Thursday, February 27, 2020

జన్మదినమిదం హే ప్రియసఖే శంతనోతుతే సర్వదా ముదం

"చిరునవ్వు వెల ఎంత?
మరుమల్లె పూవంత!
మరుమల్లె వెల ఎంత?
సిరులేవి కొనలేనంత !!

 వెండి వెన్నెల్లో
మానస సరోవరంలో
హంసలు కలువలతో ఆడుకుంటుంటే చూసారా?
పద్మాలు మీనాలతో ముచ్చటించడం కలలో కాదు ఇలలో చూసారా?
లేదు కదూ! చాలా మిస్ అయ్యాం అనిపిస్తుంది కదా!
కానీ మనం అలా దిగులు పడాల్సిన పని లేదు
ఎందుకంటారా ఈ చిరునవ్వు చూస్తే ఆ దృశ్యాన్ని
చూడలేదు అన్న దిగులుండదు
ఇదిగో ఇటు చూడండి ఈ చిరునవ్వు చూడండి
వెండి వెన్నెల సంద్రంలో  బంగారు
పద్మాలు,కలువలతో జత కూడి నవ్వుతున్నట్టుగా ఉంది కదూ!
ఎంతటి కోపమైనా,బాధైనా,అలసటైనా సరే ఆ చిరునవ్వుని చూసి పారిపోవాల్సిందే!
ఆమె ఒక సుహాసిని
సుమధుర భాషిణి!
మరి ఈ రోజు ఈ చిరునవ్వుల పుట్టినరోజు వనంలో
మనందరికీ పండుగ రోజు

వనంలో ఈ పద్మం గురించి తెలియని వారుండరు
ఈ సుహాసిని పలుకరించని వారు ఉండరు...
మన సంస్కృతీ ,సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ,
తేనెలూరు తెలుగు భాషకు సముచితాసనం వేస్తూన్న మన
వన మిత్రులు, ఆత్మీయురాలు  అయిన పద్మజా చెంగల్వల గారికి

జన్మదినమిదం హే ప్రియసఖే
శంతనోతుతే సర్వదా ముదం
ప్రార్థయామహే భవశతాయుషే
ఈశ్వరా సదా త్వాంచ రక్షతు
పుణ్యకర్మణా కీర్తిమర్జయే
జీవనం తవ భవతు సార్ధకం
హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

మీరు ఎప్పుడు ఇలాగే కోటి కాంతుల చిరునవ్వులు చిందిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని
మనసారా కోరుకుంటున్నాం !!
మిమ్మల్ని అభిమానించే

మీ ...
పున్నాగవనం అడ్మిన్ బృందం

Sunday, February 23, 2020

సన్మిత్రులతో ఓ చక్కని సాహితీ సాయంకాలం! వేదిక:హోటల్ దసపల్లా! సాహితీ రసగుల్లా!! 22.02.2020


సన్మిత్రులతో ఓ చక్కని సాహితీ సాయంకాలం! వేదిక:హోటల్ దసపల్లా! సాహితీ రసగుల్లా!! 22.02.2020
అద్దమందు కొండలా కొంచెంలా కనిపించే మిత్ర శ్రేష్ఠులు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ కాళహస్తీశ్వరున్ని "ఏ లీలన్ నుతియింప వచ్చు నిను" అని వాపోయిన ధూర్జటిలా లజ్జా స్థితి లో ఉంది నా స్థితి. సమ్ పీపుల్ మేక్ ద వరల్డ్ వెరీ స్పెషల్ జస్ట్ బై బీయింగ్ ఇన్ ఇట్ అన్న ఆంగ్ల కవి సూక్తులను నిజం చేస్తూ ఒక మంచి కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, సౌందర్యారాధకుడు, చిత్రకారుడు, తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, నిత్య సాహిత్యాన్వేషి, వక్త, నిరాడంబరుడు, నిగర్వి, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఉన్నతాధికారి, ఇలా ఎన్నెన్నో సుగుణాల గని, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. పేరుకి చినవీరభద్రుడు ప్రపంచ సాహిత్యాన్ని గొప్పగా ఔపాసన పట్టిన చినవీరభద్రుని పెద్ద ఆనంద తాండవం ఆయన ప్రతి రచనలో దర్శనమిస్తుంది అదే ఆయన ప్రతిభకు నిదర్శనం. బహుశా విశ్వ సాహితీ సాగర తీరం వెంబడి దేశ దేశాల లంగరు వేసి ఓడలలో విజ్ఞానాన్ని తరలించ దానికి సహజ సిద్దముగా ఏర్పడిన ఓడరేవు మా వాడ్రేవు! ఆయనతో సంభాషించాలంటే భయంగా ఉంటుంది? అపారమైన జ్ఞాన సముద్రం ముందు నిలబడ్డ అల్ప ప్రాణిలా అనిపిస్తుంది. విస్తృతమైన పరిజ్ఞానం పాటవం ఎప్పటిలాగే మంత్రముగ్ధులను చేస్తాయి...రాతలతో, గీతలతో మధుర భావనలు పంచి, పెంచుతున్న మహోన్నత కృషీవలుడు.
ఒక వ్యక్తిలో ఇన్ని సుగుణాలు ఎలాసాధ్యం? ఆయన దినచర్య ఏమిటి?
ఇంత అపురూపమైన...సున్నిత మనస్కుడైన భావకుడైన, లలితా కళా ప్రియుడు పేస్ బుక్ లో మనమిత్రుడు గా ఉన్నారంటే ఆ మాధుర్యం, ఆ తృప్తి, మన నిరాశల శిశిరాల్లొ ఆశల వసంతంలా ఎప్పుడూ తోడుంటాడు మంచి మంచి భావాలతో నేను ఉన్నాను అంటూ...మనల్ని పలకరిస్తాడు. మనకి గర్వాన్ని, గౌరవాన్ని, ఆనందాన్ని కలిగిస్తాడు. మిత్రమా ఇలాగే శత వసంతాలు ...సంతస వసంతాలు పూయిస్తూ వుండు.. ధన్యవాదాలు. నమస్సులు🙏🙏🙏









