Saturday, March 27, 2021

చిన్నవీరభద్రుడా వెయ్యేళ్ళు జీవించు మమ్మల్ని జీవింపచేసేందుకు

 ఈ రోజు ఎంత ప్రియమైన రోజు 

నునులేత సుప్రభాత వేళ 

కలల్లోంచి మెలకువ లోకి వస్తున్నపుడు 

పొద్దున్నే కురిసిన వసంత వానలో 

తడిసే స్వాప్నికుడు 

పాలుగారే ప్రపంచం చుట్టూ ఉన్నా 

ఇంకా పాలకోసం గుక్కపెట్టే నవ శైశవ జీవనం 

తాను తిరిగిన దారుల్లో దర్శించిన అనుభూతులను 

రాతైనా గీతైనా సృజించి దర్శించడం

నీటి రంగుల చిత్రాల మేటి చిత్రకారుడా 

ఆ మధ్యాహ్నం అడ్డతీగల అడవుల్లో 

మబ్బుల మాటలు వినగల మొనగాడా 

గోరంత గొంతుతో 

అదొక పులకింతగా 

భువనమోహన నిశ్శబ్ధాన్ని 

భగ్నం చెయ్యగల వీరభద్రుడా 

వయసు పెరిగేకొద్ది చిన్నవాడుగా 

నిండుగా పూసిన మామిడి చెట్టు ఎదట మరింత పసివాడిగా 

వసివాడని సాహితీ కుసుమాలను పండించే కృషీవలా  

మా మామూలు వీధుల్లొ మామూలు ఉదయాల్లో 

ఆకుపచ్చ జీవకాంతులు అందించు 

వెయ్యేళ్ళు జీవించు మమ్మల్ని జీవింపచేసేందుకు 

వెయ్యేళ్ళు జీవించు మమ్మల్ని జీవింపచేసేందుకు 

వెయ్యేళ్ళు జీవించు మమ్మల్ని జీవింపచేసేందుకు 

Saturday, February 27, 2021

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే - తానాకి ఆధ్యక్షుడైనా తల్లికి తనయుడే!


 రావణ సంహారం అనంతరం యుద్ధం ముగిసి అందరూ సేద తీరుతున్న సందర్భంలొ విభీషణుడు రాముని చెంతకు వచ్చి విజయఫలమైన లంకను పరిపాలించమంటాడు. సున్నితంగా తిరస్కరిస్తాడు శ్రీ రామ చంద్రుడు, ఆ తర్వాత లక్ష్మణుడు 

ధనమార్జాయ కాకుత్స్థ !

ధన మూల మిదం జగత్

అంతరం నాభి జానామి

నిర్ధనస్య మృతస్య చ

ఓ రామా! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనం తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం అంటాడు దానికి సమాధానంగా

అపి స్వర్ణ మయీ లంకా

న మే రోచతి లక్ష్మణ !

జననీ జన్మ భూమిశ్చ

స్వర్గాదపి గరీయసి.

సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

కన్నతల్లితో జన్మభూమితో ఎంత అనుబంధం ఉంటుందో మాటల్లో చెప్పలేం. కన్నతల్లి తాను ఉన్నంతవరకూ బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటే.. తర్వాత పుట్టిన నేల మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ వాక్యాలు రాముడు లక్ష్మణుడికి చెప్పుతున్నప్పటికీ ఇది మొత్తం లోకానికి వర్తించాలని చెప్పాడు. కాబట్టే రామాయణం మనకు అత్యంత పూజనీయమైంది.

రామాయణం అందరూ చదువుతాం కానీ ఆచరణ ఇదిగో ఇలాంటి మహనీయులు చేస్తారు.

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపంలో తల్లి రుణం తీర్చుకునే పువ్వుల గురించి ఒక చోట ఇలా అంటారు

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభు

"ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి

జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన

స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము

ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము

ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై" ఎన్ని జన్మలేత్తినా తల్లి రుణం తీర్చుకోలేనిది అని నమ్మి

ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్న తమ్ముళ్లు..

