Sunday, November 1, 2015

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం 

   నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!

క్షంతకుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.

టీకా:

క్షంత = క్షమించు వాని; కున్ = కి; కాళియ = కాళీయుడు అను; ఉరగ = పాము యొక్క; విశాల = పెద్ద; ఫణా = పడగల; వళి = సమూహమందు; నర్తన = నాట్యము; క్రియా = చేయుటలో; రంత = క్రీడించే వాని; కున్ = కి; ఉల్లసన్ = ఉల్లాసము చెందిన; మగధ = మగధకు; రాజ = రాజు యొక్క - జరాసంధుని; చతుర్ = నాలుగు; విధ = అంగములతో - చతురంగబలాలతో {చతురంగబలములు - రథ, గజ, హయ, కాల్బలములు.}; ఘోర = భయంకరమైన; వాహినీ = సేనావాహినిని; హంత = చంపినవాని; కున్ = కి; ఇంద్ర = ఇంద్రుని; నందన = కుమారుడైన అర్జునుని; నియంత = నడిపించేవాడి; కున్ = కి; సర్వ = సకల; చర = కదల గలవాటి; అచరా = కదల లేనివాటి; ఆవళీ = జగత్తు యొక్క {ఆవళి - సమూహము}; మంత = రక్షకుని; కున్ = కి; నిర్జిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కల; సమ = బాగుగా; అంచిత = పూజించు; భక్త = భక్త; జన = జనులను; అను = అనుసరించి; గంత = నడచువాని; కున్ = కి.

భావము:

క్షమాగుణశీలికి; కాళియుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని నడిపినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.

No comments:

Post a Comment

Total Pageviews