Sunday, May 24, 2020

తారకరామునికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..గొడవర్తి శ్రీనివాసు.

శ్రీ నందమూరి హరికృష్ణుండొసగిన
దుర్జయవంశ దివ్యతేజం..
మహోన్నత మాతృమూర్తి శాలినీదేవీ ప్రసాదిత
కన్నడ కస్తూరికా పరిమళద్వయ బ్రహ్మజ్ఞానం..
తెలుగువారి చరిత్రకే వన్నెలద్దిన రేచర్లగోత్ర రాజసం..
తాతకు తగ్గ మనవడంటూ అభిమానులందరూ
చూసుకుని మురిసే సమ్మోహనరూపం..
నృత్య,గాన,వకృత్వాది జనరంజక కళలలో
తనకు మాత్రమే సొంతమగు మహోత్సాహ కళాకోశలం..
నవరస నటవిన్యాసాలను తన క్రీగంటి చూపులోనే పలికించగల అద్వితీయ నేర్పరితనం ..
కోట్లాది జనహృదయాలను అనుమోదమొనొర్చు సరిసాటిలేని నటనైపుణ్యం..
పసిబాలుని మనస్తత్వం..
వసివాడని ఘన వారసత్వం..
వెరసి మా నందమూరి తారకరాముడంటేనే
తెలుగుసొబగుల సౌరభం..
అఖిలాంధ్ర అభిమాన జనహృదయ ఆనందనందక
నటతేజోవిరాజ అభినయధురీణుడు
మా అన్న నందమూరి తారకరామునికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..గొడవర్తి శ్రీనివాసు.
 #HappyBirthdayNTR
@Tarak9999Official

Sunday, May 17, 2020

ఇదీ బెజవాడ అని ....భండారు శ్రీనివాసరావు అనే సీనియర్ పాత్రికేయులు

బెజవాడ అంటే తెలియనివారు.
బెంజి సర్కిల్, రింగురోడ్డు.
మాత్రమే అనుకునేవారికి.

ఒకసారి తెలుసుకోండి. 
 ఇదీ బెజవాడ అని ....

భండారు శ్రీనివాసరావు అనే సీనియర్ పాత్రికేయులు కొన్ని సంవత్సరాల క్రితం రాసింది ...

మీరు చూసిన, విన్న బెజవాడ మారిపోయి చాలా కాలం అయిపొయింది ...
మీకు తెలిసిన బెజవాడ చాలా తక్కువ, ఇదిగో భండారు శ్రీనివాసరావు గారు రాసింది చూడండి ...
బెజవాడ అంటే ఇది ...
🔥🔥🔥🔥🔥🔥
"రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే వ్యక్తుల మధ్య రగిలే పగలు, సెగలు ఇవాళ బెజవాడ అంటే. బహుశా దాన్ని విజయవాడ అనాలేమో.

బెజవాడ కాదేమో ...  నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన బెజవాడ మాత్రం కాదు.

నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు.

సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు పేరు.

అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ,
కే.ఎల్.రావు,
టి.వి.ఎస్. చలపతి రావు,
డాక్టర్ దక్షిణా మూర్తి,
మరుపిళ్ళచిట్టి,
కాకాని వెంకట రత్నం,
కాకరపర్తి భావన్నారాయణ,
ఖుద్దూస్,
ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో
ఆణి ముత్యాలు ...
బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.

🎼🎼🎼
సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు,
చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు,
మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు, శ్రీరంగం గోపాల రత్నం.

బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.

📖📖📖
సాహిత్యంలో.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ,
పేరాల భరత శర్మ,
చెరుకుపల్లి జమదగ్ని శర్మ
వంటి కవి పండిత శ్రేష్ఠులు,

🏯🏯🏯🗼🗼🗼
పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన
చుండూరు వెంకటరెడ్డి,
కౌతా పూర్ణానందం,
మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు,

🎥🎥🎥📽📽📽🎞🎞🎞

సినీ రంగం ప్రముఖులు.
పోతిన శ్రీనివాసరావు,
పూర్ణ మంగరాజు కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు,
నవయుగ శ్రీనివాసరావు,
కాట్రగడ్డ నరసయ్య,
తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల -

 బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.

