ఆవిడ పూజలు అందరికీ శ్రీరామ రక్ష! సర్వజగద్రక్ష!!
దేవాలయాలు మూతబడిన వేళ!
నింగీ, నేల, నీరు, నిప్పూ, గాలి,
గుళ్ళు, గోపురాలు, నదులు, సముద్రాలు
చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, రాయి, రప్ప, సకల జీవాల్లొ
సర్వే సర్వత్రా నిండివున్న ఆ సర్వేస్వరుణ్ణి ప్రార్ధించేందుకు
వయస్సు వాతావరణం అడ్డంకి కాదు ఆవిడకి
నోములూ, పూజలు, వ్రతాలు, పండుగలు, పబ్బాలు
తెల్లవారు ఝామున చన్నీటి స్నానాలు, ఉపవాసాలు
మధు మేహం వున్నా దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినదు
అవిడ మరెవరో కాదు మా అమ్మ ఆ తరం చేతిలో
రుబ్బురోలు కూడా శివ లింగం అయిపొతుంది.
ఇంటిలోను, పెరట్లో తులసికోటకు పూజలు అయినాక
రుబ్బురోలు కూడా శివ లింగం అయిపొతుంది.
ఆ సంకల్పం మాకు రాదేం భక్తి లోపమా? శక్తి హీనమా? ఆసక్తి శూన్యమా?
మా అందరి తరఫునా ముక్కోటి దేవతల్లారా ఆవిడ చేత
అలా నిండు నూరేళ్ళు హాయిగా నిత్యనీరాజనల పూజలందుకోండి.
అందరికీ శ్రీరామ రక్ష! సర్వజగద్రక్ష!!
No comments:
Post a Comment