Saturday, June 13, 2020

లేలాండ్ స్టాన్ఫోర్డ్", "జేన్ స్టాన్ఫోర్డ్'..

ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం
తొందరపడి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి......
-------------------------
ఆ దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది.

ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరకి పంపడానికి ఆమె అంగీకరించలేదు.

 లేకపోతే, ఈ ముసలివాళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్తో పనేమిటి?

ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు.

“చెప్పండి, ఏం కావాలి?" అడిగాడు ప్రెసిడెంట్..

"మేము విరాళం ఇద్దామనుకుంటున్నాం" చెప్పాడు
ఆ ముసలాయన.

ప్రెసిడెంట్ కు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా
"ఎంత ఇవ్వాలనుకుంటున్నారు?" అన్నాడు.

"మా పదహారేళ్ల కొడుకు టైఫాయిడ్తో చనిపోయాడు.
వాడి జ్ఞాపకార్థం ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ" చెప్పింది వృద్ధురాలు.

 "ఎంత?" చాలా క్యాజువల్గా అడిగాడు ముసలాయన,

"బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించాడు ప్రెసిడెంట్, మరియు వివరాలు చెప్పాడు.

ముసలాయన ఆశ్చర్యపోయాడు. ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.

“అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే
ఎంతవుతుంది?' కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ.

ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్.

ఆమె, భర్త వైపు తిరిగి అంది,
 “మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్!"

"సరే" అన్నాడు భర్త.

కొంతకాలానికి కాలిఫోర్నియా నగరంలో  "స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ" స్థాపన జరిగింది.

ఆ దంపతులిద్దరూ "లేలాండ్ స్టాన్ఫోర్డ్",  "జేన్ స్టాన్ఫోర్డ్'..

ఒక్కోసారి మనం ఎదుటివారిని ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది.

ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం.

రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడివున్నది, ఎవరైనా కావొచ్చు. వాళ్లను మీకంటే గొప్పవాళ్లుగా భావించకపోయినా ఫర్లేదు..
కానీ ... తక్కువ వాళ్లని మాత్రం అనుకోవద్దు.

ఎందుకంటే, పూర్వం మన పాత కథల్లో కూడా దేవుడో, మహారాజులో మారువేషాల్లో వచ్చేవారు.

 *దేవుళ్ళలో*
*మనుషుల్ని చూసుకునే అవసరం మనకు లేకపోయినా*,

*మనుషుల్లో దైవత్వం చూసే అవకాశం దేవుడు ఎప్పుడూ మనకు కల్పిస్తూనే ఉంటాడు*.

