🤜డ్రాగన్ ఖబడ్దార్ 🤛
ఉ॥
బుద్ధుని నెత్తినెత్తుకొని మోసపుబుద్ధులు చూపునట్టి మీ
పద్ధతి గాంచి లోకమె యవాక్కయె, టక్కరినక్క! శాంతికే
బద్ధులమైన మా భరతవాసులశక్తులటంచునెంచితే,
యోద్ధలు,సిద్ధపూరుషులకుద్గమమౌధరయిద్ది గాంచరా!
ఉ॥
హద్దులు దాటివచ్చుటకునాబగ నెప్పుడు జూచుచుండునో
గ్రద్ద!పవిత్రభారత యఖండపరాక్రమకీలలందు నిన్
గ్రద్దనగాల్చి వేసెదమురా దురితాత్ముడ!వంచకుండ నీ
తద్దినమింక బెట్టెదము,తాళుము ముందుకు రాకు నీచుడా!
ఉ॥
"గాల్వను" లోయయొక్కటియె కాదుర, యంగుళమంగుళమ్మునున్
విల్వగుభారతోర్వి దరి వెంబడి గాచెడి సైనికావళుల్
గాల్వలు గట్టజేతురిక కత్తులనెత్తురు ధారలొల్క నీ
తెల్వియు తెల్లవారినదె,తేపకుతేపకు కాలుదువ్వెదే!
మ॥
చవకౌ నీదు సమస్తవస్తువులకున్ చౌకైన నీబుద్ధికిన్
భువిలోనూకలు చెల్లిపోయినవి,నీమోసమ్ము,నీ స్వార్థమున్
కవిలోకమ్మిదె యెండగట్టునికపై కాల్దువ్వకో "చైన"
"మా
'నవ'తా"దృక్పథమున్ మదిన్ దెలియు మన్యాయాక్రమంబాపుమా!
శా॥
"చైనావస్తుబహిష్కృతీవ్రతము"నే సాగించినన్ జాలురా
దీనావస్థకు జేరు నీబ్రతుకు, మా దేశమ్ము పేరెత్తినన్
ప్రాణాల్ పైననె బోయి చచ్చెదవురా పాపాత్ముడా తగ్గు,నీ
స్థానంబేమొ యెఱింగి మెల్గుమికపై చైనా ఖబడ్దారిదే!
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఎస్ సాయిప్రసాద్

No comments:
Post a Comment