Tuesday, September 30, 2014

యాదేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణసంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా | యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ | భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాzసమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా | విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా | ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః | శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః | విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః || శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః | శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః | మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః || మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః | వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః || వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః | గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః | సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః || యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః | దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః || అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః | చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః || అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః | అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః || జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః | నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః || పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః | పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ || మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః | బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః || కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః | కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే | చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి || ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ | సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ||




Monday, September 29, 2014

శుభోదయం!! నవరాత్రులలో ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా మనకు దర్శనమిస్తారు. ఆ మహా లక్ష్మి అనుగ్రహం ఎల్లవేళలా మన అందరిపైనా వుండాలని ఆ తల్లిని పూజిద్దాం. పూజ చేతామూ రారమ్మా! ఈవేళ మన మహాలక్ష్మికీ పూజ చేతామూ రారమ్మా! పూజ చేతామూ రారే రాజీవనేత్రులార (2) జాజీ పువ్వులా పూజ రోజూ మనమహలక్ష్మికీ! (పూజ చేతాము ..) హెచ్చుగా నిత్య మల్లెలు ఎర్రబొగాడా పువ్వులూ (2) పచ్చవాడంబరాలూ తెచ్చీ మన మహాలక్ష్మికీ! (పూజ చేతాము ..) బంతీ చేమంతులూ బంగరు పువ్వులు మంచీ (2) దొంతిగన్నేరు పూలతోటి మన మహాలక్ష్మికీ ! (పూజ చేతాము ..) తిన్నాని మొగలీ పువ్వులు తీరిన పువ్వులు మంచి (2) మందారాకుసుమాములూ ముందూ మన మహాలక్ష్మికీ ! (పూజ చేతాము ..) దేవకాంచనామూలు తీవ గులాబీపూవులూ (2) స్థావీగన్నేరు పూలతోటి మన మహాలక్ష్మికీ ! (పూజ చేతాము ..) పూజ చేతామూ రారమ్మా! ఈవేళ మన మహాలక్ష్మికీ పూజ చేతామూ రారమ్మా! మణిసాయి - విస్సా ఫౌండేషన్.


శుభ సాయంత్రం ఈ రోజు దుర్గా దేవి శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారం లో మనకు దర్శనం ఇస్త్తారు. ఆ అమ్మవారి చల్లని చూపులు మన అందరిపైనా వుండాలని ప్రార్ధిద్దాం!!! లలితాపంచరత్నం ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ పద్మాసనాదిసురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ || ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||


Friday, September 26, 2014

శుభోదయం

శుభోదయం

ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణై:
యుక్తా మిందునిబద్దరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం,
గాయత్రీం వరదాభయాం కుశ కశాం శ్శుభ్రం కపాలం గదాం 
శంఖం చక్ర మదారవింద యుగళం హస్తై ర్వహంతీ భజే||