ఒకరు అమెరికాలో టాప్ 10 డాక్టర్స్ లో ఒకరు రాజా శ్రీనివాస్.. మరొకరు అమెరికా తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్.. కోట్ల డాలర్ల సంపాదనకన్నా కన్న తల్లి మిన్న కన్నతల్లికోసం కొడుకులు, కూతురు

 కరోనాతో కోన ఊపిరితో పోరాడుతున్న తల్లి బారతమ్మ పాటు ఉండి అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జన్మనిచ్చిన అమ్మ కు  పునర్జన్మ నిచ్చిన వీరు ఆ రామ లక్షణుల వారసులు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి, తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేసిన వీరిని ఎన్ని ఎంత పొగిడినా తక్కువే..

నేటి తరానికి ఆదర్శమూర్తు లారా మీకు మా హృదయపూర్వక శుభాభినందనలు, శుభాభివందనాలు --

మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్‌! 

Saturday, January 23, 2021

 🙏🏼కొన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్న మన సనాతన హిందూ ధర్మానికి ఊపిరి పోసి బతికించిన మహానుభావుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ...బ్రాహ్మణుడు.


ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి బ్రిటీష్ వారిని గడగడలాడించి తెల్ల కుక్కలకు పగలే చుక్కలు చూపిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ....బ్రాహ్మణుడు.


హిందూ పద బాదషాహీ , హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీని నడిపించి ఆది శంకరుల తర్వాత మళ్ళీ హిందూ ధర్మానికి జవసత్వాలు తీసుకువచ్చిన ధర్మప్రభువు సమర్థ రామదాసు ...బ్రాహ్మణుడు.


హిందూ ధర్మాన్ని , మన సనాతన గురుశిష్య పరంపరను , మన జ్ఞాన కేంద్రాలైన గురుకులాలను విధర్మీయులు కుట్రపన్ని క్రమేపి నాశనం చేయప్రయత్నిస్తూన్న తరుణంలో , అతి సామాన్యుడైన చంద్రగుప్తుడిని తన రాజనీతితో రాజుగా చేసి,హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పునఃధర్మ స్థాపన చేసిన మేధోధీరుడు చాణక్యుడు...బ్రాహ్మణుడు.


పసికందును వెనక కట్టుకుని అరివీర భయంకర రణరంగంలో బ్రిటీషులను గడగడలాడించి,భారత మాతను బానిస సంకెళ్ళ నుండి విడిపించుటకు సింహగర్జన చేసిన ఆడ సింహం రాణి ఝాన్సీ లక్ష్మీబాయి....బ్రాహ్మణురాలు.


ఐక్యతారాగాన్ని ఆలాపించి,చెల్లా చెదరుగా విడిన హిందూ సమాజాన్ని ఏకం చేసి భారత స్వాతంత్ర సమరనాదాన్ని పూరించి , వాడవాడలా వినాయకుడిని స్థాపించి..తద్వారా భారత స్వాతంత్ర్యానికి పూనాదులు వేసి,మన సనాతన ధర్మ రక్షణకు ప్రాణాలు త్యాగం చేసిన భారత మాతా భక్తుడు బాల గంగాధర తిలక్ ...బ్రాహ్మణుడు.


నలంద , తక్షశిల లాంటి మన భారత దేశ జ్ఞాన కేంద్రాలను ఆక్రమణదారులు మట్టుబెట్టి భస్మీకృతం చేస్తే...అలాంటి జ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి , భారత మాతకు పూర్వ జ్ఞాన వైభవమును తేవాలని , జోలేపట్టి ఆఖరికి శవాలపై వేసిన డబ్బును ఏరుకోవడానికి వెనకాడక , భిక్షాటన చేసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయము ( BHU ) ను స్థాపించి దేశములో విద్యావెలుగులను నింపిన అసమాన కీర్తిమంతుడు మదన మోహన మాలవీయ ...బ్రాహ్మణుడు.


