Sunday, May 29, 2022

మిత్రులు శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు, వకీలు, సుప్రీంకోర్టు, మాజీ జిల్లా న్యాయమూర్తి గారితో ముఖాముఖి - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌

 


మిత్రులు శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు, 

వకీలు, సుప్రీంకోర్టు, మాజీ జిల్లా న్యాయమూర్తి గారితో ముఖాముఖి - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌

ఈ దిగువ లింక్‌ ల్లో చూడండి

1) https://www.youtube.com/watch?v=o9XIU4DJyGs




2) https://www.youtube.com/watch?v=-Lnbvi7rqVQ








Monday, February 28, 2022

"స్కైలాబ్" తగిన ప్రచారానికి నోచుకోని ఒక చక్కని సినిమా

 ఒక చక్కని సినిమా ఇది ప్రచారం లేదు  

4 డిసెంబర్ 2021 తేదీన విడుదలైన స్కైలాబ్ సినిమా ఎంతమంది చూసారు. 1979లో స్కైలాబ్ నేలమీద పడబోతోందన్న వార్త ఇతివృత్తంగా ఆ నేపథ్యంలో ఒక తెలంగాణా పల్లెటూరి నేపధ్యంగా అల్లిన ఈ చిత్రం లో  సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, నారాయణరావు, తులసి, సుబ్బరాయ శర్మ, తదితరులు నటించిన ఈ సినిమా 

1979లో స్కైలాబ్ ఊరి మీద పడుతుందని అప్పట్లో ప్రతి ఊళ్లోనూ కలకలం ఏర్పడిన సంగతి అప్పటి వారికి తెలుసు. 

ఎలాగూ పొతాము అనే తెగింపుతో చాలామంది ఆస్తులమ్మేసుకోవడం, దానాలు చేసేయడం, రకరకాల తీరని కోర్కెలు తీర్చేసుకోవడం, ఎవర్నైనా తిట్టాలనుకుంటే భయాన్ని పక్కనబెట్టి తిట్టేయడం, పెరట్లో ఉన్న కోళ్లని మేకల్ని కోసుకు తినేయడం, రైతులు పొలం పనులకు వెళ్లకపోవడం, చాలమంది తాగి పొడుకోవడం లాంటివి చేసారు. 

చివరికి స్కైలాబ్ సముద్రంలో పడడంతో కధ సుఖాంతం అయింది. సరదాగా నడుస్తుంది. నటీనటుల హవభావాలు, నెపధ్య సంగీతం కెమెరా పనితీరు, ఆర్ట్ వర్క్ లాంటి సాంకేతిక విలువలు బాగున్నాయి  1979 నాటి కాలాన్నిపునఃసృష్టించడం కళా దర్శకుని ప్రతిభ కు నిదర్శనం. ఈ చిత్రం ఒక ఆర్ట్ సినిమాలా అలరిస్తుంది. 

మీ కోసం ఈ లింక్‌ ఇస్తున్నాను. https://www.youtube.com/watch?v=CFj76ZnB-5Q   చూడండి! ప్రచారం మనం కల్పిద్దాం! మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్‌ 