చిన వీరభద్రుడు గారి తో సంభాషణ
సమ్ పీపుల్ మేక్ ద వరల్డ్ వెరీ స్పెషల్ జస్ట్ బై బీయింగ్ ఇన్ ఇట్
ఒక మంచి కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, సౌందర్యారాధకుడు, చిత్రకారుడు, తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, నిత్య సాహిత్యాన్వేషి, వక్త, నిరాడంబరుడు, నిగర్వి, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఉన్నతాధికారి, ఇలా ఎన్నెన్నో సుగుణాల గని విశ్వ సాహితీ సాగర తీరం వెంబడి దేశ దేశాల లంగరు వేసి ఓడలలో విజ్ఞానాన్ని తరలించ దానికి సహజ సిద్దముగా ఏర్పడిన ఓడరేవు మా వాడ్రేవు! పేరుకి చినవీరభద్రుడు వాగర్ధాల వివరింపగా  ఆనందతాండవమాడు ఆ వీరభద్రుడు!!   
రాతలతో, గీతలతో మధుర భావనలు పంచి పెంచుతున్న మహోన్నత కృషీవలుడు.
సంభాషించాలంటే  భయంగా  ఉంటుంది? అపారమైన జ్ఞాన సముద్రం ముందు నిలబడ్డ అల్ప ప్రాణిలా  అనిపిస్తుంది
విస్తృతమైన పరిజ్ఞానం పాటవం ఎప్పటిలాగే మంత్రముగ్ధులను చేస్తాయి...
ప్రపంచ సాహిత్యాన్ని ఔపాసన పట్టిన చినవీరభద్రుని పెద్ద ఆనంద తాండవం ఆయన ప్రతి రచనలో దర్శిస్తాము
ఉద్యోగం, చిత్రలేఖనం, చదవటం, ఉపన్యాసాలు ఎలాసాధ్యం  ఆయన దినచర్య ఏమిటి?   
ఇంత అపురూపమైన...సున్నిత మనస్కుడైన భావకుడైన, లలితా కళా ప్రియుడు 
పేస్ బుక్ లో మనమిత్రుడు గా ఉన్నారంటే ఆ మాధుర్యం, ఆ తృప్తి, మన నిరాశల శిశిరాల్లొ ఆశల వసంతంలా ఎప్పుడూ తోడుంటాడు మంచి మంచి భావాలతో నేను ఉన్నాను అంటూ...మనల్ని పలకరిస్తాడు. మనకి గర్వాన్ని ఆనందాన్ని కలిగిస్తాడు. మిత్రమా ఇలాగే శత వసంతాలు ...సంతస వసంతాలు పూయిస్తూ వుండు.. ధన్యవాదాలు. 
 ఈ భావనలు నాకు వర్తిస్తాయి మిత్రమా  నేనొకప్పుడు మసిలిన నా చిన్ననాటి ఇల్లు, నా బాల్యం, పసితనంలోనే మమ్మల్ని వదిలివెళ్ళిపోయిన నా చెల్లెల్ని మళ్ళీ మళ్ళీ చూడలేను.  కొత్త ఊరుని చూసినప్పుడల్లా జీవితం మళ్ళా కొత్తగా మొదలవుతున్నట్టే అనిపించేది. గోదావరిని, సముద్రాన్ని


"నీ చూపు చాలమ్మా ఎందుకు వెన్నెలలు నీ నవ్వు చాలమ్మా ఎందుకు వేకువలు" ఒక కవి అన్నాడు. మా విశ్వ కవి మిత్రుడు భద్రుడు రాసిన ఒక పదం చాలు. మన మనోపధంలో నిలిచి పోవడానికి ఒక వాక్యమైనా మహా కావ్యం! ప్రపంచ సాహిత్యానికి మహా భాష్యం చెప్పే భావకవి... అనుభవకవి!  అనుభూతి కవి! ఆ భవభూతి కవి!! మిత్రమా వెయ్యేళ్ళు వర్దిల్లుమా!!!



ఒక పువ్వు భావకుని అంతరంగం నిండా విరిసి బయటకి చొచ్చుకుని వచ్చి విశ్వంభరని తన సౌందర్య సౌరభంతో వ్యాపిస్తే ఇలా అధ్బుత వ్యాసమవుతుంది. ఓ ప్రేమ భావుకా!  తెలుగు సాహితీ వసంత శోభా ప్రభలు విశ్వాన విరజిమ్ముతూ... శతపత్రదళ కీర్తి శోభామయ ప్రభలతో శతవసంతముల్ వర్దిల్లుమా!!


మీ కవితలు చదివినా.. మీ ప్రసంగాలు విన్నా మంత్ర ముగ్దుణ్ణైన నాకు స్పురించేభావం ఏమంటే? ఇది నాదే కాదు బహుశా అందరిదీ!!
ఓ శిశు కవి నీవు సుకవిలా ఆసుకవిలా ఆ సుకవుల్లా మారాలంటే
వేల కవితలు చదివి అధ్యయనం చెయ్యడం కాదు
అది చాలా పెద్ద కష్టం! సులభమైన మార్గం ఏమంటే చిన వీరభద్రుణ్ణి చదువు చాలు!!

మధురమైన ప్రతి క్షణం! జీవిత కాల తీపి జ్ఞాపకం!!
అయ్యా! భావుక మహానుభావా! సాయం సంధ్యావందనం!
మీ షిర్డీ హారతి అనుభవం కొత్తగా దశవిధ భక్తి మార్గాన్ని లోకానికి అనుభూతిలోకి తెచ్చింది.


ఆ కళ్ళు గేలమేసి ఏ ప్రకృతి సౌందర్యాన్ని మనసులోకి నింపుకుంటున్నాయో, ఆ మనోభావన  చిత్రంగా చేతినుంచి జాలువారి ఒక అద్భుత చిత్రంగా, రచనగా రూపుదిద్దుకోబోతోందో వేచి చూద్దాం!!


నువ్వు నీ జీవితప్రయాణంలో ఎన్ని వింతవింత లోకాలైనా చూడవచ్చుగాక కాని నీ హృదయం మాత్రం నీ స్వదేశంకోసం, నీ స్వగ్రామం కోసం, నీ స్వజనం కోసం కొట్టుమిట్టాడుతూంటుందని తెలియరావడమే ఒడెస్సీ.
ఒడెస్యూస్ నుంచి వాడ్రేవు చినవీరభద్రుడి దాకా విశ్వజనీనమైన అక్షరసత్యం ఇది

మీ పోస్ట్ లు చదవడమే ఓ ఎడ్యుకేషన్ వరల్డ్ స్పేస్ రేడియో లో 'మోహన రాగం' సాహిత్యప్రసంగాల లింక్స్ దయచేసి ఇవ్వగలరు ఆ అపార జ్ఞానవాహినిలో మేము కూడా మునకలు వేస్తాము .

అయ్యా నమస్కారం! ప్రతి పుస్తక ప్రదర్శనలోనూ మా అభిమాన మీ పుస్తకాల గురించి వెతకడం కొన్ని దొరకడం కొండంత నిరుత్సాహం! తీరా ఆ దొరికినవాటిని మిత్రులు చదవకుండా తీసుకుపోవడం తిరిగిఇవ్వకపోవడం! మీరు కొన్ని లింకులు పెడుతున్నారు కానీ కాసిని మల్లెపువ్వులదండను రెండుచేతుల్లో పెట్టుకుని గాఢంగా శ్వాసించడానికీ దూరంగా ఉన్న పూలగుట్టను, తోటను ఆస్వాదించడానికి ఉన్న అంతరంగా ఉంది. దయచేసి హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో మీ పుస్తకాలు అన్నీ ఉండేట్లు చూడండి మిత్రశ్రేష్ఠా! దయచేసి ఆ వివరాలు మాకు తెలియచేయండి మహాశయా!

