Saturday, December 12, 2020

తెలుగు విశ్వరూపం

 జనని,జనకుడు,జన్మభూమి,జాతీయ కేతనంబు,,(జండా),జాహ్నవీ తటము పరమపావనముల్ పంచ 'జ' కారముల్ 

 

కష్ట పెట్ట బోకు కన్నతల్లి మనసు 

నష్ట పెట్టబోకు నాన్న పనులు 

తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా

తెలిసి మసలుకో తెలుగు బాల (కరుణశ్రీ)


తెలుగు వృద్ది పరచ దలచు నీవు 

మా తృభాష నెపుడు మాటాడ వలెనంచు 

పలుకుమయ్య ప్రజలకు తెలుపుమయ్య

తెలుగు భాష యనిన తీయని మామిడి తోట 

తోటలోని చెట్లు మేటి కృతులు 

పద్యగేయ వితతి పరి పక్వ ఫలములు 

తథ్ఫలాలను (ఆ పళ్ళను ) తిన దలచండయ్యా


తెలుగు విశ్వరూపం 

*****

అచ్చులతో అల్లికలు నేర్చి 

హల్లులతో మాలికలు కూర్చింది 

గుణింతాలతో సుగుణాలు చెక్కి 

ద్విత్వాలతో శిల్పాలు మలిచింది 

సంధులతో సంబంధాలు పేర్చి 

సమాసాలతో విశేషాలు చెప్పింది 

సంయుక్తాలతో యుక్తులు పన్ని 

అలంకారాలతో అందలమెక్కింది 

విభక్తులతో ఆకర్షణ చేసి 

ప్రత్యయాలతో ప్రతిమ చేసింది 

యతులతో గతులు మార్చి 

ప్రాసలతో ప్రతిభ చూపింది 

చందస్సులతో ఉషస్సు నింపి 

పద్యాలతో కదం తొక్కింది 

అవధానాలతో వేదికలెక్కి 

ఆశువుగా ధారణ చేసింది 

నుడికారాలతో నుదుటి బొట్టై 

తలకట్టులతో అందాలు చిందింది 

సామెతలతో వాసికెక్కి 

జాతీయాలతో రాశి పెంచింది 

ఏమని వర్ణింతు 

నా తెలుగు భాష ప్రతిభాపాటవం 

సుమధుర సుందర అక్షర విశ్వరూపం !!

--------------------     శుభసాయంత్రం   -----------------------------


No comments:

Post a Comment

Total Pageviews