భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Wednesday, December 31, 2014
ముక్కోటి ఏకాదశి(జనవరి 1, 2015, గురువారం)
ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదశులుంటాయి . ప్రతి నెలా అమావాస్య కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి . ఆషాడశుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశి గా పరిగనిస్తారు .
* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదశులు 12 ఉంటాయి .. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులనువిశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:
1.ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
2. కార్తీక శుద్ధ ఏకాదశి
3. పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
4.మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)
వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి
పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. ఒక చిన్న స్థలం ఉంటే తూర్పు దిక్కుగా నిలుచుంటే దానికి నిట్టనిలువుగా తూర్పు పశ్చిమాలు, అడ్డంగా ఉత్తర దక్షిణాలూ వుంటాయి. ఈ ఉత్త్తర దక్షిణ విభాగాన్ని ప్రాచీనులు కేవలం ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయకుండా కాలంలోనూ, శరీరంలోను కూడా ఈ విభాగాన్ని చేశారు.
కాలంలో ఉత్తరం పగలు; దక్షిణం రాత్రి
కుడి చేయి దక్షిణం; ఎడమ చేయి ఉత్తరం
ఎక్కడైనా (ఉత్తర - దక్షిణాలలో) ఉత్తరమే పవిత్రమైనది, శ్రేష్టమైనది.
దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు - అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట. అనగా, వారి పగలు ప్రారంభమైందన్నమాట. ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు.
సూర్యుడు ఉత్తరాయణానికి మారేముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచిఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.
ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.
విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.
పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

Tuesday, December 30, 2014
పుట్టిన రోజు నాడు ఏమి చెయ్యాలి? ఎలాచెయ్యాలో తెలుసుకుందాం! నేర్చుకుందాం!
1) పుట్టినరోజును ఎలా జరుపుకోవాలి. బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచన సుధాసారం
https://www.facebook.com/video.php?v=521257431312327&set=vb.100002842256160&type=2&theater
పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి ?
మన భారతీయ సాంప్రదాయంలో పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి సరి ఐన పద్ధతి..
.
పద్ధతి :
.
1) ఉదయమే లేచి అభ్యంగన స్నానం చెయ్యాలి . ( తలకు , వంటికి నూనె రాసుకొని చేసేది అభ్యంగన స్నానం అంటారు ).
.
స్నానంతరం కొత్త బట్టలు కట్టుకునిదైవసన్
నిధిలో...
.
2)ఆవుపాలు , బెల్లం , నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని 3 సార్లు తీర్థం పుచ్చుకున్నట్లు తీసుకోవాలి
( అందువల్ల వచ్చే సంవత్సరం వరకూ గండాలు రాకుండా ఉంటాయి )
.
3)పుట్టిన రోజు చేసుకునేవారు గానీ , పెద్దలు గానీ సప్త చిరంజీవుల పేర్లను తలచుకోవాలి
.
సప్త చిరంజీవులు.
.
చిరంజీవులు అంటే చిరకాలం జీవించిఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు.
.
పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం.
అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||
.
దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు.
{ పై విషయాలను శ్రీయుత చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగం నుండి గ్రహించినవి}
.
4 ) 5 రంగుల బియ్యం తో ఒక చోట స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసి దానిలో 5 దీపాలు , పెద్దవారితో వెలిగింపచేయ్యాలి . వాటిని వెలిగించుతూ దీప ప్రజ్వలన మంత్రాలు చెప్పాలి. లేదా ఓం కారం జపించండి
.
5 ) ఆయుష్య సూక్తం చదువుతూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించాలి .
.
వారిని వీపు మీద నిమరాలి .
.
6) ఇంటిలో గానీ , గుడి లో గానీ రుద్రాభిషేకం చేయించాలి .
.
7 ) చెయ్యగలిగిన సహాయం ఇతరులకు చెయ్యాలి ( దానం )లేకపోతే ఆవుకు పచ్చిగడ్డి తినిపించాలి
.
