Wednesday, August 26, 2015

శుభోదయం .../\...

శుభోదయం .../\...
ఈ రోజంతా చిరునవ్వుతో ఉండాలని 
ఈ ఉదయం మీరు అనుకున్నది 
సాధించే రోజు కావాలని కోరుకొంటున్నాను.


శ్రీ రాయప్రోలు సుబ్బా రావు గారి పద్య మాధురి

ప్రబోధము శ్రీ రాయప్రోలు సుబ్బా రావు గారి
ఆంధ్రా వళి నుండి.

తనగీతి అరవ జాతిని గాయకులను గా 
దిద్ది వర్ధిల్లిన తెనుగు వాణి,
తన పోటులు విరోధి తండంబు లకు సహిం 
పనివి గా మెరసిన తెనుగు కత్తి,

తన యందములు ప్రాంత జనుల కభి రుచి వా

సన నేర్ప నలరిన తెనుగు రేఖ,
తన వేణికలు వసుంధర ను సస్య శ్యామ
లను జేయ జెలగిన తెనుగు భూమి,
అస్మదార్ద్ర మనో వీధి నావ హింప
జ్ఞప్తి కెలయించు చున్నాడ ! చావలేదు
చావ లే దాంధ్ర జన మహోజ్జ్వల చరిత్ర
హృదయములు చీల్చి చదువుడో సదయులారా !
---- 

తెనుగు తల్లి

నాగార్జునాద్రి కంఠముల గండూషించె 
పలుభాష్య బంధ మై తెలుగు శిక్ష, 
ప్రాకృతాశ్రమ వాటికా కులమ్ములనాటె 
తీయమామిడి యంట్లు తెనుగు కవిత, 
బౌద్ధ ధర్మరహస్యభావముల్ పరమ
తా
త్త్విక దృష్టి విడదీసె తెనుగు ప్రతిభ,
కొండ లోయల లోన కోమల లావణ్య
మలరార చిత్రించె తెనుగు కుంచె,
గంగ తల నుండి కావేరి కాళ్ళ దాక
వెలిగె దిక్ మోహనమ్ముగా తెలుగు ఠీవి,
తమ్ముడా! మాయ నిత్తువే తల్లివన్నె?
చెల్లెలా! చిన్నబుత్తువే తల్లిచిన్నె?

----------

తెనుగు తల్లి 

శ్రీకాకు ళస్వా మిసిగపై సువాసించె
తెల్లని ఆంధ్రుల మల్లెపూలు,
ఒడ్డె రాజుల జీవ గడ్డ గ్రక్క దలంగ
కోరా డె మత్తాంధ్ర కుంజరములు,
చీకటి మన్నెముల్ ఛే దించి నవధాన్య 
ముల నెత్తె ఆంధ్రుల పోపు టె డ్లు,
చిలుక సరస్సు లో శృంగార నౌకల 
నడిపె ఆంధ్రుల యింటి పడుచు జతలు,


ఉత్కలా శా నితంబమ్ములొత్తి హత్తె
ఆంధ్రుల యశో దుకూల సితాంచ లములు;
తమ్ముడా! మాయ నిత్తువే తల్లివన్నె?
చెల్లెలా ! చిన్న బుత్తువే తల్లిచిన్నె?
----- శ్రీ రాయప్రోలు సుబ్బా రావు గారి 
అభినవ కవిత నుండి.

Tuesday, August 25, 2015

తెలుగు సాహితికి రసగంగాధర తిలకం.

నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.
తిలక్ తన కవిత్వ స్వరూపాన్ని తెలుపుతున్న గేయం ఇది ... అప్పటికి భావ కవిత్వంలో ఎవరెస్ట్ అనదగ్గ దేవుల పల్లి వారు తమ కవిత్వపు వెన్నెలల వెల్లువలో తెలుగు వారి గుండెని తడిపెశారు ... అభ్యుదయ,విప్లవ కవిత్వ దృక్పధంతో శ్రీ శ్రీ కవితా దీప్తి వెలుగులు కురిపిస్తోంది ... ఆ వెలుగూ ,ఈ వెన్నెలా కలిసిన అద్వితీయ సంగమం తిలక్ ఽఅయన భావాభ్యుదయ కవి .
ఆఖరి వాక్యాలు చూడండి ... కన్నీళ్ళలో తడిసే దయాపారావతాలు.. ఇది మానవతావాదం ... "నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు "ఇది తిలక్ అభ్యుదయ వాదం .... ఇక భావుకత కి పరాకాష్ట ..."వెన్నెలలో ఆదుకునే అందమైన ఆడపిల్లలు".... వెన్నెలలో ఆడుకుంటున్న తెలుగు అమ్మాయి అందం ఊహల్లొ చూడాల్సిందే ...

Sunday, August 23, 2015

కృష్ణం వందే జగద్గురుం

****కృష్ణం వందే జగద్గురుం****

రుక్మిణీ కేళి సంయుక్తం 
పీతాంబర శుశోభితం 
అవ్వాప్త తులసీ గంధం 
కృష్ణం వందే జగద్గురుం


మంచిమాట

మంచిమాట
మనకు రెండురకాల విద్య అవసరం 
మొదటిది జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది
రెండవది మనం ఏవిధంగా జీవించాలో నేర్పేది.



శుభోదయం

శుభోదయం




Saturday, August 22, 2015

మంచిమాట!!


మంచిమాట!!
మంచి నడవడిక ఎవరో ఇచ్చే కానుక కాదు 
ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం.!!!


Total Pageviews