*సాయం చేసే వాడే దేవుడు,

సాయం అందించే చోటే దేవాలయం*.
Author of post unknown

తెలుగు బ్రాహ్మణులు

తెలుగు బ్రాహ్మ బ్రాహ్మణులు ణులుతెలుగు బ్రాహ్మణులు
సేకరణము: మల్లంపల్లి వెంకట వటుక శివ ప్రసాద్
డిప్యూటీ జనరల్ మేనేజర్  ( ఎలక్ట్రానిక్స్ అండ్ తెలీకమ్యూనికేషన్ )
  ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-రాజమహేంద్రవరం
వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న బ్రాహ్మణులలో తెలుగు బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కల్హణుని 'రాజతరంగిణి'లో పేర్కొన్న 'పంచ ద్రావిడుల'లో తెలుగువారు ఒకరు. ఒక జాతి సంఖ్యాపరంగా విస్తృతం అవుతున్నప్పుడు, వారు భాషలవారీగా, ప్రాంతాలవారీగా, పాటించే విధానాలు, ఆచారవ్యవహారాల ఆధారంగా పలు తెగలుగా విడిపోవడం సహజం. సాంఘికంగా ఇలా వచ్చే అనేక మార్పులలో భాగంగానే, తెలుగు మాట్లాడే ప్రాంతాలలోని బ్రాహ్మణులు 'తెలుగు బ్రాహ్మణులు'గా పరిగణనలో ఉండటం సహజం. వీరుకూడా, కాలానుగతంగా వచ్చే మార్పుచేర్పులకు లోనవుతూ, అనేక విధాలైన పరిణామాలకు గురి అవుతుంటారన్నది గుర్తించాలి.
1891లో ప్రచురితమైన ఒక గ్రంధం ప్రకారం, తెలుగు బ్రాహ్మణులలో స్మార్తులు అత్యధికులు. మధ్వులు ఉన్నప్పటికీ వారి సంఖ్య పరిమితం. మధ్వులలోనూ కన్నడ ప్రాంతాలనుంచి వచ్చి, తెలుగు ప్రాంతాలలో స్థిరపడినవారే అధికం.  ఆ పుస్తకం ప్రకారం, తెలుగు స్మార్త బ్రాహ్మణులలో కానవస్తున్న తెగలు అనేకం ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానమైన తెగలు ఇవి:
1. తెలగాణ్యులు:  నైజామ్ ప్రాంతంలో, నాటి నిజామ్ దురంతాలను భరించలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు. వీరు ముఖ్యంగా నేటి కరీమ్నగర్ జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరం, చెన్నూరు ప్రాంతాలకు చెందినవారు.
2. మురికినాడు: ఇది చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రాంతమని 'కాకతీయ సంచిక'లోని 168వ సేజీ పక్కనగల చిత్రపటం ద్వారా తెలుస్తోంది. ఈ మురికినాడులోని కొంత ప్రాంతాన్నే 'తొండపినాడు', 'తొండపి మండలం' అనికూడా అనేవారు. ('ముల్క్' అంటే 'దేశం' అని అర్థం. నైజామ్ ప్రాంతానికి ఒకప్పుడు 'ముల్క్' అనే పేరుండేది. ఇది 'ముల్కి నాడు' శబ్దం అపభ్రంశం అయి, 'మురికినాడు' అయిందన్న భావన తప్పుగా తోస్తోంది.)
3. వెలనాడు : వీరిలోనూ 3 తెగలు. అవి:  1. శుద్ధ వెలనాడు; 2. కాకిమాని వెలనాడు;3. పెరుంబటి వెలనాడు.
(వీరినే 'వెలినాటి బ్రాహ్మణులు' అంటారనీ తెలుస్తోంది. వీరిలోని 3 శాఖలనూ 1. శుద్ధ వెలినాడు, 2. పేరుంబేడి వెలినాడు, 3. వెలినాడు బ్రాహ్మణులుగా పేర్కొంటున్నారు. మొత్తంమీద వీరందర్నీ 'వెల్నాటి బ్రాహ్మణులు' అనడమూ ఉంది.)
4. కాసలనాడు : ఒకప్పటి 'కోసల దేశం' నేటి 'మధ్యప్రదేశ్' అనుకోవచ్చు. అప్పటి దక్షిణ కోసల దేశం అయిన జబల్పూర్, రేవా, బిలాస్పూర్, సాగర్, సాత్నా వంటి ప్రాంతాలనుంచి కొన్ని మతపరమైన కారణాల వల్ల మన ప్రాంతాలకు వలస వచ్చినవారు వీరు. వీరినే 'కోసలనాటి బ్రాహ్మణులు' అనేవారు.
5. కరణ కమ్మలు:   1. బాల కరణాటి బ్రాహ్మణులు, 2. కొలింగేటి బ్రాహ్మణులు,     3. ఓగేటి బ్రాహ్మణులు. (వీరిలోనూ 1. బగల్నాటి కరణ కమ్మలు, 2. కొవిజేటి కరణ కమ్మలు. 3. ఓగోటి కరణ కమ్మలు అని 3 శాఖలున్నట్లు కూడా ఉంది. ఇవి పౖౖెన పేర్కొన్న 3 శాఖల పేర్లే అనిపిస్తోంది.)
6. వేగినాడు
7. తొండ్రనాడు: ఇది బహుశా నేటి తిరుపతి ప్రాంతం కావచ్చు. తిరుమాండ్యం శాసనం, కపిలేశ్వర శాసనాల ఆధారంగా నేటి తిరుపతి ప్రాంతానికి ఒకప్పుడు 'తుండీర మండలం', 'తుండక విషయం', 'తుండైనాడు', 'తొండమనాడు' అనే పేర్లుండేవని తెలుస్తోంది. ఈ పేర్లలోంచే 'తొండ్రనాడు' కూడా రూపొంది ఉండవచ్చు.
8. ఔదమనాడు
9. కోనసముద్ర ద్రావిడులు
10. ఆరామ ద్రావిడులు
1891లో ప్రచురితమైన ఆ పుస్తకం ప్రకారం పైన పేర్కొన్న పది తెగలవారూ 'వైదికులు'. వీరిలో కోనసీమ ద్రావిడులు, ఆరామ ద్రావిడులూ మొదట తమిళనాడు ప్రాంతానికి చెందినవారైనా, తెలుగునాడుకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. క్రమంగా వీరి భాష, కట్టూబొట్టూ అన్నీ పూర్తిగా తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా మారిపోయాయి. ఈ రెండు తెగలవారికీ తెలుగు బ్రాహ్మణులలో విశిష్టస్థానాలు  ఉన్నాయి. తమిళ ప్రాంతంనుంచి వచ్చి, తెలుగు ప్రాంతంలో స్థిరపడిన కారణంగా, వీరిని కొన్నిచోట్ల 'సంకీర్ణులు' అని వ్యవహరించటంకూడా ఉంది.
ఆరామ ద్రావిడుల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం: ఆరామ ద్రావిడులనే కొందరు 'తూర్పు ద్రావిడులు', 'కోస్తా ద్రావిడులు', 'కోనసీమ ద్రావిడులు', 'పేరూరు ద్రావిడులు' అనడమూ   ఉంది. ప్రాథమికంగా ఇవన్నీ వారు స్థిరపడిన ప్రాంతాలకు సంబంధించిన పేర్లేనన్నది స్పష్టం. తూర్పు ద్రావిడులు ప్రధానంగా మన కోస్తాకు ఆవల ఉన్న ఉత్కళ ప్రాంతం, తూర్పు ఆంధ్రదేశంలోని వారు. కోస్తా ద్రావిడులు కోస్తా జిల్లాలలో స్థిరపడినవారు. ఇక, కోనసీమ ద్రావిడులు మన కోనసీమలో స్థిరపడినవారు. ఈ ఆరామ ద్రావిడులలో పేరూరు ద్రావిడులనే వారూ  ఉన్నారు.
ఆరామ ద్రావిడులు ఆంధ్రదేశానికి రావటం వెనుక కొన్ని కథలు ఉన్నాయి. జనజీవనచరిత్ర అంతా పలు సందర్భాలలో జరిగిన, జరుగుతున్న వలసల వివరమేనన్నది వాస్తవం. ఆరామ ద్రావిడుల కథా అంతే! ఒక కథనం ప్రకారం - చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అయిన అమ్మంగి దేవిని రాజమహేంద్రవర పాలకుడైన రాజరాజ నరేంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో, ఆయన తన కుమార్తెతోబాటుగా, 18 కుటుంబాల బ్రాహ్మణులను వేంగి రాజ్యానికి పంపాడు. ఈ 18 కుటుంబాలవారూ అసలు  నాటి చాళుక్యదేశం (దాదాపు నేటి తమిళనాడు) లోని 'వేలంగమన్' అనే గ్రామానికి చెందినవారు. (ఇప్పుడు ఈ గ్రామం 'వలంగైమన్' పేరుతో తిరువరూర్ జిల్లాలో ఉంది.) రాజాజ్ఞ తలదాల్చి, వీరిలో కొందరు 'అగ్నిహోత్రం' ధరించి, కాలినడకన వేంగి రాజ్యానికి రాగి, మరికొందరు నావలమీద వచ్చారు. నావలమీద వచ్చినవారు సముద్రతీరంలోని 'కొనసీమ' లేదా 'కోనసీమ'కు చేరారు. వారే 'కోనసీమ ద్రావిడులు' అయ్యారు. ఇక, భూమార్గాన వచ్చినవారికి రాజరాజనరేంద్రుడు, ర్యాలి సమీపాన స్థలం ఇచ్చి నివాసం ఉండమన్నాడు. వారంతా అరవ ప్రాంతంనుంచి వచ్చిస్థిరపడిన కారణంగా, అక్కడ (ర్యాలిలో) ఉన్న గుట్టలను స్థానికులు 'అరవ దిబ్బలు'గా వ్యవహరించేవారని అంటారు. నేటికీ ర్యాలిలో అరవ దిబ్బలు ఉన్నాయి.
