పంచ్ ..పంచ్ మీద పంచ్
(1) అబ్బాయ్ శాస్త్రిగారి ఇల్లు ఎక్కడవుంది బాబు (ఎక్కడా అంటే ఆయన యిల్లుమీద ఎక్కడండి అంటాడేమొననని ముందుజాగ్రత్తగా)
మాయింటి పక్కనేనండి
అలాగా మరిమీయిల్లు ఎక్కడవుంది
శాస్త్రిగారి యింటిపక్కనే
(2) రైలు వేగంతగ్గింది. పైబెర్తుమీద పడుకున్న ప్రయాణీకుడికి గబుక్కున మెలుకువ వచ్చి, కిందికూర్చున్న కుర్రాణ్ణి అడిగాడు
ఒరే అబ్బాయ్ వచ్చేది ఏమిటి?
స్టేషనండి
తెలుసులేరా. ఏంస్టేషను ?
రైల్వేస్టేషను
(3) భార్య ఏమండీ పనసాయకూర ఎలావుంది
నామొహంలావుంది
అయ్యో అంత అసహ్యంగావుందా
(భర్తకు వళ్ళుడింది మరొకసారి భర్త రివర్సు పంచ్ ఇద్దామని వేచియుండగా)
భార్య: ఏమండీ మీకు యిష్టమని ములక్కాడ, ఉల్లిపాయ, బంగాళాదుంపలు MTR మషాలాపొడి వేసి సాంబారు చేసా. ఎలావుందో రుచిచూసి చెప్పండి
భర్త(ఆ దొరికావులే అనుకొని) నీమొహంలావుంది.
భార్య: పోనిలెండి ఇప్పటికైనా మెచ్చుకున్నారు
(ఒక మనవి ఇవి నేను విన్నవే. ఎక్కడ, ఎప్పుడు ఆవివరాలు గుర్తులేవుకాని ఈ పంచ్ వాక్యాలు గుర్తున్నాయి.)
(నవ్వు అరోగ్యానికి మంచిదిట)
No comments:
Post a Comment