Sunday, February 13, 2022

ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

 ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

జల్లూరు బావి పన్నీటి జల్లు స్నానం!
చినుకులా రాలిన నీటి చుక్క నదులుగా వాగులై వరదలై కడలి లో కలిసే
ఆ మహా ప్రస్థానంలో అలా అలా, కాలువలై సాగి సాగి, కాస్త ఆగి ఆగి, ఊరిలో చెరువులై కూసింత సేద తీరి మానవ నాగరికతకు జీవం పోసిన "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి" అంటూ సంకల్పం చెప్పుకునే నీటిపై మానవాళి కృతజ్నత క్రమంగా కనుమరుగై స్వచ్చమైన నీరు కాస్తా మురుగుగా మారిపోతొంది. తాగునీటి, సాగునీటి కాలువలు అడుగంటి
మురుగునీటి కాలువలు నిత్యం పెరుగుతున్నాయి. ఆనాటి ఇంటింటా నీటి వనరుగా విలసిల్లిన బావి, నుయ్యి అని పిలవబడే
ఈ వనరు ఓ అందమైన జ్నాపకంగా మారింది. ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది.అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు. ఆ సాంప్రదాయ కొనసాగుతున్న అరుదైన ఇళ్లల్లో మా పెద్దమ్మ గారి ఊరు జల్లూరు పుణ్యక్షేత్రాలు అటు పిఠాపురం ఇటు సామర్లకోట కు మధ్యలో వుంది. పూర్వం జైనలూరుగా ప్రసిధ్ది చెందిన ఈ ఊరులో కూచిమంచి వారు బహుమంచి వారు కరణీకం ప్రధాన వృత్తిగా, ధర్మం ప్రధాన ప్రవృత్తిగా విలసిల్లిన ఆ అపురూప సాంప్రదాయాన్నిఈ తరం వరకూ అదే ఆప్యాయత, ఆదరణ, అభిమానం, ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఈనాటికీ అడుగంటని ఈ తియ్యటి కొబ్బరి నీటి బావి లాగే సజీవంగా వున్నాయి. తరచు ఆ జల్లూరు పన్నీటి జల్లుల్లో ఇలా నా శారీరిక, మానసిక మాలిన్యాన్ని శుభ్ర పరచుకోవడం కోసం ఉవ్వీళ్ళూరుతాను.
పూర్వం కాలువలు, చెరువులు నుంచి కావిళ్ళతో, ఇంట్లో నూతినుంచి ఇలా చేదతో ఓపికతో తోడుకున్న వాడికి తోడుకున్నంత మహదేవా అన్నట్లుగా అవసరానికి మాత్రమే వాడేవారు. ఇప్పుడు చెరువులు పూడ్చి, ఇళ్ళు కట్టి, గొట్టపు బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా వ్యవసాయంలో అటు సాగునీటికి ఇళ్లల్లో కూడా తాగునీటికి విరివిగా వినియోగించడం వల్ల మోటర్లతో తోడి, టాంకుల్లో సంపుల్లో నింపి నిత్యం ఎంతో వృధాగా సింకుల్లో ఇంకిస్తున్నాం. బావులు రకాలు
దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో బావిగిలక నిర్మించబడి ఉంటుంది.
ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

Saturday, January 29, 2022

కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.

 కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.

సీరియల్సు, బిగ్‌ బాస్‌ లాంటి కార్యక్రమాలు కాస్త ఆపి
ఇలాంటి వీడియోలు కుటుంబ అంతా కలిసి చూస్తే
నేటి తరానికి మన బంధాలు, అనుబంధాలు,
పండుగలు, ఉత్సవాలు అర్ధమవుతాయి.
కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లల సమూహం.
ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో
రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం.
పూర్వ కాలం నుండి భారత దేశ కుటుంబ వ్యవస్థ
ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు,
నాయనమ్మ తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు,
పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, అన్నయ్యలు, తమ్ముళ్ళు
ఇంకా ఆ కుటుంబ సభ్యుల వివాహాల ద్వారా మరిన్ని వంశాల
బంధుత్వం ఇలా అటువంటి ఉమ్మడి కుటుంబాల లో
మా విస్సా వారి కుటుంబం కూడా ఒకటి అలాగే
మా కొండేపూడి వారి కుటుంబ గురించి నేటి తరం వారికి
తెలియ చెప్పెందుకు ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=E6yT-uWaVyE వీడియో చూడండి.
మన బంధాలు అనుబంధాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేద్దాం! మరో తరానికి పరిచయం చేద్దాం! విస్సా ఫౌండేషన్‌!

Thursday, January 27, 2022

ఇది మేఘ సందేశమూ అనురాగ సంకేతమూ

 ఇది మేఘ సందేశమూ అనురాగ సంకేతమూ 

లేత మనసుల తొలి ప్రేమలో 

అనురాగ సందేశాన్ని ఇంత అందంగా 

ఆ మేఘ సందేశాన్ని అమోఘంగా మోసుకొచ్చి

మనసులకు హత్తుకునేలా 

అక్షరసుమాల భావ గీతం, 

అందుకు అనువైన సంగీతం 

అహ హా హా హాయి అనిపించే ఆ ఆలాపన, ఆ యుగళ గానం 

అద్భుతాలు అన్నీ కలగలిసిన సమ్మేళనా సంకేతం 

అహహహ ఆ ఆ ఆ హా

చిరుజల్లు కురిసేది విను వీధిలో కాదు అది విన్న మదిలో 

ఆ ఆ ఆ హా వెల్లువలా పొంగే ఆ పాల వయసుల 

మూగ మనసుల ప్రణయ గీతానికి 

ఈ పాట బాటలో మరిన్ని పాటలు 

అక్షారాల వంతెన వేసి 

పల్లవి చరణాలుగా 

ఆచరణ లోకి వచ్చేది ఎప్పుడో 

ఆ వాగ్ధానం చేసేవారు ఎవరో 

ఆప్పుడే కదా 

కలిసిన హృదయాలకది దీవెన


Wednesday, January 19, 2022

2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ ఓవర్‌ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం - సత్యసాయి విస్సా నిలయం

