Saturday, January 29, 2022

కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.

 కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.

సీరియల్సు, బిగ్‌ బాస్‌ లాంటి కార్యక్రమాలు కాస్త ఆపి
ఇలాంటి వీడియోలు కుటుంబ అంతా కలిసి చూస్తే
నేటి తరానికి మన బంధాలు, అనుబంధాలు,
పండుగలు, ఉత్సవాలు అర్ధమవుతాయి.
కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లల సమూహం.
ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో
రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం.
పూర్వ కాలం నుండి భారత దేశ కుటుంబ వ్యవస్థ
ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు,
నాయనమ్మ తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు,
పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, అన్నయ్యలు, తమ్ముళ్ళు
ఇంకా ఆ కుటుంబ సభ్యుల వివాహాల ద్వారా మరిన్ని వంశాల
బంధుత్వం ఇలా అటువంటి ఉమ్మడి కుటుంబాల లో
మా విస్సా వారి కుటుంబం కూడా ఒకటి అలాగే
మా కొండేపూడి వారి కుటుంబ గురించి నేటి తరం వారికి
తెలియ చెప్పెందుకు ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=E6yT-uWaVyE వీడియో చూడండి.
మన బంధాలు అనుబంధాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేద్దాం! మరో తరానికి పరిచయం చేద్దాం! విస్సా ఫౌండేషన్‌!

Thursday, January 27, 2022

ఇది మేఘ సందేశమూ అనురాగ సంకేతమూ

 ఇది మేఘ సందేశమూ అనురాగ సంకేతమూ 

లేత మనసుల తొలి ప్రేమలో 

అనురాగ సందేశాన్ని ఇంత అందంగా 

ఆ మేఘ సందేశాన్ని అమోఘంగా మోసుకొచ్చి

మనసులకు హత్తుకునేలా 

అక్షరసుమాల భావ గీతం, 

అందుకు అనువైన సంగీతం 

అహ హా హా హాయి అనిపించే ఆ ఆలాపన, ఆ యుగళ గానం 

అద్భుతాలు అన్నీ కలగలిసిన సమ్మేళనా సంకేతం 

అహహహ ఆ ఆ ఆ హా

చిరుజల్లు కురిసేది విను వీధిలో కాదు అది విన్న మదిలో 

ఆ ఆ ఆ హా వెల్లువలా పొంగే ఆ పాల వయసుల 

మూగ మనసుల ప్రణయ గీతానికి 

ఈ పాట బాటలో మరిన్ని పాటలు 

అక్షారాల వంతెన వేసి 

పల్లవి చరణాలుగా 

ఆచరణ లోకి వచ్చేది ఎప్పుడో 

ఆ వాగ్ధానం చేసేవారు ఎవరో 

ఆప్పుడే కదా 

కలిసిన హృదయాలకది దీవెన


Wednesday, January 19, 2022

2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ ఓవర్‌ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం - సత్యసాయి విస్సా నిలయం

 2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ ఓవర్‌ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం - సత్యసాయి విస్సా నిలయం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన 2019 క్రికెట్ ప్రపంచ కప్ లో టై మరియు సూపర్‌ ఓవర్‌ లలో /ఛాంపియన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులు గెలుచుకున్నది మాత్రం న్యూజీలాండ్‌ అందులో ముఖ్యంగా జట్టు కెప్టెన్‌ స్థిత ప్రజ్ఞత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవ్వు ఆఖరి ఓవర్ ప్రపంచ కప్ ఈ ఉత్కంఠను శిఖరాగ్రానికి చేరుస్తూ ఫైనల్‌ ఓవర్లో ఇంగ్లండ్‌ లక్ష్యం 4 బంతుల్లో 15 పరుగులు. ఫైనల్‌ అనే త్రాసు కివీస్‌ వైపు మొగ్గింది. మూడో బంతిని స్టోక్స్‌ లాగిపెట్టి సిక్స్‌ కొట్టాడు. అప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రాయల్ స్మైల్ నవ్వు ఇంగ్లండ్‌ లక్ష్యం 3 బంతుల్లో 9 పరుగులుగా మారింది. అప్పటికీ కివీ్‌సదే ఆధిపత్యం. నాలుగో బంతికి స్టోక్స్‌ 2 పరుగులు తీయడం.. ఫీల్డర్‌ గప్టిల్‌ వేసిన త్రో స్టోక్స్‌కు తగిలి బౌండరీ లైన్‌ దాటడంతో మొత్తంగా 6 పరుగులొచ్చాయి. ఫైనల్‌ మ్యాచ్‌కు ఇదే టర్నింగ్‌ పాయింట్‌. చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లండ్‌ విజయానికి చేరువైంది. పక్కాగా ఇంగ్లండే గెలుస్తుందని అందరూ ఫిక్సయ్యారు కూడా! ఐదో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న రషీద్‌ రనౌట్‌ అయ్యాడు. చివరి బంతికి 2 పరుగులు కావాలి. బౌల్ట్‌ వేసిన ఫుల్‌ టాస్‌ను లాంగ్‌ ఆన్‌ దిశగా ఆడాడు స్టోక్స్‌. వెంటనే ఈ వైపు నుంచి స్టోక్స్‌.. నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌ నుంచి వూడ్‌ పరుగులు పెట్టారు. ఒక పరుగే పూర్తయింది. రెండో పరుగు పూర్తయ్యేంతలో వూడ్‌ రనౌట్‌ అయ్యాడు!! 241 పరుగులతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్‌ టై!!

