Thursday, December 17, 2020

ధనుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు!

                             నుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు! ఈ లింక్‌ లో చూడండి.

1) https://www.youtube.com/watch?v=BW8iNbKYan8

                ఓ సంక్రాంతి శుభవేళ హైదరాబాద్‌ శిల్పారామంలో మా చిన్నబ్బాయి చి. ప్రభవ్‌ హరిదాసు వేషం ఈ లింక్‌ లో చూడండి.

2) https://www.youtube.com/watch?v=yhea6kGRa4Y

                ఇటువంటి వీడియోలను లైక్‌ చేసి, షేర్‌ చెయ్యండి, మా యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి. 

                        ధనుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు! 

            మొట్ట మొదటి హరిదాసు నారద మహాముని.  "శ్రీ మద్రారమారమణ గోవిందో హారి" అంటూ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దిన హరిదాసు వేషధారణతో, ముంగిళ్ళ రంగవల్లులే వేదికగా నర్తనలతో "హరిలొ రంగ హరి" హరి కీర్తనలతో తెలుగు నేలలో తెల్లవారు ఝామునే అధ్యాత్మిక పరిమళాలతో అలరిస్తారు.  హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగాలని దీవిస్తారు హరిదాసులు. వీరు నెలరోజులు పాటు వీధి వీధినా హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు.   సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు. 

                     

                ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం  హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం , కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటిచెప్పే హరిదాసు కీర్తనల్లో, రూపంలో ఉంటుంది. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటని కొంతమంది నమ్మకం అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో  బియ్యం, లేదా ఇతర కానుకలతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. కాలంతో పాటుగా హరిదాసులు వాహనాల మీదే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రికార్డు చేయించిన హరినామ కీర్తనలను మైక్‌ ద్వారా ప్రజలకు వినిపిస్తున్నారు. మన తరతరాల ఈ ఆధ్యాత్మిక కళా వారసత్వాన్ని మనం ఆదరించి, వారి గురించి మన భావితరాలకు అవగాహన కల్పించేందుకు, తరలించేందుకు మనమందరం కృషి చేద్దాం అందులో భాగంగా 

            ఇటువంటి వీడియోలను లైక్‌ చేసి, షేర్‌ చెయ్యండి, మా యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి. 

No comments:

Post a Comment

Total Pageviews