8 ) చక్కటి ఆరోగ్యవంతమైన భోజనం చెయ్యాలి
.
9) ఆ రోజు రాత్రి భ్రహ్మ చర్యం పాటించాలి
.
10 ) చిన్న పిల్లలకి ప్రతీ మాసం ( మొదటి ఏడాది ) అదే తిది రోజున పుట్టిన రోజు చెయ్యాలి .
.
సంస్కృతం లో పుట్టిన రోజు శుభాకాంక్షలు
.
జన్మదిన మిదం అయి ప్రియ సఖే ! సంత నోతు హి సర్వదా ముదం
ప్రార్ధయామహే భవ శతాయుషీ ఈశ్వరం సదా త్వాం చ రక్షతు
పుణ్య కర్మణా కీర్తి మార్జయా జీవనం తవ భవతు సార్ధకం
.
ఈ కూచిపూడి బృంద నాట్య విన్యాసానికి ఆ క్రీడాప్రాంగణం ఆనంద బృందావని అయ్యింది, అయోధ్యపురి, కైలాసగిరి అయ్యింది, ఇది కేవలం గిన్నీసు పుస్తకంలో ఒక కాగితం ముక్కమీద రాయడంకోసం సంకల్పించినది కాదు కాదు కాదు. ఆ శివానందుని... ఆ దశరధనందనుని...ఆ నందనందనుని... మన మహాభాగ్య వశమున భాగ్యనగరము శివరామకృష్ణ లీల క్రీడల నృత్యకేళీ విలాసమయ్యింది ఈ మూడు రోజుల పండుగ కూచిపూడి ని మరువనివ్వమని మూడునాళ్ళ ముచ్చటగా మారనివ్వమని రుజువుపరచింది. ఈ చిరు చిరు మువ్వల సిరి సవ్వడులు... భావి మరుసవ్వడులుగా మారేలా...ఈ తెలుగు నాట్యరీతి భువిలో శాశ్వతమయ్యేలా ఒక తెలుగు వాని గట్టి సంకల్పాన్ని విశ్వానికి చాటిచెప్పింది. ఇదిగో మీ కోసం ఈ యు ట్యూబ్ లంకె నొక్కండి. https://www.youtube.com/watch?v=2wFH1GymPeg తనివితీరా తిలకించండి!పులకించండి!! మా ఆనందుని మహా సంకల్పాన్ని అభినందించండి! సత్య సాయి - విస్సాఫౌండేషన్.
Thursday, December 18, 2014
Monday, December 15, 2014
శ్రీ కృష్ణదేవరాయలు రచించిన"ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆముక్తమాల్యద ప్రవచన సుధారసదార 1 వ భాగం!
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలు లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆముక్తమాల్యద ప్రవచన సుధారసదార ఈ ధనుర్మాసారంభ శుభవేళ మీ అందరి ఆనందం కోసం...మన తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదిద్దాం!...మన ఘన తెలుగు కవులను స్మరిద్దాం!
1 వ భాగం!
1) https://www.youtube.com/watch?v=y9x8onmwdBk

ఈ దిగువ లంకె నొక్కండి.... మంజుల శ్రీ గారిచే తిరుప్పావై వ్రతం గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.
గోపెమ్మలు ఆచరించిన మార్గశీర్ష వ్రతాన్ని తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో జన్మించిన గోదాదేవి ' తిరుప్పావై' - శ్రీకరమైన పద్యాల సమాహారం - పాశురాలుగా రచించి అలరించింది. శ్రీ మహాలక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి విష్ణు చిత్తుడు అనే మహనీయుని కుమార్తెగా జన్మించి విష్ణుదేవుని రూపమైన శ్రీరంగనాథుని వివాహమాడింది.
ఈ వివాహం సిద్ధించడం కోసం గోదాదేవి తన సఖీ బృందంతో కలిసి ధనుర్మాసంలో రోజుకొక పాశురాన్ని పాడింది. ద్వాపరయుగం నాటి గొబ్బెమ్మలు లేదా గోపెమ్మలు కలియుగంలో గోదాదేవి బృందం.