ఒక కవిత రాయడం కాదు దర్షించాలి అన్న కవితా శీర్షిక కవిత చదవడం కాదు దర్శించాలి అనే ఆలోచన రేకెత్తింపచేస్తుంది వాక్యం రసాత్మకం కావ్యం అంటారు కానీ మీ ప్రతి వాక్యం వెంటాడే ఒక జ్ఞాపకం.మీసుమనస్సులకు మా నమస్సులు

మిత్ర రత్నమా
మీ రసాత్మక కావ్యాలు చదువుతూ
ప్రస్తుతాన్ని విస్మరించి
గతాన్ని వరించి స్మరించి
గుండె కరిగి గొంతులొంచి ఉబికి
కళ్ళలో జాలువారే క్షణం
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
గానమిదీ నీ ధ్యానమిదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిది అన్న సినీకవికి వందనం
మీ కవితా హృదికి మీ శైలికి మా హృదయపూర్వక అభినందన వందనం
మీ రచనలన్నీ చదివగానే మనసు మూగబోయి మాటవినదు
రాయడానికి ప్రజ్ఞ చాలదు
లలితా సహస్ర నామంలో అమ్మవారి నామం నిజసల్లాప మాధుర్య వినిర్భర్స్తిస కచ్ఛపీ గుర్తుకువచ్చి
వాణి వీణ పై ముసుగేసినట్లు మా కలాన్ని మూసివేయక తప్పదు.
ఎంత ఎదిగినకొద్దీ ఒదిగివుండే మా చిన్న వీరభద్రుడు ఇలాగే ఎప్పటికీ చిన్నవాడిగా, ఒక పసివాడిగా వుండి వసివాడని సాహితీ సుమగంధాలను రంగుల నీటిచిత్రాలను అందించి అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా ఆ సదా శివుణ్ణి కోరుకుంటూ పుట్టినరోజు శుభాకంక్షలతో

మీ ఆత్మీయ ఆహ్వానానికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు మిత్రశ్రేష్ఠా!🙏🙏🙏🙏🙏

నమస్సులు పున:పున:


గురజాడవారు 150 సంవత్సరాలక్రితం "నాతోమాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్" అనిపించారు గిరీశంతో,
మీతో మితృత్వమే, మీ సహచర్యమే ఓ విజ్ఞాన యాత్ర! మీ అనేకానేక విశ్వమిత్రుల జాబితాలో నేనుసైతం చిట్టచివరనున్నా మహాభాగ్యమే అనిపిస్తుంటుంది.

అవే, అవే అచ్చంగా అవే మాటలు సోక్రటీస్ కూడా అన్నారు. "నాపేరు సోక్రటీస్ నాకు తెల్సీసింది ఒకటే నాకు ఏమీతెలీదు అన్నవిషయం" మీ మేధావులతో వచ్చిన చిక్కే అది

సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారిగా ఒక ఉత్తమోత్తమ అధికారిని ఎంపిక చేసిన ప్రభుత్వానికి మా హృదయపూర్వక అభినందనలు. మీ ఈ నియామకం ద్వారా విద్యావ్యవస్థలో పెనుమార్పులు తద్వారా రేపటి పౌరులను తయారుచేసే వ్యవస్థల సమర్ధవంతమైన పనితీరు మీ పర్యవేక్షణలోనే సాధ్యమవుతుంది. మా హృదయపూర్వక శుభాభివందనాలు. 
ఇంతవరకు గిరిజనులు సమస్యలు పట్టించుకున్నారు
నాగరికులు అనాగరికులుగా మారిపోకుండా
ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?
బడి నుంచి ఏమి నేర్చుకోవాలి?
సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?
ఇవి పాఠ్యాంశాలుగా చేర్చండి
నిస్సారమైపోయింది సాహిత్యం అంటని నేటి తరం
భావితరాలు సారవంతం చెయ్యండి మహాప్రభో
కలసి నడవండి
ఓ ఆదర్శ మధుర మిధునమా
సమ్మోహన కవనమై
కమనీయ వర్ణమై
ద్వంద్వమేకమై
భావమమేకమై
అనుభవాలనేకమై
వాగర్ధాలై
అద్వైతమై
అద్వితీయమై
పత్రహరితంలా
పూల తావిలా
చిరుగాలి తరగలా
తోడునీడగా
కలకాలం
కలసి నడవండి
ఓ ఆదర్శ మధుర మిధునమా
సమ్మోహన కవనమై
కమనీయ వర్ణమై
కలసి నడవండి అలా అలా అనంతంగా
మీరు తిరిగిన దారులన్నీ మాకు
సంతస వసంతాలు......


