Thursday, December 17, 2020

 బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ  అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. 


కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.


అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.


బాగా చదువుకున్న  వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.


ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. 


కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo.  అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. 


కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...


ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.


ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.


నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.


మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.

ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు.  2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.


మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం  వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.


అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది.  ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!


ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.


రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.


అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు


చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.


అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.


ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.


CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.

అదే టాటా నానో పరిశ్రమ మోడీ  సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.  అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.


https://www.google.com/amp/s/wap.business-standard.com/article-amp/companies/sanand-the-new-global-auto-hub-115032200818_1.html


మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.


ఈ క్రింద ఫోటోలు చూడండి.  కుడి వైపు ఫోటో చైనా MNCలది. రెండోది US, యూరోప్ MNC లది.  స్వాతంత్రం వచ్చి 70 సం. లకు పైగా అయింది. ఎన్ని భారత్ కంపెనీలు పేర్లు దీనిలో ఉన్నాయో వెతకండి.


.....చాడా శాస్త్రి...


ధనుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు!

                             నుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు! ఈ లింక్‌ లో చూడండి.

1) https://www.youtube.com/watch?v=BW8iNbKYan8

                ఓ సంక్రాంతి శుభవేళ హైదరాబాద్‌ శిల్పారామంలో మా చిన్నబ్బాయి చి. ప్రభవ్‌ హరిదాసు వేషం ఈ లింక్‌ లో చూడండి.

2) https://www.youtube.com/watch?v=yhea6kGRa4Y

                ఇటువంటి వీడియోలను లైక్‌ చేసి, షేర్‌ చెయ్యండి, మా యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి. 

                        ధనుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు! 

            మొట్ట మొదటి హరిదాసు నారద మహాముని.  "శ్రీ మద్రారమారమణ గోవిందో హారి" అంటూ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దిన హరిదాసు వేషధారణతో, ముంగిళ్ళ రంగవల్లులే వేదికగా నర్తనలతో "హరిలొ రంగ హరి" హరి కీర్తనలతో తెలుగు నేలలో తెల్లవారు ఝామునే అధ్యాత్మిక పరిమళాలతో అలరిస్తారు.  హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగాలని దీవిస్తారు హరిదాసులు. వీరు నెలరోజులు పాటు వీధి వీధినా హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు.   సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు. 

                     

                ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం  హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం , కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటిచెప్పే హరిదాసు కీర్తనల్లో, రూపంలో ఉంటుంది. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటని కొంతమంది నమ్మకం అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో  బియ్యం, లేదా ఇతర కానుకలతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. కాలంతో పాటుగా హరిదాసులు వాహనాల మీదే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రికార్డు చేయించిన హరినామ కీర్తనలను మైక్‌ ద్వారా ప్రజలకు వినిపిస్తున్నారు. మన తరతరాల ఈ ఆధ్యాత్మిక కళా వారసత్వాన్ని మనం ఆదరించి, వారి గురించి మన భావితరాలకు అవగాహన కల్పించేందుకు, తరలించేందుకు మనమందరం కృషి చేద్దాం అందులో భాగంగా 

            ఇటువంటి వీడియోలను లైక్‌ చేసి, షేర్‌ చెయ్యండి, మా యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి. 

ధనుర్మాస వేళలో మా పల్లె పినపళ్ళలో నగర సంకీర్తన!

 ఈ ధనుర్మాస వేళ ప్రతి రోజూ ఆ ప్రత్యేకతలు తెలుసుకుందాం! ముందుగా

ధనుర్మాస వేళలో మా పల్లె పినపళ్ళలో నగర సంకీర్తన!
ఈ లింక్‌ లో చూడండి.

https://www.youtube.com/watch?v=ivIemQ613bo వారి ప్రతిభ విశ్వానికి వెల్లడించేందుకు, లైక్‌, షేర్‌ చెయ్యండి.
మా విస్సా ఫౌండేషన్ యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌ స్క్రయిబ్‌ చెయ్యండి.
శ్రీ హరి నామ సంకీర్తనతో నగర సంకీర్తన చేసే బృందం
8 సంవత్సరాల నుంచి 40 మంది సంభ్యుల బృందం పట్టాభిరామయ్య,
చంద్రమ్మ, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి , చామకూరి శివకుమారి,
వరలక్ష్మి, చంద్రావతి, నాగమణి, శేషారత్నం, ఏపూరి దుర్గ , తదితరులు
ఈ ధనుర్మాస వేళలో ఉదయం 3 గంటలకే నిద్రలేచి, శుచిగా స్నానం చేసి,
హరి సంకీర్తనలు చేసూ నగర సంకీర్తన చేస్తూ,
కోలాటం నేర్చుకుని, పాటలు పాడుతూ, శ్రీవారి సేవకు తరచూ వెళుతూ
మన ఘన ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతినిధులుగా
ముందు తరాలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు
వారినందరినీ మా విస్సా ఫౌండేషన్ అభినందిస్తున్నది.
సత్యసాయి విస్సా ఫౌండేషన్!

Sunday, December 13, 2020

పులిహోరకలపటం" "పులిహోర బాచ్" అని ఎంతో హీనంగా, నీచంగా వాడుతున్నారు.

 మిత్రులకు ఒక విన్నపం,


ఈ మధ్య మీరు గమనించి వుంటారు.. టీవీ  షో లలో, కార్య క్రమాలలో "పులిహోరకలపటం" "పులిహోర బాచ్" అని ఎంతో హీనంగా, నీచంగా వాడుతున్నారు. 


మనం ఎంతో పవిత్రంగా మన ఇంట్లో మనం దేవుడికి నైవేద్యంగా పెట్టి, ఎంతో పవిత్రంగా, ప్రసాదం గా భావించే పులిహోర ని ఇంత అవమానకరంగా వాడుతూ మనసంప్రదయాన్ని, సంస్కృతిని మనమే అవమాన పరిస్తే ఇప్పటి తరం ఏమైనా గౌరవంగా చూస్తుందా?

ఈ మధ్య మీరు గమనిస్తే భోజనం అంటే "బిర్యానీ" అనేంతగా మన భావ దారిద్య్రం పేరుకు పోయింది. నిజానికి తెలుగువారి పరిపూర్ణమైన భోజనానికి ఎంతో పేరు, కానీ మన తరం ఎం చేస్తున్నాం? మనల్ని మనమే అత్యంత అవమానకర మైన రీతిలో హీనపరచుకుంటున్నాం.

 ఇది వేరెవరో చేస్తున్నది కాదు. మనమే అతి మేధావులం,  ఈ విధంగా చింతపండు పులోహోరా,  నిమ్మకాయ పులిహోరా అనే స్థాయికి దిగజారి మన సంప్రదాయ ఆహారపు అలవాటును అవమానపర్చటం అలవాటుగా మారిపోయింది. 


  

ఇక మనం మేల్కొని ఖండించకపోతే

రేపు మన కట్టు, బొట్టు,మన ఆచారాలు, మన కుటుంబ సంప్రదాయాలమీద, మన తెలుగు తనం మీద, అవిమానపరుస్తూ మనల్ని ఇంకా దిగజార్చే వాళ్ళు తయారవుతారు. 

మనమే దిగజార్చి ,మన తర్వాతి తరానికి తెలుగువారికి కల్చర్ లేదు అనే స్థాయికి మనమే నెట్టబడతాం.


మన టీవీ లలో వచ్చే కార్యక్రమాలలో సభ్యులు.. ఇంకా అనేక మంది Fb..లో కూడా మేధావులు  చాలా ఎక్కువగా "పులిహోర" అనే మాట వాడి మన తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని దిగజారుస్తున్నారు, వారిని చూసి ఏమి తెలియని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, దానిని సమర్థిస్తూ తెలుగువారికోసమే పుట్టామని చెప్పుకునే  తెలుగు మీడియా, జాగ్రత్తగా ప్రోత్సహిస్తూ తెలుగు వారినే అవమానపరుస్తుంది. 


దయచేసి అందరూ ఈ దాడిని  ముక్తకంఠం తో ఖండిచాలి. మీ మీ గ్రూప్ లో చర్చించి,పెద్ద ఎత్తున స్పందించండి. లేకుంటే మనమే మనల్ని అవమాన పరస్తున్నవాళ్ళం అవుతాం, వదిలేస్తే ఇంకా ఎన్నో ఘోరమైన అవమానాలను తెలుగుజాతి ఎదుర్కొనాల్సివుంటుంది.


 అపమని గట్టిగా చెప్పండి,

మీడియా తో చెప్పి వారి భాధ్యతను గుర్తుచేయండి.

మన సంస్కృతిని ఎవరైనా అవమాన పరిస్తే ఖండించండి..

అంతా జరిగిన తరవాత చింతించడం కంటే, ముందే అరికట్టడం మంచిది.

ఇట్లు...

మీ తోటి సగటు తెలుగువాడు..

🙏🙏🙏


చివరి మనవి :

చదివి వదిలేయవద్దు, సాటి తెలుగువాడిగా స్పందించి అరికట్టండి. 🙏🙏🙏

Saturday, December 12, 2020

తెలుగు విశ్వరూపం

 జనని,జనకుడు,జన్మభూమి,జాతీయ కేతనంబు,,(జండా),జాహ్నవీ తటము పరమపావనముల్ పంచ 'జ' కారముల్ 

 

కష్ట పెట్ట బోకు కన్నతల్లి మనసు 

నష్ట పెట్టబోకు నాన్న పనులు 

తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా

తెలిసి మసలుకో తెలుగు బాల (కరుణశ్రీ)


తెలుగు వృద్ది పరచ దలచు నీవు 

మా తృభాష నెపుడు మాటాడ వలెనంచు 

పలుకుమయ్య ప్రజలకు తెలుపుమయ్య

తెలుగు భాష యనిన తీయని మామిడి తోట 

తోటలోని చెట్లు మేటి కృతులు 

పద్యగేయ వితతి పరి పక్వ ఫలములు 

తథ్ఫలాలను (ఆ పళ్ళను ) తిన దలచండయ్యా


తెలుగు విశ్వరూపం 

*****

అచ్చులతో అల్లికలు నేర్చి 

హల్లులతో మాలికలు కూర్చింది 

గుణింతాలతో సుగుణాలు చెక్కి 

ద్విత్వాలతో శిల్పాలు మలిచింది 

సంధులతో సంబంధాలు పేర్చి 

సమాసాలతో విశేషాలు చెప్పింది 

సంయుక్తాలతో యుక్తులు పన్ని 

అలంకారాలతో అందలమెక్కింది 

విభక్తులతో ఆకర్షణ చేసి 

ప్రత్యయాలతో ప్రతిమ చేసింది 

యతులతో గతులు మార్చి 

ప్రాసలతో ప్రతిభ చూపింది 

చందస్సులతో ఉషస్సు నింపి 

పద్యాలతో కదం తొక్కింది 

అవధానాలతో వేదికలెక్కి 

ఆశువుగా ధారణ చేసింది 

నుడికారాలతో నుదుటి బొట్టై 

తలకట్టులతో అందాలు చిందింది 

సామెతలతో వాసికెక్కి 

జాతీయాలతో రాశి పెంచింది 

ఏమని వర్ణింతు 

నా తెలుగు భాష ప్రతిభాపాటవం 

సుమధుర సుందర అక్షర విశ్వరూపం !!

--------------------     శుభసాయంత్రం   -----------------------------


Tuesday, December 8, 2020

తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం. ఇప్పుడు బళ్ళలో కూడా...

 తెలుగు మహా కళాతపస్వి శ్రీమతి కళ్యాణి ద్వి భాషిని Kalyani Dwibhashyam వారి ధర్మపతి  శ్రీ కాకర్లపతి శ్రీనివాసా గారి యొక్క సుమధుర మన తెలుగు పరిస్థితి.

చదువుతూ ఉన్నప్పుడు నవ్వకండి.

జై జై జై సాయి రామ్

హరే శ్రీనివాసా

జై జై జై జై జై జై జై తెలుగు తల్లీ

...............

...............

తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం. 

ఇప్పుడు బళ్ళలో కూడా... 


"డోర్ లాక్ చెయ్యకండి"


‘నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ?’

ఇందులో ‘కార్’ తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 

కానీ మనం వాడం.


ఎందుకు? 

ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు. 

చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.

ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 

తలుపు తాళం వేసుకో, 

గడిపెట్టుకో అనే వాళ్ళం. 

ఇవేకాదు, 

చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?


మన తెలుగులో మాటలు లేవా? 

ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి. 

కానీ మనం పలకం. 


వంటింటిని కిచెన్ చేసాం. 

వసారా వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.


మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. 

గెస్ట్‌లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. 

ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 

అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, వగైరాలే.


అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు,  తినండి అంటే ఇంకేమన్నా ఉందా,  

వాళ్ళేమనుకుంటారో అని భయం.

అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం. 

బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము. 

అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. 

కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.


ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడని అడిగా. 

ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది. 

బిత్తరపోవడం నావంతయింది. 


టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా-వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకి అలవోకగా ఆంగ్లపదాలు పట్టుబడతాయి మరి. 

అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 


టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి, 

ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, 

స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలా సాగుతుంది. 

మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?


నిన్న మా పక్కింటాయన వచ్చి 

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, 

ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ 

అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?

అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. 

అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 

అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. 

ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.


పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. 

స్కూల్‍కే పంపిస్తాం. 

సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు. 

ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 


మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం? 

ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా? 

తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి? 

ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు. 

నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, 

నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 

ఇతరులు అనుకోవాలన్న భావన.


ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. 

ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరచుకున్న తెలుగు వాళ్ళు 

తూర్పు పడమర మిగిల్చారు 

కానీ ఉత్తరం దక్షిణం మరచిపోయారు. 

ఈ కాలంలో ‘వడ’, ‘తెన్ను’ అంటే ఎవరికి తెలుస్తుంది? 

‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకును’ 

అని భావించిన గొప్పగొప్ప పండితులు 

వారి పాండిత్య ప్రకర్ష కోసం తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు. 

వారి దగ్గర పాఠం వల్లెవేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది. 


అదే వరవడిలో మనకి పగలు మిగిలింది, మావు చీకట్లో కలిసిపోయింది. 

ఉసురుకి ప్రాణం పోయింది. 

ఎడం దూరం అయింది. 

అన్నం తినడం మొదలు పెట్టాక కూడు చద్దిపట్టింది. ప్రస్తుతం మనం సంతోష పడాలన్నా, 

బాధ పడాలన్నా, 

ఆఖరికి భయపడాలన్నా 

సంస్కృతంలోనే పడుతున్నాం. 

ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు.  


వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం, 

శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి. 

తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది. 

ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం 

జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి. 

వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి. 


ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.


ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో 

ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి 

ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా. 

అతడు కొంచెం వింతగా నావైపు చూసి, 

మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు. 

అవునయ్యా అన్నా. 

అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది, 

అని అవి అమ్మే చోటు చూపించాడు. మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు, 

ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది. 


భాషలో లేని పదాలను 

పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల 

ఆ భాష పరిపుష్టమౌతుంది. 


అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి 

పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది. ఇంకా సమయం మించిపోలేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు 

అంతరించి పోకుండా ఉండాలంటే మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి. 


బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా,కనీసం *ఇంటి గోడల నడుమైనా* ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు *తలుపులు తెరుద్దాం*.


Monday, December 7, 2020

ఒంటి కాలితో ఎవరెస్ట్‌ ఎక్కిన బాలిక అరుణిమా సింహా Arunima Sinha: On top of the world



Arunima Sinha: On top of the world

ఒంటి కాలితో ఎవరెస్ట్‌ ఎక్కిన బాలిక అరుణిమా సింహా

ఈ యూట్యూబ్‌ లింక్‌ నొక్కి చూడండి 


 https://www.youtube.com/watch?v=Wx9v_J34Fyo



Total Pageviews