గోపెమ్మలు తెల్లవారు జామున నిద్రలేచి ఒకరినొకరు నిద్రలేపుకుంటూ వెళ్ళి నందుని ఇంత నిదురించి ఉన్న శ్రీకృష్ణుని నిద్రలేపి పూజించడం 'తిరుప్పావై'లోని ఇతివృత్తం.
ఇంటిముందు గొబ్బెమ్మలను నిలిపి కన్యలు - శ్రీకృష్ణుని గురించి పాడడం - మంచి భర్తను పొందడం కోసం.
ఈ వ్రతంలో భాగంగా ఇరవై ఏడు రోజుల పాటు నెయ్యి, పాలు వంటి భోగవస్తువులను కన్య పిల్లలు పరిహరించాలన్నది సనాతన సంప్రదాయం. ఇరవై ఎనిమిదవ రోజున పువ్వులు ధరించి, నెయ్యితో, పాలతో మధుర మధురమైన పొంగలిని యితర వంటలను చేసి కృష్ణునికి అర్పించి ఆరగించాలి.
కానీ వ్యవహారంలో మాత్రం మొదటి రోజు నుండీ చక్క్రే పొంగలి, ఉప్పొంగలి చేసి నైవేద్యం పెట్టడం ధనుర్మాస సంప్రదాయమైంది. సూర్యుడు ఉదయించకముందే పూజలు చేసి ఈ పొంగలి నైవేద్యం పెట్టడం ఇళ్ళలోనూ, గుళ్ళలోను కూడా కొనసాగుతున్న శుభసాంప్రదాయం.
ఈ దిగువ లంకె నొక్కండి... మంజుల శ్రీ గారిచే తిరుప్పావై వ్రతం గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!!
https://www.youtube.com/watch?v=B1yJlqk07ms
ఈ దిగువ లంకెలు నొక్కండి... చినజియ్యరు స్వామి వారి తిరుప్పావై గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!!
https://www.youtube.com/watch?v=tej59_nhSJQ
http://www.chinnajeeyar.org
/Learn/Thiruppavai.aspx

Friday, December 12, 2014
తల్లి తండ్రులకు ఒక గమనిక, ఒక విన్నపం.
పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లలుగా పౌరులుగా తీర్చిదిద్దాలి అనుకుంటే, అది మీ చేతులలోనే ఉంది.
1. రోజులో ఒక పది నిముషాలు పిల్లలు ( వారు ఎ వయసు వారైనా ) చెప్పే మాటలను శ్రద్ధగా, సంతోషంగా , ఆసక్తిగా విని, వారితో పదినిముషాలు గడపడం అలవాటు చేసుకోండి.
2. ఆ పదినిముషాలు టీవీ, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ ఫోన్, ఇంకా ఇతరత్రా వ్యాపకాలు లేకుండా చూసుకోండి.
3. అలాగే సాధ్యమైనంత వరకు, రోజులో ఉదయం అల్పాహారం కానీ, రాత్రి భోజనం కానీ కుటుంబ సభ్యులు కలిసి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ టైం లో కూడా వీలైనంత వరకు, జోక్స్, సరదా కబుర్లతో గడపండి.
4. అలాగే, పిల్లల ఎదురుగా ఎవరినీ విమర్శించడం అలవాటు చేసుకోకండి. పిల్లల ఎదురుగా పోట్లడుకోకండి. అలాగే, ఒకరి పుట్టింటి వారిని ఒకరు పిల్లల ఎదురుగా విమర్శించకండి.
5.వారానికి ఒకసారి అయినా, పిల్లలతో కాస్సేపు ఆడుకోండి.
6. వీలైనంత వరకు మీరు టెక్నాలజీ ని పిల్లల ఎదురుగా సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించండి.
7. పిల్లల స్నేహితుల మీద, వారి తో కలిసి తిరిగే సమయం మీద ఒక కన్నేసి ఉంచండి.
