భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Thursday, November 5, 2015
శుభోదయం__/i\__
శుభోదయం__/i\__
మనమందరం చిన్నపటినుండీ 'శుక్లాం బరదరం విష్ణుం' అని చదువుతూనే వున్నాంగా... దాని అర్ధమేమిటో ఎంత మందికి తెలుసు?? తెలియనివారు ఒక్కసారి చదవండి...తెలిసినవారు కూడా మరొక్కసారి చదువుదాము.
శుక్ల+అంబర+ధరం --శుభ్రమైన (తెల్లని) వస్త్రము ధరించినవాడు
విష్ణుం - సర్వాంతర్యామి ఐనవాడు
శశివర్ణం - చంద్రుని రంగు కలిగినవాడు
చతుర్భుజం - నాలుగు భుజములు(చేతులు) కలవాడు..పాశము
మనమందరం చిన్నపటినుండీ 'శుక్లాం బరదరం విష్ణుం' అని చదువుతూనే వున్నాంగా... దాని అర్ధమేమిటో ఎంత మందికి తెలుసు?? తెలియనివారు ఒక్కసారి చదవండి...తెలిసినవారు కూడా మరొక్కసారి చదువుదాము.
శుక్ల+అంబర+ధరం --శుభ్రమైన (తెల్లని) వస్త్రము ధరించినవాడు
విష్ణుం - సర్వాంతర్యామి ఐనవాడు
శశివర్ణం - చంద్రుని రంగు కలిగినవాడు
చతుర్భుజం - నాలుగు భుజములు(చేతులు) కలవాడు..పాశము
అంకుశము, మోదకము మరియు అభయ హస్తము కలిగినవాడు అన్నది
స్థూలమైన అర్థము. మన ఆశా పాశమునకు అంకుశము వేస్తే ఆయనకది
మోదకము. అప్పుడు ఆయన అభయహస్తము మనకు సిద్ధిస్తుంది.
ప్రసన్న వదనం - ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడు
ధ్యాయేత్ - ధ్యానించుచున్నాము
సర్వ విఘ్నోపశాంతయే-- ఆటంకముల నన్నింటినీ మట్టుబెట్టుటకు (సర్వ+
విఘ్న ఉపశాంతయే)
Mana Samscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు): కోటి పుణ్యములను ప్రసాదించు గోమాత పూజ
Mana Samscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు): కోటి పుణ్యములను ప్రసాదించు గోమాత పూజ: కోటి పుణ్యములను ప్రసాదించు గోమాత పూజ పుట్టినబిడ్డకు తల్లిపాలకు సమానంగా ఆవుపాలను ఇస్తారు. అందువల్ల భూలోక ప్రజలకు అమృతతుల్యమైన పాలనిచ్చే ...
Sunday, November 1, 2015
రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!
రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం
నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!
క్షంతకుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.
టీకా:
క్షంత = క్షమించు వాని; కున్ = కి; కాళియ = కాళీయుడు అను; ఉరగ = పాము యొక్క; విశాల = పెద్ద; ఫణా = పడగల; వళి = సమూహమందు; నర్తన = నాట్యము; క్రియా = చేయుటలో; రంత = క్రీడించే వాని; కున్ = కి; ఉల్లసన్ = ఉల్లాసము చెందిన; మగధ = మగధకు; రాజ = రాజు యొక్క - జరాసంధుని; చతుర్ = నాలుగు; విధ = అంగములతో - చతురంగబలాలతో {చతురంగబలములు - రథ, గజ, హయ, కాల్బలములు.}; ఘోర = భయంకరమైన; వాహినీ = సేనావాహినిని; హంత = చంపినవాని; కున్ = కి; ఇంద్ర = ఇంద్రుని; నందన = కుమారుడైన అర్జునుని; నియంత = నడిపించేవాడి; కున్ = కి; సర్వ = సకల; చర = కదల గలవాటి; అచరా = కదల లేనివాటి; ఆవళీ = జగత్తు యొక్క {ఆవళి - సమూహము}; మంత = రక్షకుని; కున్ = కి; నిర్జిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కల; సమ = బాగుగా; అంచిత = పూజించు; భక్త = భక్త; జన = జనులను; అను = అనుసరించి; గంత = నడచువాని; కున్ = కి.
భావము:
క్షమాగుణశీలికి; కాళియుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని నడిపినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.
అమర జీవులకు శ్రద్ధాంజలి!!
నవంబర్ 1 వ తేదీ, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రమే కాదు. తెలుగు వారికంటూ, తెలుగు భాషకంటూ గుర్తింపు తెచ్చిన రోజు. తెలుగు వారందరికీ చరిత్రాత్మకమైన రోజు. ఉత్తరాది వారు మనల్ని మద్రాసీలు, సాంబారు గాళ్ళు అని గేలి చేసే వారు (ఇప్పటికీ చేస్తూనే ఉంటారు) తెలుగు భాషమాట్లాడే వారందరి కోసం రాష్ట్రం కావాలని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పడడానికి అసువులు బాసిన అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి దేశ రాష్ట్రాల పట్టికలో ఆంధ్ర అనే పదం ఉంటే అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఉండి, అగ్రస్థానంలో ఉంటుందని తద్వారా ఎక్కువ గుర్తింపు ప్రయోజనం ఉంటుందని ఎంతో ముందు చూపుతో తమ పదవులను సైతం తృణప్రాయంగా ఆశించిన బూర్గుల రామ కృష్ణా రావు గారి లాంటి ఎందఱో మహనీయులు ఎన్నెన్నో త్యాగాలు చేసారు. రాష్ట్రాలు ఏర్పడవచ్చు విడిపోవచ్చు కానీ వాటి ఏర్పాటుకు కారణ భూతులయిన,మూలపురుషులయిన మహనీయులను స్మరించుకోవడం, వారందరికీ శ్రద్ధాంజలి ఘటించడం ప్రతి ఒక్క తెలుగు వాడి కృతజ్ఞతాపూర్వక కర్తవ్యం! ఈ సందర్భంగా శ్రీ సామవేదం జానకిరామ శర్మ గారి కవితను నివాళిగా అర్పిద్దాం!
అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల.
__/i\__
__/i\__
Subscribe to:
Comments (Atom)