💰💰💰💰💰💰

ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు,
తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు,

📖📖📖🏢🏢🏢
జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన.
అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా,
నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని అద్దంకి శ్రీరామమూర్తి,
విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప,
బి.వి. రంగారావు,
సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,
కర్నాటి లక్ష్మినరసయ్య,
సీడీ కృష్ణమూర్తి,
నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య,

🥊🥊🥊🏋🏋🏋🤼‍♂🤼‍♂🤼‍♂

వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు,

🎓🎓🎓⚖⚖⚖
ప్లీడర్లు
కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి, చక్రవర్తి,
పాటిబండ సుందరరావు,
ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు,

📰📰📰✒✒✒

పత్రికా సంపాదకులు.
 నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్,
నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డి,
ఏబీకె ప్రసాద్,
పీ.ఎస్. ప్రకాశరావు,

అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన
భండారు పర్వతాలరావు -

వీరిదీ బెజవాడ.

బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!

ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు,

వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు,

లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు

తెన్నేటి లత,
కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు,

 నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు,
నిమ్మగడ్డ వారి ఎంవీకేఆర్ పబ్లిసిటీస్,

దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే నేషనల్ లితో ప్రింటర్స్

బెజవాడకు లాండ్ మార్కులు.

టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీ జనరల్ స్టోర్స్,

వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు,

కాళేశ్వరరావు మార్కెట్ లో గుండపు చలపతిరావు,
తలుపులమ్మల కమీషన్ కొట్టు,

శ్రీ రామనవమి పందిళ్ళు,
రామకోటి సప్తాహాలు,
నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే

అదీ బెజవాడ.

🏞🌇🌆🏙🌃🎆🛣🌉

తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్,
తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం,
డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్,
కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి,
సామారంగం చౌక్,
చల్లపల్లి బంగ్లా,
బోడెమ్మ హోటల్,
న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు,
అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్, అలంకార్ సెంటర్,
మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్,
బీసెంట్ రోడ్డు,
ఏలూరు రోడ్డు,
వీధి రాజయ్య మేడ,
బందర్ రోడ్డు,
పాత శివాలయం,
కొత్త గుళ్ళు,
జెండా పంజా బస్ స్టాఫ్,
అక్కడ గుమిగూడే జనం.

ఇవీ బెజవాడ అంటే.

లీలా మహల్ పక్కన పిడత కింద పప్పు,
ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు రోడ్డు సెంటర్,
అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్,
మోడర్న్ కేఫ్ లో మినప దోసె, దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం, పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా,
ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల హల్వా,
రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం.
మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,

కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం, సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది,
వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల,
నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం. ,
మారుతి సినిమా,
జైహింద్ టాకీసు,
లక్ష్మీ టాకీసు,

ఎప్పుడూ హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్,

ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్,

పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్-

ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.

రాఘవయ్య పార్క్,
 రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం,
దివ్యజ్ఞాన సమాజం,
అన్నదాన సమాజం,
కాళేశ్వర రావు మార్కెట్,
 గాంధీ కొండ,
పప్పుల మిల్లు,
శరభయ్య గుళ్ళు,
అరండల్ సత్రం,
చెట్ల బజారు,
గోరీల దొడ్డి,

కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ,
ప్రకాశం బరాజు, 🚟🚟🚟
(సుంకర వెంకట రమణ)
🕉🕉🕉🕉🕉🕉
అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో గోపికలతో సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ,
✝✝✝
గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట,
రేడియో స్టేషన్, 🎙🎙🎙
నక్కలరోడ్డు
అచ్చమాంబ ఆసుపత్రి,
అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి,
మాంటిసోరి స్కూలు,
బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ,
మొగల్రాజపురం గుహలు,
ప్రెస్ క్లబ్.
పి.డబ్ల్యూ. డి. గ్రౌండ్స్.
..............
ఇంకా, ఇంకా ఎన్నెన్నో.

🏥🏥🏥🚌🚌🚌
 ఎస్.ఆర్.ఆర్. కాలేజి,
లయోలా కాలేజి,
శాతవాహన కాలేజి,
గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, సి.వి.ఆర్. స్కూలు,

ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.

అంతే కాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో తెలియనివాళ్లు తీసిన సినిమాలు, చెప్పే మాటలు విని,
చూసి బెజవాడ ఇలా వుంటుందని అనుకునేవారికి ఇవన్నీ తెలియాలి.

మా బెజవాడ చాలా గొప్పది. “అరవ వాళ్లకి మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.”

🙏🙏🙏

ఈ పోస్ట్ మరో గ్రూపు నుండి వచ్చింది. మీతో పంచుకోవాలనిపించి షేర్ చేస్తున్నా....
ముందు తరం వాళ్లకి పంపిస్తే గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతారు. గ్యారంటీ నాది.

