భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Tuesday, December 30, 2014
పుట్టిన రోజు నాడు ఏమి చెయ్యాలి? ఎలాచెయ్యాలో తెలుసుకుందాం! నేర్చుకుందాం!
1) పుట్టినరోజును ఎలా జరుపుకోవాలి. బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచన సుధాసారం
https://www.facebook.com/video.php?v=521257431312327&set=vb.100002842256160&type=2&theater
పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి ?
మన భారతీయ సాంప్రదాయంలో పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి సరి ఐన పద్ధతి..
.
పద్ధతి :
.
1) ఉదయమే లేచి అభ్యంగన స్నానం చెయ్యాలి . ( తలకు , వంటికి నూనె రాసుకొని చేసేది అభ్యంగన స్నానం అంటారు ).
.
స్నానంతరం కొత్త బట్టలు కట్టుకునిదైవసన్
నిధిలో...
.
2)ఆవుపాలు , బెల్లం , నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని 3 సార్లు తీర్థం పుచ్చుకున్నట్లు తీసుకోవాలి
( అందువల్ల వచ్చే సంవత్సరం వరకూ గండాలు రాకుండా ఉంటాయి )
.
3)పుట్టిన రోజు చేసుకునేవారు గానీ , పెద్దలు గానీ సప్త చిరంజీవుల పేర్లను తలచుకోవాలి
.
సప్త చిరంజీవులు.
.
చిరంజీవులు అంటే చిరకాలం జీవించిఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు.
.
పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం.
అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||
.
దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు.
{ పై విషయాలను శ్రీయుత చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగం నుండి గ్రహించినవి}
.
4 ) 5 రంగుల బియ్యం తో ఒక చోట స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసి దానిలో 5 దీపాలు , పెద్దవారితో వెలిగింపచేయ్యాలి . వాటిని వెలిగించుతూ దీప ప్రజ్వలన మంత్రాలు చెప్పాలి. లేదా ఓం కారం జపించండి
.
5 ) ఆయుష్య సూక్తం చదువుతూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించాలి .
.
వారిని వీపు మీద నిమరాలి .
.
6) ఇంటిలో గానీ , గుడి లో గానీ రుద్రాభిషేకం చేయించాలి .
.
7 ) చెయ్యగలిగిన సహాయం ఇతరులకు చెయ్యాలి ( దానం )లేకపోతే ఆవుకు పచ్చిగడ్డి తినిపించాలి
.
8 ) చక్కటి ఆరోగ్యవంతమైన భోజనం చెయ్యాలి
.
9) ఆ రోజు రాత్రి భ్రహ్మ చర్యం పాటించాలి
.
10 ) చిన్న పిల్లలకి ప్రతీ మాసం ( మొదటి ఏడాది ) అదే తిది రోజున పుట్టిన రోజు చెయ్యాలి .
.
సంస్కృతం లో పుట్టిన రోజు శుభాకాంక్షలు
.
జన్మదిన మిదం అయి ప్రియ సఖే ! సంత నోతు హి సర్వదా ముదం
ప్రార్ధయామహే భవ శతాయుషీ ఈశ్వరం సదా త్వాం చ రక్షతు
పుణ్య కర్మణా కీర్తి మార్జయా జీవనం తవ భవతు సార్ధకం
.