8. పిల్లల స్నేహితులు ఇంటికి వచ్చినపుడు, వారి వారి ప్రత్యెక గదులలో కాకుండా ఇంటిలో కామన్ హాల్ లో కూర్చొని, మాట్లాడుకోమని చెప్పండి.
9. మీరు వారి మాట వింటారు అనే నమ్మకాన్ని, పిల్లలలో కలుగ చేయండి. మీ పిల్లలు చెడిపోతే అది మీ బాధ్యతే.
10. పిల్లలు పార్టీలకు, గెట్ టుగెదర్ లకు వెళ్ళేటప్పుడు, తిరిగి ఇంటికి రావలసిన సమయాన్ని మీరు నిర్ణయించండి.
11. పిల్లల ముఖ్యమైన స్నేహితుల, ప్రొఫెసర్ ల ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోండి.
12. ఒకవేళ పిల్లలు పరీక్షలలో విఫలం అయినా, వారిని ఇతరులతో పోల్చితిట్టకండి. అది వారి మనసు మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
13. మేము మిమ్మల్ని నమ్ముతున్నాము అనే నమ్మకాన్ని వారిలో కలిగించండి.
14. ఇంట్లో పెద్దవాళ్ళు ( నానమ్మలు, తాతయ్యలు ) ఉంటె వారితో కొంతసేపు గడపడం అలవాటు చేయండి.
15. వారి పట్లమీరు గౌరవం చూపిస్తే, పిల్లలు కూడా వారిని గౌరవిస్తారు.
ప్రతి తల్లితండ్రులు ఈ సూచనలు పాటిస్తే, పిల్లలు కొంతవరకు ప్రక్కదారులు పట్టకుండా ఉంటారు.

Sunday, November 30, 2014
Saturday, November 29, 2014
విస్సా ఫౌండేషన్ - ప్రభవ్, ప్రణవ్ - నాటిక; శ్రీ సత్యసాయి బాబా 89వ జన్మదిన వేడుకలు!!
23-11-2014 న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 89వ జన్మదినం సందర్భంగా అర్డినన్స్ ఫ్యాక్టరీ (ఆయుధకర్మాగారం), ఎద్దుమైలారం, మెదక్ జిల్లా లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిరంజీవులు ప్రభవ్, ప్రణవ్ - నాటిక
https://www.youtube.com/watch?v=Gbj431wJKCc

విస్సా ఫౌండేషన్ - ప్రభవ్ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు!!
23-11-2014 న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 89వ జన్మదినం సందర్భంగా అర్డినన్స్ ఫ్యాక్టరీ (ఆయుధకర్మాగారం), ఎద్దుమైలారం, మెదక్ జిల్లా లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిరంజీవులు ప్రభవ్, ప్రణవ్ - నాటిక
http://youtu.be/u2UhB_6lj0c
Wednesday, November 26, 2014
Saturday, November 15, 2014
విస్సా ఫౌండేషన్ - పద్యాలు - శ్రీ అయ్యగారి వేంకటరామయ్య 2వ భాగం
ఈ దిగువ యు ట్యూబ్ లంకె నొక్కండి
మా పెద్దతాతగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ విస్సా వేంకటరావు గారు మరుగున ఉండిపోయిన మహా కవి, పండితుడు... వీరి శైలి ద్రాక్షాపాకము...వీరు ఎన్నో అద్భుత రచనలు చేసారు. అందులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , మల్లమ్మ కధ అనే కావ్యాలను బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారు అచ్చు వెయ్యటమే కాక..తన గానమాధుర్యంతో వెలుగులోకి తెచ్చిన మహా పండితుడు, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!సత్యసాయి విస్సా ఫౌండేషన్!
