Friday, February 7, 2020

ఆంధ్రులవంటి దురదృష్ట జాతి మన దేశంలో మరెవ్వరూ లేరేమో. ఆంధ్ర రాష్ట్రానికి .వచ్చిన విచిత్రమైన ఒడిదుడుకులు మరే రాష్ట్రానికి రాలేదేమో.  ఆంధ్ర రాజధానికి వచ్చిన అనిశ్చిత మరే రాష్ట్ర రాజధానికి రాలేదేమో.  ఆంగ్లంలో ఒక సామెత ఉన్న ది. "షూటింగ్ ఒన్స్ ఓన్ లెగ్. "Shooting one's own leg" ani.ఈ  ప్రక్రియలో మనకు దరిదాపులలో, కనుచూపు మేరలో   ఎవ్వరూ కనబడుట లేదు. నేను రాజకీయ వివాదాలకు పోకుండా, ఆంధ్ర జాతికి ఉన్న ప్రత్యేకతలను మాత్రమే సృజిస్తున్నాను.

పొడవాటి సముద్రతీరం, స్వయంసిద్ధమైన రేవులు. బంగారంలాంటి మూడు పంటలు పండే భూములు. రకరకాల  ధాన్యాలు, అపరాలు, కూరగాయలు, వేరుశనగ , చెరకు, పసుపు, మిర్చి, వంటి, వాణిజ్య పంటలు, పొగాకు, కాఫీ గింజలు, వంటి ఎగుమతి దినుసులు,  జనపనార, పూలమొక్కల కాణాచి కడియం, ఇంత వైవిధ్య సస్య సంపద కల రాష్ట్రాలు అరుదు.

బాక్సైటు , సున్నపురాయి, యురేనియం, ఇనుప ఖనిజము, వంటి ఖనిజాలు, పెట్రోలియం, గ్యాసు. పారిశ్రామికాభివృద్ధికి మూల ధనం వంటివి కోకొల్లలు..

కృష్ణా, గోదావరి, పెన్న వంటి నదులు.

గండికోట, గుర్రంకొండ, ఉదయగిరి, చంద్రగిరి, కొండవీడు, కొండపల్లి, గుత్తి, కర్నూలు, ఆదోని, వంటీ చారిత్రిక, శిధిలాలైన కోటలు. పర్యాటకులకు వసతులు కల్పిస్తే బాగా ఆకర్షించేవి.
,
విజయనగరం, బొబ్బిలి, చల్లపల్లి, వెంకటగిరీ, నూజివీడు, మందస, కురుపాం, రాజమండ్రిలోని  రామచంద్రపురం కోట, పెద్దాపురం కోట, ఇంకా ఎన్నో, ఆ ఆ వoశస్తులను ప్రోత్సహించి, ఋణాలు ఇచ్చి హెరిటేజ్ హొటళ్ళను నెలకొలుపవచ్చు .

బంగారు గ్రుడ్లను పెట్టే చలన చిత్ర పరిశ్రమ..

వళ్ళు వంచి శ్రమించే పాటక జనం, ఇతర రాష్ట్రాలకు గట్టి పోటీ ఇచ్చి అత్యధికంగా విద్యారంగంలో రాంకులు సంపాదించే విద్యార్థులు.

అత్యధికంగా అమేరికాకు వెళ్ళి విలువైన్న విదేశీ మారక ధనాని . ఆర్జిస్తున్న తెలుగు-అమేరికన్లు.

ప్రకాశం, తెన్నేటి, వల్లూరి బసవరాజు, గౌతు లచ్చన్న, బెజవాడ గోపాల రెడ్డి  భోగరాజు పట్టాభి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, వంటి మచ్చలేని మహారధులు.

పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు వంటి తృణప్రాయంగా అసువులు బాసిన త్యాగమూర్తులు.

మాకినేని బసవపున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగీరెడ్డి, చండ్ర రాజ్యేశ్వర రావు గారు వంటి వామపంక్తి అగ్ర నేతలు..

వెంపటపు సత్యనారాయణ, నాగభూషణం  పట్నాయక్, కొండపల్లి సీతారామయ్య  గార్ల వంటి విప్లవ వీరులు.

బంగారం తాకట్టు పెట్టి జీతాలిస్తున్న దేశాన్నే సంక్షోభం నుండి కాపాడి దశ, దిశ మార్చిన తెలుగు బిడ్డ నరసింహారావు గారు,

తిరుపతి, శ్రీశైలం, సింహాచలం,బెజవాడ, మంగళగిరి, అన్నవరం, పంచారామ  క్షేత్రాలులు., లేపాక్షి, వొంటిమిట్ట, రామతీర్థం, వంటి పుణ్య క్షేత్రాలు.