కశ్మీరును స్వతంత్రం చేయాలని , భారతమాత శిరస్సు ఖండించబడకూడదని ఆరాటపడి పోరాటం చేసిన త్యాగధనుడు, జనసంఘ్ ను స్థాపించి భారత భవిష్యత్తుకు పునాదివేసి , ప్రాణాలు అర్పించిన డా॥ శ్యామా ప్రసాద్ ముఖర్జీ....బ్రాహ్మణుడు.


ఈ రోజు నేను హిందువుని అని ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛా భిక్షను అనుగ్రహించిన,రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ( RSS ) ను స్థాపించిన డా॥ హెడ్గేవార్ ...బ్రాహ్మణుడు.


నేడు నరేంద్ర మోడీని చూసి యావత్ ప్రపంచం గర్విస్తూన్నది.ఆ నరేంద్ర మోదీ గారిని తీర్చిదిద్దిన భారతీయ జనతా పార్టీకి పురుడుపోసిన దీనదయాల్ ఉపాధ్యాయ...బ్రాహ్మణుడు.


 అపర మేధావి , కవి , రచయిత...భారత యశస్వీ ప్రధానిగా కీర్తి గడించిన మన భారత రత్న అటల్ బిహారీ వాజపేయ్ ...బ్రాహ్మణుడు.


ప్రపంచ క్రికెట్ లో భారత దేశానికి అగ్ర స్థానాన్ని కల్పించి క్రికెట్ దేవుడిగా కీర్తింపబడే భారత రత్న సచిన్ టెండూల్కర్ ...బ్రాహ్మణుడు.


ఇలా చెబుతూ పోతే సంవత్సరాలు గడిచినా విషయం పూర్తవ్వదు.ఇది భారత జాతి కొరకు , భారత దేశం కొరకు , సనాతన హిందూ ధర్మం కొరకు తమ సర్వస్వాన్ని ధారపోసి , సంపూర్ణ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులైన బ్రాహ్మణుల చరిత్ర....ఎంత చెప్పినా తరగదు.


భారత మాత కొరకు కేవలం బ్రాహ్మణులే త్యాగం చేశారు...మిగితా వారు చేయలేదు...మిగితా వారు పాటుపడలేదు అనేది మా ఉద్దేశ్యం కాదు.దేశ నిర్మాణంలో అందరి పాత్ర ఉందీ...అన్నీ వర్గాల సమిష్టి పోరాటమే భారత రూపం.అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారనేది సమాజం గుర్తించాలి.


ఇంతటి త్యాగాలను చేసి దేశ వైభవాన్ని నిలిపిన , నిలుపుతూన్న బ్రాహ్మణుల గురించి చలన చిత్రాలలో వ్యంగ్యంగా చిత్రీకరించడం శోచనీయం...దానిని మిగితా హిందూ  సమాజం ఖండించకపోవడం దౌర్భాగ్యం.


సినిమాలలో బ్రాహ్మణులపై వెధవ జోకులేయడం

బ్రాహ్మణులను కాలితో తన్నడం

బ్రాహ్మణులను రౌడీలకు సలహాదారుగా చూయించడం...ఇలా ఒకటా రెండా....ఏ చిన్న అవకాశాన్ని చిత్ర పరిశ్రమ వదలదు..బ్రాహ్మణులను కించపరుస్తూనే ఉంటుంది.


ఇకనైనా ఇటువంటి వెకిలి చేష్టలు మానాలి.

బ్రాహ్మణులు దేశ నిర్మాణంలో చేసిన సేవలను గుర్తించాలి.

వారికి తగిన గౌరవాన్ని కల్పించాలి.


బ్రాహ్మణత్వం నాశనమైన రోజు హిందూ ధర్మం నిలవదు.హిందూ ధర్మం నాశనమైన రోజు దేశం మిగలదు.


ఈ దేశ పునాది బ్రాహ్మణత్వంలో ఉంది అనేది యావత్ సమాజం విస్మరించకూడదు.


॥ శ్రీమాత్రే నమః ॥


Tuesday, January 19, 2021

మన ప్రాంతంలో పురాతన ఆలయాల విశిష్టత తెలుసుకుందాం! ఏకాదశ రుద్రులలో రెండవ రుద్రుడు "మహాదేవరుద్రుడు"

 https://www.youtube.com/watch?v=nheX7aXZ_us



మన ప్రాంతంలో పురాతన ఆలయాల విశిష్టత తెలుసుకుందాం! 