Saturday, May 16, 2020

"వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు "

దేనిమీదైనా విరక్తి పుట్టవచ్చేమోగానీ, జీవితం మీద విరక్తి కలగకూడదు. బతుకు తీపి అనేదే ఒక అద్భుతం. మనం అల్పం అనుకున్న క్షుద్రజీవిలో సైతం ఈ తీపి ఉంటుంది. చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించినది ఈ బతుకు తీపి. జీవితానికి ఉన్న విలువ అపారం-లౌకికమైన ప్రయోజనాలతోపాటు అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం ` జీవితం ' అనే అంశంలో ఇమిడి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సమృద్ధిగా అనుభవించడానికి కావల్సిన నైతికసూత్రాలు, నియమాలుం అభ్యాసాలు ఏర్పరచారు మన మహర్షులు. "ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి. ఈ రెండింటినీ సాధించడమే అసలైన ప్రయోజనం " అన్నది స్పష్టమైన నిర్వచనం. అందుకే ఎప్పుడూ జీవితంపై రోత కలగకూడదు. ఈ అవగాహన లేక క్షణికోద్రేకాలకు లోనైనవాడు బతుకునే పూర్తిచేసుకోవాలనుకుంటాడు. ఈ ఆత్మహత్యా ప్రయత్నధోరణి ఉద్రేకం వల్ల, ఒత్తిడివల్ల కలుగుతుంటుంది. జీవితంలో అర్థంలేని పరుగులు పెడుతూ, `ప్రశాంతత ' అనే స్వాభావిక స్థితిని కోల్పోవడం చేత అవగాహన అనేది లేకుండా బతుకు సంపదని పోగుట్టుకుంటున్నాం.
హనుమంతునికి సీతాదేవి జాడ తెలియక నిరాశతో తిరిగివెళ్ళడంకన్నా ఆత్మహత్య చేసుకుంటే మేలు అనుకుంటాడు. కానీ బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయట పడ్డాడు. సక్రమంగా అలోచించాడు. "వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు ".. ఇది హనుమంతుని మాట. ఈ ఒక్క వాక్యాన్ని మంత్రంలా మననం చెస్తే చాలు. నేటితరం అంతా వాళ్ళ గది గోడల మీదనో, డైరీ మొదటి పేజీలోనో మొత్తానికి హృదయఫలకంపై బలంగా లిఖించుకోదగిన వాక్యమిది. "చనిపోవడంలో చాలా దోషాలున్నాయి. జీవించి ఉంటే చాలు శుభాలను చూడవచ్చు " ఒక్కొక్కసారి అంతా శున్యమే అనిపిస్తుంది. కానీ ఆ క్షణం దాటితే అంతా మేలే కలగవచ్చు. ఈ లోపల తొందరపడి మృత్యువుని స్వాగతిస్తే, ఆ శుభాలన్నీ అందుకొనే అవకాశమే మిగలదు. ఈ వాక్యంతో ఆత్మబలాన్ని పుంజుకున్న హనుమ ఆశావాదం ఫలించింది. అశోకవనంలో సీతజాడ దొరికింది. ఆశావాదానికున్న సత్ఫలం అది.
"అలలా వచ్చిన దిగులే అంతాకాదు".
తనకుమారులందరూ విశ్వామిత్రుని కారణంగా మరణించాక వసిష్ఠునికి దు:ఖోద్రేకం కలుగుతుంది. కొండపైనుండి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు. ఈ లోపల భూదేవి ఆయనను చేతితో పట్టి కాపాడి మందలిస్తుంది-" ఓ వెర్రీ! చచ్చిపొతే జీవితం తీరిపోతుందా?" అని ప్రశ్నిస్తుంది. ఇది చాలా సూటి ప్రశ్న. మరణిస్తే దేహాన్ని కోల్పోతాం. కానీ మరో ఉపాధితో జీవించక తప్పదు. అప్పుడు ఇప్పటి ఆత్మహత్యాపాపఫలాన్ని సైతం అనుభవించవలసిందే. నిజంగా జీవితం పై విరక్తి వస్తే `శాశ్వతశాంతి ' కి చేరువయ్యేందుకు ఈ జీవితాన్ని వినియోగించుకోవాలి. ఙ్ఞానాన్ని సంపాదించాలి. దీనితో తపస్సుచేసి బ్రహ్మఙ్ఞానంతో సుస్థిర శాంతిని పొందుతాడు. ఈ కథలో జీవుని పరంగా తాత్త్విక స్పృహతో ఆత్మహత్యా ప్రయత్నం అవివేకం అని స్పష్టపరచారు.
ఇలా ధార్మికంగా, లౌకికంగా, తాత్త్వికంగా ఆలోచించినా జీవితానికన్నా విలువైనది లేదు. ముందు మనం-అటు తరువతే లోకం. బయట వస్తువులపై, వ్యక్తులపై మమకారం, ఆశా పెంచుకొని అవికోల్పోతే బతుకునే బలి చేసుకొనడం మూర్ఖత్వం. బయట వస్తువు లభించక ముందూ మనం ఉన్నాం. అది పోయినా ఉంటాం. మనల్ని నాశనం చేసుకొనే హక్కు మనకే లేదు. " ఓర్చినమ్మకి తేటనీరు ' అన్నట్లు సహనానికి ఫలం సౌభాగ్య

