Saturday, April 16, 2016

2) నిశ్చితార్ధము:తాంబూలాలు

నిశ్చితార్ధము:

తాంబూలాలు అని కూడా అంటారు వధూ వరులు పరస్పరం నచ్చాక ఇరువైపులా పెద్దలు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. బట్టలు పెట్టుకుని ఉంగరాలు అందజేసుకుంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందం లాంటిదనుకోవచ్చు. ఆధునిక కాలంలో నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్లి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంట లోని అబ్బాయిని పెండ్లి కుమారుడు అని అమ్మాయిని పెండ్లి కుమార్తె అని వ్యవహరిస్తారు. ఇదిగో మా ఇంట మా తమ్ముడి వివాహ నిశ్చితార్ధపు వేడుక...వీక్షించండి నిండు తెలుగు మనసుతో ఆశీర్వదించండి!
తాంబూలాలు కార్యక్రమానికి వేదికైన పినపళ్ళలో మాస్వగృహం ముస్తాబు. తాంబూలాల పెళ్లివారిని మా ఇంటి గాతే కూడా పూర్ణ కుంభంతో సుస్వాగతం అని మౌనంగా మనసారా స్వాగతం పలుకుతోంది. దారి పొడుగునా పిల్లలు రంగవల్లికలు తీర్చడంలో సందడి సందడిగా తిరుగాడుతున్నారు. బంధు మిత్రులు హడావిడి సరదా కబుర్లు, మా హిత పురోహితులు బ్రహ్మశ్రీ సత్తిబాబు గారి శాస్త్ర ప్రకారంగా యధావిధిగా జరిపించిన శుభకార్యం సందడి ఇదిగో చూడండి ఆ చిత్రాలు...మీరూ మనసారా ఆశీర్వదించండి!! 

సత్యసాయి - విస్సా ఫౌండేషన్.






































1) పెళ్ళంటే పందిళ్ళు



పెళ్ళంటే పందిళ్ళు

























పెళ్ళంటే పందిళ్ళు 
పెళ్ళంటే… పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు… మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. ఎంత ఆర్భాటంగా చేసాము అన్నదానికంటే ఎంత సంప్రదాయ బద్దంగా చేశాము అన్నది ఏంతో సంతృప్తి గా ఉంటుంది. కళ్ళలో పెళ్లి పందిరి కనబడ సాగే అన్న పాట ఎంత చల్లగా హాయిగా ఉంటుంది. పందిరి అంటే తాటాకు పందిరే చలవ పందిరి అంటారు. ఈ కాలంలో ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న విషయం, తాటి ఆకు లభించాలి, చెట్టు నుండి కోసి వాటిని ఒక వరుసక్రమంలో ఒక దానిపై ఒకటి వరుసగా పేర్చి చదును చేసే ప్రక్రియను మడదొక్కడం అంటారు. ఈ మధ్యకాలంలో పాకలు పందిళ్ళు నేసే వారు కరువవుతున్నారు. ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. పందిరిని బట్టి ఆధారపడుతుంది. అందుకనే గ్రామాలలో కూడా పెళ్లిళ్ళలో పందిరిలు నామమాత్రం గానే కనిపిస్తున్నాయి. టెంటు వేసేస్తే సరి అని సరిపెట్టేసు కుంటున్నారు. కనీసం 6 మంది 4 రోజులు కష్టపడితే పందిరి తయారవుతుంది. ఇక ఆ పందిరి కింద కాసింత సేదతీరితే ఆ పచ్చి తాటిఆకు వాసన ఆ పందిరి స్తంభాలకు కట్టిన పచ్చి కొబ్బరాకులవాసనా, తోరణాలుగా కట్టిన మామిడాకుల వాసనలు పీలుస్తూ ఆ పందిరి కింద సేదతీరితే అటు ఎండనుండి రక్షణతో పాటు సంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నామన్న భావనతో ఎంతో తృప్తి గా అలౌకిక ఆనందం అంతేకాదు ప్రకృతి సహజసిద్ధమైన అలసట పోగొట్టి మనసుని ఉల్లాసంగా ఉంచే గుణం తాటి ఆకుల్లోను , తాటి పందిళ్ళలోను, పాకల్లోను ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే పూర్వం శుభకార్యాలకి కొబ్బరి ఆకుల కన్నా తాటి వనరులనే ఎక్కువ ఉపయోగించేవారు. ఈ విషయంలో కొబ్బరికన్నా, మరింత శాతం తాటి మంచిది అంటున్నారు పరిశోధకులు. అందులో అనేక విశే షాలు, ఔషధగుణాలు, కలగలుపుగా ఎన్నో ఉన్నాయి. దీని సాధారణ ఉపయోగాలు చూస్తే, దీని ఆకులు లతో పూరిపాకలే కాక శోభస్కరమైన పెళ్లి పందిరికీ, వాడేవారు కాగితం లేని పూర్వకాలంలో ప్రజలందరూ తాటి ఆకుల్నే వాడేవారు. వాటినే తాళపత్రాలు అని పిలిచేవారు. నేటికీ ఎన్నో గ్రంధాలు మనకి తాళపత్రాలలోనే ఉన్నాయి. ఇక దీని కాండం ఇంటి వాసాలుగా ఉపయోగిస్తారు. అనేక పల్లెల్లో, వ్యవసాయ భూముల్లో ఈ తాటివాసాలతో, తాటి ఆకులతో కట్టిన ఇళ్ళు మనకి నేటికీ కనిపిస్తూనేవుంటాయి. ఈ ఇళ్ళు మనకి వేసవిలో చల్లగానూ, శీతాకాల, వర్షాకాలాల్లో వెచ్చగానూ వుంటాయి. అందుకే తాటితో తయారైన ఇంటిని ‘నేచురల్‌ ఎయిర్‌కండిషన్డ్‌ హౌస్‌’ అంటారు. తాటికల్లుని నీరాగా అందరూ సేవించడం మనకి తెలిసినదే. తాటి సంపద ఆయుర్వేదపరంగా కూడా మనిషికి మేలుచేస్తుందనే చెప్తోంది. భొజానాల్లో అరటి ఆకులు కూడా మాయమై పోతున్నాయి. నేటి ఆధునిక ఒత్తిడుల మయ మాయా జీవనంలో ఇలా ఒక చల్లని పందిరికింద సేద తీరితే ఎంత హాయి! ఇలా పందిరి వేసాక దానికి తెల్ల వస్త్రాన్ని కప్పి రంగు రంగుల పువ్వులతో అలంకరిస్తే ఇంటి ముంగిట ఎంత చల్లదనం ఎంత శోభాయమానం... నగరాల్లో పట్టణాల్లో పెళ్లి మంటపాలకు లక్షాలాది రూపాయలు ఖర్చు చేసేవారు ఏదో ఒక గ్రామంలో ఇలా పందిరి ఏర్పాటు చేసి తక్కువ ఖర్చులో ఎంతో వైభవంగా చెయ్యవచ్చు సంప్రదాయాన్ని పరిరక్షించావచ్చు ఆలోచించండి! ఇంతకీ ఈ హడావుడి అంతా ఏమంటే? రాజు తలుచుకుంటే దేనికైనా కొదువా అంటారు కదా మా తమ్ముడు రాజు తలుచు కుంటే అంతేమరి! ఇదిగో మా తమ్ముడు చి. వెంకటేశ్వర్లు వివాహ నిశ్చితార్దానికి మా ఇంటి ముంగిట పందిరి శోభ! అచ్చతెలుగు సంప్రదాయం ఆస్వాదించండి! రేపటి పోస్ట్ లో నిశ్చితార్ధం దృశ్యాలు వీక్షించండి మనసారా ఆశీర్వదించండి! సత్యసాయి విస్సా ఫౌండేషన్!

