భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Monday, June 8, 2015
Sunday, June 7, 2015
ఊరికి పోదాం ఛలో ఛలో ... అల్లరి చేద్దాం ఛలో ఛలో... సందడి చేద్దాం ఛలో
అందుకే అప్పుడప్పుడు ఊరికి వెళ్ళాలి ఇటువంటి మన సంస్కృతిలోని సరదాలు పిల్లలకి రేపటి మధురానుభూతులుగా అందించాలి.
1) తాటి ముంజెలు తిన్న తర్వాత వాటిని ఇలా బండిలా చేసుకుని ఆడుకోవచ్చు... ఈ లింక్ నొక్కి చూడండి
https://www.youtube.com/watch?v=mFwcnQBIzZA

3) చిన్న చిన్న దూరాలకి ఇలా సైకిల్ మీద వెళితే బోలెడు ధనం, ఇంధనం అదా! కదా!!
4) ఇంటిలో చిన్న చిన్న పనులు చేస్తే వేరే ఎక్సర్ సైజులు అవసరం లేదు కదా!
Saturday, June 6, 2015
ఆవకాయ కధా కమామిషు!
ఆవకాయ కధా కమామిషు
పచ్చటి లేత అరటి ఆకులో ఎర్రగా ఆవకాయ అన్నం కలుపుకుని అందులో కొద్దిగా గానుగ నూని రుచికి కలుపుకుని కొద్దిగా వెన్నపూస, మధ్యలో నంజుకి బాగా ముగ్గిన మామిడి పండు ముక్కలు తో...మొదటి కొత్త ఆవకాయ ముద్ద నోట్లో పెట్టుకో .....ఆగండి... ఆగండి...ఒక్కసారి మహత్తరమైన ఆ ఆవకాయ మహా ప్రస్థానాన్ని చూద్దాం!
ఆవకాయ కోసం ముందుగా మంచి పుల్లని మామిడికాయల్ని ఎంచుకోవాలి.
వాటిని నీళ్ళల్లో వేసి కడిగి తడిలేకుండా తుడవాలి.
ఈ మామిడి కాయలను ముక్కలుగా చెయ్యడానికి ప్రత్యేకమైన కత్తిపీట ఉంటుంది.అదే మరకత్తిపీట.

ముక్కలు చేసేటప్పుడు ఎంతో నేర్పుగా చెయ్యాలి లేకపోతే మామిడికాయ చితికిపోతుంది.

మామిడికాయ ముక్కలపైనున్న జీడి, పైపొరలను తీసి బట్టతో శుభ్రంగా తుడవాలి.
ఇక్కడకి ఆవకాయకి మామిడి ముక్కలు సిద్ధం అయ్యాయి.

