Friday, December 18, 2020

గంగిరెద్దుల వారు మా ఇంటివద్ద గంగిరెద్దు ఆటల విన్యాసాలు మరిన్ని విశేషాలు ఈ లింక్‌ లో

 గంగిరెద్దుల వారు 

మా ఇంటివద్ద గంగిరెద్దు ఆటల విన్యాసాలు మరిన్ని విశేషాలు ఈ లింక్‌ లో

1)  https://www.youtube.com/watch?v=3TRbv1jTMK4

2) https://www.youtube.com/watch?v=uwYjjiUYARY

3) https://www.youtube.com/watch?v=hrXR7C2I3dU

ఇటువంటి జానపద కళారూపాలను ఆదరించండి. వారి ప్రతిభ విశ్వవ్యాప్తమయ్యేలా ఈ వీడియోలు లైక్‌, షేర్‌ చెయ్యండి. 

మా ఈ ఛానల్‌ సబ్‌ స్క్ర్యైబ్‌ చెయ్యండి.  

                    గంగిరెద్దులాటలు అనునది ఒక జానపద కళారూపం.ఇది ప్రాచీనమైనది. తెలుగు సంప్రదాయాలకు గుర్తు సన్నాయి అప్పన్న, విశాఖ పట్నంలో జరిగే విశాఖ ఉత్సవ చిహ్నం కూడా సన్నాయి అప్పన్నే. కానీ సన్నాయి అప్పన్నల జీవితాలలో విషాదమైన సంగీతము మారుమ్రోగుతోంది. ఇతరులకు సన్నాయి పాటలను వినిపించి డోలు కొట్టి, శిక్షణ నిచ్చిన గంగిరెద్దును పట్టుకొని తిరిగే గందిరెద్దులోళ్ళు జీవితాలు చీకటి మయమయ్యాయి. స్థిర నివాసాలు లేనివారు, భూములు లేని వీరికి విద్యా, ఉద్యోగం, మొదలగు వాటిలో వున్న రిజర్వేషన్లు వీరికి తెలియవు.

                       పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట. అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు. అంతర్ధానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు గంగి రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నంది కేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలైన డోలు, సన్నాయి, బూర, సుత్తి లను ధరింప చేసి, తాను మేళానికి నాయకత్వం వహించి ...గజాసురుని చెవుల బడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించ మని కోరుతాడట. అందు కోసమే ఎదురు చూచిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట. గజాసురుడు ఆనంద భరితుడై ఏం కావాలో కోరుకో మంటాడట. తన పాచిక పారిందనుకున్న హరి... ఇది శివుని వాహనమై న నంది తన స్వామికి దూరమై విలపిస్తూ ఉంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట. ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారి యైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసుకున్న గజాసురుడు శివుని ప్రార్థించి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట. అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడట. ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజ లందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిస్తాననీ చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. ఆ గంగిరెద్దులను లోకంలో తిప్పుకొమ్మని గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా యివ్వడం జరుగుతుంది. (గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు) అప్పటి నుండి గంగిరెద్దులను తిప్పుకొని బ్రతుకు తున్నట్లు పెద్దలు చెప్తారు.

                    వీరు ప్రాంతీయ బాణీలలో జానపద పాటలు పాడుతారు. సన్యాసమ్మ పాట, రాములవారి పాట, ఈశ్వరమ్మ పాట, గంగరాజు పాట, వీరగున్నమ్మ పాట (మందస ప్రాంతంలో), మాలవారి మంగమ్మ మొదలగు పాటలు బాణీకట్టి పాడతారు. సినిమా పాటలు కూడా పాడతారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా గంగిరెద్దుల వారున్నారు. అయినా వీరంతా తెలుగువారే. మహారాష్ట్రలో వీరిని నందివాలా అంటారు.

గంగిరెద్దు ఆటల విన్యాసాలు

గంగిరెద్దుతో సన్నాయి అప్పన్న చేయించే విన్యాసాలు

సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దుల వారు పల్లెల్లో తిరుగుతుంటారు. గంగిరెద్దు

డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నావురుకుతు రారన్నా రారన్న బసవన్నా

అమ్మవారికీ దండం బెట్టు అయ్యగారికీ దండం బెట్టు

మునసబు గారికి దండం బెట్టూ

కరణం గారికి దండం బెట్టూ

రారా బసవన్నా, రారా బసవన్నా.... అంటూ


No comments:

Post a Comment

Total Pageviews