అరవదేశంనుంచి ఇక్కడ స్థిరపడినవారిలో -  నన్నయభట్టారకుడి శిష్యుడు నారాయణ భట్టు ముఖ్యుడు. 'శ్రీమదాంధ్ర మహాభారతం' ఆంధ్రీకరణంలో నన్నయభట్టుకు నారాయణ భట్టు చేసిన సహాయానికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నందంపూడి అగ్రహారాన్ని కానుకగా ఇచ్చారన్న కథా ఉంది.
ఇక, చోళదేశంనుంచి వచ్చిన మరికొందరు, పలిమెలపాడు పాలకుడి అనుమతితో పేరూరులో స్థిరపడ్డారని అంటారు, వీరు అసలు తమిళనాడులోని 'పెరియ ఊర్' (పెద్ద ఊరు) నుంచి వచ్చారని, కనుక, తాము స్థిరపడిన ఊరికి అలాగే, 'పేరూరు' అని పేరు పెట్టుకున్నారని అంటారు. ఇక్కడి ద్రావిడులు 'పేరూరు ద్రావిడులు'గా సుప్రసిద్ధులయ్యారు. వీరికి 'ఆరామ ద్రావిడులు' అన్న పేరు రావడానికి మరో కారణాన్ని శ్రీ చందూరి వేంకట సుబ్రహ్మణ్యం గారు తమ 'వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు' పుస్తకం (పేజీ 82)లో వివరించారు. మన రాష్ట్రంలో ఉన్న  పంచారామాలు- ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం, అమరారామం, కుమారారామం- లలో ముందుగా స్థిరపడిన ద్రావిడులు గనుక వీరిని 'ఆరామ ద్రావిడులు' అంటారని ఆ పుస్తకంలో ఉంది.
11. తుంబల వారు
12. ప్రథమ శాఖీయులు
13. నియోగులు-
1. ఆరువేల నియోగులు;  2. కమ్మెల బ్రాహ్మణులు;  3. ప్రాజ్ఞాడు బ్రాహ్మణులు;    4. నందవరీక బ్రాహ్మణులు
5. పెసలవాయిల బ్రాహ్మణులు;  6. తుమ్మనాడు లేదా కమ్మనాడు బ్రాహ్మణులు; 7. లింగధారులు;
8. ప్రథమశాఖ నియోగులు
ఇక్క డ మనం కొన్ని ముఖ్య విశేషాలు గమనించాల్సి ఉంది. పైన పేర్కొన్న తెగలలో కొన్ని ప్రాంతాలపరంగా ఉండటం స్పష్టం. వీటిలో కొన్ని ఇప్పుడు కనపడటం లేదనిపిస్తోంది. (బాల కర్నాటి, కొలింగేటి, ఓగేటి, తొండ్రనాడు, ఔదమనాడు వంటి కొన్ని నియోగ బ్రాహ్మణ శాఖలు ఎక్కడైనా  ఉన్నాయోమో కానీ, ఈ సంకలనకర్త దృష్టికి రాలేదు.)
ఆరువేల నియోగులు;
ఆరువేల నియోగి బ్రాహ్మణుల గురించి ఒక కధ ప్రచారములో ఉన్నది. కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవ చక్రవర్తి పరిపాలిస్తున్న సమయములో, తెలుగు సామ్రాజ్యము ఉత్తరాన్న ప్రస్తుత చంద్రాపూర్ (మహారాష్ట్ర) మరియు దక్షిణాన్న కాంచీపురం వరకు విస్తరించింది. పశ్చిమాన్న రాయచూరు(కర్ణాటకము) తూరుపున సింహాచలం వరకు సరిహద్దులు కలిగియున్నది. ఈ విశాల సామ్రాజ్య పరిపాలనకొరకు గణపతిదేవా చక్రవర్తికి సమస్యగా ఉన్నది. ఇదే సమయములో నెల్లూరు సీమను మనుమ సిద్ధి పరిపాలించుచుండగా ఆయన మంత్రి కవిత్రయములో ఒక్కడైనా తిక్కన్న సోమయాజి. పాండ్య రాజు మనుమసిద్ధి రాజ్యము కబళించగా మనుమసిద్ధి రాజ్య ప్రాప్తి కోసము కాకతీయ చక్రవర్తి గణపతిదేవ సహాయము కోరుతాడు. అప్పుడు కాకతీయ ప్రభవు ఒక నిబంధన పైన సహాయము చేయగలను అనితెలుపుతాడు. అది ఏమిటంటే పాండ్య రాజు చెరనుంచి నెల్లూరు సీమ విమోచన తరువాత తిక్కన్న ఓరుగల్లుకు విచ్చేసి కాకతీయ సామ్రాజ్యానికి సమర్ధవంతమైన పరిపాలన వ్యవస్థ ఏర్పరచాలి.  దానికి మనుమసిద్ధి ఒప్పుకొని తిక్కన్న సోమయాజి సేవలను కాకతీయ సామ్రాజ్యానికి అందించాడు. తిక్కన్న ఏకశిలానగరము విచ్చేసి ఆరువేల మంది బ్రాహ్మణులను గ్రామపరిపాలన వ్యవస్థలో తర్ఫీదు ఇచ్చి నియామకం చేసాడు. వారే ఆంధ్ర ప్రాంతములో కరణము, మునుసబు, తెలంగాణములో పటేల్ మరియు పట్వారి లు. రాజకీయ కారణాలతో తెలుగుదేశము పార్టీ రాజ్యాధికారానికి రాగానే గడచినా ఏడువందల సంవత్సరాల వ్యవస్థను రద్దుచేసినది. ఈ వ్యవస్థ రాజులూ, నవాబులు, ఈస్ట్ ఇండియా కంపెనీ,బ్రిటిష్ రాజరికం సమర్ధముగా వినియోగించుకున్నాయి.  ఆరువేల మంది నియోగించబడ్డారు కాబట్టి ఆ ఆరువేలమంది వారి సంతతిని ఆరువేల నియోగులు అని వ్యవహరించ సాగారు. ఈ మహత్కార్యము కోసము తిక్కన్న సోమయాజి సుమారు పన్నెండు  సంవత్సరములు  కాకతీయ రాజధాని ఓరుగల్లు నివాసిగా ఉండడము ఏకశిలానగరము భాగ్యము.
నందవరీకులు
    నందవరీకుల గురించిన ఈ దిగువన వివరిస్తున్న చరిత్ర శ్రీ గోపానందనాథులు 1996లో రాసిన 'శ్రీ దేవీ మాహాత్మ్యము- శ్రీ చౌడేశ్వరీ చరిత్రము' అనే పుస్తకంలో ఉంది.  సోమ వంశంలో పాండురాజు సంతతికి చెందిన నందరాజు అప్పటి కర్నాటక దేశంలోని నందవరం రాజధానిగా పరిపాలన చేసేవాడు. ఈ నందరాజు జనమేజయునికి తొమ్మిదో తరానికి చెందిన ఉత్తుంగభుజుని కుమారుడు. ఈయన చాణక్య-మౌర్యుల చరిత్రలోని నవనందులలోనివాడు కాడు. నందరాజు గొప్పశివభక్తుడు. ఈయన శివభక్తికి మెచ్చి, ఒక సిద్ధుడు ఒక దివ్యపాదుకల జతను ప్రసాదిస్తాడు. తను ఇచ్చిన దివ్యపాదుకల విషయం ఎవ్వరికీ చెప్పవద్దనే ఆంక్ష కూడా విధిస్తాడు. ఈ దివ్యపాదుకల ప్రభావంతో నందరాజు ప్రతీ నిత్యమూ వేకువజామున లేచి, కాశీనగరం చేరుకుని గంగాస్నానానంతరం విశ్వేశ్వరుని, విశాలాక్షిని దర్శించుకుని, తిరిగి తెల్లవారే లోగా తన రాజధానికి చేరుకునేవాడు. ఇలా కొంతకాలం జరిగాక, తన భర్త తెల్లవరే సమయంలో అదృశ్యం కావడాన్ని గుర్తించిన రాణి, తన భర్తను ఆ విషయమై నిలదీస్తుంది. తప్పనిసరై, నందరాజు తనకు సిద్ధుడు ఇచ్చిన పాదుకలగురించి వివరిస్తాడు. అది ఒక గొప్పవింతగా భావిస్తూ, తననూ కాశీకి తీసుకువెళ్లమని కోరుతుంది. నందరాజు ఆమెను అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత, రాణికి రజోదర్శనం అవుతుంది. ఆ అశుచి ఫలితంగా దివ్యపాదుకలను ఉపయోగించుకోలేక, రాజధానికి తిరిగి చేరలేని పరిస్థితి ఏర్పడి, వారిద్దరూ కాశీలో చ్కిడిపోతారు.
