Tuesday, August 1, 2017

వెళ్లాలని లేకున్నా... వెళ్లక తప్పని పయనమిది..వెళ్లిరానా మరి..బై..రా.!!

బ్రతుకుతెరువు కోసం వలసవెళ్లే పల్లె ప్రజల కన్నీటి కథలను,వెతలను చూపించాటానికి కావాల్సినంత సమాచారముంది, గల్ఫ్ కు వెళ్లి కంపెనీ వారి ఘాతుకానికి బలి యై కుటుంబానికి దూరమై కూనారిల్లుతున్న ప్రజలదీన గాధలెన్నో ఉన్నాయి.ప్రతిభావంతులు పూనుకొని ప్రజలను వెళ్ళనీయకుండా ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ కూడా చిత్రాలు రూపొందించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.
ఒబులాపురం గ్రామం పోస్ట్ పేరిట ఓ అజ్ఞాత కవి వ్రాసిన కన్నీటి కథను మీ ముందున్చుతున్నాను.

వెళ్లాలని లేకున్నా...
వెళ్లక తప్పని పయనమిది..వెళ్లిరానా మరి..బై..రా.!!
******************************************
అమ్మను చూస్కో..
బాబు జాగ్రత్తే..నువ్వు ఏడ్వకు..
గుండె అంత పిండినట్టైతుందే నువ్వేడిస్తే..
ఈసారి తొందర్గనే వస్తా..నాకూ గల్ఫ్ లో.. 
ఉండబుద్ది కావట్లేదే..నావల్ల కాదిక .నా బుజ్జి కదూ..వెళ్లక తప్పదురా..!

ఏడ్నెల్ల జీతం రావాలి..
పన్నెండ్ల సర్వీసు పైసల్ రావాలి..
రూంలున్న దోస్తులకు సేపాయిచ్చినవి వసూల్ చేస్కోవాలి.

అన్నట్టు మరిచానే..
పక్క దేశపోల్లు తక్కువ జీతంకు వస్తున్నరు..
నా ఒక్కడి జీతంల ..ఆ దేశం వాళ్లు ముగ్గురు పనిజేయడానికి రెడీ అవడంతో మా కంపిని కఫిల్ గాడు మా సీనియర్లను పొమ్మనలేక పొగవెట్టి టార్చర్ పెడుతుండు.

తక్వ జీతానికి..
గల్ఫ్ లో పని చేయలేక..
గతి లేక ఇండియాకు రాలేక..
ఎంత నలిగి పోతున్నమో ..ఎవరికి చెప్పుకోలేక పోతున్నం.!!

బై..రా..బంగారం..
నేను ఇప్పుడు కష్టపడితేనే కదే మనందరి కష్టాలన్ని పోయి 
సంతోషంగా బతికేది..మేం రొండు నెలల కోసం వచ్చేది మేమేదో సాధించామని కాదే..నా వాళ్లందరి మొహంలో చిరునవ్వు చూసేందుకు..!

మిమ్మల్ని చూసుకుని మేమెంత ఛార్జవుతామంటే..ఎండిపోయిన అన్నాన్ని బిర్యాని అనుకునేంత..మాడగొడుతున్న ఎండను సైతం మర్చిపోయెంత..మీకోసం మేం ఏం చేయడానికైనా సిద్ధం రా..
నువ్వేం బాధ పడకూ..ఆ..నే..వస్తాన్రా..ఏడకూ..జాగర్తా..బైరా..!!

పొన్నగంటి కూర.

