భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Saturday, August 22, 2020
సాహితీ నందనం: యతో భావః తతో రసః
సాహితీ నందనం: యతో భావః తతో రసః
Friday, August 21, 2020
Mohan Publications | Bhakti Books | Telugu Books | FREE pdfs | Devullu.com | Bhakti Pustakalu: వినాయక చవితి రోజున గణేషుడుని 21 రకాల ఆకులతో ఎందు...
Wednesday, August 19, 2020
అచ్చ తెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం.
చక్కని మెసేజ్.
అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది.
నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది.
తాత అనే పిలుపులో తన్మయత్వం ఉంది.
అమ్మమ్మ అనే పిలుపులు అభిమానం ఉంది.
నానమ్మ అనే పిలుపులో నవ్వు ముఖం ఉంది.
అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది.
మామ అనే పిలుపులో మమకారం ఉంది.
బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉంది.
చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంది.
అన్నా అనే పిలుపులో అభయం ఉంది.
చెల్లి అనే పిలుపులో చేయూత ఉంది.
తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉంది.
అక్క అనే పిలుపులో అనురాగం ఉంది.
బావా అనే పిలుపులో బాంధవ్యం ఉంది.
వదినా అనే పిలుపులో ఓర్పు ఉంది.
మరదలు అనే పిలుపులో మర్యాద ఉంది.
మరిది అనే పిలుపులో మానవత్వం ఉంది.
గురువు అనే పిలుపులో గౌరవం ఉంది.
మిత్రులారా!
నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్ని పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి.
కనీసం పిలుపులో నయినా మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం.....!
బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..
(ఎవరు రాశారో తెలియదు గాని అద్భుతం గా వుంది..ఆ రచయితకు వందనాలు.. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న అజ్ఞాత రచయిత రచన మీ కోసం పట్టుకొచ్చా.. చదవండి).
అమ్మ చేసిన రొట్టె వృత్తము
సగానికి మడిచిన దోసె అర్ధ వృత్తము
మనం కూర్చునే స్టూల్ చతురస్త్రం
పడుకునే మంచం దీర్ఘ చతురస్త్రం
మనకిష్టమైన లడ్డూఒక గోళము
సగం మన మిత్రునికిస్తే అర్ధ గోళము
మన తరగతి గది ఒక ఘనం
మనం కూర్చునే బెంచీ ఒక దీర్ఘ ఘనం
మన జెండా కర్ర ఒక స్థూపం
కొడవలి మలుపు ఒక చాపం
ధాన్యపు రాశి ఒక శంఖువు
రూపాయి రూపాయి కలిపితె కూడిక
కొనడానికి కొంత తీస్తే తీసివేత
తలా పది పంచితే భాగహారం
హెచ్చిస్తే గుణకారం
కూర్చుంటే జడత్వం
కదిలితే చలనం
పరిగెత్తితే వేగం
ఆగి ఆగి పరుగు తీస్తే త్వరణం
పడిపోతే ఆకర్షణ
విడిపోతే వికర్షణ
తన చుట్టూ తాను తిరిగితే భ్రమణం
గుడి చుట్టూ తిరిగితే పరిభ్రమణం
మాట్లాడడానికి శక్తి
పనిచేయడానికి బలం
గంటకు ఎంతపని చేస్తావో అది సామర్థ్యం
వింటున్నా మంటే శబ్దం
చూస్తున్నామంటే వెలుగు
రంగులన్ని వర్ణ పటం
ఆహారం అరగడం జీవక్రియ
అరిగిన ఆహారం శక్తిగా మారడం రసాయన క్రియ
ఉచ్వాస నిశ్వాస శ్వాస క్రియ
నేను చూశాను భూతకాలం
నేను చూస్తున్న వర్ధమాన కాలం
నేను చూడ బోతున్న భవిష్యత్ కాలం
నాకు తొంభై ఏళ్ళు ఇక పోయే కాలం
బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..
సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...
మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని
గురించి తెలుసుకోవడం తప్ప..
భయమెందుకు నీకు ...
నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...
తెలుసుకో పదిలంగా
నేర్చుకో సులభంగా...! అదే మన తెలుగు భాష గొప్ప. భలే ఉంది కదా🤩✨🦋
Monday, August 17, 2020
శ్రీ మాత్రై నమ: మా అమ్మ పూజలు!


ఆవిడ పూజలు అందరికీ శ్రీరామ రక్ష! సర్వజగద్రక్ష!!
దేవాలయాలు మూతబడిన వేళ!
నింగీ, నేల, నీరు, నిప్పూ, గాలి,
గుళ్ళు, గోపురాలు, నదులు, సముద్రాలు
చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, రాయి, రప్ప, సకల జీవాల్లొ
సర్వే సర్వత్రా నిండివున్న ఆ సర్వేస్వరుణ్ణి ప్రార్ధించేందుకు
వయస్సు వాతావరణం అడ్డంకి కాదు ఆవిడకి
నోములూ, పూజలు, వ్రతాలు, పండుగలు, పబ్బాలు
తెల్లవారు ఝామున చన్నీటి స్నానాలు, ఉపవాసాలు
మధు మేహం వున్నా దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినదు
అవిడ మరెవరో కాదు మా అమ్మ ఆ తరం చేతిలో
రుబ్బురోలు కూడా శివ లింగం అయిపొతుంది.
ఇంటిలోను, పెరట్లో తులసికోటకు పూజలు అయినాక
రుబ్బురోలు కూడా శివ లింగం అయిపొతుంది.
ఆ సంకల్పం మాకు రాదేం భక్తి లోపమా? శక్తి హీనమా? ఆసక్తి శూన్యమా?
మా అందరి తరఫునా ముక్కోటి దేవతల్లారా ఆవిడ చేత
అలా నిండు నూరేళ్ళు హాయిగా నిత్యనీరాజనల పూజలందుకోండి.
అందరికీ శ్రీరామ రక్ష! సర్వజగద్రక్ష!!
Wednesday, August 12, 2020
పేరెంటింగ్ సూత్రం 2 Ramadevi Telugu one
పేరెంటింగ్ సూత్రం 2