Thursday, February 2, 2017

అందరికీ శ్రీ రధసప్తమి శుభాకాంక్షలు

అందరికీ శ్రీ రధసప్తమి శుభాకాంక్షలు 


రధసప్తమి శుభవేళ ఈ లింక్ క్లిక్ 
ఈ చిత్రాలు చూడండి 
https://youtu.be/G6Sm8fXozEU

దినకరుడు తన కిరణ కరాలతో పువ్వులకు అరుణిమను అరువిస్తున్న దృశ్యం "తెల వారకుండ మొగ్గలలోనజొరబడి
వింత వింతల రంగు వేసి వేసి" అన్న కరుణశ్రీ వారి కవితాత్మను గుర్తుచేసింది. వారికి మరోమారు శ్రద్ధంజలి. మరి ఇటువంటి సాహిత్య సంపదలు మనం మననం చేసుకుని మన వారసులకు కూడా అందిద్దాం! చిత్తగించండి.
అంజలి        
సీ|| పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెల పాలు పోసి పోసి
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనము సిద్ధ పరచి పరచి
తెల వారకుండ మొగ్గలలోనజొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
                
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమొ దేవాదిదేవ
ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు

శ్లో:-ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.
ధన మిచ్ఛే ద్ధుతాశనః.
జ్ఞానం మహేశ్వరా దిచ్ఛేత్.
మోక్ష మిచ్ఛే జ్జనార్దనః.
భావము:- మనకు ఆయువు నొసగు వాడు సూర్య భగవానుడు. సంపదల నొసగు వాడు అగ్ని. జ్ఞాన మొసగు వాడు మహేశ్వరుడు . మోక్ష మొసగు వాడు జనార్దనుడు. 
మనము ఆయా దేవతల నుపాసించి ఆయువును, సంపదను, జ్ఞానమును, మోక్షమును పొంద వచ్చును. మరి ఆయా దేవతల నుపాసించడం ద్వారా ఆ నాల్గింటినీ పొందుదాం! అందుకే చలిపులి నెమ్మదిగా వెళుతోందిగా మరి ఉదయాన్నే లేద్దాం ఇటువంటి ప్రకృతి చిత్రాలను చూస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!
అందరికీ శ్రీ రధసప్తమి శుభాకాంక్షలతో
మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews