Sunday, February 23, 2020

సన్మిత్రులతో ఓ చక్కని సాహితీ సాయంకాలం! వేదిక:హోటల్ దసపల్లా! సాహితీ రసగుల్లా!! 22.02.2020


సన్మిత్రులతో ఓ చక్కని సాహితీ సాయంకాలం! వేదిక:హోటల్ దసపల్లా! సాహితీ రసగుల్లా!! 22.02.2020
అద్దమందు కొండలా కొంచెంలా కనిపించే మిత్ర శ్రేష్ఠులు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ కాళహస్తీశ్వరున్ని "ఏ లీలన్ నుతియింప వచ్చు నిను" అని వాపోయిన ధూర్జటిలా లజ్జా స్థితి లో ఉంది నా స్థితి. సమ్ పీపుల్ మేక్ ద వరల్డ్ వెరీ స్పెషల్ జస్ట్ బై బీయింగ్ ఇన్ ఇట్ అన్న ఆంగ్ల కవి సూక్తులను నిజం చేస్తూ ఒక మంచి కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, సౌందర్యారాధకుడు, చిత్రకారుడు, తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, నిత్య సాహిత్యాన్వేషి, వక్త, నిరాడంబరుడు, నిగర్వి, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఉన్నతాధికారి, ఇలా ఎన్నెన్నో సుగుణాల గని, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. పేరుకి చినవీరభద్రుడు ప్రపంచ సాహిత్యాన్ని గొప్పగా ఔపాసన పట్టిన చినవీరభద్రుని పెద్ద ఆనంద తాండవం ఆయన ప్రతి రచనలో దర్శనమిస్తుంది అదే ఆయన ప్రతిభకు నిదర్శనం. బహుశా విశ్వ సాహితీ సాగర తీరం వెంబడి దేశ దేశాల లంగరు వేసి ఓడలలో విజ్ఞానాన్ని తరలించ దానికి సహజ సిద్దముగా ఏర్పడిన ఓడరేవు మా వాడ్రేవు! ఆయనతో సంభాషించాలంటే భయంగా ఉంటుంది? అపారమైన జ్ఞాన సముద్రం ముందు నిలబడ్డ అల్ప ప్రాణిలా అనిపిస్తుంది. విస్తృతమైన పరిజ్ఞానం పాటవం ఎప్పటిలాగే మంత్రముగ్ధులను చేస్తాయి...రాతలతో, గీతలతో మధుర భావనలు పంచి, పెంచుతున్న మహోన్నత కృషీవలుడు.
ఒక వ్యక్తిలో ఇన్ని సుగుణాలు ఎలాసాధ్యం? ఆయన దినచర్య ఏమిటి?
ఇంత అపురూపమైన...సున్నిత మనస్కుడైన భావకుడైన, లలితా కళా ప్రియుడు పేస్ బుక్ లో మనమిత్రుడు గా ఉన్నారంటే ఆ మాధుర్యం, ఆ తృప్తి, మన నిరాశల శిశిరాల్లొ ఆశల వసంతంలా ఎప్పుడూ తోడుంటాడు మంచి మంచి భావాలతో నేను ఉన్నాను అంటూ...మనల్ని పలకరిస్తాడు. మనకి గర్వాన్ని, గౌరవాన్ని, ఆనందాన్ని కలిగిస్తాడు. మిత్రమా ఇలాగే శత వసంతాలు ...సంతస వసంతాలు పూయిస్తూ వుండు.. ధన్యవాదాలు. నమస్సులు🙏🙏🙏









