Tuesday, November 17, 2015

5వ, 6వ, 7వ అధ్యాయములు

5వ అధ్యాయము

వన భోజన మహిమ
ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము న౦దు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము  తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర(గన్నేరు) పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠము వెళ్ళుదురు. భగవద్గీత  కొంత వరకు పఠి౦చిన వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించవలయును.

వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను - యని వశిష్టుల వారు చెప్పిరి. అది విని జనక రాజు' ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.

కిరాత మూషికములు మోక్షము నొందుట
రాజా! కావేరి తీర మ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ . చిన్నతనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని  తండ్రి కుమారుని పిలిచి ' బిడ్డా! నీ దురాచారముల కంతు లేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటుల చేయు'మని భోదించెను. అంతట కుమారుడు' తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతిరేకార్ధములతో పెడసరంగా సమాధాన మిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రీ ' ఓరి నీచుడా! కార్తిక మాస ఫలమునంత చులకనగా చుస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొర్ర యందు యెలుక రూపములో బ్రతికేదవు గాక' అని కుమారుని శపెంచెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి' తండ్రీ క్షమి౦పుము. ఆ జ్ఞానా౦ధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ  యెంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాపవిమోచన మోప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమెమో వివరింపు' మని ప్రా  ధేయ పడెను. అంతట తండ్రీ' బిడ్డా! నా శాపమును అనుభవి౦చుచు మూషికము వై పడియుండగా నీ వెప్పుడు కార్తిక మహత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొ౦దుదువు' అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.

ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభిరామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తిక మాసములో నొక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యా సమేతముగా  కావేరి నదిలో స్నానార్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించు చుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజ ద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందే మోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని' వీరు బాటసారులై వుందురు. విరి వద్దనున్న ధన మపహరించ వచ్చు' ననెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికి నమస్కరించి' మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో నా మనస్సులో చెప్పారని ఆనందము కలుగుచున్నది? గాన , వివరింపుడు' అని ప్రాధేయ పడ్డాడు. అంత విశ్వామిత్రుల వారు' ఓయి కిరాతక! మేము కావేరి నది స్నానార్ధమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరి౦చి కార్తీక పురాణమును పఠించుచున్నాము  . నీవును యిచట కూర్చుండి  సావధానుడవై  ఆలకి౦పుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తిక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మవృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణాన౦తరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది ' మునివర్య! ధన్యోస్మి! తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తిక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి ఐదవ అధ్యాయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.

6 వ అధ్యాయము

దీపారాధన విధి- మహత్మ్యం
ఓ రాజ శేష్ట్రుడా! యే మానవుడు  కార్తిక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఆ ప్రకారముగా కార్తిక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.

శ్లో|| సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతి రస్తూ సదామమ||

అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్ధ మేమనగా,  'అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగు ఈ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! ' అని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ భోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి  కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట

పూర్వ కాలమున ద్రవిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది  ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చుధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసారా ధ్యాని౦చుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని  పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడ బెట్టుచు౦డెడిది.

అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని  అమె కడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి  అసహ్యముగా  తయారగును. అటువంటి యి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని  చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత:కాలమున నదీస్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వని వుపదేశ మిచ్చెను.

ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై  మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తిక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షమునందినది కావున  కార్తిక మాస వ్రతములో అంత మహత్మ్యమున్నది.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి
అరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.

7వ అధ్యాయము

శివకేశవార్చనా విధులు
వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా! కార్తిక మాసము గురించి, దాని మహత్మ్యము ను  గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈ మాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తిక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్షమింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు  చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి గల వారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసినచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని జండా ప్రతిష్టించినచొ యమ కింకరులు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళి రాసు లెగిరి పోయినట్లే కోటి పాపము లైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తిక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తిక పురాణము చదువు చుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తిక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తిక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవార మైనను చేసి శివకేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుము యని చెప్పెను.

' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం
నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి
సప్తమధ్యాయము - సప్తమదిన పారాయణము సమాప్తం.  

No comments:

Post a Comment

Total Pageviews