ఈ దశలో వారు అక్కడున్న కొందరు విప్రులను చూస్తారు. వారి తేజస్సును చూసి, వారికి నమస్కరించి, తమకు సంప్రాప్తించిన విపత్తును వివరించి, సహాయం చేయవలసిందిగా కోరతారు. తపస్సంపన్నులయిన ఆ బ్రాహ్మణులు తమ దివ్యదృష్టితో భవిష్యత్తును చూసినవారై, త్వరలోనే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుందని గ్రహించి, ఆ సమయంలో తమను నందరాజు ఆదుకోగలడని ఆశిస్తూ, ఆయననుంచి తగిన వాగ్దానం పొందుతారు.
వారు చేస్తామన్న సహాయానికి ప్రతిగా, తన రాజ్యంలోని నందవర అగ్రహారాన్ని వారికి దానం ఇచ్చేందుకు అంగీకరిస్తూ, విళంబినామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య సూర్యోదయ సమయంలో కాశీలోని గంగాతీర మణికర్ణికా ఘట్టంలో, శ్రీవిశ్వేశ్వర మహాదేవునికి సమర్పణంగా, శ్రీ చాముండాదేవి సాక్షిగా ఆ విప్రులకు దానం చేశాడు. (ఇది నేటి క్రీ.శ. 2013కు 4135 సంవత్సరాల క్రితం, అంటే యుధిష్టిర శకంలోని 980కి సమానం.) ఆ తర్వాత, ఆయనకు సహాయం చేయడానికి సిద్ధపడిన విప్రులు, వేదోక్తవిధిని రాణిని శుచిని చేసి, రాజును, రాణిని క్షేమంగా నందరాజ్యానికి చేర్చుతారు.
    ఆ తర్వాత, ఆ విప్రులు గుర్తించినట్లే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుంది. తాము అక్కడ ఉండలేక, మొత్తం 500 ఇళ్లవారు నందరాజు తమకు ఇచ్చిన దానాన్ని గుర్తు చేసుకుని, నందరాజ్యానికి వస్తారు. నందరాజ్యం చేరిన వారికి రాజదర్శనం వెంటనే లభించక, కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో తమ నిత్యకర్మానుష్టానాలను  రాజభవనంముందే పూర్తి చేసి, తీర్థజలాన్ని అక్కడే ఉన్న ఒక ఎండు రావి చెట్టుమీద చల్లుతారు. ఆ విధంగా మూడు రోజులు గడిచేసరికి, ఆ ఎండు చెట్టు చిగురిస్తుంది. ఇది కేవలం ఆ విప్రుల తపోబలప్రభావమేనని భావించిన రాజసైనికులు వెంటనే
ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తారు. ఆయన రాజభవనం ముందుకు వచ్చి, ఆ విప్రులను సభకు ఆహ్వానిస్తాడు. సభలో, విప్రులు రాజుకు ఆయన తమకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుకు తెస్తారు. నందరాజుకు ఆ విషయం జ్ఞప్తికి వచ్చినా, తాను దివ్యపాదుకలను పొందిన సంగతినిగానీ, తాను ప్రతినిత్యం కాశీకి వెళ్లిన సంగతినిగానీ ప్రజలు విశ్వసించరేమోనన్న భీతితో, తాను అసలు కాశీకి వెళ్లనే లేదని బొంకుతాడు. అప్పుడు ఆ విప్రులు నందరాజు, కాశీలో విశాలాక్షి సాక్షిగా తమకు వాగ్దానం చేశాడని సభలో వివరిస్తారు. అయితే, సభలోని పురజనులు సైతం రాజుకే వత్తాసు పలుకుతూ, తమ రాజు అసలు కాశీకి వెళ్లనే లేదనీ, ఒకవేళ విప్రులు చెప్పేది నిజమే అయిన పక్షంలో విశాలాక్షిచేత తనముందు సాక్ష్యం చెప్పించాలని గేలి చేస్తూ విప్రులను నిండుసభలో అవమానపరుస్తారు. జగన్మాతముందు చేసిన వాగ్దానాన్ని కాదనటమేగాక ఆవిధంగా నిండుసభలో తమను అవమానపరచటంతో వారు ఎంతగానో నొచ్చుకుని, కాశీలోని విశాలాక్షి మాత చేతనే సాక్ష్యం చెప్పించటం భావ్యంగా ఉంటుందని భావించి, తమలో నలుగురు పెద్దలను ఎంచుకుని, వారిని విశాలాక్షి దగ్గరకు పంపుతారు. అలా కాశీకి వెళ్లిన నలుగురు పెద్దలు:
    1. బ్రహ్మశ్రీ అవధానం పెద్దిభట్టు (శ్రీవత్సస గోత్రం)
    2. బ్రహ్మశ్రీ తర్కశాస్త్రం మాధవభట్టు (వశిష్టస గోత్రం)
    3. బ్రహ్మశ్రీ పురాణం శ్రీధరభట్టు (భారద్వాజస గోత్రం)
    4. బ్రహ్మశ్రీ వార్తికం కమలనాభ పండితుడు (హరితస గోత్రం)
 నలుగురు ప్రముఖులు కాశీకి వెళ్లి, అక్కడ జపతపహోమాలను శాస్రోక్తంగా చేసి, జగన్మాతను పూజించి, ఆమెను ప్రసన్నం చేసుకుంటారు. వారి భక్తికి మెచ్చి, ఆమె వారిముందు ప్రత్యక్షం కాగానే, జరిగిన విషయం ఆ తల్లికి వివరించి, తమతో వచ్చి, సభలో సాక్ష్యం చెప్పవలసిందిగా కోరతారు. వారు కోరినట్లే తాను నందరాజు వద్దకు వచ్చి, సాక్ష్యం చెప్తాననీ, అయితే, మార్గంలో ముందు వెళ్లే విప్రులు ఎవ్వరూ జ్యోతి రూపంలో వచ్చే తనను వెనుదిరిగి చూడరాదని స్పష్టం చేస్తుంది. ఆ ప్రకారమే, నందరాజ్యం పొలిమేర వరకూ వచ్చిన విప్రులు, అక్కడ వెనుదిరిగి చూస్తారు. ఫలితంగా ఆ జగన్మాత జ్యోతి రూపంలో అక్కడ నిలిచిపోతుంది. ఈ వృత్తాంతం అంతా విప్రులు వచ్చి, నందరాజుకు విన్నవిస్తారు. ఆయన తన సతీమణి, బంధుమిత్ర పురజనపరివారసహితంగా వచ్చి, అందరిముందూ జరిగినదంతా తెలియజేసి, మహానుభావులైన విప్రుల పట్ల తను చేసిన తప్పును క్షమించమని జగన్మాతను  ప్రార్థిస్తాడు. పశ్చాత్తాపం చెందుతున్న రాజును జగన్మాత క్షమించి, విప్రులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని ఆనతి ఇస్తుంది. ఆ ప్రకారమే, నందరాజు వెంటనే ఆ విప్రులకు నందవరాది అగ్రహారాలను దానం చేసి, తగిన వృత్తులను కలగజేస్తాడు. కాశీనుంచి విచ్చేసిన జగన్మాతను అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకోవలసిందిగా నందరాజు ప్రార్థిస్తాడు. తాను చౌడేశ్వరీ నామంతో అక్కడ వెలసి, విప్రులను, ఇతర చరాచరసృష్టినీ కాపాడతానని తల్లి అభయప్రదానం చేసి, అక్కడ జ్యోతిరూపంలో వెలుస్తుంది. నాటినుంచీ అక్కడి బ్రాహ్మణులు అందరూ 'నందవరీకులు'గా పేరొంది, నిత్యం వేదశాస్త్ర అభ్యాసంతోబాటు, అగ్నిష్టోమ్యాది యజ్ఞకర్మలను ఆచరిస్తూ,, తమ ఇళ్లలోని అన్ని శుభకార్యాలలోనూ చౌడేశ్వరీమాతను 'జ్యోతి' రూపంలో కొలుస్తూ, ఆ జగన్మాతను ఆరాధిస్తూ, తల్లి కరుణతో జగద్విఖ్యాతిని పొందుతున్నారు - అని ప్రచారంలో ఉన్న గాథ.   శ్రీ చౌడేశ్వరీమాత ఆవిర్భావ చరిత్ర, చరిత్రరచనకు ముందునాటి భవిష్యత్పురాణం, భాగవతంలోని ద్వాదశ స్కంధములో ఉన్నట్లూ, ఆధునిక కాలంలో విన్నకోట సీమ, కొండవీడు, కొండపల్లిల దండకవిలెలలోనూ నమోదు అయిఉన్నట్లు శ్రీ గుంటుపల్లి సోమయ్య వివరించారు. వీరు 1914 ప్రాంతంలో 'ప్రబంధ కల్పవల్లి' అనే మాసపత్రికకు సంపాదకులుగానూ ఉండేవారు. చారిత్రక ఆధారాలనుబట్టి, శ్రీ చౌడేశ్వరీమాత అవతారం జరిగి, క్రీ.శ. 2013 నాటికి సుమారు 4134 సంవత్సరాలయిందని శ్రీ గోపానంద నాథులు రచించిన 'శ్రీ నందవర చౌడేశ్వరీ చరిత్ర' అనే పుస్తకం పేర్కొంటోంది.