Wednesday, February 19, 2020

స్వర్గీయ గొల్లపూడి మారుతీ రావు గారి పుట్టపర్తి దేవాలయం పై వ్యాసం

మరో దేవాలయం
నిజానికి ఇది మరో దేవాలయం. ఇది దొంగ శీర్షిక. అది తెలిసే ఎందుకు పెట్టాను? ఈ దేవాలయా నికి Focus ఇదొక్కటే కనుక. మీ కాలమ్‌ రుచి రహస్యమేమిటని కొందరు అడుగుతూంటారు. వారికి ఇవీ సూత్రాలు. మొదటి సూత్రం– అబద్ధం. అబద్ధానికి ఓ ‘రుచి’ ఉంది సరిగ్గా వండగలిగితే. అబద్ధం ఆశ్చర్యం, తీరా ముడి విప్పాక చిన్న కితకిత, ఎక్కువ సరదా, మీకు ముందే తెలిసిన విషయానికి ముక్తాయింపు– ఇన్ని కలగాలి. చాలా ముఖ్యంగా హర్ట్‌ చేయకూడదు, కోపం తెప్పిం చకూడదు. చిన్న మెలికకు నవ్వాలి. అందరితో చెప్పి నవ్వుకోవాలి. సరే. ఇంకో దేవాలయం ఏదీ? తొలుత మొదటి దేవాలయం గురించి. చాలా సంవత్సరాల కిందట పుట్టపర్తిలో భగవాన్‌ సత్యసాయిబాబా తమ్ముడు జానకి రామయ్యగారు నా గదికి వచ్చి నన్ను స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అదొక గొప్ప జ్ఞాపకం.
అటు తర్వాత జానకి రామయ్యగారు నన్ను పుట్టపర్తి దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మా పాదరక్షలు విడవబోతూ ఉంటే ఒకాయన పరుగున వచ్చారు. వాటిని భక్తితో అందుకున్నారు. నేను చేస్తానంటే ఒప్పుకోలేదు. సగం వొంగి భక్తితో ప్రసాదంలాగా అందుకున్నారు. అతనక్కడ ఊడిగం చేసే పనివాడు కాదు, స్వామి సేవకి 15 రోజులు శెలవు పెట్టి వచ్చిన ఓ గెజిటెడ్‌ ఆఫీసర్‌. ఒళ్లు పులకరించింది. ఇప్పుడు ఆసుపత్రిలోకి అడుగుపెడుతూనే రికార్డు టైములో నిర్మించిన ఈ కట్టడాన్ని చూపి మాట్లాడుతూంటే జానకి రామయ్యగారికి కళ్లనీళ్లు ధారాపాతంగా వర్షించాయి. నిజానికి అది సిమెంట్, ఇసుకతో కట్టిన భవనం కాదు. ప్రేమ, డెడికేషన్‌ దాని మూలస్తంభాలు. అక్కడ నాకు తెలిసిన పాత ముఖాలు కని పిస్తున్నాయి. విశాఖ మునిసిపల్‌ కమిషనర్‌ ఆఫీసు సూపర్నెంటు, నా మిత్రుని భార్య, పంజాబు మిలట్రీ కల్నల్‌ భార్య ఎందరో ఆఫీసర్లు అక్కడ సేవకులు. వంగి నిలుచున్నారు. సేవకులు కూడా అంత ఒద్దికగా ఉండరు. అంతటా భక్తీ– ఏ ప్రతిఫలాపేక్ష లేని సేవా తత్పరత– వీటన్నిటికీ మూల ధాతువు– స్వామి! అద్భుతం. బయటికి వస్తూ నేనూ ఏడ్చాను.
ఇప్పుడు మరో దేవాలయం. అపోలో ఆసుపత్రి. దీని వెనుక స్వాములు లేరు. పరమార్థం లేదు. పాపపుణ్యాల ప్రసక్తి లేదు. మరేం ఉంది? ఇక్కడ నాలుగు గోడల మధ్య వందలాది వర్కర్లున్నారు. డాక్టర్లున్నారు. పువ్వులాంటి దేవతలున్నారు (నర్సులు). ప్రపంచంలో అన్ని మూలల నుంచీ వచ్చిన అనూహ్యమైన యంత్రాలున్నాయి. వాటిని అలవోకగా నడిపే నిపుణులున్నారు. వీటన్నిటి సామూహిక దృక్పథం. ఆరోగ్యంమీద నమ్మకం, బతుకుతామన్న ధైర్యం, బతకడానికి చేయూత, వెరసి– ప్రాణ ధాతువు. లోపలికి రాగానే ఓ నర్సు నీ జాతకాన్ని ఇస్తుంది– క్షణాల్లో. నీ జ్వరం దగ్గర్నుంచి– నీ రుచుల దాకా– నీ ఊపిరి వివరాల దాకా కాగితం మీదకి వచ్చేసింది. వెంటనే రెండో విడత. సమస్య, ప్రారంభం, కష్టం, ఇక్కడికి రావడానికి కారణం. ఈలోగా రక్తనాళంలోకి సూది దిగుతూంటుంది. మరో రెండు నిమిషాల్లో మొదటి విడత చికిత్స ప్రారంభం. నువ్వు వచ్చి ఇంకా 5 నిమిషాలే అయింది. ఆ టీమ్‌ నీ హితుడో, నీ కోసం నియ మించిన ప్రాణ స్నేహితుడో అయి ఉండాలి. ఎందు కంటే సరిగ్గా 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి వచ్చిన మొదటి ఫలితం దక్కిపోతుంది.
ఇటు తర్వాత డాక్టర్లు, వర్కర్లు, నిపుణులు– కేవలం నీ కోసం పుట్టినట్టు కృషి చేస్తారు. నీ నమ్మకం దేదీప్యమానమవుతుంది, విశ్వాసం వీర విహారం చేస్తుంది. ఇది శక్తి, నైపుణ్యం, ఏ కల్మషమూ లేని ‘సేవ’ నీకిచ్చే వరం. ఒకపక్క ఈ కృషి ప్రతీ క్షణం పుస్తకంలోకి ఎక్కుతుంది. అది త్వరలో ఫైలుగా మారి రేపటికి గ్రంథమవుతుంది. ప్రజల దేవుళ్లకి నాలుగు స్థానాలు– నీ మనస్సు, గుడి, నీ తాదాత్మ్యం– అన్నింటికీ మించి నీ నమ్మకం. ఇది సీతా సాధ్వా? అవును. ఇది తాదాత్మ్యం. అబ్బే రాయి.. అంతే ఓ గొప్ప illusion is dead. Faith dies when the logic starts.. ఈ తెరని ఈ దేవాలయం నీకు తెలియకుండానే చెరిపేస్తుంది. ఈ నిజాన్ని ప్రపంచంలో 120 దేశాలు నమ్ముతున్నాయి. ఒక తీర్థయాత్రగా వస్తున్నారు. నీ విశ్వాసాన్ని ఉద్భుద్ధం చేసేది తీర్థం. కేవలం అవసరానికి పిలిచి, తీర్చి, నీకు తెలియకుండానే మరొక ప్లేస్‌కి నిన్ను బదిలీ చేసే విచిత్రమైన దేవా లయం పేరు– అపోలో. నేను కొండంత అనారోగ్యంతో– క్రిటికల్‌ కేర్‌లో మూడు రోజులుగా ఉంటూ డాక్టర్ల అనుమతితో ఈ ‘వ్యక్తిగత’ స్పందనని మీకు పంచుతున్నాను. ఇది ప్రకటన కాదు. కితాబు కాదు. వాటికి నేను ఆమళ్ల దూరం. మొదటి దేవాలయానికి– మహాస్వామి మూల హేతువు. రెండో దేవాలయానికి ‘విశ్వాసం’ మూల ధాతువు.

Monday, February 17, 2020

🍃🍁🍃🍁🍃🍁🍃🍁

వార్ధక్యం వయసా నాస్తి
మనసా నైవ తద్భవేత్‌
సంతతోద్యమ శీలస్య
నాస్తి వార్ధక్య పీడనమ్‌


☘ ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం.

☘ ముసలితనం రెండు రకాలుగా వస్తుంది.
వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం.
వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే._ కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు.
కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు._
 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది .

☘ పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే.

☘  అతి పిసినారితనం,
స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీన పరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగు లాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది .

☘ మానసిక వృద్ధాప్యం అంటే..
నాకు ముసలితనం వచ్చేసింది . అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు.

☘ సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం ,
 అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి.

 భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు.

☘ నిత్యవ్యాయామం,
యోగాభ్యాసం,
సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత,
మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం,
ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁

Monday, February 10, 2020

సరదాకి చిరు కవిత: పదవీ విరమణ శుభా కాంక్షలు !!!