చిన వీరభద్రుడు గారి తో సంభాషణ
సమ్ పీపుల్ మేక్ ద వరల్డ్ వెరీ స్పెషల్ జస్ట్ బై బీయింగ్ ఇన్ ఇట్
ఒక మంచి కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, సౌందర్యారాధకుడు, చిత్రకారుడు, తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, నిత్య సాహిత్యాన్వేషి, వక్త, నిరాడంబరుడు, నిగర్వి, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఉన్నతాధికారి, ఇలా ఎన్నెన్నో సుగుణాల గని విశ్వ సాహితీ సాగర తీరం వెంబడి దేశ దేశాల లంగరు వేసి ఓడలలో విజ్ఞానాన్ని తరలించ దానికి సహజ సిద్దముగా ఏర్పడిన ఓడరేవు మా వాడ్రేవు! పేరుకి చినవీరభద్రుడు వాగర్ధాల వివరింపగా  ఆనందతాండవమాడు ఆ వీరభద్రుడు!!   
రాతలతో, గీతలతో మధుర భావనలు పంచి పెంచుతున్న మహోన్నత కృషీవలుడు.
సంభాషించాలంటే  భయంగా  ఉంటుంది? అపారమైన జ్ఞాన సముద్రం ముందు నిలబడ్డ అల్ప ప్రాణిలా  అనిపిస్తుంది
విస్తృతమైన పరిజ్ఞానం పాటవం ఎప్పటిలాగే మంత్రముగ్ధులను చేస్తాయి...
ప్రపంచ సాహిత్యాన్ని ఔపాసన పట్టిన చినవీరభద్రుని పెద్ద ఆనంద తాండవం ఆయన ప్రతి రచనలో దర్శిస్తాము
ఉద్యోగం, చిత్రలేఖనం, చదవటం, ఉపన్యాసాలు ఎలాసాధ్యం  ఆయన దినచర్య ఏమిటి?   
ఇంత అపురూపమైన...సున్నిత మనస్కుడైన భావకుడైన, లలితా కళా ప్రియుడు 
పేస్ బుక్ లో మనమిత్రుడు గా ఉన్నారంటే ఆ మాధుర్యం, ఆ తృప్తి, మన నిరాశల శిశిరాల్లొ ఆశల వసంతంలా ఎప్పుడూ తోడుంటాడు మంచి మంచి భావాలతో నేను ఉన్నాను అంటూ...మనల్ని పలకరిస్తాడు. మనకి గర్వాన్ని ఆనందాన్ని కలిగిస్తాడు. మిత్రమా ఇలాగే శత వసంతాలు ...సంతస వసంతాలు పూయిస్తూ వుండు.. ధన్యవాదాలు. 
 ఈ భావనలు నాకు వర్తిస్తాయి మిత్రమా  నేనొకప్పుడు మసిలిన నా చిన్ననాటి ఇల్లు, నా బాల్యం, పసితనంలోనే మమ్మల్ని వదిలివెళ్ళిపోయిన నా చెల్లెల్ని మళ్ళీ మళ్ళీ చూడలేను.  కొత్త ఊరుని చూసినప్పుడల్లా జీవితం మళ్ళా కొత్తగా మొదలవుతున్నట్టే అనిపించేది. గోదావరిని, సముద్రాన్ని


"నీ చూపు చాలమ్మా ఎందుకు వెన్నెలలు నీ నవ్వు చాలమ్మా ఎందుకు వేకువలు" ఒక కవి అన్నాడు. మా విశ్వ కవి మిత్రుడు భద్రుడు రాసిన ఒక పదం చాలు. మన మనోపధంలో నిలిచి పోవడానికి ఒక వాక్యమైనా మహా కావ్యం! ప్రపంచ సాహిత్యానికి మహా భాష్యం చెప్పే భావకవి... అనుభవకవి!  అనుభూతి కవి! ఆ భవభూతి కవి!! మిత్రమా వెయ్యేళ్ళు వర్దిల్లుమా!!!



ఒక పువ్వు భావకుని అంతరంగం నిండా విరిసి బయటకి చొచ్చుకుని వచ్చి విశ్వంభరని తన సౌందర్య సౌరభంతో వ్యాపిస్తే ఇలా అధ్బుత వ్యాసమవుతుంది. ఓ ప్రేమ భావుకా!  తెలుగు సాహితీ వసంత శోభా ప్రభలు విశ్వాన విరజిమ్ముతూ... శతపత్రదళ కీర్తి శోభామయ ప్రభలతో శతవసంతముల్ వర్దిల్లుమా!!