Friday, May 15, 2020

"మళ్లీ కవిగానే పుడతా.... తెలుగు దేశంలో మాత్రం కాదు!!"..... తనికెళ్ల భరణి....

"మళ్లీ కవిగానే పుడతా.... తెలుగు దేశంలో మాత్రం కాదు!!"
ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు.....  తనికెళ్ల భరణి....
ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు.... అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో.... ఆయన మాటల్లోనే.....
"అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం" అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.
వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లోో ఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.
గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే..... తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే..... 'అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు... ఆయనేనా?' అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.
కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య.... వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి... పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్తారు.
తెలుగుకు ఆ శక్తి ఉంది....
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత "తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్" అని ఆవేదన వ్యక్తం చేశారట.
"తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది." అన్నారట పీవీ.
అవును... తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం"
ఇది భరణి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా. నిజమే భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగు వాళ్లే చంపుతున్నారు. నిజమే.... చిన్నపిల్లలు అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయటం అంటారా.... అబ్బో అదో బ్రహ్మ విద్య.
ఓ సినిమాలో చెప్పినట్టు... దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి... షిట్ అనే అశుద్దాన్ని పలుకుతున్నాం.
మారాలి.... మనం మారాలి. మన ఆలోచన మారాలి.  మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం.
అమ్మ  చేతి  గోరుముద్ద  తెలుగు.
రుచి  రాగాల పాల ముద్ద తెలుగు.
వాట్స్ ప్  ద్వారా  వచ్చినది.
రాసిన వారికి  కృతజ్ఞతలు.

Thursday, April 16, 2020

సందేలమాటు బడుదిలేసాక ఇంటికెల్లి పెరట్లో అరుగుమీద కూకుని హోమువర్కు సేసుకుంటుంనప్పుడు..,

పుల్లలపొయ్యమీద కుతకుతలాడతా వుడుకుతున్న అన్నం వాసన గేపకవుందా? అద్బుతవైన పరిమళం.., నేనింకా అప్పుడప్పుడూ వండుకునేది ఆవాసనకోసమే..,

బల్లోకెల్లాక కరెట్టుగా మజ్జానంనుంచి వానొచ్చేసి కంటిన్నుం సేహేత్తే ఎంతానందంగా వుండీదోకదా?

వంటిగంటకి ఇంటిబెల్లు కొట్టేసాక వానతగ్గి ఇంటి కెలతా కాల్లు బురదలో తడకూడదని గోడలనట్టుకుని ఫీట్లుసేత్తా ఎల్లివోల్లం గేపకవుందా? (ఫొటో పెట్టానదే).,

సందమామరావే జాబిల్లిరావే అంటూ ఓసంకలో పిల్లని.,
మరోసేతిలో చారు.,నెయ్యి ఏసి మెత్తగా పిసికిన అన్నం తినిపింతం.,

కొంచెం ఎదిగిన పిల్లలకు గేదెల్ని, కోళ్ళని చూబెట్టి తినిపించడం.,

అదిగో బూసోడొచ్చేత్తన్నాడు బేగాతినేయాలంటం.,

బేగా తినేత్తే బేగా పెద్దోడివైపోతావంటం..,

పిల్లలందరినీ ఓ దిక్కినే కూకోబెట్టి అన్నాలెడతం..,

ఎవరు ముందు తింటారో..,అని పందాలెడతం.,

ఒరే బుజ్జే అందర్ని గొద్దెక్కిచ్చేయాలొరే (ఓడించేయాలని)నువ్వు అంటం.,

తినకపోతే రెండు తగిలింతం.,

అన్నం తినీముందు కల్లకద్దుకోమంటం.,

బాసింపటవేసుకుని తినమంటం.,

ఓకాలు మడతేసి.,ఓకాలుసాపితే అలా మడిగాల్లేసుకుంటా వేంటిరా ముడిగాల్లెదవ అని తిడతం..,

అన్నం తినాపోతే మేనమామని కేకేయమంటం.,

తోలుతీసేత్తాను తినాపోతే ఒక్కొక్కడికీ అని బెదిరింతం.,

ఒలే బేబీ ఇందాకొచ్చేడుకదూ.., బూసోడు., ఆన్నిలా కేకేయవే ఈడు అన్నంతింటంలేదనగానే గబగబా నోటినిండా కుక్కేసుకుంటం..,