ఆవగుండ, కారం సమపాళ్ళలో తీసుకొని వాటికంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకొని కొంచెం మెంతులు (ఇష్టానికి తగ్గట్టు ) వేసి బాగా కలపాలి.
అందులోనే కొంచెం గానుగనూనె వేసి కలిపి అందులో మనం శుభ్రం చేసి ఉంచుకున్న మామిడి ముక్కలు వేసి బాగా కలిపి ఇంకొంచెం నూనె వేసికలపాలి.
తిరిగి 3వ రోజున తిరగకలపాలి.
వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని ....వెన్నపూస, పేరిన నెయ్యి, మామిడి పండు ....ఇలా ఎవరికి ఇష్టమైన వాటిని ఆ ఎర్రటి ఆవకాయలో నంచుకొని తింటే ఎవరైనా ఆహా!!! ఏమి రుచి...అనరా ఎవరైనా మైమరచి!!!
మన సంస్క్రతిని ప్రేమిద్దాం! మన దేశీయ ఉత్పత్తులను బ్రతికిద్దాం!!
గోల్డ్ స్పాట్, ఇంకా ఎన్నో మన దేశీయ కంపెనీలు బహుళజాతి సంస్థల కూల్ డ్రింక్స్ కంపెనీల ధాటికి నిలవలేక పోయాయి, ఈ అర్టొస్ కంపెనీ ఒకటే నిలబడ గలిగింది. 9 రూపాయలకి ఒక చక్కని చల్లని పానీయం సేవించిన అనుభూతి మన సొంతం అవుతుంది.
అటువైపు (కృష్ణా, గోదావరి జిల్లాల వైపు) వెళ్ళినప్పుడు తప్పకుండా
వాటినన్నిటి రుచిచూడడం పిల్లలకి రుచి చూపిస్తూ ఉంటాము.
ఎప్పుడూ కోలాలు, పెప్సీలు, పిజ్జాలు బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్, నూడుల్స్, చాట్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మరి తాతలు నాటినుండి ఉన్న మన ఉత్పత్తులు నిమ్మషోడా, అర్టొస్, కొబ్బరి బొండాం, ముంజి కాయలు, అల్పాహారాలు, కాయలు, పళ్ళు మన రుచులను మాత్రమే తినడం పిల్లలకి అలవాటు చెయ్యాలి. మన సంస్క్రతిని ప్రేమిద్దాం! మన దేశీయ ఉత్పత్తులను బ్రతికిద్దాం!!
--మణి సాయి విస్సా ఫౌండేషన్
అటువైపు (కృష్ణా, గోదావరి జిల్లాల వైపు) వెళ్ళినప్పుడు తప్పకుండా
ఎప్పుడూ కోలాలు, పెప్సీలు, పిజ్జాలు బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్, నూడుల్స్, చాట్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మరి తాతలు నాటినుండి ఉన్న మన ఉత్పత్తులు నిమ్మషోడా, అర్టొస్, కొబ్బరి బొండాం, ముంజి కాయలు, అల్పాహారాలు, కాయలు, పళ్ళు మన రుచులను మాత్రమే తినడం పిల్లలకి అలవాటు చెయ్యాలి. మన సంస్క్రతిని ప్రేమిద్దాం! మన దేశీయ ఉత్పత్తులను బ్రతికిద్దాం!!
--మణి సాయి విస్సా ఫౌండేషన్
Friday, June 5, 2015
శ్రీవేంకటేశ్వరస్వామి అభయహస్తానికి అర్ధం.
శ్రీవేంకటేశ్వరస్వామి అభయహస్తానికి అర్ధం.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అభయహస్తంతో మనకి దర్శనమిస్తారు.స్వామి 5 వేళ్ళుకలిపి మనకి చూపటంలో అర్ధం మన శరీరంలో వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ, ఆపానములను వాయువులుంటాయి. ఆ 5 వాయువులు నిలిచినమనస్సు నిలకడగా ఉంటుంది. కనుక ఆ 5 వాయువులను ఒక్కటిగా చేసి ప్రార్ధించు అని అర్ధం అని పెద్దలు చెపుతారు.
Thursday, June 4, 2015
శుభకార్యాలకి, లేదా ఏదైనా పనిమీద బయటకి వెడుతున్నప్పుడు ముగ్గురు ఎందుకు వెళ్ళకూడదు?
పెద్దల మాట!!!
శుభకార్యాలకి, లేదా ఏదైనా పనిమీద బయటకి వెడుతున్నప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అని పెద్దలు అనడం మనం చాలాసార్లు వింటూ ఉంటాము. ముగ్గురువెడితే మార్గమధ్యలో అభిప్రాయబేధాలు రావచ్చు. అప్పుడు ఒకరితో ఒకరు మాది సరయినదంటే కాదు మేము చెప్పినదే సరైనది అని వాదన రావచ్చు. అప్పుడు అసలు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళకుండా గొడవకి దిగుతారు. అదే ఇద్దరయితే ఒకరికొకరు సర్దిచెప్పుకుంటూ చేయవలసిన పనిని జయప్రదంగా చేసుకొని వస్తారు. కాబట్టి ఏదైనా పనిమీద బయటకి వెడుతున్నప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అని పెద్దలు చెపుతారు.

లక్ష్మీదేవి తామరపువ్వులో, ఇరుపక్కలా ఏనుగులతో ఎందుకు ఉంటుంది?
లక్ష్మీదేవి తామరపువ్వులో, ఇరుపక్కలా ఏనుగులతో ఎందుకు ఉంటుంది?
సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ
అటూఇటూ ఊగుతూ ఉంటుంది.తనూ నిలకడలేని దానిని అని చెప్పటమే
లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటంలోని పరమార్ధం. ఇక
ఇరుప్రక్కలా వున్న ఏనుగులతో ఉండటంలోని అర్ధం ఏమిటంటే శ్రీమహాలక్ష్మి
ధనబలము గజబలమంతటిది అని అర్ధం చేసుకోమని పరమార్ధం.
Subscribe to:
Posts (Atom)