   సీ. జన్మదేశంబశేష బ్రహ్మవిద్యల కాశ్వలాయన శాఖకాశ్రమంబు
     సంకేత భవనంబు సకల శాస్త్రములకు ప్రథమాగమములకు పట్టుకొమ్మ,
     ఉపనిషత్తులకు నిత్యోత్సవస్థానంబు, యామళంబులకు సింహాసనంబు,
     ఆలయంబఖిల కావ్యాదికంబులకు గంధర్వలోకంబు గాంధర్వమునకు,
     కాశికాక్షేత్ర కళ్యాణ కటకనగర విప్ర పంచశతీ వృత్తి విస్తృతంబు,
     గుణపవిత్ర త్రయోదశ గోత్రయుతము నందభూవరదత్తంబు నందపురము.
సీ.శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస విశ్వామిత్ర, శ్రీ యగస్త్య,
    కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ ఋషిగోత్ర మౌద్గల్య, వీత
    హవ్య, భరద్వాజ హరితస ముఖ్య త్రయోదశ గోత్రులౌ భూదివిజుల
    నాశ్వలాయన సూత్రులౌ విప్రవర్యుల సకత వేద శాస్త్ర పురాణవిదుల
     చముండ మాంబా ప్రసాద ప్రశస్త ఘనుల
    పూజ్యుల గణించి తనదు సామ్రాజ్యగరిమ
    నగ్రహార క్షితిని వృత్తులారునేడు
    భూవరు డొసగె యానంద లీల.
  పైన చెప్పిన విధంగా నందవరీకులు ప్రధానంగా కాశీనుంచి ఇక్కడికి వచ్చినవారుగా అర్థమవుతోంది. అయితే, పైనగల మొదటి సీస పద్యం ఆరో పాదంలో 'కాశికాక్షేత్ర కల్యాణ కటకనగర...' అన్న పదాల ఆధారంగా వీరు కల్యాణ్ (నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది), కటకనగరం (నేటి ఒడిషా రాష్ట్రంలో ఉంది) వంటి ప్రాంతాలనుంచి కాశీకి చేరి ఉంటారనే భావనా ఉంది.
అలాగే, రెండో సీస పద్యంలో పేర్కొన్న విధంగా వీరిలో   'శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస, విశ్వామిత్ర, శ్రీ యగస్త్య, కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ, (ఋషిగోత్ర) మౌద్గల్య, వీతహవ్య, భరద్వాజ హరితస' అనే 13 గోత్రాలు ఉండేవనేదీ స్పష్టం. వీరు ఋక్శాఖ, ఆశ్వలాయన సూత్రులైన కరణకర్మ శాఖీయులు. అలాగే, మిగిలిన అందరు బ్రాహ్మణులకు మల్లేనే నందవరీకులు సైతం మొదట పూర్తిగా వైదికులేకాగా, తర్వాత కాలంలో వారిలోనూ వైదికి, నియోగి విభేదాలు ఏర్పడ్డాయి.
 నందవరీకులలో విశిష్టమైన ఖ్యాతి గడించిన ప్రముఖులు అనేకంగా ఉన్నారు. చాణక్యుడు, మహామంత్రి తిమ్మరుసు, విద్యానాథుడు, తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వేంగమాంబ, నన్నయ భట్టారకుడు, సంకుసాల నృసింహ కవి, రాయన భాస్కర మంత్రి వంటి ప్రముఖులు అందరూ నందవరీకులే.
లింగధారులు
లింగధారణ అనేది శివారాధనకు చెందిన విశ్వాసచిహ్నం అన్నది స్పష్టం.
వీరశైవులకు వృషుడు, నంది, భృంగి (భృంగిరిటి), వీరుడు, స్కందుడు అనే అయిదుగురే గోత్రకర్తలు, పంచాచార్యులు. వీరికే యుగభేదాలనుబట్టి వేర్వేరు పేర్లు సమకూడాయి. అలా వచ్చిన పేర్లు (పైన చెప్పిన వరుస క్రమంలోనే): రేవణసిద్ధ, మరుళసిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, విశ్వారాధ్య అనేవి. ఈ ఆరాధ్య మతధర్మాలను స్వీకరించినవారు మిగిలిన బ్రాహ్మణులనుంచి తాము భిన్నమని చెప్పుకోవడానికి 'ఆరాధ్య' పదస్వీకారం చేసి, 'ఆరాధ్యబ్రాహ్మణులు' అయ్యారని తెలుస్తోంది.
        'ఆరాధ్య బ్రాహ్మణులు లింగధారణాది వీరశైవ ధర్మములను స్వీకరించినను లింగముతోబాటు యజ్ఞోపవీతమును ధరించి యుపనయన సంస్కారములు గ్రహింతురు. లింగధారులుగాని బ్రాహ్మణులు చెప్పికొను ఋషిగోత్ర సూత్రములనే వీరును జెప్పుకొందురు. వీరిలో నిప్పటికినిట్టి గోత్రసూత్రవ్యవహారమే జరుగుచున్నది.' అంటారు శ్రీ బండారు తమ్మయ్యగారు. (పాలకురికి సోమనాథ కవి, వ్యాసం, కాకతీయ సంచిక, 1991, పే. 214)
ప్రథమ శాఖీయులు
 ప్రథమ శాఖీయులు అటు వైదీకులలోనూ, ఇటు నియోగులలోనూ ఉండటం గమనార్హం. ప్రథమ శాఖీయులగురించి తెలుసుకోవాల్సిన విశేషాలు అనేకం  ఉన్నాయి. ముందుగా వీరికి 'ప్రథమ శాఖ' అన్న పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం:
  వైశంపాయనుడి వద్ద వేదాభ్యాసం చేస్తున్న యాజ్ఞవల్క్యుడు, వైశంపాయనుని ఆగ్రహానికి గురై, తను అంతవరకూ నేర్చుకున్న వేదాలను కక్కివేయాల్సివస్తుంది. అప్పుడు, తీవ్రమైన నిరాశకు గురయిన యాజ్ఞవల్క్యుడు వేదాభ్యాసం కోసం సూర్యుడిని ప్రార్థిస్తాడు. సూర్యుడు ఒక గుర్రం రూపంలో ప్రత్యక్షమయి, యాజ్ఞవల్క్యునికి యజుర్వేదం  నేర్పుతాడు. ఆయన నేర్పినవే 15 శాఖలు. యజుర్వేదంలోని ఆ మొదటి 15 శాఖలను 'శుక్ల యజుర్వేదం' అంటారు. వాటిని యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వుడు, మధ్యందినుడు, కాత్యాయనుడు, వాజసనేయుడు-లకు నేర్పాడని భాగవతంలో ఉంది.
అయితే, సూర్యుడినుంచి వేదం నేర్చుకోవటం పాపమనీ, అధమమనీ వైశంపాయనుడు శపిస్తాడు. దానికి యాజ్ఞవల్క్యుడు, బాధపడి, తన గురువైన వైశంపాయనుడిని క్షమాపణ కోరతాడు. అప్పుడు  సూర్యుడి వినతి మేరకు శాంతించిన వైశంపాయనుడు, తన శాపం తప్పదనీ, అయితే దానికి కొంత మినహాయింపు ఇవ్వగలననీ చెప్తూ, శుక్ల యజుర్వేదం నేర్చుకునేవారు ప్రతీదినం ఒక ముహూర్తకాలంపాటు (అంటే, 48 నిమిషాలపాటు) అధములుగా ఉంటారని  చెప్పాడని వరాహ పురాణం పేర్కొంటోంది. ఈ శుక్ల యజుర్వేద (యజుర్వేదంలోని తొలి 15) శాఖలను అనుసరించేవారిని 'ప్రథమ శాఖీయులు' అంటారు. వీరినే 'వాజసనేయులు', 'కాత్యాయనులు' లేదా 'శుక్ల యజుస్'లనీ అనడమూ ఉంది. యాజ్ఞవల్క్యుని వద్ద వేదం నేర్చుకున్న కాత్యాయనుడు, వేదానికి సూత్రాలను రాశాడు కనుకనే, ఈ సూత్రాలను పాటించే వీరికి 'కాత్యాయనులు' అని పేరు వచ్చింది.   స్కంద పురాణం, 17, 18 అధ్యాయాలలో శుక్ల యజుర్వేదం గురించిన ప్రసక్తి ఉన్నా, ఈ శాపం గురించిన ప్రస్తావన లేదు.   యాజ్ఞవల్క్యుడు, సూర్యుని వద్ద నేర్చుకున్న యజుర్వేద శాఖలను ఏమాత్రం ఎవ్వరూ మార్చలేదు గనుక, ఇవి 'శుద్ధ'మైనవి గనుక, ఇవి  'శుక్ల యజుర్వేదం'గా పేరు పొందాయనీ అంటారు.

