Thursday, October 11, 2018

*పశ్చాత్తాపం- ఆవేదన- కృతజ్ఞత*

*పశ్చాత్తాపం- ఆవేదన- కృతజ్ఞత*
70 ఏళ్ళు ఉన్న ఒక పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయనను బంధువులు హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. ఆయనకు కొన్ని పరిక్షలు చేసి ఒకరోజు ఆక్సిజన్ పెట్టి ఇక ఇంటికివెళ్ళచ్చు అన్నారు.
సరే బిల్లు ఎంతైందని అడిగాడు పెద్దాయన 20 వేలు అన్నారు హాస్పిటల్ సిబ్బంది. వెంటనే పెద్దాయన ఏడవడం మొదలు పెట్టాడు.
డాక్టర్ పెద్దాయనను ఓదారుస్తూ... మీదగ్గర డబ్బు లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో కట్టండి! పర్వాలేదు అన్నాడు. దానికి ఆ పెద్దాయన లేదు నేను మీ డబ్బులు ఇప్పుడే ఇస్తాను అదికూడా క్యాష్ రూపంలోనే ఇస్తాను అన్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు డాక్టర్.
ఒకరోజు ఆక్సిజన్ పెట్టినదానికే మీరు 20 వేలు అడిగారు, ఆ సృష్టికర్త నాకు 70 సంవత్సరాలనుండి ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తున్నాడు. రోజుకు 20 వేల లెక్కన ఆయనకు నేను ఎంత డబ్బు కట్టాలి? నేను ఆయనకు కనీసం కృతజ్ఙత కూడా చూపలేదే? అని మరలా ఏడ్చేశాడు!

శరన్నవరాత్రులలో రెండవరోజు విదియ - బ్రహ్మచారిణి.

శరన్నవరాత్రులలో రెండవరోజు విదియ - బ్రహ్మచారిణి. ఈరోజు అమ్మవారు మనకు బాలా త్రిపురసుందరిగా దర్శనమిస్తారు.
ధధానాకర పద్మాఖ్యామక్షమాలా కమండలా|
దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యముత్తమా||
Image may contain: 1 person, flower, plant, nature and textదుర్గామాత రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. 'వేదస్తత్వం తపోబ్రహ్మ'. బ్రహ్మ అనగా వేదం, తత్త్వం, తపస్సు. ఈ తల్లి తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది. నైవేద్యంగా పులిహోరను సమర్పించాలి.

Wednesday, October 10, 2018

తెలుగుభాషాభిమానులైన మాన్యులందరకీ వందనం, శుభాభినందనం

చాలా చక్కగా వ్రాసారెవరో :-
అమృతాన్ని వర్షించు అమ్మయను మాట మరచి,
మృతశరీరాన్ని స్ఫురింపజేసే మమ్మీయను మాట నేర్చిరి!
నాన్నాయనగ, ప్రేమమీరగ విశ్వమంతను చూపే తండ్రిని,
డ్యాడ్ అంటూ బ్యాడ్ గా డమ్మీని చేసిరి!
అమ్మా నాన్నల ప్రేమ కలగలపిన అన్నను,
బ్రోదర్ అంటూ బరువూ భాద్యత లేనివానిగ మార్చిరి!
తమ్ముడూ అను మురిపాల పిలుపునకు కూడా,
ఒకటే పదం అంటూ సెలవిచ్చిరి!
అక్కాయనగ, అవ్యాజానురాగమైన ప్రేమను అనంతంగా కురిపించు
అమృతమూర్తిని, సిస్ టర్ అంటూ మిస్ చేసిరి!
చెల్లీయనగా, కష్టాల్లో నాకంటూ తోడుగా నా అన్న వున్నాడంటూ
భ్రమించే చెల్లికి కూడా, ఒకటే పదమంటూ సొద పెట్టిరి!
సంస్కారాన్ని తెలిపే నమస్కారాన్ని,
హెలో, హాయ్ అంటూ జాయ్‌గా ఎంజాయ్‌గా మార్చిరి !
యుగానికే ఆది తెలుగు వుగాది, సంస్కృతీ సంబరాలను మరచి, తల్లుల రోజు, తండ్రులరోజు, ప్రేమికుల రోజు,ఆంగ్ల సంవస్తరాది విందుల మత్తులో మునిగితేలిరి?
సుమతి లోపించి, వేమనను మరచి, తెలుగున సంభాషించు వాడిని చిన్నచూపు జూచి,
ఆంగ్లము అరకొరగా, అస్తవ్యస్తముగా పలికినా, చిలక పలుకులని భ్రమించసాగిరి?
వేయి మాటలేల, అత్తకు పిన్నమ్మకు, మామకు పెద్దయ్యకు,
బోడిగుండుకు మోకాలికి ముడి వేసినట్లుగా, ఒక్కటే పదమనిరి
అక్షరాలు తక్కువై, ఇఛ్ఛానుసారం పదాలను పొందుజేసి,
పెంపొందింపజేసిన ఎంగిలిభాష, విశ్వభాష యెట్లయ్యనో?
సుధామధురిమలొలుకు పరిపూర్ణ అమృతఘటము వంటి
తేట తెనుగు, విశ్వము నుండి కనుమరుగు యెట్లు కాజొచ్చొనో?
యెంత ఆలోచించినను, అవగతం కాకుండె వినర తెనుగు రాయుడా!!?
తెలుగుభాషాభిమానులైన మాన్యులందరకీ వందనం, శుభాభినందనం

*సి.బి.ఐ.మాజీ.జే.డీ.లక్ష్మీనారాయణ* గారు ఓ కధ చెప్పారు.