 2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ ఓవర్‌ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం - సత్యసాయి విస్సా నిలయం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన 2019 క్రికెట్ ప్రపంచ కప్ లో టై మరియు సూపర్‌ ఓవర్‌ లలో /ఛాంపియన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులు గెలుచుకున్నది మాత్రం న్యూజీలాండ్‌ అందులో ముఖ్యంగా జట్టు కెప్టెన్‌ స్థిత ప్రజ్ఞత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవ్వు ఆఖరి ఓవర్ ప్రపంచ కప్ ఈ ఉత్కంఠను శిఖరాగ్రానికి చేరుస్తూ ఫైనల్‌ ఓవర్లో ఇంగ్లండ్‌ లక్ష్యం 4 బంతుల్లో 15 పరుగులు. ఫైనల్‌ అనే త్రాసు కివీస్‌ వైపు మొగ్గింది. మూడో బంతిని స్టోక్స్‌ లాగిపెట్టి సిక్స్‌ కొట్టాడు. అప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రాయల్ స్మైల్ నవ్వు ఇంగ్లండ్‌ లక్ష్యం 3 బంతుల్లో 9 పరుగులుగా మారింది. అప్పటికీ కివీ్‌సదే ఆధిపత్యం. నాలుగో బంతికి స్టోక్స్‌ 2 పరుగులు తీయడం.. ఫీల్డర్‌ గప్టిల్‌ వేసిన త్రో స్టోక్స్‌కు తగిలి బౌండరీ లైన్‌ దాటడంతో మొత్తంగా 6 పరుగులొచ్చాయి. ఫైనల్‌ మ్యాచ్‌కు ఇదే టర్నింగ్‌ పాయింట్‌. చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లండ్‌ విజయానికి చేరువైంది. పక్కాగా ఇంగ్లండే గెలుస్తుందని అందరూ ఫిక్సయ్యారు కూడా! ఐదో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న రషీద్‌ రనౌట్‌ అయ్యాడు. చివరి బంతికి 2 పరుగులు కావాలి. బౌల్ట్‌ వేసిన ఫుల్‌ టాస్‌ను లాంగ్‌ ఆన్‌ దిశగా ఆడాడు స్టోక్స్‌. వెంటనే ఈ వైపు నుంచి స్టోక్స్‌.. నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌ నుంచి వూడ్‌ పరుగులు పెట్టారు. ఒక పరుగే పూర్తయింది. రెండో పరుగు పూర్తయ్యేంతలో వూడ్‌ రనౌట్‌ అయ్యాడు!! 241 పరుగులతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్‌ టై!!

Wednesday, January 12, 2022

ఆముక్తమాల్యద కావ్యం గురించి సులభంగా వివరించగల శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఈ వీడియో ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=ioTwaML5syU

 

ధనుర్మాస శుభవేళ! ముక్కోటి ఏకాదశి పర్వదినాన పెద్దలు, పిల్లలతో కలిసి వీలున్నసమయంలో https://www.youtube.com/watch?v=ioTwaML5syU

ఈ వీడియో చూస్తే మనకున్న అనేక సందేహాలు తీరిపోతాయి

1. ధనుర్మాసం అంటే ఏమిటి?

2. శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కథ ఏమిటి?

3. ఆముక్తమాల్యద అంటే ఏమిటి?

4. ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసి సాయంత్రం కవుల సాహిత్యంతో పోటీపడి యుద్దంలోనూ, కవిత్వంలోనూ గెలిచి సాహితీ, సమరాంగణ సార్వభౌముడు అని పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఈ ఆముక్తమాల్యద కావ్యం గురించి   సులభంగా వివరించగల శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఈ వీడియో ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=ioTwaML5syU  చూడండి. మన ఘన చరిత్ర తెలుసుకుందాం తెలియజేద్దాం -  విస్సా పౌండేషన్!


Total Pageviews