ఏకాదశ రుద్రులలో  రెండవ రుద్రుడు "మహాదేవరుద్రుడు"

శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి వారి దేవాలయం. (కృష్ణా రాయుడు పెదపూడి) 

కే.పెదపూడి. అంబాజీపేట మండలం. తూ.గో.జిల్లా.

ఈ ఊరిలో పుట్టి పెరిగి, జీవితంలో ఎంతో ఎదిగినవారిలో ఒకరు "ధార్మిక రత్న" శ్రీ కొండా సత్యనారాయణ గారు. వైమానిక దళ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంబించి రక్షణ శాఖలో  దేశం నలుమూలలా ఉత్తమ ఉన్నతాధికారిగా విధి నిర్వహణలో తలమునకలుగా ఉంటూనే ఆధ్యాత్మిక ధార్మిక జీవితాన్ని గడిపిన వీరికి మా విస్సా ఫౌండేషన్ "ధార్మిక రత్న" బిరుదు ప్రదానం చేసి ఘన సన్మానం చేసింది. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండే వ్యక్తి, ఇటీవలే పదవీ విరమణ చేసి ఉన్నవారిలో బంధుమిత్రులతో, ఆధ్యాత్మిక, ధార్మిక శేష జీవితం గడపాలనే వారి సంకల్పం నెరవేరాలని ఎందరో తమ ప్రాంతాల్లో ఇటువంటి ఆశయాలు నెరవేర్చేందుగు స్ఫూర్తివంత మవుతుందని ఆశిస్తూ మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్  కొండా వారి మాటల్లో ఈ మహిమాన్విత శివ కేశవ  గురించి విందాం! 

పూర్వము  ఈ గ్రామ సమీపాన తపోవరం అనే ప్రాంతంలో విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సు చేస్తుండగా దానిని భగ్నం చేయడానికి ఇంద్రుడు మేనకను భూలోకమునకు పంపగా, ఆమె విశ్వామిత్రుని తపోభంగము గావించి, ఆడ బిడ్డకు (శకుంతల)  జన్మనిచ్చి తాను తిరిగి ఇంద్ర లోకము పోవ ప్రయత్నించగా, ఈ దుశ్చర్య కారణంగా ఆకాశంలోకి ఎగురలేక క్రింద పడిపోయినదట. అశరీర వాణి పలికిన సూచన మేరకు అక్కడ శివలింగ ప్రతిష్ట చేసిన తరువాత పైకి ఎగుర గలిగినా, ఈ గ్రామ ప్రాంతానికి వచ్చేసరికి  శక్తి చాలక నేలపై పడి పోగా మరలా ఈ ప్రాంతంలో తపస్సు చేసి, ఈ గ్రామంలో శివలింగ ప్రతిష్ట చేసిన తరువాత మేనక తన పూర్వశక్తిని తిరిగి పొంది ఇంద్ర సభను చేరుకోగలిగినదని స్థల పురాణము వలన తెలియుచున్నది. దేవకాంత మేనక చే ప్రతిష్టించబడిన కారణంగా ఈ దేవునికి శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామీ అని పేరు వచ్చినది.

ఒక పని సంకల్పించి శక్తి చాలక అపజయం కలిగే వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మేనకేశ్వర స్వామికి అభిషేకాదులతో అర్చించుట వలన కార్యసిద్ది కలుగునని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ గోడపై ప్రాచీన లిపిలో రాగి రేకు పై శాసనము కలదు ఈ గ్రామము కౌశికా తీరమున కలదు.

శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి ఆలయము ప్రక్కనే శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత  వేణుగోపాల స్వామి ఆలయము కలదు. ఈ ఆలయమును కృష్ణారాయుని ఆలయం అని అంటారు. స్వర్గీయ యర్రా క్రిష్ణారాయుడు అనే ఈ గ్రామవాసి పెద్దాపుర రాజాస్థానములో పనిచేసి వృద్దాప్యములో ఈ గ్రామములో నివసించి అనేక ప్రజాహిత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకొనుటవలన ఈ పెదపూడి గ్రామమును కృష్ణారాయుడు పెదపూడిగా వ్యవహరించ బడుతున్నదని తెలిసినది. వీరు వేణుగోపాల స్వామి ఆలయంలో ఎక్కువ సమయం గడుపుతూ శ్రీ వేణుగోపాలుని పై శతక రచన చేసినారట ఈ కారణం గానే ఈ ఆలయమును శ్రీ కృష్ణారాయుని దేవాలయముగా పిలవ బడుతున్నట్లు చెప్పబడుతున్నది. స్వర్గీయ యర్రా క్రిష్ణారాయుని ఔనత్యము కారణము గా ఈ గ్రామం పేరు, ఆలయం పేరు ఆయన పేరున పిలువబడుతున్నట్లు స్థానికులు అంటారు.

కే. పెదపూడి గ్రామము రాజమండ్రి – అమలాపురం రహదారి లో అమలాపురంనకు 13 కి.మీ. దూరములోను రాజమండ్రి కి 60 కి.మీ. దూరములోనూ ఉన్నది. బస్సులో ఈ గ్రామము చేరుకోవచ్చును 

భక్తులు తప్పక శ్రీపార్వతీ సమేత మేనకేశ్వరుని ఆలయము సందర్శించి ఈ స్వామిని దర్శించి, అర్చించి, తరించండి.

మనిషి ఇరుక్కున్నాడు... గ్లోబలైజేషన్ లో...🤔

 🤔మనిషి ఇరుక్కున్నాడు...

గ్లోబలైజేషన్ లో...🤔


👉డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!


👉పీలికబట్టల్ని 

వస్త్ర ధారణ అంటున్నారు.!


👉భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!


👉సహజీవనాన్ని సంసారమంటున్నారు.!


👉గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!


👉డూప్ ల పోరాటాన్ని

హీరోయిజం అంటున్నారు.!


👉పదవుల పోరాటాన్ని

ప్రజాస్వామ్యమంటున్నారు


👉అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!


👉ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!


👉సరదాలను సంస్కృతి అంటున్నారు.!


👉భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!


👉కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!


👉ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!


👉మందు పోయిస్తేనే...

మిత్రుడు అంటున్నారు.!


👉కట్నం తెస్తేనే...

భార్య అంటున్నారు.!


👉సొమ్ములు తెస్తేనే...

సంసారం అంటున్నారు.!


👉కాసులు తెస్తేనే...

కాపురం అంటున్నారు.!


👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!


👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!


👉అసత్యాలు మాట్లాడితే... 

బ్రతక నేర్చిన వాడంటున్నారు.!


👉నిజం పలికితే...

బ్రతక నేర్వని వాడంటున్నారు.!


👉న్యాయబద్ధంగా ఉంటే... 

ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!


👉అన్యాయంగా బ్రతికినా...

ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!


👉అన్యాయాన్ని ఎదిరిస్తే...

అతనికెందుకు అంటున్నారు.!


👉నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!


👉మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!


👉మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!


👉 పరిస్థితులకు అనుగుణంగా. పాత అర్ధం చెరిగిపోయి,

ప్రయోజనాలకు అండగా...

పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!


🤔స్వార్ధ కాంక్షాణుగుణంగా... విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది.!🤔


*ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే*


🔥 టెక్నాలజీ పెరిగింది...

🔥 సౌకర్యం పెరిగింది...

🔥 విలాసం పెరిగింది...

🔥 విజ్ఞానం పెరిగింది...

🔥 కాలుష్యం పెరుగింది...

🔥 ఖర్చు పెరిగింది...

🔥 కల్తీ పెరిగింది...

🔥 రసాయన బంధం పెరిగింది...

🔥 అన్నీ పెరిగాయి...


కానీ! *పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు*  

*మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది*


*సర్వే జనా సుఖినోభవంతు* 🙏

G Stone

Total Pageviews