ఈ కూచిపూడి బృంద నాట్య విన్యాసానికి ఆ క్రీడాప్రాంగణం ఆనంద బృందావని అయ్యింది, అయోధ్యపురి, కైలాసగిరి అయ్యింది, ఇది కేవలం గిన్నీసు పుస్తకంలో ఒక కాగితం ముక్కమీద రాయడంకోసం సంకల్పించినది కాదు కాదు కాదు. ఆ శివానందుని... ఆ దశరధనందనుని...ఆ నందనందనుని... మన మహాభాగ్య వశమున భాగ్యనగరము శివరామకృష్ణ లీల క్రీడల నృత్యకేళీ విలాసమయ్యింది ఈ మూడు రోజుల పండుగ కూచిపూడి ని మరువనివ్వమని మూడునాళ్ళ ముచ్చటగా మారనివ్వమని రుజువుపరచింది. ఈ చిరు చిరు మువ్వల సిరి సవ్వడులు... భావి మరుసవ్వడులుగా మారేలా...ఈ తెలుగు నాట్యరీతి భువిలో శాశ్వతమయ్యేలా ఒక తెలుగు వాని గట్టి సంకల్పాన్ని విశ్వానికి చాటిచెప్పింది. ఇదిగో మీ కోసం ఈ యు ట్యూబ్ లంకె నొక్కండి. https://www.youtube.com/watch?v=2wFH1GymPeg తనివితీరా తిలకించండి!పులకించండి!! మా ఆనందుని మహా సంకల్పాన్ని అభినందించండి! సత్య సాయి - విస్సాఫౌండేషన్.
Thursday, December 18, 2014
Monday, December 15, 2014
శ్రీ కృష్ణదేవరాయలు రచించిన"ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆముక్తమాల్యద ప్రవచన సుధారసదార 1 వ భాగం!
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలు లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆముక్తమాల్యద ప్రవచన సుధారసదార ఈ ధనుర్మాసారంభ శుభవేళ మీ అందరి ఆనందం కోసం...మన తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదిద్దాం!...మన ఘన తెలుగు కవులను స్మరిద్దాం!
1 వ భాగం!
1) https://www.youtube.com/watch?v=y9x8onmwdBk
1 వ భాగం!
1) https://www.youtube.com/watch?v=y9x8onmwdBk
ఈ దిగువ లంకె నొక్కండి.... మంజుల శ్రీ గారిచే తిరుప్పావై వ్రతం గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.
గోపెమ్మలు ఆచరించిన మార్గశీర్ష వ్రతాన్ని తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో జన్మించిన గోదాదేవి ' తిరుప్పావై' - శ్రీకరమైన పద్యాల సమాహారం - పాశురాలుగా రచించి అలరించింది. శ్రీ మహాలక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి విష్ణు చిత్తుడు అనే మహనీయుని కుమార్తెగా జన్మించి విష్ణుదేవుని రూపమైన శ్రీరంగనాథుని వివాహమాడింది.
ఈ వివాహం సిద్ధించడం కోసం గోదాదేవి తన సఖీ బృందంతో కలిసి ధనుర్మాసంలో రోజుకొక పాశురాన్ని పాడింది. ద్వాపరయుగం నాటి గొబ్బెమ్మలు లేదా గోపెమ్మలు కలియుగంలో గోదాదేవి బృందం.
గోపెమ్మలు తెల్లవారు జామున నిద్రలేచి ఒకరినొకరు నిద్రలేపుకుంటూ వెళ్ళి నందుని ఇంత నిదురించి ఉన్న శ్రీకృష్ణుని నిద్రలేపి పూజించడం 'తిరుప్పావై'లోని ఇతివృత్తం.
ఇంటిముందు గొబ్బెమ్మలను నిలిపి కన్యలు - శ్రీకృష్ణుని గురించి పాడడం - మంచి భర్తను పొందడం కోసం.
ఈ వ్రతంలో భాగంగా ఇరవై ఏడు రోజుల పాటు నెయ్యి, పాలు వంటి భోగవస్తువులను కన్య పిల్లలు పరిహరించాలన్నది సనాతన సంప్రదాయం. ఇరవై ఎనిమిదవ రోజున పువ్వులు ధరించి, నెయ్యితో, పాలతో మధుర మధురమైన పొంగలిని యితర వంటలను చేసి కృష్ణునికి అర్పించి ఆరగించాలి.
కానీ వ్యవహారంలో మాత్రం మొదటి రోజు నుండీ చక్క్రే పొంగలి, ఉప్పొంగలి చేసి నైవేద్యం పెట్టడం ధనుర్మాస సంప్రదాయమైంది. సూర్యుడు ఉదయించకముందే పూజలు చేసి ఈ పొంగలి నైవేద్యం పెట్టడం ఇళ్ళలోనూ, గుళ్ళలోను కూడా కొనసాగుతున్న శుభసాంప్రదాయం.