Wednesday, June 10, 2020

మనుషుల మధ్య. గోడలు కడితే, క్షమ ఒక్కటి చేస్తుంది! సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా..!" అన్నాను. *నెల్సన్ మండేలాu

#నెల్సన్ #మండేలా - #నల్లజాతి #సూర్యుడు

*నెల్సన్ మండేలా డైరీలో ఓ పేజీ *

‘నేను నా అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తులతో మధ్యాహ్నం భోజనానికి ఒక హోటల్కివెళ్లాను. వేయిటర్ వచ్చి మాఆర్డర్ తీసుకువెళ్లిన తర్వాత కాసేపటికి మా భోజనం వచ్చింది. సరదాగా మాట్లాడుకుంటూ,
మేం తినడం ప్రారంభించేముందు నా దృష్టి ఎదురుటేబులలో ఒంటరిగా_కూర్చున్నవ్యక్తి మీద పడింది.
అతని భోజనం ఇంకారాలేదు.
నన్ను అతడు చూడగానే చటుక్కున లేచి బయటకువెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అతని ఖర్మ కాలి భోజనంవచ్చింది. అతను నిస్సహాయంగా కూలబడిపోయాడు.

నేనతణ్ని చూసి, పలకరింపుగా నవ్వి, నాపక్కన కూర్చోమంటూ, కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను.

వెయిటర్ కు సైగ చేయగానే, అతడి భోజనం నా పక్కన పెట్టి వెళ్లాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు.

మా భోజనం త్వరత్వరగా అవుతోంది. కానీ, అతనికి ముద్ద గొంతుదిగడంలేదు. చేతులు వణుకుతున్నాయి.
దిక్కులు చూస్తూ మాటిమాటికీ నీళ్లు తాగుతూ మొహం తుడుచుకుంటున్నాడు. మా అందరి భోజనం అయ్యాక అతను సగం తిండిని కతికినట్టు చేసి వడివడిగా వెళ్లిపోయాడు.

అతనిని గమనించిన నా మిత్రుడు బాగా అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు. అస్సలు తినలేకపోతున్నాడు. వణుకుతున్నాడు..! " అంటూ ఓ జనాంతిక కామెంట్ వదిలాడు.  అప్పుడు నేను "లేదురా..! అతను ఆరోగ్యంగానే ఉన్నాడు.

*నేను జైలుశిక్ష అనుభవిస్తున్నప్పుడు నా సెల్ సెంట్రీ* ఇతను
ప్రతిరోజూ నన్ను విపరీతంగా, అకారణంగా కొడుతూ హింసించేవాడు. హింసవల్ల నొప్పులు, బాధతో అరిచీ అరిచీ
నా గొంతు ఆర్చుకుపోయి దాహంతో నీళ్లమ్మని అడిగితే, హేళనగా నవ్వుతూ నామొహం మీద మూత్రం పోసేవాడు.
మాఅమ్మ పాలకన్నా ఇతని మూత్రాన్నే ఎక్కువ తాగాను.

మా అమ్మ ప్రేమను నేర్పితే, ఇతడు ఓపిక నేర్పాడు.
నన్నిప్పుడు ఈ హోదాలో చూసి భయపడి, వణికిపోతున్నాడు.

నేను తనమీద ప్రతీకారం తీర్చుకుంటానేమో,
ఉద్యోగం పీకిస్తానేమో, జైలులో వేయిస్తానేమో..! అని
ముందే ఊహించి కొని అలా  భయపడుతున్నాడు.

నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు. పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య. గోడలు కడితే, క్షమ ఒక్కటి చేస్తుంది!
సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా..!" అన్నాను.

*నెల్సన్ మండేలా*.

(దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన యధార్ధ సంఘటన.)

Friday, May 29, 2020

మీ జీవితం టీ అయితే..... మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా టీ కప్పులాంటివి...no limit for them. కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని ఆస్వాధించటం నేర్చుకొండి.

చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న
స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో జీతం వస్తోంది . బాగా సెటిల్ అయ్యారు . కానీ జీవితంలో ఏదో మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.

ఇదే విషయం గురించి చర్చించారు...
కానీ ఏదో మిస్‌ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు.....!
మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు.