Wednesday, January 12, 2022

ఆముక్తమాల్యద కావ్యం గురించి సులభంగా వివరించగల శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఈ వీడియో ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=ioTwaML5syU

 

ధనుర్మాస శుభవేళ! ముక్కోటి ఏకాదశి పర్వదినాన పెద్దలు, పిల్లలతో కలిసి వీలున్నసమయంలో https://www.youtube.com/watch?v=ioTwaML5syU

ఈ వీడియో చూస్తే మనకున్న అనేక సందేహాలు తీరిపోతాయి

1. ధనుర్మాసం అంటే ఏమిటి?

2. శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కథ ఏమిటి?

3. ఆముక్తమాల్యద అంటే ఏమిటి?

4. ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసి సాయంత్రం కవుల సాహిత్యంతో పోటీపడి యుద్దంలోనూ, కవిత్వంలోనూ గెలిచి సాహితీ, సమరాంగణ సార్వభౌముడు అని పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఈ ఆముక్తమాల్యద కావ్యం గురించి   సులభంగా వివరించగల శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఈ వీడియో ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=ioTwaML5syU  చూడండి. మన ఘన చరిత్ర తెలుసుకుందాం తెలియజేద్దాం -  విస్సా పౌండేషన్!


Friday, December 24, 2021

స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా విస్సా ఫౌండేషన్‌ కు చేంజ్‌ మేకర్‌ బేడ్జ్‌ స్థాయి ఓ గర్వ కారణం!

స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా విస్సా ఫౌండేషన్‌ కు చేంజ్‌ మేకర్‌ బేడ్జ్‌ స్థాయి ఓ గర్వ కారణం 1 వ స్థాయి 480 పాయింట్సు నుంచి 16 స్థాయిలు దాటి 1 లక్ష పాయింట్సుకి చేరువై ఇప్పుడు 3 లక్షల 1970 పాయింట్సు చేరిన ప్రస్థానం . ఇది నిజంగా మా చిన్నారుల విజయం. మా విస్సా ఫౌండేషన్‌! బాలమిత్ర, చందమామలకు వారి తల్లితండ్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఈ విజయం మా చిన్నారులందరిదీ మరీ ముఖ్యంగా వారిని ఉత్సాహంగా పంపుతున్న వారి తల్లితండ్రులదీ అని సవినయంగా మనవి చేస్తున్నాను. స్వచ్చ భారత్‌ కార్యక్రమాలు 2014 సంవత్సరం నుంచి మా విస్సా ఫౌండేషన్‌ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఆదివారం పిల్లలకు వివిధ తరగతులు, కార్యశాలలు నిర్వహించి వివిధ అంశాల పట్ల అవగాహన కలిగేలా ఉదా: మొక్కలు నాటడం, నీళ్ళు పోయడం, కలుపు తీయడం వంటి సంరక్షణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్ధాల పునర్వినియోగం వంటి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలను ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ లో ఉంచడం జరిగింది. ఆ విజయ ప్రస్థానం అనంతంగా కొనసాగుగాక!





Thursday, December 23, 2021

వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం రతన_టాటా. ''

 

వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం
డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు. కారణం ఆ నాల్గవ వ్యక్తి #రతన_టాటా. '' సార్ , మీరు ? '' '' అవును , మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? '' అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ]
TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది !
బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది.
యవ్వనంలో ఆయన girl friend మోసం చేసింది.
ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి.
కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. #TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది :
టాటా సంస్థ అయిన #TCS యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.
భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది.
ప్రతి ఏటా అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50000 + కోట్లు ]
నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క #TajHotel మీద [ కింద ఫోటోలో కనిపిస్తుంది ] ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం , పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ] నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు : Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.
నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.
(సేకరణ)

Saturday, December 11, 2021

 64లక్షల #జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక #పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా #దేహం పెరుగుతుంది. దేహం మీద #మోహం పెరుగుతుంది.

ఈ దేహం నేనె అంటాం. కానీ ఎలా?

నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?

ఏ భాగము వినదు.

వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.

చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.

అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.

ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?

ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?

ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?

ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు. 

ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.

ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకొ..

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.

రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.

చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.

ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

రూపానికి ముందు నువ్వున్నావు.

రూపంలో నువ్వున్నావ్.

రూపం వదిలేశాకా నువ్వుంటావు.

ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు. 

ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఒ అద్భుత వరం. 

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్....👏👏

Total Pageviews