కోడిగుడ్డు సగం ముక్కే ఏత్తం.,

కోడిగుడ్డు కంచం కోసం కొట్టుకుంటుం..,

పెన్సిలెప్పుడూ సగంముక్కే ఇవ్వటం.,

పాతసంవత్సరం మిగిలిపోయిన నోటుబుక్కుల్లోని కాయితాలన్నీ సింపి తెలుపు.., రూల్లు., అన్నీకలిపి బొంతసూది.,పేకదారంతోటి చిత్తుబుక్కులు సేసుకుంటం..,

ఇంకుపెన్నుల్లో రెండుసుక్కలు ఇంకు అప్పడగటం..,

పాళీ,నాలిక అనీవోల్లుం., పెన్నుకిందడితే పాళీ ఇరిగిపోయీదిగాని.,నాలిక బానేవుంటం.,

పెన్ను కక్కేంత్తుందనీవోల్లుం.,

ముల్లుపెన్నుల్లో ముల్లు రాయకపొతే గట్టిగా గాలూదటం.,
పొయ్యపక్కనెట్టి వేడిసేసుకుంటం., ముల్లుతీసేసి ఏలడ్డవెట్టి గాలూదటం.,

సూదిపిన్నీసెట్టి ముల్లులో వున్న గుండు బయటకు గెంటడం.,

చేతిసంచీలో పుస్తకాలన్నీ నీటుగా సర్దుకుని సంచీ భుజాన తగిలించుకుని బల్లోకెలతం..,

పుస్తకాల మయంగా నెమలిపించాలెట్టుకుని తాటిపూర్ణం మేతేస్తే పిల్లలు పుడతాయనుకుంటం.,

కొత్తపుస్తకం కొనగానే మజ్జిగూట్లో వాసనసూసి అబ్బా ఎంతబోందో అనుకుంటం.,

పదోతరగతిదాక నిక్కర్లతోనే వుంటం.,

పొడుగుఫేంటుకుట్టించుకోవాలని కలలుగంటం.,

ఆరోజుల్లో అంబాసిడర్ కార్లని టూరింకారు అంటం..,

ఇనాయకసవితి., దేవీనవరాత్రుల్లప్పుడు గుడిదగ్గరేసే నాటకాలు,సినిమాలు పోగ్రాంలగురించి ముద్రేసిన పేపరు కోసం ఎగబడి కలబడిపోతాం.,

సమయాను కూలపోగ్రావనుంటే ఆయాల సినిమా ఏత్తారో, నాటకవేత్తారో అని చర్చించుకుంటం.,

నాటకాలేసీవోల్లు మేకప్పులేసుకుంటుంటే దొంగతనంగా తలుపుకన్నాల్లోంచి సూత్తం.,

గోనుసంచట్టుకుపోయి స్టేజిదగ్గరగా సోటుసూసుకుంటం.,

ఇంత అద్భుతమైన లోకాన్ని మనంచూసొచ్చాంకదా..,
మరీకాలం పిల్లలకి ఇదంతా వట్టిదేనా..,!?

ఈపోస్టులోయన్నీ అనుభవించినవారు మీఅనుభవాల్ని కామెంట్లలో రాయండి.,

ఈపోస్టు సదివిన తర్వాత ఇందులోవున్నాయి మీకు తెలీదంటే ఖచ్చితంగా మీ అమ్మానాన్నలకు తెలిసినట్టే వారినడగండి మీరిలాగే సేసీవోరా అని..,

గోదారియాసే నాశ్వాస మీ Evv సత్తినాణ.,

Friday, April 3, 2020

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత: "ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ,...

Wednesday, April 1, 2020

మీకోసం...: మన ఆచార వ్యవహారాలు

మీకోసం...: మన ఆచార వ్యవహారాలు: ప్రపంచ సామాజిక చరిత్రలో భారతదేశానికున్న ప్రాముఖ్యత మరే ఇతర దేశానికీ లేదన్నది ప్రపంచ దేశాల ఉమ్మడి అభిప్రాయం.ఇందుకు కారణం ఇక్కడి ఆచార వ్యవహ...

Total Pageviews