కరోనా వైరస్ వల్ల మానవ జాతి అంతరించి పోతుందా ?
మీకు తెలుసా ? ప్రకృతి లో అనేక రకాల వైరస్ లు వున్నాయి . అందులో మానవుల పై దాడి చేయగలిగిన వైరస్ లు 219 . ఇప్పటిదాకా జంతువులకు మాత్రమే పరిమితమైన కొన్ని వైరస్ లు ఆహార ఇతరత్రా అలవాట్ల వల్ల మానవుల్లోకి ప్రవేశిస్తున్నాయి . HIV , కరోనా వైరస్ లు ఇలా వచ్చినవే !
వైరస్ లు మన చుట్టూరా వున్నాయి . మనం పీల్చే గాలిలో , తాగే నీటిలో , భూమి పైన ఇలా అన్ని చోట్ల వున్నాయి . వీటిలో చాల మటుకు గాలి ద్వారా వ్యాపించేవే ! కేవలం కొన్ని వైరల్ వ్యాధులకు మాత్రమే నివారణ టీకా లు వున్నాయి . వైరల్ వ్యాధులకు చికిత్స లేదు .
మరి చికిత్స లేని వైరస్ లు ఇన్ని వున్నప్పుడు వైరల్ వ్యాధి వస్తే మనిషి మరణించాలి కదా ? కరోనా వైరస్ ను పక్క పెట్టండి . ఫ్లూ , మసూచి లాంటి వ్యాధులకు మనుషులు పెద్ద ఎత్తున మరణించి ఉండాలి కదా ? ఆలా జరిగిందా ?
మీకు తెలుసా ? ఫ్లూ జ్వరం { అంటే వైరస్ వల్ల వచ్చే జలుబు } వల్ల ఏటా నాలుగు లక్షల మంది చని పోతున్నారు . ఈ సంఖ్య చాల పెద్దదిగా అనిపించవచ్చు . కానీ ఈ వ్యాధి సోకిన వెయ్యి మంది లో పది మంది మాత్రమే మరణిస్తారు . చికిత్స లేని ఈ వైరల్ వ్యాధి సోకినా ఎలా బతుకు తున్నారు ? ఎలా కోలుకొంటున్నారు ?
మీరు సినిమా థియేటర్ లోనో విమానం లోనో కూర్చున్నారు . అక్కడ ఒక వ్యక్తికి జలుబు వుంది . ఆ వైరస్ మీ శరీరం లోకి ప్రవేశిస్తుంది . మీరు ఒక తలుపునొ ఒక లిఫ్ట్ బటన్నో తాకారు . అక్కడ బాక్టీరియా వుంది . అది మీ చేతిని నుండి మీరు కళ్ళు తుడుచుకొన్నప్పుడో , ముక్కు రాసుకొన్నపుడో , మీ శరీరం లోకి ప్రవేశిస్తాయి . ఇలా రోజూ కొన్ని వందల సార్లు .. కొన్ని వందల సూక్ష్మ జీవులు.. మీ శరీరం పై దాడి చేస్తాయి . ఇది నిరంతరం జరిగే ప్రక్రియ . మీ సెల్ ఫోన్ లో కొన్ని లక్షల సూక్ష్మ జీవులు వున్నాయి . మీ కంప్యూటర్ కీ బోర్డు, మీ కార్ సీటు ఇలా ప్రతి చో టా సూక్ష్మ జీవులే . అవి నిరంతరం శరీరం పై దాడి చేస్తూనే ఉంటాయి .
మరి శరీరం ఏమి చేస్తుంది ? మీరు ఏదైనా ఫంక్షన్ లోనో , పబ్ లోనో, హీరో లేదా హీరోయిన్ చుట్టూరా కండలు తిరిగిన వీరుళ్ళను చూసి వుంటారు . వాళ్ళను బౌన్సర్లు అంటారు . మన శరీరం లో కూడా పెద్ద సంఖ్య లో బౌన్సర్లు వున్నారు . దాన్నే ఇమ్యూన్ సిస్టం అంటారు . పిలవని పేరంటం గా బాక్టీరియా లేదా వైరస్ శరీరం లోకి ప్రవేశిస్తే ఈ బౌన్సర్లు వెంటనే వాటి పై దాడి చేసి చంపేస్తాయి . ఇది రోజు జరిగేదే . మీరు నా పోస్ట్ చదివే లోపే మీ శరీరం లో బౌన్సర్ లు తమ పని తాము చేస్తూ పదుల సంఖ్యలో సూక్ష జీవులను చంపేసుంటాయి . మనిషి చనిపోయాక ఒక రోజులో శరీరం కుళ్ళు వాసన వస్తుంది . ఎందుకిలా ? అంటే చనిపోగానే బౌన్సర్లు లు పని చెయ్యరు . అప్పుడు బాక్టీరియా దాడి చేసి శరీరాన్ని జయించి తినడం మొదలు పెడుతుంది .
