Saturday, June 13, 2020

లేలాండ్ స్టాన్ఫోర్డ్", "జేన్ స్టాన్ఫోర్డ్'..

ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం
తొందరపడి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి......
-------------------------
ఆ దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది.

ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరకి పంపడానికి ఆమె అంగీకరించలేదు.

 లేకపోతే, ఈ ముసలివాళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్తో పనేమిటి?

ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు.

“చెప్పండి, ఏం కావాలి?" అడిగాడు ప్రెసిడెంట్..

"మేము విరాళం ఇద్దామనుకుంటున్నాం" చెప్పాడు
ఆ ముసలాయన.

ప్రెసిడెంట్ కు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా
"ఎంత ఇవ్వాలనుకుంటున్నారు?" అన్నాడు.

"మా పదహారేళ్ల కొడుకు టైఫాయిడ్తో చనిపోయాడు.
వాడి జ్ఞాపకార్థం ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ" చెప్పింది వృద్ధురాలు.

 "ఎంత?" చాలా క్యాజువల్గా అడిగాడు ముసలాయన,

"బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించాడు ప్రెసిడెంట్, మరియు వివరాలు చెప్పాడు.

ముసలాయన ఆశ్చర్యపోయాడు. ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.

“అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే
ఎంతవుతుంది?' కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ.

ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్.

ఆమె, భర్త వైపు తిరిగి అంది,
 “మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్!"

"సరే" అన్నాడు భర్త.

కొంతకాలానికి కాలిఫోర్నియా నగరంలో  "స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ" స్థాపన జరిగింది.

ఆ దంపతులిద్దరూ "లేలాండ్ స్టాన్ఫోర్డ్",  "జేన్ స్టాన్ఫోర్డ్'..

ఒక్కోసారి మనం ఎదుటివారిని ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది.

ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం.

రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడివున్నది, ఎవరైనా కావొచ్చు. వాళ్లను మీకంటే గొప్పవాళ్లుగా భావించకపోయినా ఫర్లేదు..
కానీ ... తక్కువ వాళ్లని మాత్రం అనుకోవద్దు.

ఎందుకంటే, పూర్వం మన పాత కథల్లో కూడా దేవుడో, మహారాజులో మారువేషాల్లో వచ్చేవారు.

 *దేవుళ్ళలో*
*మనుషుల్ని చూసుకునే అవసరం మనకు లేకపోయినా*,

*మనుషుల్లో దైవత్వం చూసే అవకాశం దేవుడు ఎప్పుడూ మనకు కల్పిస్తూనే ఉంటాడు*.

*సాయం చేసే వాడే దేవుడు,

సాయం అందించే చోటే దేవాలయం*.
Author of post unknown

No comments:

Post a Comment

Total Pageviews