడా ఎక్కువే. వస్త్రధారణ కూడా ఎవరికి వాళ్లదే. పెళ్లయిన స్త్రీలు మాత్రం కాలర్‌తో కూడిన యాప్రాన్ కట్టుకుంటారు. ఫ్యాషన్లూ ఎక్కువే.
టాయ్ ట్రెయిన్! హిమాలయన్ రైల్వే ఆధ్వర్యంలో- కేవలం రెండే బోగీలతో ఆవిరితోనూ డీజిల్‌తోనూ నడిచే అక్కడి టాయ్ రైళ్లని చూడగానే వింతగా అనిపించింది. ఇది ఎక్కితే డార్జిలింగ్ నుంచి గూమ్ రైల్వేస్టేషన్, గూమ్ నుంచి తిరిగి డార్జిలింగ్ చేరుకుంటాం. కానీ సమయంలేక ఎక్కలేక పోయాము. ఆ రైల్ పట్టాలు కొండప్రాంతంలో నివాసగృహాల మధ్యలొంచి ఉంటాయి. ఆ పట్టాలమీద వర్తకులు వివిధ వస్తువులు అమ్ముతుంటారు రైల్ వస్తున్నప్పుడు హడావుడిగా లేచి ఆ సరుకులు తీసి దారి ఇచ్చి రైల్ వెళ్ళగానే తిరిగి అమ్ముతుంటారు. ఈ మొత్తం ప్రయాణం 16 కి.మీ. కానీ ఒక్క ట్రిప్పుకి రెండు గంటల సమయం పడుతుంది. కొండల్లోనుంచీ ఇళ్ల మధ్యలోంచీ వేసిన చిన్నపట్టాల మీదుగా ప్రయాణిస్తూ డార్జిలింగ్, గూమ్ పట్టణ అందాలను చూడటం మంచి అనుభూతిని కలిగిస్తుంది. గూమ్ దేశంలోకెల్లా ఎత్తైన రైల్వేస్టేషన్. అంతేకాదు ఎత్తుకు వెళుతున్న కొద్దీ మనల్ని తాకుతూ వెళ్లే మబ్బులు. మబ్బులను చీల్చుకుంటూ మన ప్రయాణం ఎంత ఉత్తేజభరితంగా ఉంటుందో. ఆగలేక వాహనం ఆపించి ఆ మబ్బులలో కొంత దూరం నడిచాం ఫోటోలు తీసుకున్నాం. అదో అందమైన అనుభూతి.
ఇక వాతావరణం విషయానికి వస్తే..వేడి వాతావరణంలో నివసించే మనకు అక్కడి చలికి కొయ్యబారిపోవడం ఖాయం. కాళ్లకు సాక్సులూ చేతులకి గ్లోవ్సూ తలకి మఫ్లర్లూ చుట్టుకుని జెర్కిన్లు వేసుకుంటే తప్ప రాత్రిపూట నిద్రపోలేం. ఉదయం 16 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండే ఉష్ణోగ్రత, రాత్రయ్యేసరికి 6 నుంచి 1 డిగ్రీకి పడిపోతుంది. రగ్గులు కప్పుకున్నా రూములో హీటరు ఉన్నా చలి చలే.
ఉదయం రెండుగంటలకు చలిలో ముంచుకొస్తున్ననిద్రను జయించి నాలుగు గంటలకే లేచి 8,400 అడుగుల ఎత్తులో ఉన్న టైగర్‌హిల్స్‌కు చేరుకున్నాం. సూర్యోదయ సమయంలో 28,208 అడుగుల ఎత్తులోని కంచన్‌జంగ శిఖరం మీదుగా వచ్చే భానుడి తొలికిరణాలను ఓ అనిర్వచనీయమైన అనుభూతి సాధారణంగా ఆ భాగ్యం అందరికీ లభించదు ఎందుకంటే వాతావరణాన్ని బట్టి, మబ్బులు పట్టి ఉంటే ఆ సుందర దృశ్యం చూసే అవకాశం లేదు. అప్పటివరకు చీకటిగా ఉన్న ఆ సుదూరంలో లీలగా వెండి కొండల ఆనవాలు అంతలోనే కొంతసేపటికి ఆ వెండి కొండలు బంగారు వర్ణంలో మారడం ఓహ్ వర్ణించనలవికాని మనోహర సుందర దృశ్యం, చలిలో వెచ్చని తేనీటిని సేవించాము. మా అదృష్టవశాత్తు 15 రౌజులనుండి కనపడని ఆ సుందర దృశ్యం చూసే భాగ్యం కలిగింది. దేశవిదేశాలనుంచి ఎందరో పర్యటకులు ఆ ఉదయశోభలు తిలకించి పులకించడానికి వస్తుంటారక్కడికి. ఎత్తుకు వెళ్ళేకొలదీ ఆక్సిజన్ తక్కువ గా ఉండటం వల్ల ఎత్తులు ఎక్కేటప్పుడు వడివడిగా నడిచేటప్పుడు త్వరగా అలసటకు గురి అవుతాం.
తరవాత గూమ్ మొనాస్టరీకీ వెళ్లాం. అక్కడ బౌద్ధ మతస్తుల ఆచారాలు తెలుసుకుంటూ ఓ మానా పేమీను అంటూ ప్రదక్షిణంగా వెళుతూ ఆ గంటలు మ్రోగిస్తూ వెళ్ళాము.
