అట్లతద్ది, ఉండ్రాళ్ళతద్ది వెన్నెల్లో ఊహల ఊయలలూగే, ఆటలు, పాటలు తిలకించి పులకించి తిలక్ కవిత్వం అయ్యింది.ఆ అమాయకత్వం...జీవితాంతం మధుర జ్ఞాపకంగా మన తెలిగింటి మాట, ఆట, పాట ఒక్కసారైనా మన పిల్లలకు పరిచయం చెయ్యగలమా? అవన్నీ మరచిపోయి మనల్ని మనం మైమరచిపోతున్న ఈ సందర్భంలో... ఆ మధుర రసగంగాధరతిలకాన్నిమన జ్ఞాపకాల పాపిట కాస్త దిద్దుకుందాం! మదికి కొద్దిగా హాయిగా అద్దుకుందాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.
నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.
- బాల గంగాధర తిలక్.
No comments:
Post a Comment