సరదాకి చిరు కవిత: పదవీ విరమణ శుభా కాంక్షలు !!!: శ్రీ కొక్కు రవికుమార్ ,ప్రధానోపాధ్యాయులు, మాదా పూర్ ఉన్నత పా ఠ శాల  గారికి పదవీ విరమణ శుభా కాంక్షలు !!! వాసి గాంచిన కొక్కు సద్వంశ మందు...

Sunday, February 9, 2020

ఆ విధాత తలపున ఓ గొప్ప ఆలోచన ప్రభవించి ఈ సినీవినీలాకాశంలో సిరి"వెన్నెలసాగరమథనం"లో ప్రభవించిన చంద్రుడీయన.....
వినీల గగనపు వేదికపై... ప్రాక్దిశ వీణియపై...
ఆ దినకరుని మయూఖ తంత్రులపై...
విహంగ తతుల కిలకిల స్వనములతో మానవ జాతిని తెల్లారింది లెగండో అని మేల్కొలిపే సుప్రభాత సేవకుడీయన.....
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమనుకునే సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడిగే విప్లవ స్పూర్తి.....
తనదరికిరాని వనాల దగ్గరకే వసంతాన్ని తీసుకెళ్ళగలిగే లలిత భావగీతి.....
ఆకాశంలో స్వర్ణకమలాల ఆశల హరివిల్లుకు కొత్త రెక్కలు తొడిగించి, జామురాతిరిలో జాబిలమ్మకు కోపం రాకుండా లలితప్రియకమలాలతో అందెల రవళులు వినిపించే సాహితీ సరస్వతి.....
ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దనే చిరంతర స్పూర్తి...
జేడీ"చక్రవర్తికి" వీధిలో బిచ్చగత్తెతో బంధుత్వాన్ని కలిపిన "మనీ"షితడు.....
బ్యాచిలర్ బ్రదర్ ని భర్తగా మారొద్దని బీకేర్ ఫుల్ అని సలహా ఇచ్చిన సంసారి.....
"తెలవారదేమో స్వామి" సినిమా పాట కాదేమో... అన్నమాచార్య సంకీర్తనేమో లేక త్యాగరాజస్వామి క్రుతి గానీ అయిఉంటుందని ఎవార్డు ఇవ్వడానికి వీలులేని "స్వయంక్రుతాపరాధం" చేసుకున్న పండితుడు.....
బోటనీ పాఠం కోసం క్లాసురూములో తపస్సు చేయడం వేస్ట్ రా గురూ అంటూనే బలపం పట్టి భామ ఒళ్ళో "అ ఆ ఇ ఈ"లు నేర్పిన
ప్రేమబడిపంతులు.....
ఏ తోడూ లేక ఎటో వెళ్ళిపోయిన మనసు చిలకను గంగ పుట్టిన హరిపాదాన చేర్చగల తత్త్వవేత్త.....
సామజవరగమన కాళ్ళను చూసి వదలని తన కంటి చూపులను దయలేకుండా తొక్కుకుని వెళ్ళొద్దనే ప్రేమికుడు.....
తెలుగు సినిమాపాటల ప్రబంధ సాహిత్యం పాలిట అల్లసాని పెద్దన...
నేటితరం "సినీపాటకులకు" (రచయితలకు) మాత్రం పెద్దన్న...

Friday, February 7, 2020

ఆంధ్రులవంటి దురదృష్ట జాతి మన దేశంలో మరెవ్వరూ లేరేమో. ఆంధ్ర రాష్ట్రానికి .వచ్చిన విచిత్రమైన ఒడిదుడుకులు మరే రాష్ట్రానికి రాలేదేమో.  ఆంధ్ర రాజధానికి వచ్చిన అనిశ్చిత మరే రాష్ట్ర రాజధానికి రాలేదేమో.  ఆంగ్లంలో ఒక సామెత ఉన్న ది. "షూటింగ్ ఒన్స్ ఓన్ లెగ్. "Shooting one's own leg" ani.ఈ  ప్రక్రియలో మనకు దరిదాపులలో, కనుచూపు మేరలో   ఎవ్వరూ కనబడుట లేదు. నేను రాజకీయ వివాదాలకు పోకుండా, ఆంధ్ర జాతికి ఉన్న ప్రత్యేకతలను మాత్రమే సృజిస్తున్నాను.

పొడవాటి సముద్రతీరం, స్వయంసిద్ధమైన రేవులు. బంగారంలాంటి మూడు పంటలు పండే భూములు. రకరకాల  ధాన్యాలు, అపరాలు, కూరగాయలు, వేరుశనగ , చెరకు, పసుపు, మిర్చి, వంటి, వాణిజ్య పంటలు, పొగాకు, కాఫీ గింజలు, వంటి ఎగుమతి దినుసులు,  జనపనార, పూలమొక్కల కాణాచి కడియం, ఇంత వైవిధ్య సస్య సంపద కల రాష్ట్రాలు అరుదు.

బాక్సైటు , సున్నపురాయి, యురేనియం, ఇనుప ఖనిజము, వంటి ఖనిజాలు, పెట్రోలియం, గ్యాసు. పారిశ్రామికాభివృద్ధికి మూల ధనం వంటివి కోకొల్లలు..

కృష్ణా, గోదావరి, పెన్న వంటి నదులు.

గండికోట, గుర్రంకొండ, ఉదయగిరి, చంద్రగిరి, కొండవీడు, కొండపల్లి, గుత్తి, కర్నూలు, ఆదోని, వంటీ చారిత్రిక, శిధిలాలైన కోటలు. పర్యాటకులకు వసతులు కల్పిస్తే బాగా ఆకర్షించేవి.
,
విజయనగరం, బొబ్బిలి, చల్లపల్లి, వెంకటగిరీ, నూజివీడు, మందస, కురుపాం, రాజమండ్రిలోని  రామచంద్రపురం కోట, పెద్దాపురం కోట, ఇంకా ఎన్నో, ఆ ఆ వoశస్తులను ప్రోత్సహించి, ఋణాలు ఇచ్చి హెరిటేజ్ హొటళ్ళను నెలకొలుపవచ్చు .

బంగారు గ్రుడ్లను పెట్టే చలన చిత్ర పరిశ్రమ..

వళ్ళు వంచి శ్రమించే పాటక జనం, ఇతర రాష్ట్రాలకు గట్టి పోటీ ఇచ్చి అత్యధికంగా విద్యారంగంలో రాంకులు సంపాదించే విద్యార్థులు.

అత్యధికంగా అమేరికాకు వెళ్ళి విలువైన్న విదేశీ మారక ధనాని . ఆర్జిస్తున్న తెలుగు-అమేరికన్లు.

