Saturday, February 9, 2019

అందరికీ మొదటి మాఘపు ఆదివారం మరియు శ్రీపంచమి శుభాకాంక్షలు

అందరికీ మొదటి మాఘపు ఆదివారం మరియు శ్రీపంచమి శుభాకాంక్షలు 
ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.
Image result for vasanta panchami in teluguమాఘస్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకం!!!
" దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "
అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.
పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.
Image result for vasanta panchami in teluguస్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.
ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి. అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.
కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.
ఈ మాసంలోని శుక్లపక్ష తదియనాడు బెల్లము,పప్పులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాలా మంచిది.
రథసప్తమి రోజున మరియు ప్రతి ఆదివారము ఆవుపాలు,బియ్యం, బెల్లం తో చేసిన పరవాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి.
ఈ మాసంలో వచ్చే పండుగలు!!
 ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

No comments:

Post a Comment

Total Pageviews