Monday, April 4, 2016

మహాభారతంలో, ఒక సంఘటనలో హనుమంతుడు రామేశ్వరం వద్ద ఒక సాధారణ వానర రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకకు వెళ్ళటానికి రాముడు నిర్మించిన వంతెన చూసి అర్జునుడు ఈ వంతెనను నిర్మించడానికి వానరుల సహాయం తీసుకున్నాడు. ఎందుకు! అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు అదే తను అయితే ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించి ఉండేవాడినని అనుకున్నాడు.
హనుమంతుడు నీ బాణంతో నిర్మించిన వంతెన అయితే సంతృప్తికరంగా ఉండేది కాదని, ఆ వంతెన ఒక వ్యక్తి బరువును మోసి ఉండేది కాదని విమర్శించాడు. అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకున్నాడు. అర్జునుడు, తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే, అప్పుడు తాను అగ్నిలో దూకుతానన్నాడు.
దీంతో అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మించారు. హనుమంతుడు దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది. అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు. తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునిని ముందు ప్రత్యక్షమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు. ఈసారి వంతెన కూలిపోలేదు. హనుమంతుడు ఆశ్చర్యపోయి తన ప్రభువు శ్రీరామచంద్రుడే ...శ్రీకృష్ణ పరమాత్మునిగా అవతరించాడని గ్రహించి నమస్కరించాడు.

Saturday, April 2, 2016

దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........

1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.

2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........

3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి.........
.

4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........

5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...

6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......

7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......

8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........

9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............

10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి.........అన్ని మతాలు ప్రేమించమనే
చెప్పాయని,ద్వేషించమని ఏ మతమూ చెప్పలేదని వారికి తెలియచేయండి........

వీటిలో మీరు కొన్ని అయినా చేస్తే..........
మీ పిల్లలకు మంచిని చేసినవారు అవుతారు.......
ప్లీజ్..చేస్తారని ఆశిస్తూ.........

Total Pageviews