మీ కవితలు చదివినా.. మీ ప్రసంగాలు విన్నా మంత్ర ముగ్దుణ్ణైన నాకు స్పురించేభావం ఏమంటే? ఇది నాదే కాదు బహుశా అందరిదీ!!
ఓ శిశు కవి నీవు సుకవిలా ఆసుకవిలా ఆ సుకవుల్లా మారాలంటే
వేల కవితలు చదివి అధ్యయనం చెయ్యడం కాదు
అది చాలా పెద్ద కష్టం! సులభమైన మార్గం ఏమంటే చిన వీరభద్రుణ్ణి చదువు చాలు!!

మధురమైన ప్రతి క్షణం! జీవిత కాల తీపి జ్ఞాపకం!!
అయ్యా! భావుక మహానుభావా! సాయం సంధ్యావందనం!
మీ షిర్డీ హారతి అనుభవం కొత్తగా దశవిధ భక్తి మార్గాన్ని లోకానికి అనుభూతిలోకి తెచ్చింది.


ఆ కళ్ళు గేలమేసి ఏ ప్రకృతి సౌందర్యాన్ని మనసులోకి నింపుకుంటున్నాయో, ఆ మనోభావన  చిత్రంగా చేతినుంచి జాలువారి ఒక అద్భుత చిత్రంగా, రచనగా రూపుదిద్దుకోబోతోందో వేచి చూద్దాం!!


నువ్వు నీ జీవితప్రయాణంలో ఎన్ని వింతవింత లోకాలైనా చూడవచ్చుగాక కాని నీ హృదయం మాత్రం నీ స్వదేశంకోసం, నీ స్వగ్రామం కోసం, నీ స్వజనం కోసం కొట్టుమిట్టాడుతూంటుందని తెలియరావడమే ఒడెస్సీ.
ఒడెస్యూస్ నుంచి వాడ్రేవు చినవీరభద్రుడి దాకా విశ్వజనీనమైన అక్షరసత్యం ఇది

మీ పోస్ట్ లు చదవడమే ఓ ఎడ్యుకేషన్ వరల్డ్ స్పేస్ రేడియో లో 'మోహన రాగం' సాహిత్యప్రసంగాల లింక్స్ దయచేసి ఇవ్వగలరు ఆ అపార జ్ఞానవాహినిలో మేము కూడా మునకలు వేస్తాము .

అయ్యా నమస్కారం! ప్రతి పుస్తక ప్రదర్శనలోనూ మా అభిమాన మీ పుస్తకాల గురించి వెతకడం కొన్ని దొరకడం కొండంత నిరుత్సాహం! తీరా ఆ దొరికినవాటిని మిత్రులు చదవకుండా తీసుకుపోవడం తిరిగిఇవ్వకపోవడం! మీరు కొన్ని లింకులు పెడుతున్నారు కానీ కాసిని మల్లెపువ్వులదండను రెండుచేతుల్లో పెట్టుకుని గాఢంగా శ్వాసించడానికీ దూరంగా ఉన్న పూలగుట్టను, తోటను ఆస్వాదించడానికి ఉన్న అంతరంగా ఉంది. దయచేసి హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో మీ పుస్తకాలు అన్నీ ఉండేట్లు చూడండి మిత్రశ్రేష్ఠా! దయచేసి ఆ వివరాలు మాకు తెలియచేయండి మహాశయా!

ఒక కవిత రాయడం కాదు దర్షించాలి అన్న కవితా శీర్షిక కవిత చదవడం కాదు దర్శించాలి అనే ఆలోచన రేకెత్తింపచేస్తుంది వాక్యం రసాత్మకం కావ్యం అంటారు కానీ మీ ప్రతి వాక్యం వెంటాడే ఒక జ్ఞాపకం.మీసుమనస్సులకు మా నమస్సులు