ప్రకాశం, తెన్నేటి, వల్లూరి బసవరాజు, గౌతు లచ్చన్న, బెజవాడ గోపాల రెడ్డి  భోగరాజు పట్టాభి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, వంటి మచ్చలేని మహారధులు.

పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు వంటి తృణప్రాయంగా అసువులు బాసిన త్యాగమూర్తులు.

మాకినేని బసవపున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగీరెడ్డి, చండ్ర రాజ్యేశ్వర రావు గారు వంటి వామపంక్తి అగ్ర నేతలు..

వెంపటపు సత్యనారాయణ, నాగభూషణం  పట్నాయక్, కొండపల్లి సీతారామయ్య  గార్ల వంటి విప్లవ వీరులు.

బంగారం తాకట్టు పెట్టి జీతాలిస్తున్న దేశాన్నే సంక్షోభం నుండి కాపాడి దశ, దిశ మార్చిన తెలుగు బిడ్డ నరసింహారావు గారు,

తిరుపతి, శ్రీశైలం, సింహాచలం,బెజవాడ, మంగళగిరి, అన్నవరం, పంచారామ  క్షేత్రాలులు., లేపాక్షి, వొంటిమిట్ట, రామతీర్థం, వంటి పుణ్య క్షేత్రాలు.

బొజ్జన్నకొండ, అమరావతి, ఆదుర్రు, ఘంటసాల, అమరావతి, తోట్లకొండ వoటి, జాపాను, కొరియా, వంటి పూర్వప్రాంత దేశస్తులను ఆకర్షించగల బౌద్ధ క్షేత్రాలు.

యాగంటి, కొండపల్లి, గుంటూరు, బెజవాడ బొర్ర, వంటి గుహలు.

సుందరతెలుంగు అని మహాకవి సుబ్రహ్మణ్య భారతిచే పొగడబడిన తెలుగు భాష.

పోతన, శ్రీనాధుడు,నన్నయ్య, తిక్కన, ఎర్రన,  అష్టదిగ్గజాలు, మొల్ల, కృష్ణదేవరాయలవంటి మహాకవులు.

ఆంధ్రదేశములోనేగాకుండా, యావత్ దక్షి ణ భారతంలో, భగవంతునితో సమానంగ పూజింపబడుతున్న, త్యాగరాజు, క్షేత్రయ్య, అన్నమయ్య, శ్యామశాస్త్రి, రామదాసు, మొదలగువారు సంగీతజగత్తుకు ఇచ్చివెళ్ళిన సంగీత, సాహిత్య  భండాగారాలు.

ప్రపంచ విఖ్యాతి పొందిన కూచిపూడి నృత్యం.

ద్వారం వెంకటస్వామి నాయుడు గారు,  శ్రీపాద పిణాకపాణీ గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, వోలేటి వెంకటెశ్వరులు గారు, నూకల చిన సత్యనారాయణ గారు, శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వంటి ఆంధ్రుల చేతనే కాకుండా యావత్ సంగీత ప్రపంచముచేత గౌరవింపబడ్డ సంగీత విద్వాంసులు.

తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, చిలకమర్తి, గురజాడ, శ్రీపాద, విశ్వనాథ, శ్రీ శ్రీ వంటి అధునిక వైతాళికులు.

రావు బాలసరస్వతి, పీ. బీ శ్రీనివాస్, పీ. సుశీల, ఎస్.జానకి, ఏ ఎం రాజా, జిక్కి, వంటి, తెలుగు, తెలుగేతర  శ్రోతల మనసులు దోచుకున్న  నేపధ్య గాయకులు. ఇక ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, వంటి నేపధ్య గాయకులు.
 
ఎస్. రాజేశ్వర రావు, పెండ్యాల, తాతినేని చలపతి రావు, ఆదినారాయణ రావు, ఏ ఎం రాజా వంటి పరభాష లను కూడా  ఏలిన స్వర సారధులు.

అంజలి, జమున, సావిత్రి, ఎస్ జానకి, ఎస్ వీ రంగా రావు, కన్నాంబ, నాగయ్య, వంటి అన్ని భాషల చిత్రాలలోనూ పేరుపొందిన తెలుగు రత్నాలు.

ఇంకా ఇంకా చెప్పుకుంటూపోతే అంతులేని తెలుగు తేజాలు.

ఇంత ఉండికూడా మనకు సాటి దురదృష్టవంతులు లేరు.

1933-39 మధ్య బ్రిటిష్ వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాని మడ్రాస్ ప్రెసిడెన్సీ లోని తెలుగు జిల్లాలతో ఏర్పాటుకు  అంగీకరించినా,  తెలుగువారు మద్రాసు నగరం కావాలని పట్టు పట్టడంతో, ఆగీపోయింది.

1952-53 శ్రీబాగ్ పెద్దమనుషుల ఒప్పందంతో కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్త్రం ఎర్పడినా, తరువాత, నైజాముతో కలవడం వల్ల హైదరాబాదును రాజధానిగా స్వీకరించి కర్నూలు రాజధానిని పోగుట్టుకున్నాం

నిన్న మొన్న తెలంగాణా ఏర్పాటుతో హైదరాబాదు రాజధానిని పోగోట్టుకుని, రోడ్డున పడ్డాం.

తరువాత, అమరావతి 33000 ఏకరాలతో ప్లాన్డ్ సిటీ, దేశంలోనే గొప్ప సిటీ, రాజధాని అనుకున్నాం,  అన్నారు.

రాజకయాలకు అతీతంగా ఉండవలసిన ఈ విషయం, రాజకీయం క్రింద మారడంతో ప్రభుత్వం మారగానే, మూడు రాజధానులన్నారు.

ఇప్పుడు రాజధానే లేని రాష్ట్రం అయ్యింది

ఉచిత పథకాల కోసం అప్పు చేస్తున్న రాష్ట్రం
మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందో
తెలీడం లేదు

ఏమి జరుగనున్నదో!

Saturday, February 1, 2020

జననీ! యేమిటికింక? ఆశు కవితా సన్యాస మిప్పింపవే!! శ్రీ రాయప్రోలువారు.