*సి.బి.ఐ.మాజీ.జే.డీ.లక్ష్మీనారాయణ*
గారు (19.09.2018) మచిలీపట్నం లో ముఖాముఖీ కార్యక్రమం లో ఓ కధ చెప్పారు.
ఒక ఊరిలో ఓ రైతు ఉన్నాడు.
అతనికో ఇల్లు వుంది. 
ఆ రైతు తనతో పాటు ఒక కోడిని ఒక మేకను పెంచుకుంటున్నాడు.
ఆ ఇంట్లో ఒక ఎలుక కూడా తిరుగుతుండేది.
ఆ ఊరిలోనే గ్రామస్థుల అవసరాలకు ఒక చెరువు వుంది.
దానిలో ఒక మొసలి నివాసం వుంటుంది.
కొన్నాళ్ళ తరువాత ఆ రైతు కి వివాహమై బార్య కాపురానికి వచ్చింది.
ఆవిడకి ఆ ఇంట్లో ఎలుక తిరగడం నచ్చలేదు.
ఆ విషయమే భర్తకి చెప్పింది.
ఎలుకను చంపడానికి బోను తీసుకురమ్మని చెప్పింది.
మరుసటి రోజే రైతు ఓ ఎలుకల బోను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు.
జరిగిన తతంగాన్ని చూసిన ఎలుక భయపడింది.
ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడటానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంది.
మందుగా కోడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది.
*నేను ఇంతవరకూ ఈ రైతుకి ఏ విధమైన నష్టం కలిగించే పని చెయ్యలేదు. ఏదో నా మానాన నేను బతుకుతున్నాను. ఇక మీదట కూడా వారి జోలికి రాను. నన్ను చంపవద్దని చెప్పు.*
అని ప్రాధేయపడి అడిగింది.
దానికి ఆ కోడి చిద్విలాసంగా...
*అది నీ వ్యక్తిగత విషయం. దానితో నాకేమిటి సంబంధం. నీ సమస్య నువ్వే పరిష్కరించుకో...*
అని సమాధానం చెప్పింది.
అప్పుడు ఆ ఎలుక మేకని ఆశ్రయించి అడిగింది.
దానికి ఆ మేక కూడా...
*అది నీ సమస్య...*
*దానిని నువ్వే సరిచేసుకోవాలి* *నాకు సంబంధంలేదు*
అని బదులిచ్చింది.
చేసేదేమీ లేక ఎలుక చివరిగా చెరువు దగ్గరకు వెళ్ళి మొసలిని కూడా అడిగింది ..
*ఎలాగైనా రైతుని ఒప్పించి నన్ను కాపాడు. నేను ఏ పొరపాటు చెయ్యను*
అని అడిగింది.
అప్పుడు ఆ మొసలి కూడా
*నాకు సంబంధం లేదంటూ...*
అలాగే మాట్లాడింది.
ఏదయితే అదే జరుగుతుందిలే అనుకుని ఎలుక తిరిగి ఇంటికి వచ్చేసింది.
ఆ రాత్రి ప్రొద్దుపోయాక పెద్ద శబ్దంతో బోను తలుపు మూసకుంది.
వెంటనే రైతు బార్య ఎలుక చిక్కింది అనుకుంటూ చీకట్లో తడుముకుంటూ బోను దగ్గరకు వెళ్ళింది.
కానీ... దానిలో దూరింది ఎలుక కాదు.
అది ఓ పాము.
ఆవిడ దగ్గరకు రాగానే అది ఆమెను చేతి మీద కాటేసింది.
ఆవిడ అరుపుకి అందరూ లేచి వచ్చారు.
ఆమెను ఓ మంచం మీద పెట్టి డాక్టర్ ని పిలుచుకొచ్చారు.
ట్రీట్మెంట్ మొదలైంది.
రోజులు గడుస్తున్నాయి.
అందరూ వచ్చి పలకరించి వెళుతున్నారు.
చుట్టాలు రావటం మొదలైంది.
ఇలా కొన్ని రోజులు గడిచాయి.
వైద్యం జరుగుతూనే ఉంది.
వచ్చిన చుట్టాలకి మర్యాదలు చేయటానికి ఓ రోజు ఆ రైతు తను పెంచుకున్న కోడిని కోసి వండి పెట్టాడు.
*ఎలుక మాత్రం అక్కడే వుంది.*
మరికొన్ని రోజులు గడిచాయి.
వైద్యం జరుగుతోంది.
చుట్టాలు ఇంకా ఎక్కువ మంది వచ్చారు.
వారి కోసమని ఆ రైతు మేకని కోసి ఫలావు చేసి పెట్టాడు.
*ఎలుక మాత్రం ఇంకా ఆ ఇంట్లో తిరుగుతూనే వుంది.*
వైద్యం జరుగుతుంది. కానీ ఆమె కోలుకోలేదు.
లాభం లేదని పొరుగూరు నుండి మరో వైద్యుడిని పిలిపించారు.
ఆ వైద్యుడు ఆమెను చూసి...
మరేమీ పర్వాలేదు.
నేను ఈమెను బ్రతికిస్తాను.
కానీ... వైద్యానికి నాకు మొసలి రక్తం కావాలి అన్నాడు.
దానితో అందరూ వెళ్ళి చెరువులో ఉన్న మొసలిని పట్టుకుని చంపి దాని రక్తం తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చారు.
రైతు భార్యకి నయమైంది.
*కోడి చచ్చింది.*
*మేక కూడా చచ్చింది.*
*చివరికి మొసలీ చచ్చింది.*
*కానీ... ఆ ఎలుక మాత్రం అక్కడే వుంది.*
*మన సమాజమూ ఇలాగే ఉంది*
*ఎవరికి వారే నాకేమిటి సంబంధం అనుకుంటే....*
*చివరికి వారు కూడా.....!!!!!!*