ఆ మాస్టారూ పేరు గుర్తుకు రాగానే అందరి మోహాల్లో ఒక సంతోషం...! ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారూ అంటే అందరికీ ఎంతో ఇష్టం....
అతనొక స్పూర్తి ! అంతా ఒక అండస్టాండింగ్‌కు వచ్చారు...

ఆ మాస్టారూ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలు దేరారు....!

ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!

ఆయన చెప్పిన పాఠాల మూలంగానే  ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...! పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు,
సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.

ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా...వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!

ఇదంతా విన్న ఆ గురువు
కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.

కొద్ది సేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి  వేడి వేడి టీ ని  ఓ కేటిల్‌లో తీసుకుని వచ్చింది.

ఓ ప్లేట్‌లో రకరకాల కప్పులను
(పింగాణి, స్టీల్‌, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.

వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!

వాళ్లంతా టీ  తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..

‘‘మీరంతా గమనించారా...
టీ మీ ముందుకు రాగానే ,  ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ  తాగారు..ఫలితం...
ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!

అందరూ తాగే టీ
ఒకటేఅయినా... తాగుతూ..
ఇతరుల టీ  కప్పు,
దాని డిజైన్‌ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...
 ఫలితం...తాగే
 "టీ"ని  అస్వాధించడం" మరిచిపోయారు..

అదే సకల సమస్యలకు మూలం....

ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...
వాటి వెంట పరిగెడితే ఇక అంతే...!

మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!

ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో,
ఎంత రిచ్‌గా ఉన్నారో...
ఏ హోదాలో ఉన్నారో,
ఏం కొంటున్నారో
అని పొల్చుకొని...
మధన పడుతూ...
వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ
మీ ఇష్టాఇష్టాలను,
మీ అభిరుచులను
అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...

మీ జీవితం టీ అయితే.....
మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా
టీ కప్పులాంటివి...no limit for them.

కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని  ఆస్వాధించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు. Finally understand difference between being rich and being happy. Dont struggle much, do your interests and try to be happy

 అదే జీవిత సత్యం...

🙏🏼🙏🏻🙏🏻

Thursday, May 28, 2020

- కుప్పిలి పద్మ

రెడ్ బ్యాoగిల్స్:
.........

చుట్టూ కాగితాలు. యెదుట లాప్ టాప్. మరో పక్క లాగేస్తోన్న మల్లె పూలవనం. లోపల అల్లరి పెడుతోన్న పాటలెన్నో.

యేకకాలంలో యెన్నెన్ని భావాలో. మనకి పరిచయం అయిన ఆ తొలి వసంత కాలంలో మనిద్దరం కడియం మల్లెపువ్వుల తోటల్ని చూడటానికి వెళ్లాం. ముదురాకుపచ్చని గుబుర్ల నడుమ చిన్నివి, కొంచెం పెద్దవి, బాగ పెద్దవి మల్లెలు. పందిరి మొగ్గలు. ఆ మొగ్గలని బుట్టల్లోకి చకచక కోయటం చూసి నువ్వెంతగానో ఆ స్కిల్ ని మెచ్చుకున్నావ్.

యెన్నిన్ని కాంబినేషన్స్ తో మాలలు అల్లేవారో కదా! మల్లె దవనం. మల్లె మరువం. మల్లెలు కనకాంబరాలు. మల్లెలు మరువం కనకాంబరాలు… ఆ కలబోత మాలలు యెంత అందంగానో వుండేవి. వాటి పరిమళాలు సుమధురం. వదులు జుట్టుని అల్లుకొంటే యెంచక్కగా పువ్వులు పెట్టుకోవచ్చు కదా అనేవారు ఆ వూరిలో పరిచయం అయిన బామ్మ గారు. తిరిగి ఆమె నవ్వుతూ యిప్పుడు పువ్వులు యెవ్వరూ పెట్టుకోవటం లేదు అనేవారు. ఆమెతో వొక రోజు మల్లెపూల జడ అల్లించుకొంటే బరువే తెలియనివ్వ లేదు ఆ పూలపరిమళం.
పూల జడ అల్లటం వో కళ. వరుస తప్పకుండా అల్లాలి. యెన్ని మల్లెల వరసల తరువాత యే రంగు పువ్వులు పూలజడ సొగసుని మరింత ఎన్హాన్స్ చేస్తాయోననే రంగులచూపు వుండాలి.

ఆ అనేక తీపి సువాసనలు మనలని చుట్టుకొంటుంటే ఆ జడపై పై నుంచి కిందనున్న జడ గంటల వరకు యెన్ని ముద్దులు వస్తాయోనని లెక్క పెడుతూ, మధ్యలో లెక్క తప్పిందని ఆగి, మొదటి నుంచి ముద్దులు పెట్టాలని, తిరిగి లెక్క పెట్టాలని నువ్వు మళ్లీమళ్లీ లెక్క పెట్టే పని చేస్తుంటే, నువ్వు కావాలనే చేస్తున్నావని గుర్తు పట్టి కూడా గుర్తుపట్టనట్టే వున్నాను. ఆ నీ పూల ముద్దులు యేమో కాని నా మెడ పై నుంచి వీపు పైకి జారుతోన్న నీ లేత వెచ్చని వూపిరి పూయించే గిలిగింత కావాలనిపించేది. మళ్లీ మళ్లీ నువ్వు యెన్ని సార్లు యెన్నెన్నో ముద్దులు పెట్టినా ఆ గిలిగింత యిప్పటికి పచ్చని పులకరింతే.

తప్పదు యిక్కడ ఆగాలి. పనుంది. చాల రాయాలి యింకా… పంచుకోవలసినవి చాలున్నాయి.

***

హమ్మయ! సమయం చిక్కపట్టుకొని వచ్చేసాను నీకు రాయాలని.
నీదెంత సునిశితమైన సున్నితమైన మనసు. ఆ ఆఫ్ఫీషియల్ మీటింగ్ మధ్యలో టీ బ్రేక్ లో చిటికేసిన మోహాన్ని నీకు మెసేజెస్ పంపించినప్పుడు పని వొత్తిడిలోనే ఆ మెసేజ్ ని పంపానని నీకు భలే తెలిసిపోయింది. అవును అలాంటప్పుడే ఆ మెసేజ్ ని పంపాను. నువ్వన్నట్టు పనొక్కటే కాదు మనసులో కూడా అనేక ప్రశ్నలున్నాయి.

యిప్పటి వరకు యెర్రని యెండ. యెండ ఛాయే. యెండ చుర్రుమంటుంది. వేసవి వచ్చింది అనుకొన్నానో లేదో చూస్తుండగానే అర్ధరాత్రిలా మిట్ట మధ్యాహ్నం నల్లని మబ్బులు దట్టంగా. అంత తొందరగా కమ్ముకొన్న చీకట్లని చూసి గూడు చేరుకొనే వేళ యింత తొందరగా అయిందేమిటి అనుకున్నాయేమో తేనె పిట్టలు గూళ్ళకి వచ్చేసాయి త్వరత్వరగా.

వడగళ్ళ వాన.