మిత్ర రత్నమా
మీ రసాత్మక కావ్యాలు చదువుతూ
ప్రస్తుతాన్ని విస్మరించి
గతాన్ని వరించి స్మరించి
గుండె కరిగి గొంతులొంచి ఉబికి
కళ్ళలో జాలువారే క్షణం
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
గానమిదీ నీ ధ్యానమిదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిది అన్న సినీకవికి వందనం
మీ కవితా హృదికి మీ శైలికి మా హృదయపూర్వక అభినందన వందనం
మీ రచనలన్నీ చదివగానే మనసు మూగబోయి మాటవినదు
రాయడానికి ప్రజ్ఞ చాలదు
లలితా సహస్ర నామంలో అమ్మవారి నామం నిజసల్లాప మాధుర్య వినిర్భర్స్తిస కచ్ఛపీ గుర్తుకువచ్చి
వాణి వీణ పై ముసుగేసినట్లు మా కలాన్ని మూసివేయక తప్పదు.
ఎంత ఎదిగినకొద్దీ ఒదిగివుండే మా చిన్న వీరభద్రుడు ఇలాగే ఎప్పటికీ చిన్నవాడిగా, ఒక పసివాడిగా వుండి వసివాడని సాహితీ సుమగంధాలను రంగుల నీటిచిత్రాలను అందించి అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా ఆ సదా శివుణ్ణి కోరుకుంటూ పుట్టినరోజు శుభాకంక్షలతో

మీ ఆత్మీయ ఆహ్వానానికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు మిత్రశ్రేష్ఠా!🙏🙏🙏🙏🙏

నమస్సులు పున:పున:


గురజాడవారు 150 సంవత్సరాలక్రితం "నాతోమాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్" అనిపించారు గిరీశంతో,
మీతో మితృత్వమే, మీ సహచర్యమే ఓ విజ్ఞాన యాత్ర! మీ అనేకానేక విశ్వమిత్రుల జాబితాలో నేనుసైతం చిట్టచివరనున్నా మహాభాగ్యమే అనిపిస్తుంటుంది.

అవే, అవే అచ్చంగా అవే మాటలు సోక్రటీస్ కూడా అన్నారు. "నాపేరు సోక్రటీస్ నాకు తెల్సీసింది ఒకటే నాకు ఏమీతెలీదు అన్నవిషయం" మీ మేధావులతో వచ్చిన చిక్కే అది

సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారిగా ఒక ఉత్తమోత్తమ అధికారిని ఎంపిక చేసిన ప్రభుత్వానికి మా హృదయపూర్వక అభినందనలు. మీ ఈ నియామకం ద్వారా విద్యావ్యవస్థలో పెనుమార్పులు తద్వారా రేపటి పౌరులను తయారుచేసే వ్యవస్థల సమర్ధవంతమైన పనితీరు మీ పర్యవేక్షణలోనే సాధ్యమవుతుంది. మా హృదయపూర్వక శుభాభివందనాలు. 
ఇంతవరకు గిరిజనులు సమస్యలు పట్టించుకున్నారు
నాగరికులు అనాగరికులుగా మారిపోకుండా
ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?
బడి నుంచి ఏమి నేర్చుకోవాలి?
సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?
ఇవి పాఠ్యాంశాలుగా చేర్చండి
నిస్సారమైపోయింది సాహిత్యం అంటని నేటి తరం
భావితరాలు సారవంతం చెయ్యండి మహాప్రభో
కలసి నడవండి
ఓ ఆదర్శ మధుర మిధునమా
సమ్మోహన కవనమై
కమనీయ వర్ణమై
ద్వంద్వమేకమై
భావమమేకమై
అనుభవాలనేకమై
వాగర్ధాలై
అద్వైతమై
అద్వితీయమై
పత్రహరితంలా
పూల తావిలా
చిరుగాలి తరగలా
తోడునీడగా
కలకాలం
కలసి నడవండి
ఓ ఆదర్శ మధుర మిధునమా
సమ్మోహన కవనమై
కమనీయ వర్ణమై
కలసి నడవండి అలా అలా అనంతంగా
మీరు తిరిగిన దారులన్నీ మాకు
సంతస వసంతాలు......


No comments:

Post a Comment

Total Pageviews