మనిషి జీవితము అంతే...,

అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, తెల్లటి పూలతో అందంగా ఉండేది.. దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది.. ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే ఆశ కలిగేది...
అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి.. ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి... చెట్టు బోసిపోయింది.. అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు., ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు...
అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు., తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా! అనే నమ్మకంతో బతుకుతుంది..
కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది.., అంతే చెట్టులో చలనం మొదలైంది.. కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి... కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి , పూవ్వులు వికసించాయి.. మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది... ఆ చెట్టు...!
మనిషి జీవితము అంతే...,
ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి..
కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు...
అయిన సరే నిరుత్సాహ పడకూడదు.. ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..
ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది అని గట్టిగా నమ్ము...
అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం..
గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి...
కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..
ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు.. కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు..
గుర్తుంచుకో.,..
నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు., దానికి సమయం రావాలి.. మనకు సహనం ఉండాలి...!!👍

*చెట్టు, పిట్ట కథ.

*చెట్టు, పిట్ట కథ.అందులో నీతి*
అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు. 
ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తనకూ తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్లి అడిగింది, "వర్షా కాలం వస్తోంది.నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద *గూడుకట్టుకోనా?"అంది*
*"వద్దు"*అనేసింది మొదటి చెట్టు.పిట్ట చిన్న బుచ్చుకుంది.
నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది. *సరే*"అంది రెండో చెట్టు. మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది.
*పిట్ట, పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది*
ఈలోగా వర్షాకాలం వచ్చేసింది.
అంతలో పెద్ద వర్షం. వర్షం పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్ళతో సహా కూలి పోయి, నీటిలో కొట్టుకుని పోతోంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ, *భగవంతుడు నీకు శిక్ష వేసాడు. నాకు సహాయం చేయడానికి*నిరాకరించావుగా అంది నవ్వుతూ...... నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు. *నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకు పోకూడదనే, నువ్వు గూడు కట్టు కునేందుకు నిరాకరించాను నేను* నన్ను క్షమించు. నువ్వు పది కాలాలు సుఖంగా ఉండు", అంది ఆనందంగా. *ఆ చిన్న పిట్ట చిన్ని గుండెలో సముద్రమంత ఆవేదన*. నీతి:ఎవరైనా నిరాకరిస్తే వారిని *తప్పుగా అర్థం చేసు కోవద్దు వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది*ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది.

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా శ్లోకం.

ఈ  శ్లోకం  చాలా  శక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులో  ఉన్నాయి .  ఈ  శ్లోకం  దుర్గాసప్తసతి  లో  కనిపిస్తుంది . ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారో  వారు  అన్ని భయాలనుంచీ    కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు. అందరూ  తప్పకుండా  నమ్మకం  తో  చదవండి

దుర్గా  దుర్గార్తి  శమనీ   దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ  దుర్గసాధినీ  దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ   దుర్గనిహంత్రీ   దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక   దవానలా
ఓం దుర్గ  మాదుర్గమాలోకా   దుర్గమాత్మ  స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా   దుర్గమవిద్యా  దుర్గమాశ్రితా
ఓం దుర్గమ  జ్ఞాన  సంస్థానా  దుర్గమ  ధ్యాన  భాసినీ
ఓం దుర్గ  మోహాదుర్గ  మాదుర్గమార్ధ  స్వరూపిణీ
ఓం దుర్గ  మాసుర  సంహంర్త్రీ    దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ  దుర్గమాతా  దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా  దుర్గ  దారిణీ
నామావళి   మిమాం  యస్తు దుర్గాయా  మమ మానవః
 పఠేత్సర్వ  భయాన్ముక్తో  భవిష్యతి  నసంశయః 

Total Pageviews