వడగళ్ళు అంటే నాకు స్నో వైట్ కథ గుర్తొస్తుంది. స్నో వైట్ గుర్తొస్తే వడగళ్ళు కురుస్తాయి కళ్ళ ముందు. వొకప్పుడు వడగళ్ళ వాన చాల అరుదుగా కురిసేదట. ఆ వాన వొక మంచి ముచ్చట. ఆ వాన కోసం యెదురు చూసేవాళ్ళం. యిప్పుడు తరచు వడగళ్ళ వానే. అదీ మాములుగా కాదు. పంటంతా ధ్వంసం చేస్తూ. మళ్లీ కాసేపటికి వాన కురిసిన ఆనవాలే లేని యెండ. తిరిగి వాన. పగలు రాత్రి యిదే వరస.

ప్రభాత వేళ విచ్చుకొనే పువ్వులని దాదాపు ప్రతి వుదయం చూస్తాను. అదే మెరుపు. అదే రంగు. అదే సుగంధం. యెన్నెన్నో రంగులని సువాసనలని వెదజల్లే స్థాయికి రావడానికి తను యెన్నెన్ని వడగాలుల్ని మంచు రాత్రులని చూసి వుంటాయో కదా పూల తోటలు. అడ్డదిడ్డంగా పెనవేసుకొంటు సరసరా పాకే తీగలు అనేక రంగుల పువ్వులతో మనలని పలకరిస్తుంటాయి, యెన్నెన్నో అవరోధాల నడుమ. వాటిని చూసినప్పుడు కొందరు మనుష్యులు సాటి మనుష్యుల మీద చిమ్మే చేదుని పెద్దగా పట్టించుకోకుండా యెంతటి వ్యతిరేక పరిస్థితుల్లోనైన స్నేహం ప్రేమలాంటి మానవీయపుష్పాలపై మరింత విశ్వాసాన్ని పెంచుకొంటూ ఆ సుపరిమళాన్ని మనం శ్వాసిస్తూ మన చుట్టూ వున్న వాళ్ళు శ్వాసించేట్టు మన మనసులు విరబూయాలి రుతువు యేదైనా …
---- కుప్పిలి పద్మ.
29.5.2019
Fb Memory.... Thank you.
.........
(తీరిక చేసుకొని చదవండి)

**పిత్రార్జితం**
 
*‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*

వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. అయితే తన ప్రార్థన ఫలించలేదు. భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.

‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్‌.

విజయ్‌ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది. ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.

విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్‌ తీశాడు. తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.

భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. ‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా... ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.

తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.
‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్‌ తల్లితో.

‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.

‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా?

మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్‌.

‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.

‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్‌ విసుగ్గా.

‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్‌ అడిగాడు.

‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.

‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.

‘‘మీ చదువుల కోసం’’.

‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్‌ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.

‘‘కావచ్చు. ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు? మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. కానీ మీకా ఆలోచన లేకపోయింది. మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు.

ఆ అప్పు అలాగే నిలిచిపోయింది.

అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.

‘‘ఇంకా ఎంత కట్టాలట?’’

విజయ్‌ అడిగాడు.

‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్‌.

‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్‌.

పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.

‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.

‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్‌’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్‌. సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.

ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది. ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

*   *   *

ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. ఏడు గంటలు చూపిస్తూంది. ‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.

‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.

తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్‌ అవసరంలేదనీ పాలవాడితో విజయ్‌ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది. ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.

షాపు నుంచి పాలప్యాకెట్‌ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది. ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. ఆమెకు ప్రాణం లేచివచ్చింది.

‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది. కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది. తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.

అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.

సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.

‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్‌. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్‌ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్‌ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్‌ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్‌. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్‌ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.

‘‘అమ్మా, మీ పెన్షన్‌ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.

రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?

ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు. ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. అవన్నీ పిల్లలు గమనించారు కూడా. మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.

వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు.

‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు. దుబారా ఖర్చులు చేసేవారు కారు. రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. వీటిలో చాలా వస్తువులు స్టేటస్‌ సింబల్‌గా మారిపొయ్యాయి. అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు. పైగా ఫ్లాట్ల రేట్లు  పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్‌ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.

*     *     *

వారంరోజులు గడచిపోయాయి. సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. ఫోన్‌ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది.

ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.

‘‘నా పేరు శ్రావణ్‌. బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.

‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.

‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.

‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్‌ మొన్న శాంక్షన్‌ అయింది. ఈనెల పెన్షన్‌ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.

‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్‌ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్‌ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.

*   *   *

సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది. కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది. త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.

సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.

‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.

‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.

సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది. ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.

‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.

*   *   *

ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.

ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్‌.

అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.

తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు.
ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.

ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్‌ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు. కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.

ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. మా నాన్న గెజిటెడ్‌ ఆఫీసరు. లంచాలు బాగా తినేవాడు. ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. మాకు చదువు తలకెక్కేది కాదు. ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి.  నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి పెద్ద వాడిగా అన్ని బాధ్యతలు  తీసుకోమంటారు బంధువులు. అలా తీసుకోవడం నాకు సంతోషమే కానీ
ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు అవుతా ఉన్నాయి.

మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. అందుకే మీ ఇల్లు కొని మా తమ్ముల్లను, మా అమ్మ ను ఇందులో చేర్చితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ. చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్‌ హౌస్‌’. ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. ఆస్తులకంటేరక్తసంబందాలు,ఆప్యాయత లు, మమకారాలే ముఖ్యమని నమ్మేవ్యక్తి ని నేను.   మా నాన్నగారి రుణం కొంత లో కొంత అయినా నెరవేర్చానన్న తృప్తి నాకు మిగులుతుంది " అన్నాడు రామారావు.

*    *   *

రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది.

రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.

వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్‌ ‘గుడ్‌నెస్‌ ఈజ్‌ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ విచ్‌ నెవర్‌ ఫెయిల్స్‌ టు ఎర్న్‌ డివిడెండ్స్‌’ గుర్తొచ్చింది.

‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

విజయ్‌ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్‌. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.

‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్‌. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.

సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు. ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సం తోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.
     * *మిత్రులారా సమాజంలో ఇలాంటి యధార్థ సంఘటనలు కోకొల్లలు. ఈ రోజు మీరు మంచి హోదా లో ఉండవచ్చు గాక . మీరు ఈ భూమి మీద కు రావటానికి జన్మను ఇచ్చింది ఎవరు? మీరు అనుభవిస్తున్న   ప్రస్తుత   హోదా మీకు రావటానికి కారణం ఎవరు? కేవలం ఆస్తులు మాత్రమే పంచుకుంటాం. వారి బాగోగులు మాకెందుకు అంటూ  జన్మనిచ్చి,కష్టపడి  పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన కనపడే ఆ దేవుళ్ళ ను మరిస్తే ఎలా?* 
     *ఈరోజు మీ తల్లిదండ్రుల ను ఎలా చూస్తున్నారో రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కధ చదివిన తర్వాత అయినా సరే కొంతమంది కొడుకుల మనఃస్తత్వం అయినా మారుతుంది అని ఆశిస్తున్నాను*.
*తమ స్వంతం   గురించి పట్టించుకోకుండా పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్తు గా భావించి వారిని మంచి ప్రయోజకులు గా చేసిన ప్రతి ఒక్క  తల్లితండ్రి కి ఈ కధ అంకితం* 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

Tuesday, May 26, 2020

పిత్రార్జితం** *‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*

Total Pageviews