-కీ.శే.ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం
*
తెనుగే తీయని దందు పద్యపద
రీతి క్రీడ లత్యంత మో
హనముల్, శోభనముల్ తదీయ
రస, రక్తాలాపనంబుల్, లభిం
చిన వాగర్ధ కలా కలాప జయ
లక్ష్మిన్ గాలికిం బుత్తునే?
జననీ! యేమిటికింక? ఆశు కవితా
సన్యాస మిప్పింపవే!!
రసమో? భావమొ? జీవ దర్ధ
సుకుమార వ్యంజనా మంజు శ
బ్ద సమాసా రచనంబొ? సాధు హృదయ
స్పంద ప్రతిష్ఠా కథా
విసరంబో? సకలార్థ శూన్యమగు
నీ వేగాతి వేగొక్తి దు
ర్వ్యసనం భేటికి? త్రిప్పు మింక
జననీ! రమ్యాక్షర క్షోణికిన్’’
‘‘కపురంపుం బలుకుల్, తెనుంగులివి, వేగ ప్రక్రియా ధోరణీ విపరీతా నిలధాటిలో చెరగినన్ విధ్వంసమై పోదె తద్విపులా మోదము? మెత్తురే రసికులీ విన్యస వైకల్యమున్’’ అని పరిదేవనం చెందారు 1911 శ్రీ రాయప్రోలువారు. ఆశుకవితకు భరతవాక్యం పల్కారు. భావకవితకు నాందీ ప్రస్తావన కావించారు.
రాయప్రోలు వారి దృష్టి,ఆంగ్లంలో రసిక జన కామితమైన లిరిక్ రచనలపై ప్రసరించింది. ఆ భంగిమ, తెనుగులో సవదరించాలనిసంకల్పించారు. 1913 సంవత్సరారంభంలో అభినవ కవితా మండలి ది తెలుగు స్కూల్ ఆఫ్ రొమాంటిక్ రివైవల్ రాయప్రోలువారి తణకంకణం అనే చిరుకావ్యాన్ని ప్రచురించింది. ఇది చెన్నపురిలని కళాశాల విద్యార్థుల్ని అమితంగా ఆకర్షించింది. ఆ సంవత్సరంలోనే, రుూ చిన్ని కావ్యం, తృణకంకణం, మూడు ముద్రణలకు నోచుకొన్నది. కట్టమంచి వారి ప్రశంసనందుకొన్నది.
పాఠకలోకం లో అపోహమేమిటంటే- వర్డ్స్‌వర్త్, కాల్‌రిడ్జి, షెల్లీ, కీట్సు ప్రభృతుల కవితా ప్రభావంలో తృణకంకణం రచితమైందని. ఆ అపోహ తొలగాలని తల్లావఝల శివశంకరులు అన్నమాట లాలకించండి! ‘‘సుబ్బారావుగారు ఆంగ్ల కవితారసం ఆస్వాదించిన మాట వాస్తవమే. అయినప్పటికీ ఆ కవుల శక్తికి ముగ్ధులై ఈ కవి వరులు తృణకంకణం రచించలేదు. కాళిదాసు కవీంద్రుని నాటకత్రయం బహు పర్యాయాలు సాకల్యంగా సమాలోచనం చేసి ఆ మీదనే తృణకంకణం కూర్చినారు’’. ఇంకా శ్రీ శాస్ర్తీగారంటారు- ‘‘ఆ రోజుల్లో ఈ కృతివల్ల ఏదో క్రొత్తలోకంలోకి మార్గం ఏర్పడినట్లయింది.
-ఇంకా ఉంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

సిరి ధాన్యం చిరాయువు

కరోనా వైరస్ వల్ల మానవ జాతి అంతరించి పోతుందా ?

మీకు తెలుసా ? ప్రకృతి లో అనేక రకాల వైరస్ లు వున్నాయి . అందులో మానవుల పై దాడి చేయగలిగిన వైరస్ లు 219  . ఇప్పటిదాకా జంతువులకు మాత్రమే  పరిమితమైన కొన్ని వైరస్ లు  ఆహార ఇతరత్రా అలవాట్ల వల్ల మానవుల్లోకి ప్రవేశిస్తున్నాయి . HIV , కరోనా వైరస్ లు ఇలా వచ్చినవే !

వైరస్ లు మన చుట్టూరా వున్నాయి . మనం పీల్చే గాలిలో , తాగే నీటిలో , భూమి పైన ఇలా అన్ని చోట్ల వున్నాయి . వీటిలో చాల మటుకు గాలి ద్వారా వ్యాపించేవే ! కేవలం కొన్ని వైరల్ వ్యాధులకు మాత్రమే నివారణ టీకా లు వున్నాయి . వైరల్ వ్యాధులకు చికిత్స లేదు .

 మరి చికిత్స లేని వైరస్ లు ఇన్ని వున్నప్పుడు వైరల్ వ్యాధి వస్తే మనిషి మరణించాలి కదా ? కరోనా వైరస్ ను పక్క పెట్టండి . ఫ్లూ , మసూచి లాంటి వ్యాధులకు మనుషులు పెద్ద ఎత్తున మరణించి ఉండాలి కదా ?  ఆలా జరిగిందా ?

 మీకు తెలుసా ? ఫ్లూ జ్వరం { అంటే వైరస్ వల్ల వచ్చే జలుబు } వల్ల ఏటా నాలుగు లక్షల మంది చని పోతున్నారు . ఈ సంఖ్య చాల పెద్దదిగా అనిపించవచ్చు . కానీ ఈ వ్యాధి సోకిన వెయ్యి మంది లో పది మంది మాత్రమే మరణిస్తారు . చికిత్స లేని ఈ వైరల్ వ్యాధి సోకినా ఎలా బతుకు తున్నారు ? ఎలా కోలుకొంటున్నారు ?

మీరు సినిమా థియేటర్ లోనో విమానం లోనో కూర్చున్నారు . అక్కడ ఒక వ్యక్తికి జలుబు వుంది . ఆ వైరస్ మీ శరీరం లోకి ప్రవేశిస్తుంది . మీరు ఒక తలుపునొ ఒక లిఫ్ట్ బటన్నో తాకారు . అక్కడ బాక్టీరియా  వుంది . అది  మీ చేతిని నుండి మీరు కళ్ళు తుడుచుకొన్నప్పుడో , ముక్కు రాసుకొన్నపుడో , మీ శరీరం లోకి ప్రవేశిస్తాయి . ఇలా రోజూ కొన్ని వందల సార్లు .. కొన్ని వందల సూక్ష్మ జీవులు..  మీ శరీరం పై దాడి చేస్తాయి . ఇది నిరంతరం జరిగే ప్రక్రియ . మీ సెల్ ఫోన్ లో కొన్ని లక్షల సూక్ష్మ జీవులు వున్నాయి . మీ కంప్యూటర్ కీ బోర్డు,  మీ కార్ సీటు ఇలా  ప్రతి  చో టా సూక్ష్మ జీవులే . అవి నిరంతరం శరీరం పై దాడి    చేస్తూనే ఉంటాయి .