బొజ్జన్నకొండ, అమరావతి, ఆదుర్రు, ఘంటసాల, అమరావతి, తోట్లకొండ వoటి, జాపాను, కొరియా, వంటి పూర్వప్రాంత దేశస్తులను ఆకర్షించగల బౌద్ధ క్షేత్రాలు.

యాగంటి, కొండపల్లి, గుంటూరు, బెజవాడ బొర్ర, వంటి గుహలు.

సుందరతెలుంగు అని మహాకవి సుబ్రహ్మణ్య భారతిచే పొగడబడిన తెలుగు భాష.

పోతన, శ్రీనాధుడు,నన్నయ్య, తిక్కన, ఎర్రన,  అష్టదిగ్గజాలు, మొల్ల, కృష్ణదేవరాయలవంటి మహాకవులు.

ఆంధ్రదేశములోనేగాకుండా, యావత్ దక్షి ణ భారతంలో, భగవంతునితో సమానంగ పూజింపబడుతున్న, త్యాగరాజు, క్షేత్రయ్య, అన్నమయ్య, శ్యామశాస్త్రి, రామదాసు, మొదలగువారు సంగీతజగత్తుకు ఇచ్చివెళ్ళిన సంగీత, సాహిత్య  భండాగారాలు.

ప్రపంచ విఖ్యాతి పొందిన కూచిపూడి నృత్యం.

ద్వారం వెంకటస్వామి నాయుడు గారు,  శ్రీపాద పిణాకపాణీ గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, వోలేటి వెంకటెశ్వరులు గారు, నూకల చిన సత్యనారాయణ గారు, శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వంటి ఆంధ్రుల చేతనే కాకుండా యావత్ సంగీత ప్రపంచముచేత గౌరవింపబడ్డ సంగీత విద్వాంసులు.

తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, చిలకమర్తి, గురజాడ, శ్రీపాద, విశ్వనాథ, శ్రీ శ్రీ వంటి అధునిక వైతాళికులు.

రావు బాలసరస్వతి, పీ. బీ శ్రీనివాస్, పీ. సుశీల, ఎస్.జానకి, ఏ ఎం రాజా, జిక్కి, వంటి, తెలుగు, తెలుగేతర  శ్రోతల మనసులు దోచుకున్న  నేపధ్య గాయకులు. ఇక ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, వంటి నేపధ్య గాయకులు.
 
ఎస్. రాజేశ్వర రావు, పెండ్యాల, తాతినేని చలపతి రావు, ఆదినారాయణ రావు, ఏ ఎం రాజా వంటి పరభాష లను కూడా  ఏలిన స్వర సారధులు.

అంజలి, జమున, సావిత్రి, ఎస్ జానకి, ఎస్ వీ రంగా రావు, కన్నాంబ, నాగయ్య, వంటి అన్ని భాషల చిత్రాలలోనూ పేరుపొందిన తెలుగు రత్నాలు.

ఇంకా ఇంకా చెప్పుకుంటూపోతే అంతులేని తెలుగు తేజాలు.

ఇంత ఉండికూడా మనకు సాటి దురదృష్టవంతులు లేరు.

1933-39 మధ్య బ్రిటిష్ వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాని మడ్రాస్ ప్రెసిడెన్సీ లోని తెలుగు జిల్లాలతో ఏర్పాటుకు  అంగీకరించినా,  తెలుగువారు మద్రాసు నగరం కావాలని పట్టు పట్టడంతో, ఆగీపోయింది.

1952-53 శ్రీబాగ్ పెద్దమనుషుల ఒప్పందంతో కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్త్రం ఎర్పడినా, తరువాత, నైజాముతో కలవడం వల్ల హైదరాబాదును రాజధానిగా స్వీకరించి కర్నూలు రాజధానిని పోగుట్టుకున్నాం

నిన్న మొన్న తెలంగాణా ఏర్పాటుతో హైదరాబాదు రాజధానిని పోగోట్టుకుని, రోడ్డున పడ్డాం.

తరువాత, అమరావతి 33000 ఏకరాలతో ప్లాన్డ్ సిటీ, దేశంలోనే గొప్ప సిటీ, రాజధాని అనుకున్నాం,  అన్నారు.

రాజకయాలకు అతీతంగా ఉండవలసిన ఈ విషయం, రాజకీయం క్రింద మారడంతో ప్రభుత్వం మారగానే, మూడు రాజధానులన్నారు.

ఇప్పుడు రాజధానే లేని రాష్ట్రం అయ్యింది

ఉచిత పథకాల కోసం అప్పు చేస్తున్న రాష్ట్రం
మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందో
తెలీడం లేదు

ఏమి జరుగనున్నదో!

No comments:

Post a Comment

Total Pageviews