ఈ దిగువ లంకె నొక్కండి... మంజుల శ్రీ గారిచే తిరుప్పావై వ్రతం గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!!
https://www.youtube.com/watch?v=B1yJlqk07ms
ఈ దిగువ లంకెలు నొక్కండి... చినజియ్యరు స్వామి వారి తిరుప్పావై గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!!
https://www.youtube.com/watch?v=tej59_nhSJQ
http://www.chinnajeeyar.org
/Learn/Thiruppavai.aspx

Friday, December 12, 2014
తల్లి తండ్రులకు ఒక గమనిక, ఒక విన్నపం.
పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లలుగా పౌరులుగా తీర్చిదిద్దాలి అనుకుంటే, అది మీ చేతులలోనే ఉంది.
1. రోజులో ఒక పది నిముషాలు పిల్లలు ( వారు ఎ వయసు వారైనా ) చెప్పే మాటలను శ్రద్ధగా, సంతోషంగా , ఆసక్తిగా విని, వారితో పదినిముషాలు గడపడం అలవాటు చేసుకోండి.
2. ఆ పదినిముషాలు టీవీ, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ ఫోన్, ఇంకా ఇతరత్రా వ్యాపకాలు లేకుండా చూసుకోండి.
3. అలాగే సాధ్యమైనంత వరకు, రోజులో ఉదయం అల్పాహారం కానీ, రాత్రి భోజనం కానీ కుటుంబ సభ్యులు కలిసి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ టైం లో కూడా వీలైనంత వరకు, జోక్స్, సరదా కబుర్లతో గడపండి.
4. అలాగే, పిల్లల ఎదురుగా ఎవరినీ విమర్శించడం అలవాటు చేసుకోకండి. పిల్లల ఎదురుగా పోట్లడుకోకండి. అలాగే, ఒకరి పుట్టింటి వారిని ఒకరు పిల్లల ఎదురుగా విమర్శించకండి.
5.వారానికి ఒకసారి అయినా, పిల్లలతో కాస్సేపు ఆడుకోండి.
6. వీలైనంత వరకు మీరు టెక్నాలజీ ని పిల్లల ఎదురుగా సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించండి.
7. పిల్లల స్నేహితుల మీద, వారి తో కలిసి తిరిగే సమయం మీద ఒక కన్నేసి ఉంచండి.
8. పిల్లల స్నేహితులు ఇంటికి వచ్చినపుడు, వారి వారి ప్రత్యెక గదులలో కాకుండా ఇంటిలో కామన్ హాల్ లో కూర్చొని, మాట్లాడుకోమని చెప్పండి.
9. మీరు వారి మాట వింటారు అనే నమ్మకాన్ని, పిల్లలలో కలుగ చేయండి. మీ పిల్లలు చెడిపోతే అది మీ బాధ్యతే.
10. పిల్లలు పార్టీలకు, గెట్ టుగెదర్ లకు వెళ్ళేటప్పుడు, తిరిగి ఇంటికి రావలసిన సమయాన్ని మీరు నిర్ణయించండి.
11. పిల్లల ముఖ్యమైన స్నేహితుల, ప్రొఫెసర్ ల ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోండి.
12. ఒకవేళ పిల్లలు పరీక్షలలో విఫలం అయినా, వారిని ఇతరులతో పోల్చితిట్టకండి. అది వారి మనసు మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
13. మేము మిమ్మల్ని నమ్ముతున్నాము అనే నమ్మకాన్ని వారిలో కలిగించండి.
14. ఇంట్లో పెద్దవాళ్ళు ( నానమ్మలు, తాతయ్యలు ) ఉంటె వారితో కొంతసేపు గడపడం అలవాటు చేయండి.
15. వారి పట్లమీరు గౌరవం చూపిస్తే, పిల్లలు కూడా వారిని గౌరవిస్తారు.
ప్రతి తల్లితండ్రులు ఈ సూచనలు పాటిస్తే, పిల్లలు కొంతవరకు ప్రక్కదారులు పట్టకుండా ఉంటారు.

Subscribe to:
Comments (Atom)