Power of positive THINKING(మంచి ఆలోచనా విధానం అపారమైన శక్తి వంతమైనది) 😌😌
....
ఆ కుర్రవాడికి పది సంవత్సరాలు !
పీలగా బలహీనంగా ఉండేవాడు .🥴🥴
పరీక్షలో క్షయవ్యాధి 🙄🤤
అని డాక్టర్లు తేల్చారు శానిటోరియంకు పంపారు !
కానీ !
మరల పరీక్ష చేసి జరిగినపొరపాటు గుర్తించి క్షయలేదని ఇంటికి పంపారు !
🙂🙂🙂
...అప్పటినుండి అతను సరి అయిన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ
17 సంవత్సరాలకల్లా బలిష్టంగా తయారయ్యాడు .
🏃♂️🏃♂️🏃♂️🏃♂️
కాలం గడుస్తున్నది! వివాహమయ్యింది !
వయస్సు 35 !
ఇన్స్యూరెన్స్ కోసమని వైద్యపరీక్షలకు వెళితే గుండెధమనులు పూడుకుపోయాయి అనిచెప్పి ఇన్స్యూరెన్స్ ఇవ్వము పొమ్మన్నారు .😥😥😰😰
పైగా ఒక సలహా ఇచ్చారు నీవు పనులన్నీ ఆపి విశ్రాంతి తీసుకొనకపోతే నేడో రేపో పోవడం ఖాయం అన్నారు .
.
మరణంకోసం ఎదురు చూడటమా జీవనరణం సాగించడమా ? ఏదో ఒకటి తేల్చుకోవలసిన పరిస్థితి !
.😱😱😱😱😱
మరల ఎందుకైనా మంచిదని ఇంకొక చోట వైద్యపరీక్షలు చేయించుకున్నాడు .
నిజమే ! గుండెధమనులు పూడుకుపొయ్యాయి !
.
ఏదో చెకప్ కని వెళితే అలా తేలిందికానీ తాను అన్నిపనులు అంతకు ముందు చేసుకుంటూనే ఉన్నాడు కదా !
.
అంతే!! ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు ,విషయం తెలియకముందు ఎలా బ్రతికాడో అలాగే కొనసాగించాడు.
.☺️😃😀😊🥰🙂
వ్యాయామం ,కుటుంబంతో ఆనందంగా గడపడటం ! ... !
.
మూడేళ్ళ తరువాత ఒక ప్రఖ్యాతవైద్యుడు అతనిని పరీక్షించి ఒకమాటన్నాడు !
.
Yes your decision was right ! Your heart is alright !!
.🥰🥰🥰🥰🥰☺️☺️
అప్పుడే కధ అయిపోలేదు !
.
అది 1964 వ సంవత్సరం !
ఆ జబ్బు తగులుకుంటే నాలుగువందలతొంభయితొమ్మిదిమంది ప్రాణాలు గాలిలో కలిసినట్లే !
ఒక్కడికి మాత్రమే బ్రతికే అవకాశం ! 1:500 ......మందులు అప్పటికింకా కనిపెట్టని కొల్లాజిన్ వ్యాధి !
ఆ వ్యాధి సంక్రమించింది మన కధానాయకుడికి
🤕🤒😷🤐.
గుండెదిటవు చేసుకున్నాడు !
డాక్టర్ సలహాతో జీవనగమనం నిర్దేశించుకున్నాడు .
ఉల్లాసంగా ఉండటానికి హాస్యరసప్రధానమైన చిత్రాలు చూడటం అలవాటు చేసుకున్నాడు . 😃😄😁
క్రమేణా వ్యాధిని జయించాడు !
.
మరల 1980 లో ఇంట్లో ఉండగా గుండెపోటు !గుండెకండరంలో ఒక భాగం పూర్తిగా దెబ్బతిన్నది !ఈసారికూడా జీవనశైలి,ఆహారం మార్చాడు!
సరి అయిన వ్యాయామం మొదలెట్టాడు .
.
ఆ తరువాత 20 సంవత్సరాలు జీవించాడు ...
.🧎♂️🧎♂️
ఆయన పుట్టిన సంవత్సరం 1915 ...
ఆయన పేరు
నార్మన్ కసిన్స్ ..
దేశం అమెరికా
.
ఆయన స్వీయ అనుభవాలతో ఒక పుస్తకం వ్రాశారు
అది
"అనాటమీ ఆఫ్ ఏన్ ఇల్ నెస్"... అమెజాన్ లో అందుబాటులో ఉంది. !
.
It is the mind
that makes
or
brakes !
.
ఊరికే కరోనా వార్తలు చూడకుండా
తీసుకొనవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ !
💃🕺🏽💃👯♀️👯🏻♂️💃🤳👩❤️👨👩❤️👩👨👩👧👦👩👩👦
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి !
😀😃😄😁😆
నూరుసంవత్సరాలు జీవించడం ఖాయం !
😊😊😊😊😊😊
No comments:
Post a Comment