 మరి శరీరం ఏమి చేస్తుంది ?    మీరు ఏదైనా ఫంక్షన్ లోనో , పబ్ లోనో,  హీరో లేదా హీరోయిన్ చుట్టూరా కండలు తిరిగిన వీరుళ్ళను చూసి వుంటారు . వాళ్ళను బౌన్సర్లు అంటారు . మన శరీరం లో కూడా పెద్ద సంఖ్య లో బౌన్సర్లు వున్నారు . దాన్నే ఇమ్యూన్ సిస్టం అంటారు . పిలవని పేరంటం గా బాక్టీరియా లేదా వైరస్ శరీరం లోకి ప్రవేశిస్తే ఈ బౌన్సర్లు వెంటనే వాటి పై దాడి చేసి చంపేస్తాయి . ఇది రోజు జరిగేదే . మీరు నా పోస్ట్ చదివే లోపే మీ శరీరం లో బౌన్సర్ లు తమ పని తాము చేస్తూ పదుల సంఖ్యలో సూక్ష జీవులను చంపేసుంటాయి . మనిషి చనిపోయాక ఒక రోజులో శరీరం కుళ్ళు వాసన వస్తుంది . ఎందుకిలా ? అంటే చనిపోగానే బౌన్సర్లు లు పని చెయ్యరు . అప్పుడు బాక్టీరియా దాడి చేసి శరీరాన్ని జయించి  తినడం మొదలు పెడుతుంది .

 సో కరోనా  నో .. మరొకటో .. ఇలాంటి గాలి ద్వారా సోకి చికిత్స లేని వైరస్ ల నుండి మనకు రక్షణ కల్పించేది మన శరీరం లోని బౌన్సర్లు . అదేనండి ఇమ్యూన్ సిస్టం . మరి ఇమ్యూన్ సిస్టం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి ?
 
నాకు కొన్ని నెలల దాక చాల సులభంగా జలుబు సోకేది .  వాతావరణం మారినా .. ఎక్కువగా అలసిపోయినా పచక్ పచక్ అంటూ తుమ్ములు .. మూడు రోజుల పాటు.. జలుబు దగ్గు .. ; అటు పై తగ్గి పొయ్యేది .  గత ఎనిమిది నెలలుగా ఒక్కటంటే ఒక్క సారి  కూడా   నాకు జలుబు రాలేదు . మొన్న సముద్రం లో గంటల కొద్దీ ఈదినా , వరుసగా విమాన ప్రయాణాలు చేసి అలిసి పోయినా , కొద్దిగా గొంతు కరకర అనిపించినా ఒకటి రెండు గంటల్లో దానంతట అదే తగ్గి పోతోంది . ఒకప్పుడు నేను రోజూ హోమియో వాడేవాడిని . ఇంట్లో ANTI  BIOTIC మాత్రలు ఎప్పుడూ ఉండేవి . మొన్ననే మా శ్రీమతి " అవన్నీ EXPIRY డేట్ అయిపోయివుంటాయి . తీసి పడేసాను"  అంది .

నా లోని  బౌన్సర్లు   ఇలా బాహుబలి    లా బలోపేతం కావడానికి ప్రధమ కారణం నేను తింటున్న మిల్లెట్స్ -- కొర్రలు , అందు కొర్రలు మొదలైన అయిదు రకాల సిరి ధాన్యాలు . వారం అంటే ఏడు రోజులు . రోజుకి మూడు సార్లు అంటే మొత్తం 21  సార్లు . కనీసం 17  సార్లు నేను సిరి ధాన్యాలే తింటున్నాను . ఇది నిజంగా అద్భుతాలు చేస్తోంది . వీరమాచినేని లేదా మంతెన డైట్ గురించి నాకు తెలియదు . ఖాదర్ వలి గారు ప్రాచుర్యం లోకి తెచ్చిన డైట్ నిజానికి కొత్తది కాదు .     వేల సంవత్సరాలు మన పూర్వీకులు తిన్న  సిరి ధాన్యాలే . సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ వుండవు . మనం తింటున్న బియ్యం విషంగా మారి     పొ  య్యింది . హరిత విప్లవం  దాకా    వున్న బియ్యం,  గోధుమలు వేరు ; నేటి బియ్యం గోధుమలు వేరు అని గుర్తించండి . మనసు ను నియంత్రిస్తే మిల్లెట్స్ ఫుడ్ ను ఎంజాయ్ చేయవచ్చు . ఒక  పూట  తిని రుచికరంగా లేదని దాన్ని వదిలేసి ఇలాంటి డైట్ పై సోషల్ మీడియా లో సెటైర్ లు వేస్తె త్వరగా రిటైర్ అయ్యి పొయ్యేది మీరే! ఖదీర్ వాలి కో ప్రకృతివనం ప్రసాద్ రెడ్డి గారికి ఏమీ నష్టం లేదు .

 ఇమ్మ్యూనిటి సిస్టం  బల   పడాలంటే మంచి ఆహారం తో పాటు .. చక్కటి విశ్రాంతి .. రెగ్యులర్ గా వ్యాయామం అవసరం .

మన ఇంటిని రోజూ శుభ్రం చేస్తామా లేదా ? బండిని రెగ్యులర్ గా సర్వీసింగ్ చేస్తామా లేదా ? అలాగే మనకు వున్న ఒకే ఒక శరీరాన్ని జాగ్రత్త్తగా కాపాడుకోవాలండి . మంచి తిండి . నిద్ర . పని . వ్యాయామం . లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోషల్ మీడియా పై ఆ నాయకుడి ని ఈ నాయకుడి ని తిడుతూ హేట్ పోస్ట్ లు కూడా వద్దు . ఎందుకంటే తన కోపమే తన శత్రువు . నెగటివ్ ఫీలింగ్స్ ముందుగా మీ శరీరానికి హాని చేస్తాయి . మీకు తెలియకుండా శాడిస్ట్ గా CYNICAL గా మారిపోతారు . యు అర్ ఆ ప్రోడక్ట్ అఫ్ వాట్ యు ఈట్ .. వాట్ యూ థింక్

వృద్ధులు వ్యర్ధలు కారు

మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు
ముంగిట్లో కూచోబెడితే
ఇంటిని కాచే ఈశ్వరుడు
                                                                  బతుకుబాటలో గతుకుల్ని
ముందుగా హెచ్చరించి.
కాపాడే సిద్ధుడు వృద్ధుడు
వృద్ధులు సారధులైతే
యువకులు విజయులౌతారు
అనుభవాల గనులు ఆపాత బంగారాలు
                                                                            వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు
చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం
మూడుకాళ్ల ముసలివాడు
తగిన గుర్తింపునిస్తే
విజయాన్నిచ్చే త్రివిక్రముడు
                                                                        ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు
తనను పట్టించుకోకున్నా
నువ్వు పచ్చగా ఉండాలని తపించే
ఉదాత్తుడు వృద్ధుడు
                                                                             పలకరిస్తే చాలు
పాలకడలిలా పొంగులు వారే
పసివాడు వృద్ధుడు
వృద్ధుడంటే పైపైన చూస్తే
జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు
అంతర్గతంగా
తలపండిన పండితుడు.  👇.   🙏🙏🙏
అందుకే మన పూర్వీకులు వృద్ధులకు అమిత గౌరవాన్నిచ్చేరు, ఇమ్మన్నారు.

Total Pageviews