Thursday, September 25, 2014

మంచిమాట


శుక్రవార శుభ శుభోదయం

శుక్రవార శుభ శుభోదయం..........................ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రులను జరుపుకుంటాం. పదవ రోజు.. అంటే ఆశ్వయుజ దశమిరోజు విజయదశమి పర్వదినం. ఇది శరదృతువు గనుక ఈ పండుగ దినాలను శరన్నవరాత్రులు అంటారు. దుర్గాదేవి ఆలయాల్లో అమ్మవారిని మొదటిరోజు శైలపుత్రి, రెండోరోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రఘంటాదేవి, నాలుగో రోజు కూష్మాండాదేవి, ఐదోరోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, ఏడోరోజు కాళీమాత, ఎనిమిదోరోజు మహాగౌరి, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రీదేవి - రూపాల్లో ఆరాధిరిస్తారు. దేవి రూపానికి తగినట్లు ఆవేళ ఆ నైవేద్యం సమర్పిస్తారు. మహిషాసురుడు దేవేంద్రుని ఓడించి, దేవలోకానికి అధిపతి అయ్యాడు. ఆ రాక్షసుడు పెట్టే హింస భరించలేక దేవతలు త్రిమూర్తులతో మొర పెట్టుకున్నారు. దాంతో మహిషాసురుని మట్టు పెట్టేందుకు త్రిమూర్తులు ఒక దివ్యశక్తిని సృష్టించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుండి వెడలిన మహోజ్జ్వల శక్తి ఒక మహా శక్తిగా అవతరించింది. ఆ దివ్య మంగళ రూపానికి మహాశివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చారు. ఇక ఆ మహాశక్తి దేవతలను పీడిస్తున్న మహిషాసురునితో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి, చివరికి సంహరించింది. మహిషాసురుని వధించింది కనుకనే, మహిషాసురమర్దిని అయింది. మహిషాసురుని పీడ విరగడవడంతో ప్రజలు సంతోషంగా ఉత్సవం జరుపుకున్నారు. అదే విజయదశమి పర్వదినం. తొలిరోజు కనకదుర్గాదేవి రెండోరోజు బాలా త్రిపుర సుందరి, మూడోరోజు గాయత్రీదేవి, నాలుగోరోజు అన్నపూర్ణాదేవి, ఐదోరోజు లలిత త్రిపుర సుందరీదేవి, ఆరోరోజు సరస్వతీ దేవి, ఏడో రోజు మహా లక్ష్మీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని, పదవ రోజు రాజరాజేశ్వరీదేవి రూపాలతో అమ్మవారిని అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి వరుసగా కేసరి, పొంగలి, అల్లం గారెలు, దద్దోజనం, అప్పాలు - పులిహోర, పెసరపప్పు పాయసం, వడపప్పు - చలిమిడి, చక్రపొంగలి, కేసరి పూర్ణాలు, లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తారు.


Tuesday, September 23, 2014

అమ్మ ప్రేమ.......


అరటి ఆకులో భోజనం అద్భుతం.

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.
శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.
వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.
ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.
ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.
వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.
అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను.
ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది. అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో!
అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. ఇది నిజమో లేక కల్పనో తెలియదు కాని మన అరటి ఆకుని మించిన ఆకు లేదు.

Wednesday, September 17, 2014

దయచేసి ఈ మహాద్భుత దృశ్యాన్ని వీక్షించండి. 'పిల్లలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్'


దయచేసి ఈ మహాద్భుత దృశ్యాన్ని వీక్షించండి. 'పిల్లలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్' అన్నట్లుగా చదువుతో పాటు లలితకళల పట్ల చిన్నప్పటి నుంచే అభిరుచి ఏర్పరిస్తే ఇలా బాల విద్వాంసులు తయారవుతారు. మరి మనల్ని మనం ఒకసారి తరచి చూసుకుంటే ...పిల్లల్ని కార్టూన్ చానెల్స్ కి, సెల్, కంప్యూటర్ గేమ్స్ కి పరిమితం చేసేస్తున్నాము. ఇటువంటి దృశ్యాలు చూసి మనం స్ఫూర్తి పొంది... మనలో ఆలోచన మొలకెత్తి... ఆచరణాత్మకం కావాలని మనసారా కోరుకుంటూ
 ...మీ... 
సత్యసాయి విస్సా ఫౌండేషన్

అట్లతద్ది, ఉండ్రాళ్ళతద్ది వెన్నెల్లో ఊహల ఊయలలూగే, ఆటలు, పాటలు తిలకించి పులకించి తిలక్ కవిత్వం అయ్యింది.





అట్లతద్ది, ఉండ్రాళ్ళతద్ది వెన్నెల్లో ఊహల ఊయలలూగే, ఆటలు, పాటలు తిలకించి పులకించి తిలక్ కవిత్వం అయ్యింది.ఆ అమాయకత్వం...జీవితాంతం మధుర జ్ఞాపకంగా మన తెలిగింటి మాట, ఆట, పాట ఒక్కసారైనా మన పిల్లలకు పరిచయం చెయ్యగలమా? అవన్నీ మరచిపోయి మనల్ని మనం మైమరచిపోతున్న ఈ సందర్భంలో... ఆ మధుర రసగంగాధరతిలకాన్నిమన జ్ఞాపకాల పాపిట కాస్త దిద్దుకుందాం! మదికి కొద్దిగా హాయిగా అద్దుకుందాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్. 

నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. 


- బాల గంగాధర తిలక్.

Total Pageviews