కంటిచూపు తగ్గుతోందన్న విషయం మన ఇంట్లోని బామ్మలు, అమ్మమ్మల చెవినబడితే వెంటనే వాళ్లు రోజూ పొన్నగంటి కూర తినమని సలహా ఇస్తారు. నిజానికి చూపు పోయినవాళ్లకీ చూపు తెప్పించగలదనే అర్థంలో దీన్ని ‘పోయిన కంటి కూర’ అని పిలిచేవారు. అదే వాడుకలో పొన్నగంటి అయింది. ఈ ఆకునే సంస్కృతంలో మత్స్యక్షి అనీ, ఇంగ్లిషులో డ్వార్ఫ్‌ కాపర్‌లీఫ్‌, సెసైల్‌ జాయ్‌వీడ్‌ అనీ పిలుస్తారు. సామాన్యుడి బంగారు భస్మంగానూ దీన్ని పిలుస్తారు. పూర్వం తిరిగి శక్తిని పుంజుకునేందుకు కాయకల్పచికిత్స చేయించుకునేవారు. అందులో వాడే బంగారు భస్మానికి బదులు దీన్ని వాడేవారట. మనకన్నా ఉత్తరాదిన దీని వాడకం మరింత ఎక్కువ. ఇందులో పోషకాలూ ఎక్కువే. వంద గ్రాముల ఆకులో 60 క్యాలరీల, 12గ్రా. పిండిపదార్థాలూ, 4.7గ్రా. ప్రొటీన్లూ, 2.1గ్రా. పీచూ, 146మి.గ్రా. కాల్షియం, 45 మి.గ్రా. పొటాషియంలతోబాటు ఎ, సి- విటమిన్లూ పుష్కలంగా లభ్యమవుతాయి.                        

"మహాభారతం" నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

 "మహాభారతం" నుండి
నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు*****

1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.

3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.

5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.

6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.

7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.

8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.

10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.

11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.

12. ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తోంది
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది.

13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.

14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:
పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగ
From FB

భగవద్గీత ఎందుకు చదవాలి?



     బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు.
      లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు.
     గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.                        

ఉల్లి చేసేమేలు.

పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది ! షేర్ చేయండి
పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది ! షేర్ చేయండి

అవును ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ పని పట్టొచ్చు. ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ఇటీవలి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది. హల్లో పతి మందులకు లొంగని హై షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటోంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.. ఇలా 7 రోజులు చేస్తే అద్భుత మైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఆచరించడంతో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి..
ఇలా చేయాలి:
రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఖచ్చితంగా తినాలి.
ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకుని తిన్నా సరే.. పచ్చిది మాత్రం తినాలి.
50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.
7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.
50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.
పచ్చి ఉల్లిపాయతో పచ్చిపులుసు చేసుకుని అన్నంతోపాటు తిన్నా సరిపోతుంది.
పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు:
ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.
ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.
ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ 2, 3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలను రావు.
కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు కూడా రావు.

అమ్మకి పాదాభివందనం.


శ్రీ మంగళగౌరి స్తవము.

అందరికీ శ్రావణ మంగళవార శుభాకాంక్షలు.అమ్మవారి దయ, అనుగ్రహం, ఆశీర్వాదం మన అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకొంటున్నాను.
శ్రీ మంగళగౌరి స్తవము.
నిర్మలమైన మనస్సుతో శ్రీ మంగళ గౌరీ స్తవమును చదువుదాము.
శ్రీ మంతాక్షర మాలయాగిరిసుతాం యః పూజయే చ్చేతసా
సంధ్యాసుప్ర్యవాసరం సువియత స్తస్యామలం స్యాన్మనః
చిత్తాంబోరుహ మంటపే గిరినుతానృత్తంవిధత్తే సదా
వాణీ వక్త్రసరోరుహే జలదిజాగేహే జగన్మంగళా.
రక్షరక్ష జగన్మాతర్దేవి మంగళ చండికే
హరికే విపదాంరాళేర్హర్ష మంగళకారికే
హర్ష మంగళ దక్షేచహర్ష మంగళ దాయికే
శుభే మంగళ దక్షే చ మంగళ చండికే
మంగళే మంగళార్హేచ సర్వమంగళ మంగళే
సతాం మంగళాదే దేవి సర్వేషాం మంగళాళయే
పూజ్యే మంగళ వారే చ మంగళాభీష్ట దేవతే
మంగళాదిష్టాతృదేవి మంగళానాంచ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని.
సారే చ మంగళాధారే సారే చ సర్వకర్మాణామ్
ప్రతిమంగళ వారే చ పూజ్యేహే మంగళ ప్రదే
పుత్రా దేహి ధనందేహి సౌభాగ్యం సర్వమంగళే
సౌ మాంగల్యం సుఖం జ్ఞానం దేహిమే శివసుందరి.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః
సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే, ఐదోతనానికీ, సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి. ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధ్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితలందరూ ఆదిపరాశక్తులైన ఆ జగన్మాతలను భక్తిశ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ, శుక్రవారాలు.
పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం 'మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు.

Total Pageviews