Monday, August 24, 2020

గోదారియాసే నాశ్వాస మీ ఇవివి..

 ఆయ్ అన్నది మాగోదారోల్లకి ఆయువు పట్టండి,

అండి అన్నది లేకుండా మాటాడితో వట్టండి,
యవసాయవంటే మాకు సేనా ఇట్టవండే,
యెటకారవంటే దానికన్నా కూతెక్కువ ఇట్టవండి,
మా పల్లెటూల్లన్నా,పంటపొలాలన్న సేనా బెవండి,
ఏరేరు తల్లులకడుపున పుట్టినా మాఅందరికీ అమ్మ మాగోదారమ్మేండి,
ఆతల్లి దయవల్లేండి ఇలాగున్నాం,
మాకు మనుసులంటే అభిమానవండి,
చుట్టాలెవరైనా వత్తే కాల్లుకడుక్కోటానాకి నీల్లిచ్చి..,దావానికి మజ్జిగిచ్చి.,
పదినిమషాల్లో వండి వడ్డించే అన్నపుార్ణమ్మలండి మా గోదారాడపడుచులు,
కొట్టుకాడ ఏవన్నా కొనుక్కున్నాక కొసరెట్టమని అడిగీవోల్లుం మేవేండి,
ఎవరన్నా ఇంటికొత్తే కొసరికొసరి వడ్డించేవోల్లుం కూడా మేవేండి,
మావూల్లంటా లంకంత కొంపలున్నా రావణాసురులు మాత్రం లేరండే,
ఐనా మాకు గొడవలంటే భయవండే.,!
పుసుక్కున మాలో మేవు గొడవపడ్డాగాని మావూరి మునసీబుగారో,కరణంగారో వచ్చి ఎల్లండెదవల్లారా.,
మనలో మనకి గొడవలేటిరా అంటే ఎల్లిపోయే వాళ్ళమండి, అంతటి మొత్తనోల్లవండి,
అన్నాటిలికి తగుదునమ్మా అంటూ ఎల్లవండి,
ఒకేల ఎల్లావంటే ఎనక్కిసూసే సమస్యే లేదండి ఆయ్
వుప్పుడిప్పుడే సేలా మార్పులు వచ్చేత్తన్నాయేమోనని....
సందాలమాటు అన్నం తినేహేక యీదలోరి మండువా అరుగుమీద కూకుని కిందసేలో రేపు కలుపుతీయించాలరా.,
ఒరేయ్ మాయాకుమడికి పిండెట్టేయమంటావా? అంటా ఒకలకొకలం సలహాలిచ్చుకున్నా రోజులకన్నా ఇయ్యేవన్నా గొప్పగావున్నాయేటి బా?
మనపిల్లలింక మారాపోయినా కనీసం మనవైనా మునుపటి బతుకుల్లోకెలిపోదాం బా.,
పిల్లల సదువులనే వంకతో సేనామంది యవసాయంచేసేటోల్లు పట్నాలమీద అడతున్నారండి,
రెండుపంటలూ పండే పచ్చటిపొలాలన్నీ రియలెస్టేటులంటూ బీల్లు సేసేత్తానరండి,
వూల్లంట వున్న ఆస్తులమ్మి పట్నాల్లో ఆస్తులు కొనగలం కానీండి,
కేవలం మనూల్లలోనే దొరికే ఆప్యాయతల మాటేటండి మరి?
కోరుకున్న కూర కొసరికొసరి వడ్డించే మనుష్యల మధ్యనుంచి,
ఆడిదగ్గరున్న కూరేదో పొట్లంలో కూరతుంటే కొంచెం
కూరెయ్యమ్మా మరీతక్కువ కట్టేవు అనేకాడకొచ్చావండే,
అమ్మగారు అన్నవుంది కాతకూరో,పచ్చడో ఎయ్యండమ్మా అనే బిచ్చగాడికి మనూల్లో మనింట్లో కూరే ఏత్తావండి, మరి మనవేటండి పదిరుాపాయల కూరకట్టమ్మా అనీకాడికెల్లిపోయాం.,?
ఉద్యోగరీత్యా ఎల్లినోల్లకన్నా, పిల్లలసదువులనో,
హాస్పటల్ దగ్గరగా వుందనో వంకతోటి.,
యవసాయం సేసేటోల్లంతా తిరిగి మనూల్లకెల్లిపోతే బోంటదండి.,
మీరిక్కడేసుకునే పేంటు,చొక్కాలకన్నా
మనూల్లో వున్నప్పుడు ఏసుకున్న కాటను సొక్కా,శంఖుమార్కు గల్ల లుంగీల్లోనే మీరందంగా ఆపడతున్నారు,
ఎల్లండి ఎల్లి ఈతపాలకిచ్చిన
పెద్దకొమ్ములగేదీని,
కర్రావుని తోలుకొచ్చి మన మకాంలో కట్టేయండి,
అంతరించిపోతున్న మనబాస,యాసలతోపాటు
మన సంస్కృతి సాంప్రదాయాలను బతికించండి బాబూ, మీకో కోటి🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏
గోదారియాసే నాశ్వాస మీ ఇవివి... (#rptd)

No comments:

Post a Comment

Total Pageviews