మరో సుందర ప్రదేశం బటాసియా లూప్...డార్జిలింగ్‌ను 360 డిగ్రీల కోణంలో చూడ్డానికి దీన్ని మించిన ప్రదేశం లేదు. బటాసియా అంటే గాలితో కూడిన ప్రదేశం అని అర్థం. దీన్ని టాయ్ ట్రెయిన్ రైడ్ కోసమే రూపొందించారట. ఎత్తైన కొండమీద వృత్తాకారంలో ఉద్యానవనాన్ని పెంచి దాని చుట్టూ రైల్వే పట్టాలు నిర్మించారు. కొండప్రాంతాల్లో పెరిగే మొక్కలతో కూడిన ఉద్యానవనమూ ఉంది. లూప్ మధ్యలో తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన గూర్ఖ సైనికుల స్మారకార్థం వార్ మెమోరియల్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వస్తే మార్కెట్ ఉంటుంది. స్థానికులు సమోసాలూ కూరగాయలతో స్టఫ్ చేసిన స్నాక్స్ అమ్ముతుంటారు.
తేయాకు తోటలు .. మకైబరి, హ్యాపీ ఎస్టేట్స్‌గా పేరొందిన అక్కడి కొండలమీద ఆకుపచ్చని శాలువాలు కప్పినట్లుగా ఉన్న ఆ తోటల్ని చూడడం అందమైన అనుభూతి. వేల ఎకరాల్లో పరచుకున్న ఆ తేయాకు కొండల్లో తిరుగుతుంటే చల్లని వానచినుకులతో కూడిన గాలి మనల్ని గిలిగింతలకు గురిచేస్తుంది. అక్కడ పెరిగే టీ రుచికి మరేదీ సాటి రాదట. అందుకే ఇది వరల్డ్ గ్రేటేస్ట్ టీగా పేరొందింది. మనదేశంలో తయారయ్యే టీలలో డార్జిలింగ్ నుంచి వచ్చేది ఒక శాతమే. కానీ దాన్ని వేలంవేసి మరీ కొంటుంటారు. ఆ గాలిలో నేలలో ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే ఆ టీకి అంత రుచి అంటుంటారు దాని రుచి చూసినవాళ్లు. పైగా అక్కడి తేయాకు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించినది. టీ ఎస్టేట్స్ దగ్గరే ఉన్న ప్రాసెసింగ్ యూనిట్‌లో రకరకాల టీ పొడుల తయారీని చూసి అక్కడ ఉన్న అవుట్‌లెట్స్‌లో నచ్చిన టీ పొడులనీ కొనుక్కోవచ్చు. కిలో ఏడు వందల రూపాయల బ్లాక్ టీ నుంచి 50 వేల ఖరీదు చేసే వైట్ టీ వరకూ అన్నీ దొరుకుతాయి. తోటల్లో రాత్రివేళ హోమ్‌స్టేల్లో ఉండాలనుకునేవాళ్లు టీ ఆకును తుంచే వాళ్ల ఇళ్లలోనే ఉంటారు. విలాసవంతమైన హోటళ్లలో కూడా ఉండచ్చు.
జపనీస్ పీస్ పగోడాకి బౌద్ధులు రోజూ నాలుగు గంటలకే లేచి డ్రమ్ములు వాయించుకుంటూ ఈ గుడికి నడిచి వస్తారట. డార్జిలింగ్ రైల్వే స్టేషన్‌కి కాస్త దిగువన ఉన్న ధీర్‌ధామ్ ఆలయాన్ని చూసి రాక్‌గార్డెన్‌కి వెళ్లాం. ఓ చిన్న జలపాతం, రాళ్లు, రంగురంగుల పూలమొక్కలతో నిర్మించిన ఈ ఉద్యానవనంలో స్థానిక దుస్తుల్ని అద్దెకు ఇస్తారు. ఇష్టమైనవాళ్లు వాటిని ధరించి ఫొటోలు దిగుతుంటారు. అక్కడి నుంచి అబ్జర్వేటరీ కొండమీద ఉన్న మహాకాళ్ ఆలయాన్ని చూశాం. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసేవాళ్లకి డార్జిలింగ్ అనువైన ప్రదేశం. ప్రకృతి పచ్చని తివాచీ పరిచి, అందులో పూలబాట వేసి మరీ స్వాగతిస్తుంటుంది. కొండలనిండా రోడోడెండ్రాన్‌లూ మాగ్నోలియాలతోబాటు దాదాపు వందల రకాల ఆర్కిడ్లు అక్కడి నేలమీద విరబూస్తూ కనువిందు చేస్తుంటాయి. లాల్‌కోతి, ధీర్‌దాం టెంపుల్, ఇలా ఎన్నో అద్భుతమైన సుందర దృశ్యాలు బ్రిటీషర్స్ వేసవి విడుదుల బంగళాలు. ఓహ్ ఒకటేమిటి ఎన్నో వింతలూ విశేషాలు. అక్కడ బాగా ఆశ్చర్య కరమైన అంశాలు ఏమంటే పిల్లలు మహిళలు మైదాన ప్రాంతాలనుంచి కొండల్లోని తమ నివాస ప్రాంతాలకు గ్యాస్ సిలెండర్లు వంటి బరువైన వస్తువులను, నిత్యావసర వస్తువులను నుదురు భాగం భుజాలను ఆధారంగా చేసుకుని వీపుకు ప్రత్యేక సంచులలో తరలించడం, అలాగే ఆ సన్నని ఘాట్ రోడ్లలో వివిధ వాహనాల డ్రైవర్స్ ఏంటో సహనంతో ఎదురుగా వచ్చేవారికి దారి ఇస్తూ హరన్స్ అనవసరంగా మోగించకుండా, ట్రాఫిక్ జామ్స్ జరగకుండా జాగ్రత్తగా ఎంతో బాధ్యతతో మెలగడం మన మైదాన ప్రాంతం వారికి వింతగా అనిపిస్తుంది. మరిన్ని వివరాలు మరో రోజు మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్.
Subscribe to:
Comments (Atom)