సో కరోనా నో .. మరొకటో .. ఇలాంటి గాలి ద్వారా సోకి చికిత్స లేని వైరస్ ల నుండి మనకు రక్షణ కల్పించేది మన శరీరం లోని బౌన్సర్లు . అదేనండి ఇమ్యూన్ సిస్టం . మరి ఇమ్యూన్ సిస్టం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి ?
నాకు కొన్ని నెలల దాక చాల సులభంగా జలుబు సోకేది . వాతావరణం మారినా .. ఎక్కువగా అలసిపోయినా పచక్ పచక్ అంటూ తుమ్ములు .. మూడు రోజుల పాటు.. జలుబు దగ్గు .. ; అటు పై తగ్గి పొయ్యేది . గత ఎనిమిది నెలలుగా ఒక్కటంటే ఒక్క సారి కూడా నాకు జలుబు రాలేదు . మొన్న సముద్రం లో గంటల కొద్దీ ఈదినా , వరుసగా విమాన ప్రయాణాలు చేసి అలిసి పోయినా , కొద్దిగా గొంతు కరకర అనిపించినా ఒకటి రెండు గంటల్లో దానంతట అదే తగ్గి పోతోంది . ఒకప్పుడు నేను రోజూ హోమియో వాడేవాడిని . ఇంట్లో ANTI BIOTIC మాత్రలు ఎప్పుడూ ఉండేవి . మొన్ననే మా శ్రీమతి " అవన్నీ EXPIRY డేట్ అయిపోయివుంటాయి . తీసి పడేసాను" అంది .
నా లోని బౌన్సర్లు ఇలా బాహుబలి లా బలోపేతం కావడానికి ప్రధమ కారణం నేను తింటున్న మిల్లెట్స్ -- కొర్రలు , అందు కొర్రలు మొదలైన అయిదు రకాల సిరి ధాన్యాలు . వారం అంటే ఏడు రోజులు . రోజుకి మూడు సార్లు అంటే మొత్తం 21 సార్లు . కనీసం 17 సార్లు నేను సిరి ధాన్యాలే తింటున్నాను . ఇది నిజంగా అద్భుతాలు చేస్తోంది . వీరమాచినేని లేదా మంతెన డైట్ గురించి నాకు తెలియదు . ఖాదర్ వలి గారు ప్రాచుర్యం లోకి తెచ్చిన డైట్ నిజానికి కొత్తది కాదు . వేల సంవత్సరాలు మన పూర్వీకులు తిన్న సిరి ధాన్యాలే . సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ వుండవు . మనం తింటున్న బియ్యం విషంగా మారి పొ య్యింది . హరిత విప్లవం దాకా వున్న బియ్యం, గోధుమలు వేరు ; నేటి బియ్యం గోధుమలు వేరు అని గుర్తించండి . మనసు ను నియంత్రిస్తే మిల్లెట్స్ ఫుడ్ ను ఎంజాయ్ చేయవచ్చు . ఒక పూట తిని రుచికరంగా లేదని దాన్ని వదిలేసి ఇలాంటి డైట్ పై సోషల్ మీడియా లో సెటైర్ లు వేస్తె త్వరగా రిటైర్ అయ్యి పొయ్యేది మీరే! ఖదీర్ వాలి కో ప్రకృతివనం ప్రసాద్ రెడ్డి గారికి ఏమీ నష్టం లేదు .
ఇమ్మ్యూనిటి సిస్టం బల పడాలంటే మంచి ఆహారం తో పాటు .. చక్కటి విశ్రాంతి .. రెగ్యులర్ గా వ్యాయామం అవసరం .
మన ఇంటిని రోజూ శుభ్రం చేస్తామా లేదా ? బండిని రెగ్యులర్ గా సర్వీసింగ్ చేస్తామా లేదా ? అలాగే మనకు వున్న ఒకే ఒక శరీరాన్ని జాగ్రత్త్తగా కాపాడుకోవాలండి . మంచి తిండి . నిద్ర . పని . వ్యాయామం . లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోషల్ మీడియా పై ఆ నాయకుడి ని ఈ నాయకుడి ని తిడుతూ హేట్ పోస్ట్ లు కూడా వద్దు . ఎందుకంటే తన కోపమే తన శత్రువు . నెగటివ్ ఫీలింగ్స్ ముందుగా మీ శరీరానికి హాని చేస్తాయి . మీకు తెలియకుండా శాడిస్ట్ గా CYNICAL గా మారిపోతారు . యు అర్ ఆ ప్రోడక్ట్ అఫ్ వాట్ యు ఈట్ .. వాట్ యూ థింక్

No comments:
Post a Comment