http://youtu.be/r2fP7DMwOwY

Friday, November 14, 2014
బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారి గానమాధురి 1వ భాగం
మా పెద్దతాతగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ విస్సా వేంకటరావు గారు మరుగున ఉండిపోయిన మహా కవి, పండితుడు... వీరి శైలి ద్రాక్షాపాకము...వీరు ఎన్నో అద్భుత రచనలు చేసారు. అందులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , మల్లమ్మ కధ అనే కావ్యాలను బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారు అచ్చు వెయ్యటమే కాక..తన గానమాధుర్యంతో వెలుగులోకి తెచ్చిన మహా పండితుడు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!...సత్యసాయి విస్సా ఫౌండేషన్!
http://youtu.be/DznwhvteJNk
http://youtu.be/DznwhvteJNk
Thursday, November 13, 2014
మా బ్లాగ్ విజయోత్సాహం!! 4నెలల్లొ..16 దేశాలకు చెందిన 2020 మంది వీక్షకులు!!
2014 జూన్ నెలలో 30 వ తేదీ, సోమవారం నాడు ప్రారంభించిన మా బ్లాగ్ విజయోత్సాహం!! ఇదిగో చూడండి. 4నెలల్లొ..16 దేశాలకు(ఇండియా, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, మారిషస్, యుక్రెయిన్, వియత్నాం, బొలివియా, ఒమన్, స్పెయిన్, కెనడా, చైనా ) చెందిన 2020 మంది వీక్షకులు మా 'ఫౌండేషన్ విస్సా బ్లాగ్' సందర్శించడం ఒక పక్క మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది...మరోపక్క మా వీక్షకుల అబిమానం నిలుపుకోనేలా, వారి ఆకాంక్షలు, అంచనాలకు తగినట్లు రూపెందించేలా మా బ్లాగ్ ను నిర్వహించే భాద్యతను మరింత పెంచుతోంది. ఈ శుభ సందర్భంలో వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!! భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన మా విస్సా ఫౌండేషన్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ లంకె మీద నొక్కండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా బ్లాగ్ ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా సహకరించమని విశ్వవ్యాప్త వీక్షకులకు మా వినమ్ర విన్నపం!!....ఈ ఆనందోత్సవ శుభవేళ...మా విస్సా ఫౌండేషన్ కార్యక్రమాలు త్వరలో యు ట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంచుతున్నామని విన్నవించుకుంటున్నాము..ధన్యవాదములతో...సత్యసాయి విస్సా ఫౌండేషన్.
Wednesday, November 12, 2014
ప్రభవ్ - విస్సా ఫౌండేషన్
ఈ దిగువ లంకెలు నొక్కండి! ఆస్వాదించండి!! ఆశీర్వదించండి!!!
1) ప్రభవ్ పద్యాలు - ఆది గణాధిపతే!!
https://www.youtube.com/watch?v=OlLUKpkx23c
2) ప్రభవ్ పద్యాలు - శ్రీ సరస్వతి నమోస్తుతే!!!
https://www.youtube.com/watch?v=M1S5k8mLm20
3) శ్రీ రెంటాల వెంకటేశ్వర రావు గారు రచించిన, శ్రీ గజల్ శ్రీనివాస్ గారు పాడిన 'నాన్నగజల్ ' మా చిన్నబ్బాయ్ చిరంజీవి నాగ ప్రభవ్ గళం నుంచి మీ ఆనందం కోసం...సత్యసాయి విస్సా ఫౌండేషన్
గజల్; ప్రభవ్ - విస్సా ఫౌండేషన్
http://youtu.be/-LoWwg5LD4I
'ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్' మా ఇంటి మహాలక్ష్మి చిన్నారి మహి చేతినుంచి జారిన ముత్యమంత ముగ్గులు!! సత్యసాయి విస్సా ఫౌండేషన్!
ఈ దిగువ యు ట్యూబ్ లంకెలు నొక్కండి!.
మా చిన్నారి ముద్దుగుమ్మ ముద్దుగా పెడుతున్న ముత్యాల ముగ్గుల వీడియోలు చూడండి!!
1)
https://www.youtube.com/watch?v=F3ZWgsV9uOc&feature=youtu.be
2)
https://www.youtube.com/watch?v=qVgMPxjoVss&feature=youtu.be

Subscribe to:
Posts (Atom)